Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమైక్యాంధ్రతోనే అభివృద్ధి

$
0
0

అనకాపల్లి టౌన్, డిసెంబర్ 9: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర జెఎసి సభ్యులు పట్టణంలో ఆదివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆడారి కిషోర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని యువకులు గవరపాలెం గౌరీపరమేశ్వరుల పార్కు సెంటర్‌నుండి పట్టణ మెయిన్‌రోడ్డు మీదుగా నినాదాలు చేసుకుంటూ ‘తెలంగాణ వద్దు - సమైక్యాంధ్ర ముద్దు’ అంటూ పట్టణంలో నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్‌లో కొద్దిసేపు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రభుత్వం వెంటనే సమైక్యాంధ్రను తెరమీదకు తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలుగా విడదీసేందుకు ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరించారు. పార్టీ నాయకులందరూ సమైక్యాంధ్రకు కేంద్రం మద్దతు తెలపాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారందరినీ రాబోయే ఎలక్షన్‌లో తీవ్ర పరాభవం ఎదుర్కోవాల్సి వస్తుందని జెఎసి నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి యువజన జెఎసి అధ్యక్షుడు కాండ్రేగుల రవికుమార్, డాన్ స్వచ్చంద సంస్థ ఎస్. శ్రీనివాస్, బొడ్డేడ మురళీ, బుద్ధ జగన్, కొణతాల కుమార్, దూలం గోపీ, స్వరూప్, అశోక్, కృష్ణా, పి.సాయిగణేష్, కొణతాల అరవింద్, హరి పాల్గొన్నారు.

నియోజకవర్గాలలో
మహిళా శక్తి సంఘాల ఏర్పాటు
* డిసిసి అధ్యక్షుడు ధర్మశ్రీ
చోడవరం, డిసెంబర్ 9: జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో మహిళా శక్తిసంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ వెల్లడించారు. ఆదివారం స్థానిక మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అల్లు తాతంనాయుడు అధ్యక్షతన జరిగి కార్యక్రమంలో సోనియాగాంధీ బర్త్‌డే కేక్‌ను ధర్మశ్రీ కట్‌చేసి శుభాకాంక్షలు తెలియజేసి వందమంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సోనియాగాంధీ ప్రజాసంక్షేమం కోసం అనేక సాహసోపేత నిర్ణయాలు చేశారన్నారు. సాంఘిక సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల మెస్‌చార్జీలను ఒకేసారి పెంపుచేశారని చెప్పారు. ఈనెల 16వ తేదీన జిల్లా కాం గ్రెస్ కమిటీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పార్టీపరంగా ప్రణాళికను రూపొందిస్తామన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 20మంది సభ్యులతో కూడిన మహిళా శక్తిసంఘాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం వందమంది పేద మహిళలకు చీరలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి సన్యాశిరావు, మూడెడ్ల శంకరరావు, నర్సింహమూర్తి, జ్యోతుల రమేష్, బైన ఈశ్వరరావు, ఉప్పలబాబు, ఓరుగంటి నెహ్రూ, సిహెచ్ అర్జునరావు, పల్లెల వరహాలుబాబు, సకలా సూరిబాబు, వేచలపుప్రకాష్ పాల్గొన్నారు.

హాస్టల్‌లో మెస్‌చార్జీల పెంపుపై
విద్యార్థుల ఆనందం
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 9: రాష్టవ్య్రాప్తంగా హాస్టల్‌లో అమలవుతున్న కొత్త మెనూ పరిశీలించేందుకు ప్రభుత్వస్థాయి అధికారులు ఆదివారం వివిధ జిల్లాలు, మండలాల్లో హాస్టళ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా గాంధీనగరం బిసి హాస్టల్‌కు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సందర్శించారు. అక్కడి విద్యార్థులను కలసి పలు వివరాలు జెసి అడిగి తెలుసుకున్నారు. కొత్తమెనూ అమలుపట్ల మీకెలాఉందని విద్యార్థులను అడగారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటనేది పేపర్‌పై ఐదు వాఖ్యాలు రాసి ఇవ్వమని విద్యార్థులకు సూచించారు. దీనికి విద్యార్థులందరూ పేపర్లపై రాసి జెసికి ఇచ్చారు. మెనూ పెంచి ప్రభుత్వం చాలామంచి నిర్ణయం తీసుకుందని, దీనివల్ల విద్యార్థుల్లో చదువుపట్ల ఏకాగ్రత పెరుగుతుందని, గతంలో చాలీచాలని ఆహారంతో కడుపు నింపుకోవాల్సి వచ్చేదని ఇప్పుడు సంపూర్ణంగా ఆరోగ్యవంతమైన ఆహారం అందుతుందని జెసి పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు పండ్లుకూడా అందించేందుకు పరిశీలిస్తున్నామన్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులచే పద్యాలు పాడించారు. కొత్తమెనూ 3నుండి 7వ తరగతి వరకు 750 రూపాయలు, 8నుండి 10వ తరగతి విద్యార్థులకు 850 రూపాయలు పెరిగినట్లు హాస్టల్ వార్డెన్ డి. వెంకట్రావు తెలియజేశారు. ఈ హాస్టల్‌లో 87మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఈ రాత్రికి జాయింట్ కలెక్టర్ విద్యార్థులతోపాటు బస చేయనున్నట్లు వార్డెన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పాండురంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మురళీధరరావు, విఎల్ నారాయణ పాల్గొన్నారు.

