Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అందరి దృష్టి కౌన్సిల్‌పైనే!

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 10: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి, అధికార యంత్రాంగంతో పాటు గ్రేటర్ ప్రజల దృష్టి కూడా ఈనెల 15వ తేదీన జరగనున్న కౌన్సిల్‌పైనే ఉందనే చెప్పవచ్చు. ముఖ్యంగా మజ్లిస్ మేయర్‌గా మాజీద్ హుస్సేన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న ఈ మూడో సమావేశం ఇదివరకు జరిగిన ఆరు కౌన్సిల్ సమావేశాల కన్నా ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పవచ్చు.
ముఖ్యంగా పలువురు స్థారుూ సంఘం సభ్యులు తమ స్వప్రయోజనాల కోసం గ్రేటర్ నిధులను, భూములను ధారాదత్తం చేస్తూ తీసుకున్న పలు తీర్మానాలు, అలాగే కాంగ్రెస్, మజ్లిస్‌ల మధ్యనున్న బంధం తెగిపోవటం వంటి పరిణామాలు ఈ కౌన్సిల్ సమావేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంది. ఇందులో అన్నపూర్ణ సినీ స్టూడియో సమీపంలో ఓ ప్రైవేటు వెంచర్ నిర్మాణ అనుమతి కోసం అధికారులు, పలువురు స్థారుూ సంఘం సభ్యులు ఇరవై అడుగుల రోడ్డును అరవై అడుగుల రోడ్డుగా విస్తరించి, అభివృద్ధి పరిచేందుకు వీలుగా చేసిన తీర్మానం, అలాగే మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి చెందిన జూబ్లీహిల్స్‌లోని భూమిని కార్పొరేషన్ స్వాధీనం చేసుకుని, మరోచోట కార్పొరేషన్‌కు చెందిన కోట్లాది రూపాయల విలువైన భూమిని ఆయనకు కేటాయించేందుకు వీలుగా ఇటీవల స్థారుూ సంఘం సభ్యులు చేసిన తీర్మానాలు ఈ కౌన్సిల్ సమావేశంలో దుమారం లేపనున్నట్లు తెల్సింది. ప్రజాసమస్యలు, నగరాభివృద్ధిని పక్కనబెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ, అంతేగాక, స్వప్రయోజనాల కోసం గ్రేటర్ ఖజానా, ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారని ఆరోపిస్తున్న టిడిపి, బిజెపి కార్పొరేటర్లు ఇప్పటికే మేయర్‌ను, అధికారపార్టీ సభ్యులను నిలదీసేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే 15 మంది సభ్యులతో కూడిన స్థారుూ సంఘంలోని ఎనిమిదిమంది కాంగ్రెస్ సభ్యులు, ఏడుగురు మజ్లిస్ సభ్యులతో పాటు మేయర్ సైతం అత్యుత్సాహాన్ని ప్రదర్శించారంటూ ఇప్పటికే ఉభయపార్టీలకు చెందిన కొందరు కార్పొరేటర్లు వాదిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, అదే పార్టీకి చెందిన స్థారుూ సంఘం సభ్యులను సైతం తీవ్ర స్థాయిలో ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకున్న మజ్లిస్ ఇపుడు ఆ పార్టీకి మద్దతును ఉపసంహరించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ప్రైవేటు వెంచర్ అనుమతి కోసం రోడ్డు అభివృద్ధికి రూ. 7.20 కోట్ల మంజూరీ ప్రతిపాదనకు అనుకూలంగా చేసిన తీర్మానంలో మేయర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని ఇప్పటికే ఆరోపిస్తున్న పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రధాన విపక్షమైన తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువ మజ్లిస్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లు తెల్సింది. దీంతో పాటు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు విడిపోవటంతో ఉభయపార్టీలకు చెందిన ఎక్స్ అఫీషియో సభ్యులు, అలాగే కో ఆప్షన్ సభ్యులు మొత్తం హాజరై తమ సత్తాను చాటాలని భావిస్తున్నట్లు తెల్సింది.
