కరాచీ, డిసెంబర్ 10: భారత్‌లో పాకిస్తాన్ జట్టు పర్యటనకు ఆమోదం తెలిపినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మాజీ అధ్యక్షుడు ఇషాన్ మణి విమర్శలు గుప్పించాడు. వనే్డ, టి-20 సిరీస్‌లో పాల్గొనాలన్న నిర్ణయాన్ని తక్షణమే మానుకోవాలని హితవు పలికాడు. భారత్‌లో పర్యటన వద్దని, పిసిబి అధికారులు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించాలని అన్నాడు. భారత్‌లో పాక్ పర్యటించకూడదని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను అన్నాడు. పాక్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు భారత్ అంగీకరించడం రాజకీయ నిర్ణయమైతే, కనీసం తటస్థ వేదికలలోనైనా భారత్ తమతో ఆడేందుకు ఒప్పించేలా పాక్ నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిసిబి కోరాల్సిందని మణి అన్నాడు. పాక్‌తో ఆడాల్సిన రెండు సిరీస్‌లను రద్దు చేసుకున్న భారత్‌తో సిరీస్ ఆడటానికి పిసిబి ఎలా అంగీకరించిందో తనకు అర్థమవట్లేదని పేర్కొన్నాడు. ముంబాయి దాడుల తర్వాత పాక్ బోర్డును బిసిసి ఐ పట్టించుకోలేదని అతను ఆరోపించాడు. ప్రస్తుత సిరీస్ ద్వారా భారత బోర్డుకు దాదాపు 15 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుందని తెలిపాడు. ఈ పర్యటన వల్ల పాక్‌లో క్రికెట్ పునరుద్ధరణకు ఒరిగేదేమీ ఉండదన్నాడు. ఈ సిరీస్‌లో పాల్గొంటున్నందుకు బదులుగా పాక్‌తో భారత్ మరో సిరీస్ ఆడేందుకు హామీ కూడా పొందకుండా బిసిసి ఐకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తున్నామని విమర్శించాడు. ఈ నిర్ణయాన్ని తాను ఏమాత్రం సమర్థించట్లేదని చెప్పాడు. పిసిబి నిర్వహణ తీరుపై కూడా మణి అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్థానిక క్రికెట్ అసోసియేషన్లు, అనుబంధ సంఘాలకు పిసిబిలో ఏ ప్రాధాన్యత ఉండదని, పాక్ అధ్యక్షుడు నియమించిన చైర్‌పర్సన్ జవాబుదారీతనం లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడని ధ్వజమెత్తాడు. భారత్‌లో సిరీస్‌ను పాకిస్తాన ఆడరాదని, లేకపోతే ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు ఏక పక్షమవుతాయని అన్నాడు. పాకిస్తాన్‌కు చెందిన ఇషాన్ మణి 2003లో ఐసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు.
బాంబే హైకోర్టులో గోపీచంద్‌కు ఎదురుదెబ్బ
ముంబయి, డిసెంబర్ 10: భారత బాడ్మింటన్ స్టార్, జాతీయ కోచ్, ఆల్ ఇంగ్లాండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ బాడ్మింటన్ కోచ్‌గా, సెలక్షన్ ప్యానెల్ చీఫ్‌గా, జాతీయ బాడ్మింటన్ అథారికీ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో ఉన్న గోపీచంద్ ప్రైవేటుగా ఒక అకాడెమీని నిర్వహించడం అనైతికమని ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా, న్యాయమూర్తి ఎబి మెహతాలతో కూడిన బాంబే హైకోర్టు బెంచ్ సంచలన వ్యాఖ్యాలు చేసింది. గోపీచంద్‌కు హైదరాబాద్‌లో అకాడెమీ ఉన్నందున, అందులో శిక్షణ పొందుతున్న వారికే జాతీయ జట్టులో అవకాశం కల్పిస్తూ, మిగతా వారికి అన్యాయం చేస్తున్నారంటూ ప్రజాక్తా సామంత్ అనే 19 ఏళ్ల యువ క్రీడాకారిణి వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంతకు ముందు భారత డబుల్స్ స్పెషలిస్టు జ్వాలా గుత్తా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. సమర్థులను గోపీచంద్ అణగదొక్కుతున్నాడని ఆమె పలుమార్లు ఆరోపించింది. తన అకాడెమీలో శిక్షణ పొందిన వారికే గోపీచంద్ ప్రాధాన్యం ఇస్తుండడంతో, సమర్థులు ఎంతో మందికి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడే అవకాశం రావడం లేదంటూ ఆరోపించింది. బాంబే హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో జ్వాలా గుత్తా హర్షం వ్యక్తం చేసింది. చాలాకాలంగా తాను ఇదే విషయాన్ని ప్రస్తావించిన విషయాన్ని ఆమె గుర్తుచేసింది. ప్రైవేటుగా అకాడెమీని నిర్వహిస్తున్న వ్యక్తి జాతీయ సమాఖ్యల్లో కీలక పాత్ర పోషిస్తే, సాధారణ క్రీడాకారులకు న్యాయం జరగదని పేర్కొంది. జాతీయ బాడ్మింటన్ సంఘం (బిఎఐ) కూడా ఈ విషయంలో స్పందించాలని ఆమె కోరింది.