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు
విశాఖఫట్నం, డిసెంబర్ 9: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ జన్మదిన వేడుకలు విశాఖలో ఆదివారం ఘనంగా జరిగాయి. పెదవాల్తేరులో జరిగిన వేడుకల్లో కేక్‌ను కట్ చేశారు. అనంతరం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో మంత్రి బాలరాజు, దొరబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేదలకు వౌలిక సదుపాయాలు అందుతున్నాయన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని పదవిని త్యాగం చేసిన సోనియా మహోన్నత వ్యక్తి అని, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బెహరా భాస్కరరావు, బాణాల శ్రీనివాస్, ఇంటక్ నాయకులు మంత్రి రాజశేఖర్, కె.మోహన కుమార్, పీతల మూర్తి యాదవ్, విజయారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు రామకృష్ణస్వామి, చరణ్ కుమార్ పాల్గొన్నారు.
టిఎస్సార్ బంగ్లాలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బాలరాజు కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఆంక్షించి, అన్ని వర్గాల ప్రజల బాగోగుల గురించి కృషి చేస్తున్న సోనియాగాంధీ నాయకత్వం వర్ధిల్లాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, పంచకర్ల రమేష్‌బాబు, టిఎస్సార్ సేవాపీఠం ప్రధాన కార్యదర్శి డి.వరదారెడ్డి, టిఎస్సార్ కార్యదర్శి ఎస్.కె.్భషా పాల్గొన్నారు.

సీలేరు విద్యుత్ కేంద్రంలో
ఆశాజనకంగా నీటిమట్టాలు
సీలేరు, డిసెంబర్ 9: సీలేరు కాంప్లెక్స్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆశాజనకంగా నీటిమట్టాలు ఉన్నాయ ని జెన్‌కో డైరెక్టర్ ఆదిశేషు తెలిపా రు. ఆదివారం ఆయన సీలేరు కాంప్లెక్స్‌లో పర్యటించారు. జెన్‌కో అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడుతూ సీలేరు కాంప్లెక్స్‌లో గత ఏడాది కన్నా ఈ ఏడాది అధికంగా 30 టి.ఎం.సి.లు నీరు అధికంగా ఉందని, ఈ ఏడాది శ్రీశైలంలో నీటిమట్టాలు తగ్గినప్పటికీ సీలే రు కాంప్లెక్స్‌లో నీటిమట్టాలు అధికంగా ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి లోటు భర్తీ చేయవచ్చన్నారు. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఆధునీకరణ చేయడానికి ఒడిశా అధికారుల నుండి అనుమతులు రావాల్సి ఉందని, అనుమతుల్లో జాప్యం జరగడం వలనే పనులు ప్రా రంభం కావడంలేదని ఆయన తెలిపారు. అదేవిధంగా మాచ్‌ఖండ్‌లో గృహాల మరమ్మతుల విషయంలో కూ డా ఒడిశా నుండి అనుమతులు రాలేద ని డైరెక్టర్ తెలిపారు. చిత్రకొండలో నిర్మించతలపెట్టిన ఎ.పి. పవర్ హౌస్ కోర్టు పరిధిలో ఉందని, కోర్టు అడ్డంకు లు తొలగి అనుమతులు వచ్చేవరకు వేచి ఉండాల్సిందేనని డైరెక్టర్ అన్నారు. గోదావరి డెల్టాకు సీలేరు జలాశయం నుండి 40 టి.ఎం.సి.ల నీటిని ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన రాష్టస్థ్రాయి సమావేశా ల్లో నిర్ణయించామని ఆదిశేషు తెలిపారు. అంతకుముందు డైరెక్టర్ డొంకరా యి జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించా రు. అనంతరం సీలేరు జలవిద్యుత్ కేంద్రానికి వచ్చి జలవిద్యుత్ కేంద్రంలో ఉన్న ఎం.సి. యార్డును తనిఖీ చేసి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న యూనిట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్.కృపాసాగర్, ఎస్.ఇ. సివిల్ వి.కిషన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.ఎల్.రమేష్ పాల్గొన్నారు.