మార్పు తథ్యం
* లంగర్‌హౌస్ కార్పొరేటర్ వివాదానికి త్వరలో తెర
* బిజెపి అభ్యర్థికి రేపోమాపో అధికారిక ఉత్తర్వులు
* కౌన్సిల్‌లో ఆరుకు పెరిగిన బిజెపి బలం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 10: నగరంలోని లంగర్‌హౌస్ డివిజన్ కార్పొరేటర్ సీటు వివాదానికి త్వరలోనే తెరపడే అవకాశముంది. 2009లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రవియాదవ్‌కు ముగ్గురు పిల్లల సంతానమున్నట్లు, ఆయన ఎన్నికను సవాలు చేస్తూ బిజెపి అభ్యర్థి ఉదయ్‌కుమార్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే! అయితే కింది స్థాయి న్యాయస్థానం రవియాదవ్ ఎన్నిక చెల్లదని, అలాగే తదుపరి మెజార్టీ సాధించిన బిజెపి అభ్యర్థి ఉదయ్‌కుమార్‌ను కార్పొరేటర్‌గా ప్రకటించాలని ఏడాది క్రితమే ఆదేశాలు జారీచేసినా, ఆ ఆదేశాలపై రవియాదవ్ కోర్టు నుంచి స్టే తెచ్చుకోవటంతో కార్పొరేటర్ మార్పు అప్పట్లో వాయిదా పడింది. అయితే కొద్ది రోజుల క్రితం ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం అమలు చేయటంలో అలసత్వాన్ని వహిస్తూ వచ్చిన అధికారులు కొద్దిరోజుల క్రితం రవియాదవ్ కార్పొరేటర్ పదవికి అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెల్సిందే! అయితే తదుపరి మెజార్టీ సాధించిన బిజెపి అభ్యర్థి ఉదయ్‌కుమార్‌ను కూడా ఆయన స్థానంలో కార్పొరేటర్‌గా ప్రకటించాల్సిన అధికారులు కోర్టు ఆదేశాలు లిఖితపూర్వకంగా తమకు ఇంకా అందలేదని, అందిన తర్వాత పరిశీలించి కోర్టు ఆదేశాలను అమలుచేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. కానీ నేటి వరకు కూడా ఉదయ్‌కుమార్‌ను కార్పొరేటర్‌గా ప్రకటించలేదు. అలాగే ఇంతకు ముందు కూడా బోరబండ కార్పొరేటర్ వనజకు కూడా ముగ్గురు పిల్లలుండటంతో ఆమె కార్పొరేటర్‌గా అనర్హురాలిగా కమిషనర్ ప్రకటించిన సంగతి తెల్సిందే. కోర్టు ఆదేశాల మేరకు కార్పొరేటర్లను అనర్హులుగా ప్రకటించటంలో చూపే శ్రద్ధను వారి స్థానంలో మరో కార్పొరేటర్‌ను భర్తీ చేసే ఉత్తర్వులు జారీ చేయటంలో అధికారులు ఆలసత్వం వహిస్తున్నారని పలు పార్టీల కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఇందుకు సంబంధించి అధికారికంగా తామేమీ ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని, అర్హులైన వారు, కోర్టు ప్రకటించిన వారు నేరుగా పాలక మండలికి రావచ్చునని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో బిజెపి కార్పొరేటర్ల వత్తిడి మేరకు రేపోమాపో కమిషనర్ కృష్ణబాబు ఉదయ్‌కుమార్‌ను కార్పొరేటర్‌గా ప్రకటిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెల్సింది. ఎట్టకేలకు మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న లంగర్‌హౌస్ డివిజన్ కూడా కోర్టు ఆదేశాల మేరకు బిజెపి ఖాతాలోకి రావటంతో పాలకమండలిలో బిజెపి కార్పొరేటర్ల సంఖ్య ఆరుకు పెరిగటంతో ఆ పార్టీ కార్పొరేటర్లు, నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుష్పక్ బస్‌పాస్ రూ.2000
కంటోనె్మంట్, డిసెంబర్ 10: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పుష్పక్ ఎసి బస్సుల్లో ప్రయాణికుల కోసం డిసెంబర్ 15 నుంచి బస్‌పాస్‌లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కోటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నగరంలో పలు ప్రాంతాల్లో తిరుగుతున్న ఎసి బస్సులతో పాటు అన్ని ఆర్టీసీ బస్సుల్లో కొత్తగా జారీ చేస్తున్న పాస్ వర్తిస్తుంది. కొత్త పాస్‌కు 2000 రూపాయల ధర నిర్ణయించారు.

