మాడ్రిడ్, డిసెంబర్ 10: బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా వీరుడు లియోనెల్ మెస్సీ తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా 1972లో జర్మనీ లెజెండరీ ఆటగాడు గెర్డ్ మ్యూలర్ నెలకొల్పిన రికార్డును అధిగమించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. స్పానిష్ లీగ్ చాంపియన్‌షిప్ ‘లా లిగా’లో భాగంగా రియల్ బెటిల్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ రెండు కీలకమైన గోల్స్ చేయడంతో నాలుగు దశాబ్దాలకుపైగా స్థిరంగా ఉన్న రికార్డు తెరమరుగైంది. నిజానికి ఈ మ్యాచ్‌లో మెస్సీ ఆడడం చివరి క్షణం వరకూ అనుమానంగానే కనిపించింది. మోకాలికి గాయమైన అతనికి విశ్రాంతినివ్వాలని బార్సిలోనా క్లబ్ అధికారులు భావించారు. కానీ, త్వరగానే కోలుకున్న అతను ఈమ్యాచ్‌లో ఆడడమేగాక, ప్రారంభంలోనే ఒక గోల్ సాధించి, మ్యూలర్ రికార్డును సమం చేశాడు. 16వ నిమిషంలో మొదటి గోల్ చేసిన అతను మరో తొమ్మిది నిమిషాల తర్వాత రికార్డు గోల్‌ను నమోదు చేశాడు. బెటిస్ క్లబ్ తరఫున రూబెన్ కాస్ట్రో చివరి క్షణాల్లో ఒక గోల్ సాధించినా ఫలితం లేకపోయింది.
నాలుగు దశాబ్దాల రికార్డు తెరమరుగు
english title:
mepsi
Date:
Tuesday, December 11, 2012