‘గిరిజన సమస్యల పరిష్కారానికి
పోరాటాలే శరణ్యం’
ముంచంగిపుట్టు, డిసెంబర్ 9: గిరిజనుల సమస్యలను పరిష్కరించుకునేందుకు పోరాటాలే శరణ్యమని సి.పి.ఎం. అరకు డివిజన్ కార్యద ర్శి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లో సురేంద్ర అన్నారు. గిరిజన సమస్యలను అధ్యయనం చేసేందుకు సి.పి. ఎం. చేపట్టిన పాదయాత్రను మండ లం జర్రెల గ్రామంలో ఆయన ఆదివా రం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారానికి పార్టీ నిరంతరం పోరాటాలు సాగిస్తుందని చెప్పారు. తమకు గిరిజనులు అండగా ఉండి ఉ ద్యమాలలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గిరిజన గ్రా మాలలో నెలకొన్న సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నా రు. ప్రభుత్వ పథకాలలో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతుండడంతో గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, దీంతో అధికారులు అవినీతి అక్రమాలకు తెర లేపుతున్నారని ఆయన ఆరోపించారు. గిరిజన సమస్యలపై పార్టీ చేపట్టిన పాదయాత్ర మండలంలోని మారుమూల ప్రాంతమైన పది పంచాయతీలలో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 17వ తేదీన బరడలో పాదయాత్రను ముగించి బహిరంగ సభను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం ఈ నెల 18వతేదీన తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తామని, తహశీల్ధార్‌కు గిరిజన సమస్యలపై వినతిపత్రం సమర్పిస్తామని సురేంద్ర చెప్పారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. నాయకులు పి.శాస్ర్తీబాబు, పి.సత్యనారాయణ, లైకోన్, నరసింగ్‌పడాల్ పాల్గొన్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
డుంబ్రిగుడ, డిసెంబర్ 9: పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలపాతం వద్ద ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకున్నా చాపరాయి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి సబ్ ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చాపరాయి జలపాతంవద్ద మద్యం, గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు ఫిర్యాదులు అందాయని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని, దీనిని నివారించే బాధ్యత చాపరాయి నిర్వహణ కమిటీదేనన్నారు. పర్యాటకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడరాదని సూచించారు. చాపరాయి వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ప్రధాన రహదారిపై పర్యాటకుల వాహనాలు నిలిపివేస్తుండడంతో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని, దీంతో వాహనాల నిలుపుదలకు ప్రత్యేక స్థలం కేటాయించనున్నామని పేర్కొన్నారు. పర్యాటక సందర్శిత ప్రాంతాలకు నడిపే ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేక నెంబర్లను కేటాయించనున్నట్టు కుమారస్వామి తెలిపారు.

అవినీతి వ్యతిరేక ర్యాలీ
అరకులోయ, డిసెంబర్ 9: అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అరకులోయలో గిరిజన సేవా ట్రస్ట్ ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. స్థానిక పోర్టుట్రస్ట్ అతిధి గృ హం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా మండల రెవెన్యూ కార్యాల యం వరకు కొనసాగింది. అవినీతిని నిర్మూలిద్దాం, గిరిజనులు ఐక్యంగా మెలుగుదాం అనే నినాదాలతో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేసినట్టు ట్రస్ట్ వ్యవస్థాపకుడు బాకా గౌరీశ్వరరావు చెప్పారు.

పారిశ్రామిక ప్రాంతంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి
అగనంపూడి, డిసెంబర్ 9: పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వం జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర ఓడరేవుల, వౌలిక వసతల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మహావిశాఖ నగర పాలక సంస్థ నిధులతో అగనంపూడి సమీపంలో గల పెదమడక గ్రామంలో నిర్మించిన సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. నేడు రాష్ట్రం అభివృద్ధి బాటలో పయినిస్తుందని, దీనికి కారణంగా సోనియాగాంధియే అన్నారు. ప్రణాళిక బద్దంగా దేశాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకు వెళ్లడం జరుగుతుందన్నారు. అయితే గత కొనే్నళ్లగా పారిశ్రామిక ప్రాంత ప్రజలను ఊరిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. కళాశాల సమస్యను మంత్రికి ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తీసుకు వెళ్లారు. అలాగే ఉక్కు సామాజిక బాధ్యత నిధులతో డొంకాడ కాలనీలో కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు కొన్ని అంటకాలు ఉన్నాయన్న విషయాన్ని మంత్రి దృష్టికి స్థానిక నేతలు తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే సమస్యలను పరిష్కరించి కళ్యాణ మండపం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేక్‌ను కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు దుల్ల రామునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దుల్ల లక్ష్మి, జోనల్ కమీషనర్ శ్రీనివాస్, అధికారులు, నేతలు బొబ్బరి నారాయణరావు, మోటూరి వెంకటరమణ, మజ్జి శ్రీనివాసరావు, అట్టా సన్యాసి అప్పారావు, కొయ్య వెంకటరమణరెడ్డి, కొలిపాక అప్పారావు, వ్యాసశర్మ, నర్సింగరావు, బలిరెడ్డి సత్యనారాయణ, దాసరి త్రినాధ్, చందక చిన్నారావు, బలిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర జెఎసి సభ్యులు పట్టణంలో ఆదివారం ఉదయం ర్యాలీ
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>