వజ్రాల దొంగల అరెస్ట్

కంటోనె్మంట్, డిసెంబర్ 10: కొరియర్‌లో పార్సిల్ వచ్చిన రూ.18 లక్షలు విలువ చేసే డైమండ్, బంగారు నగలు దొంగలించిన నలుగురుని మహాంకాళి పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ జోన్ డిసిపి శ్రీకాంత్. సోమవారం ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఢిల్లీలోని బ్లూడాట్ కొరియర్ సర్వీస్ హిమాయత్‌నగర్‌లోని ప్రేమ్‌నతన్ కోసం కెరెక్స్ కార్గో సర్వీస్ ద్వార అక్టోబర్ 30న 18 లక్షలు విలువ చేసే డైమండ్, బంగారు నగలు పంపారు. బ్లూడాట్ కొరియన్‌కు చెందిన అఫీసు సికింద్రబాద్ పాన్‌బజార్‌లో గోనే సంజీవ రెడ్డి గ్రీన్ డాట్ కోరియర్ నిర్వహిస్తున్నాడు. అందులో నాంపల్లి నివాసులైన వౌలాలి, బిప్లదాస్‌లు ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అక్టోబర్ 31న పార్సల్ రావటం అందులో విలువైన వస్తువులు ఉన్నట్లు వౌలాలి గమనించాడు. వాటిని ఎలాగైన కాజేయ్యాలని పథకం వేశాడు. అతని మిత్రుడు బాసిద్‌ను బ్లూడాట్ కొరియర్‌కు పంపి హిమాయత్‌నగర్‌లోని ప్రేమ్ రతన్ పంపాడని, పార్శిల్ ఇవ్వాలని చెప్పి దాన్ని తీసుకున్నాడు.
ఆ తర్వాత ప్రేమ్త్రన్ తన పార్సిల్ కోసం మనిషిని పంపిస్తే ఇంతకు ముందే మీ వ్యక్తి తీసుకున్నారని సమాధానం వచ్చింది. మోసం జరిగిందని గమనించిన ఆయన మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి కేసును ఛేదించి నలుగురిని అరెస్టు చేశారు.

ఎఫ్‌డిఐలను స్వాగతించాలి

తమిళనాడు గవర్నర్ రోశయ్య పిలుపు
తార్నాక, డిసెంబర్ 10: వర్తక వాణిజ్య రంగాల్లో పెనుమార్పులు వస్తున్నాయని మారుతున్న పరిస్థితులకనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. సోమవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాపేట్‌లో నేతిరాములు ఆధ్వర్యంలో దాదాపు రు.2 కోట్లతో నిర్మించిన ఆర్యవైశ్యసంఘ భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్‌డిఐలపై పార్లమెంట్‌లో పెద్దఎత్తున వాగ్వివాదాలు జరుగుతున్నాయని, కానీ మారుతున్న పరిస్థితులకనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార ఉద్యోగరంగాల్లో రాణించడంతోపాటు రాజకీయరంగంలోను రాణించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఎంతో సుదీర్ఘకాలంగా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని, ఆర్యవైశ్యుల్లో కేవలం ధనికులేకాదు అత్యంత పేదరికంలో ఉన్నవారు ఉన్నారని, వారికోసం సేవాభావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. సంఘంలో రాజకీయాలు తీసుకురాకూడదని హితవుపలికారు. లాలాపేట్‌లో నిర్మించిన ఈ భవనం నిత్యం ఆర్యవైశ్యులకు అందుబాటులో ఉండాలని కోరారు. సికింద్రాబాద్ ఎంపి అంజన్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ రోశయ్య కేవలం ఆర్యవైశ్యులకే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికోసం కృషి చేశారని అన్నారు. అపరచాణుక్యుడిగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవ మరవలేనిదని అన్నారు. ఆయన చల్లనిచూపు పడితే అక్కడ అంతా శుభమే జరుగుతుందని, నేడు తన నియోజకవర్గంలో ఇంత చక్కటి భవనం ఆయన చేతులమీదుగా ప్రారంభోత్సవం జరగడం సంతోషకరమని అన్నారు. గ్రేటర్ మాజీమేయర్ బండ కార్తీకాచంద్రారెడ్డి మాట్లాడుతూ నేతిరాములు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యసంఘం సేవా కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. తన డివిజన్‌లో ఇంత చక్కటి భవనం నిర్మించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి బండ చంద్రారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మెట్టబలరామ్, ఆర్యవైశ్య సంఘం నేతలు గంజి రాజవౌళిగుప్త, ఇంద్రయ్యగుప్త, నేతిరాములు, నేతిరాజు, సంఘసేవకులు బాల్‌రెడ్డి, లయన్స్ క్లబ్ నేతలు బాబూసేట్, లయన్ నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