వనే్డ జట్టులో అఫ్రిదీకి దక్కని చోటు
కరాచీ, డిసెంబర్ 10:్భరత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో పాల్గొనే పాకిస్తాన్ జట్టులో మాజీ కెప్టెన్ షా హిద్ అఫ్రిదీ, ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌లకు స్థానం ల భించలేదు. అయతే, రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో అఫ్రిదీకి అవకాశం లభించింది. వనే్డ జట్టుకు మిస్బా-ఉల్- హక్, టి-20 జట్టుకు మహమ్మద్ హఫీజ్ నాయకత్వం వ హిస్తారు. ఇటీవల జరిగిన వివిధ టోర్నీలు, సిరీస్‌లలో ఆ టగాళ్ల ప్రదర్శనను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే, భారత్ పర్యటనకు జట్లను ఎంపిక చేశామని పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ చీఫ్ ఇక్బాల్ ఖాసిం తెలిపాడు. 2015 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను కూడా దృష్టిలో ఉంచుకున్నామని చె ప్పాడు. యువ ఆటగాళ్లతోపాటు సీనియర్లు కూడా ఈ జ ట్లలో ఉన్నారని, భారత్‌లో అద్భుతంగా రాణించే అవకా శాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లు రాణిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.
విండీస్ ఖాతాలో టి-20
మీర్పూర్, డిసెంబర్ 10: బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టి-20 మ్యాచ్‌ని వెస్టిండీస్ 18 పరుగుల తేడాతో గెల్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 197 పరుగులు చేసింది. సామ్యూల్స్ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయినప్పటికీ 20 ఓవర్లలో 179 పరుగులకు పరిమితమైంది. తమీమ్ ఇక్బాల్ (88 నాటౌట్), మహమ్మదుల్లా (64 నాటౌట్) చక్కగా ఆడినప్పటికీ, అవసరమైన రన్‌రేట్‌ను అందుకోలేకపోయారు. టి-20 వంటి పొట్టి మ్యాచ్‌లలో సహజంగా ఒక జట్టు వికెట్లు త్వరత్వరగా కో ల్పోవడం లేదా పిచ్ బ్యాటింగ్‌కు సహకరించకపోవడంతో ఓడుతుం ది. కానీ, బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ, విజయం కోసం పోరాడకపోవడం విచిత్రం.
నకమురాతో ఆనంద్ గేమ్ డ్రా
లండన్, డిసెంబర్ 10: లండన్ చెస్ క్లాసిక్ ఎమిదో రౌండ్‌లో జపాన్ ఆటగాడు హికరు నకమురాతో తలపడిన భారత స్టార్, ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ డ్రాతో సరిపుచ్చాడు. ఏడో రౌండ్‌లో జ్యూడిత్ పోల్గార్‌తోనూ ఆనంద్ గేమ్‌ను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఎనిమిదో రౌండ్ ఆరంభం నుంచి నకమురా ఆధిపత్యాన్ని కనబరచగా, ఆనంద్ పావులను వ్యూహాత్మకంగా ముందుకు దూకించడ