సంక్షేమ వసతి గృహాల్లో హాస్టల్ నిద్ర చేయాలి
-- ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలకు కలెక్టర్ వాణీప్రసాద్ ఆదేశం --

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచినందున దానికనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు సవరించిన మెను ప్రకారం అందించాల్సిన ఆహారాన్ని సక్రమంగా అందుతున్నది లేనిది తెలుసుకోవడానికి వీలుగా వచ్చే బుధవారం జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో నిద్ర చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఎ.వాణీప్రసాద్ మండల అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ ప్రత్యేక అధికారి చాంబర్ నుండి ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలతో టెలికాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ మండలాల్లోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో మెను ప్రకారం అందించాల్సిన ఆహారం అందేందుకు వీలుగా ఆయా మండలాల్లోని సంక్షేమ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఇతర మండల అధికారులు ఒక్కో హాస్టల్ ఎంపిక చేసుకొని ఆ హాస్టల్‌లో రాత్రి బస చేసి ఆయా సమస్యలను తెలుసుకొని నివేదికను గురువారం సమర్పించాలని కలెక్టరు ఆదేశించారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, మెను డిస్‌ప్లే చేశారా, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల నిర్వహణ తదితర వివరాలను సేకరించి సమర్పించాలని ఆమె ఆదేశించారు. అదేవిధంగా ఆహార పదార్థాల నాణ్యత, పరిమాణం తదితర వివరాలను కూడా సమర్పించాలని ఆమె ఆదేశించారు. హాస్టళ్లలోని సమస్యలను తెలుసుకొని చిన్నచిన్న సమస్యలైతే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పెద్ద సమస్యలుండి ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉన్న పక్షంలో వాటికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా బాలికల హాస్టళ్లలో కనీస సదుపాయాలు ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వం సవరించిన మెనూ ప్రకారం అందుతున్నది లేనిది పర్యవేక్షించాలని ఆమె సూచించారు. సంపూర్ణ పారిశుద్ధ్యానికి సంబంధించి నిర్మల్ భారత్ అభియాన్ క్రింద మొదటి విడతగా ఎంపిక చేసిన 165 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ఆయా గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసేందుకు వీలుగా ఒకరోజు పల్లెనిద్రను మండల స్థాయి అధికారులు చేపట్టాలని కలెక్టరు ఆదేశించారు. ఒక్కో మండలంలోని ఎంపిక చేసిన అయిదు గ్రామాలను స్థానిక ఎంపిడిఓ, తహసీల్దారు, ఇఓఆర్‌డి, వ్యవసాయాధికారి, ఎంఇఓలు దత్తత తీసుకొని పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టి రాత్రిళ్లలో కళాజాత నిర్వహించి ఉదయం పూట బహిరంగ మలవిసర్జన జరుగకుండా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ఆమె సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి బుధ, గురువారాల్లో మేస్ర్తిలకు మండల కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, ఈ శిక్షణా కార్యక్రమాలకు విఓలు, ఉపాధి హామీ సిబ్బంది హాజరయ్యేలా చూడాలని ఆమె సూచించారు. తెలుగు మహాసభల ఉత్సవాలకు సంబంధించి గ్రామ, మండల స్థాయిలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఈ నెల 12వ తేదీలోగా డివిజన్ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను డిఇఓకు పంపాలని, ఈ నెల 13 నుండి 19వ తేదీలోగా ఏదో ఒక రోజు జిల్లా స్థాయిలో ఉత్సవాలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతందని ఆమె తెలిపారు. ప్రజావాణి, పిఎంఓ, డయల్ యువర్ అధికారి ఫిర్యాదులకు సంబంధించి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసుల పరిష్కారానికి గాను చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టరు ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జడ్పీ సిఇఓ/ఇంచార్జి డిఆర్‌ఓ రవీందర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి వరప్రసాద్‌రెడ్డి, డ్వామా పిడి అనురాధ, సాంఘిక సంక్షేమ శాఖ జెడి సురేష్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ జగదీశ్వర్‌రెడ్డి, భూపరిరక్షణ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ప్రభాకర్‌రెడ్డి, లా అధికారి వేణుగోపాల్ వివిధ సంక్షేమ శాఖల అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మాయమైన స్టీల్ పోలీసుస్టేషన్‌లో ప్రత్యక్షం

శంషాబాద్, డిసెంబర్ 10: గత నెల పెద్ద షాపూర్ చౌక్‌పోస్టు వెనుక లారీ యజమానులు, డ్రైవర్లు దొంగతనంగా స్టీల్ అమ్ముకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. అప్పుడు రూరల్ పోలీసులు కేసు నమోదుచేసారు. అయితే పోలీసులు లారీ యజమానులను తప్పించడానికి అక్షరాల 8 లక్షలు ముడుపు అందినట్లు వార్తలు వచ్చిన విషయం తలిసిందే. కాగా చోరీ అయిన స్టీల్ సీజ్ చేసామని చెప్పినా పోలీసుస్టేషన్‌లో స్టీల్ లేదు. పోలీసులు చేసిన తప్పును కప్పిపుచ్చడానికి మాయమైన స్టీల్‌ను సోమవారం గుట్టుచప్పుడు కాకుండా పెద్దషాపూర్ చెక్‌పోస్టు ముందున్న ఒక పాడుబడ్డ కంపెనీలో వున్న స్టీల్‌ను డిసిఎం వ్యాన్‌లో ఆర్‌జిఐఎ పోలీసుస్టేషన్‌కు తరలించారు. చోరీ జరిగితే కేసు నమోదుచేసి నిందితులపై చర్యలు తీసుకునే పోలీసులే ఇలాంటి సంఘటనలకు పాల్పడితే ఇక న్యాయం చేసేది ఎవరని స్థానికులు అనుమానిస్తున్నారు.

‘అమృతహస్తం’ ప్రారంభం
తాండూరు, డిసెంబర్ 10: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో డిసెంబర్ 3న తాండూరులోముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ప్రారంభించిన అమృతహస్తం పథకాన్ని సోమవారం లాంఛనంగా ఐసిడిఎస్ ఆర్‌జెడి జ్యోతి ప్రారభించారు. మండల పరిషత్ కార్యాలయంలోని ఐఎస్‌డిఎస్ ప్రాంగణంలో మహిళా సమాఖ్య, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలతో మాతాశిశు స్ర్తి సంక్షేమ విభాగం అధికారులతో ఆర్‌జెడి జ్యోతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమృతహస్తం రూపకల్పనతో గర్భిణులు, బాలింతలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది పథకాన్ని అర్హులకు అందేలా పనిచేయాలని సూచించారు.
షర్మిల పాదయాత్రకు తెలంగాణలో బ్రహ్మరథం: జయన్న
ముషీరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణలో వైకాపా నాయకురాలు షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రకు జనం బ్రహ్మరధం పడుతున్నారని వైకాపా బిసి నాయకుడు లోగెడి జయన్న అన్నారు. షర్మిలమ్మ పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలకనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం మహేశ్వరం మండలం కోళ్లపడకల్‌కు చేరుకుంటుందని బిసి నాయకులు , కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇన్‌కంటాక్స్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నర్సింహారావు
ముషీరాబాద్, డిసెంబర్ 10: ఏ.పి ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఇ.నర్సింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం బషీర్‌బాగ్ ఆయకార్‌భవన్‌లో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఇ.నర్సింహారావు, ఉపాధ్యక్షులుగా జివిఆర్‌ఎస్. వరప్రసాద్, ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా బి.శాంతికుమార్, సంయుక్త కార్యదర్శిగా సి.వి. సూర్యప్రకాశరావు, కోశాధికారిగా సిహెచ్. సాంబశివప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా కె.వి.రాఘవచారి, టి.కృష్ణయ్య, కె.శ్రీరామశర్మ, సిహెచ్.్ఠగూర్ నిత్యప్రసాద్, వాసుదేవరావు, మన్మోహన్ ఎన్నికయ్యారు.
నకిలీ వీసాపై వచ్చిన ఒకరి అరెస్ట్
శంషాబాద్, డిసెంబర్ 10: నకిలీ వీసాపై వచ్చిన ఒకరిని ఆర్‌జిఐఎ పోలీసులు అరెస్టు చేసారు. ఎస్‌ఐ మహేష్ వివరాల ప్రకారం హర్యానాకు చెందిన మహ్మద్ జాబీద్ (46) 2011లో రియాద్ వెళ్లి పనిపై విరక్తి చెంది తిరిగి వస్తానని కేరళ ఏజెంట్‌ను సంప్రదించగా కళానందిస్వామి అనే పాస్‌పోర్టుపై ఇతని ఫొటో పెట్టి ఇచ్చినట్లు తెలిపాడు. సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాగా ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలో నకిలీదిగా గుర్తించి జాబీద్‌ను పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలతోటే అభివృద్ధి
రాజేంద్రనగర్, డిసెంబర్ 10: భూటాన్ రాజరిక ప్రభుత్వం నుంచి ప్రజాసామ్య ప్రభుత్వానికి మారటం ఆ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సోమవారం రాజేంద్రరగ్‌లోని అపార్టులో భూటాన్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులు, సచివాలయం అధికారులతో జండర్ సెన్సిటివ్ గవర్నెన్స్, పరిపాలన అంవంపై 12 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు, సంస్కృతిలో భారతదేశం, భూటాన్ దేశాలు ఒకేలా ఉంటాయని వివరించారు. బౌద్దమతం ఈ రెండు దేశాల్లో ఉండటం మరో అంశమని చెప్పారు. భూటాన్‌లో మహిళా సాధికారత సాధించడానికి కొత్త విధానాలను సూచించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రతినిధులతోపాటు అపార్ట్ కమిషనర్ కె.చంద్రవౌళి, జెడి సి.నాగరాజు, సూర్యనారాయణరెడ్డి, కుర్మారావు, డా.ప్రసాద్, సత్యవాణి పాల్గొన్నారు.
‘మీకోసం’ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 10: మీకోసం కార్యక్రమంలో అందే ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇళ్లు, పెన్షన్లు, ఉద్యోగాలు, రేషన్‌కార్డులు, రేషన్, విద్యా వలంటీర్ల నియామకం తదితర అంశాలపై పలువురు ఫిర్యాదు చేశారు. సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గుండా మల్లేష్, దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఎం.బాలనర్సింహా వినపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో జెసి శ్రీధర్, ఎజెసి రేఖారాణి, డిఆర్‌వో మదన్‌మోహన్‌రావు, ఆర్డీవో హరీష్ పాల్గొన్నారు.

జలమండలి కార్మిక ఉద్యోగుల ఎన్నికలు నిర్వహించాలి
ట్రేడ్ యూనియన్ జెఎసి విజ్ఞప్తి

చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 10: కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజ్ బోర్డులో కార్మిక సంఘాల మెజారిటీ గుర్తింపు సీక్రెట్ బాలెట్ ఎన్నికలు, కాలపరిమితి ముగిసినప్పటికీ పెండింగ్‌లో ఉంచడంపై విచారించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ట్రేడ్ యూనియన్‌జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
జలమండలిలో ప్రస్తుతం గుర్తింపు సంఘానికి గుర్తింపు కాలపరిమితి రెండు సంవత్సరాల క్రితమే ముగిసిందని దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్‌ను నియమించి ఎన్నికలు నిర్వహించాలని ట్రేడ్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జలమండలి ఉద్యోగుల యూనియన్ చైర్మన్, మాజీమంత్రి ఇ.పెద్దిరెడ్డి, చీఫ్ కన్వీనర్, గ్రేటర్ టిడిపి అధికార ప్రతినిధి ఎం.ఆనందకుమార్‌గౌడ్‌లతో కూడిన ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ వి.రెడ్డి, అదనపు కమిషనర్ సూర్యప్రసాద్‌లను కలిసి వినతిపత్రం అందచేసారు. రాజకీయ వత్తిళ్ల ద్వారానే ఎన్నికల నిర్వహణను రిటర్నింగ్ అధికారి జాప్యం చేస్తున్నారని ఇకనైనా వెంటనే జలమండలి కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే జరపాలని కోరుతూ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ట్రేడ్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జలమండలి) ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించింది. ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని గుర్తింపు యూనియన్ కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని పెద్దిరెడ్డి, అమ్జదుల్లాఖాన్, ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఆలయాలు కిటకిట
కీసర, డిసెంబర్ 10: కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో నగర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆర్టీసి అధికారులు ప్రత్యేక బస్‌లు నడపడంతో ఉదయం నుంచే భక్తులు వచ్చి లైన్లలో గంటల తరబడి వేచివుండి స్వామివారిని దర్శించారు. గోపురం సమీపంలోని శివలింగాలకు భక్తులు అభిషేకాలు చేసి పూజించారు. అనంతరం పార్కుల్లో కుటుంబసభ్యులతో కలిసి వనభోజనాలు చేసారు. మేడ్చల్ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి ప్రభాకర్‌గౌడ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ నారాయణశర్మ, ఇఓ వెంకటేష్ ఏర్పాట్లను సమీక్షించారు.
కుత్బుల్లాపూర్‌లో..
కుత్బుల్లాపూర్ : కార్తీక పౌర్ణమి చివరి సోమవారం కావడంతో నగర శివారులోని శివాలయాలు భక్తులతో కిటకిలాడాయి. నిజాంపేట్‌లో అభయాంజనేయస్వామి ఆలయంలోని శివాలయం, సూరారం శివాలయనగర్ ఉమామహేశ్వరస్వామి ఆలయం, ఐడిపిఎల్, చింతల్, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, ప్రగతినగర్, దుండిగల్, కొంపల్లి, దూలపల్లిలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
నిజాంపేట్ అభయాంజనేయస్వామి ఆలయాన్ని వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధికార ప్రతినిధి కొలను శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక
వికారాబాద్, డిసెంబర్ 10: నీటి సమస్య చాలా ముఖ్యమైనదని వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుండే ప్రణాళిక రూపొందించుకోవాలని మున్సిపల్ ప్రత్యేకాధికారి, సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి సూచించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డయల్ యువర్ స్పెషలాఫీసర్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది నీటి సమస్య తలెత్తిన ప్రాంతాలను గుర్తించి దానిపై సమీక్ష చేయాలన్నారు. డెత్ సర్ట్ఫికెట్ కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఇవ్వడం లేదని పట్టణ వాసి శారద ఫోన్ ద్వారా తెలిపారు. గాంధీ కాలనీలో బోర్ ఇంకా మరమ్మతుకు నోచుకోలేదని, టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్‌లో డంపర్‌బిన్ ఏర్పాటు చేయలేదని గత ఫిర్యాదును రాజ్‌కుమార్ గుర్తుచేశారు. గరీబ్‌నగర్‌లో రెండు కల్వర్టులు నిర్మించాలని, పాఠశాలకు ప్రహరిగోడ నిర్మించాలని కోరారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సింగారపు కాలనీ నివాసి గోపాల్ కోరారు. కోర్టు వద్ద వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, అరుణ్ ఆప్టికల్స్ వద్ద జనరేటర్ శబ్దంతో ఇబ్బందులకు గురవుతున్నామని, రైల్వే బ్రిడ్జిపై వాహనాలు ఆపటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఫోన్‌లో తెలిపారు.
గ్రామీణ ప్రాంతం నుండి ఫోన్‌లు
మున్సిపల్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహిస్తున్న సబ్‌కలెక్టర్‌కు గ్రామీణ ప్రాంతం నుండి ఫోన్‌లు వచ్చాయి. ధారూర్ మండలం అర్దాస్‌పల్లి గ్రామవాసులు ఓసమస్యపై ఫోన్ చేశారు. మర్పల్లి మండలం కొత్లాపూర్ గ్రామం నుండి నీటి సమస్య ఉందని ఫోన్ చేశారు. కొత్తగడిలో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
అవసరమైనపుడు ప్రతిపాదనలు ఇవ్వండి
ముఖ్యమంత్రి వచ్చినపుడు పట్టణం ఎంత శుభ్రంగా ఉందో ఎపుడూ అలాగే ఉండేలా పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని ఆమె అన్నారు. పారిశుద్ధ్య పనులకు అవసరమయ్యే లేబర్, ఆటోలు, ట్రాక్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. పట్టణంలో దోమలు, వీధిధీపాల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. మోటార్ మరమ్మతు బిల్లు వెంటనే చెల్లించాలని ఎఇ హన్మంత్‌రావు నాయక్‌ను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ డిఇఇ శ్రీకాంత్‌రెడ్డి, టిపివో రంగరాజు, ఐకెపి ఎపివో రవి, ఆర్‌ఐ తేజిరెడ్డి, శానిటేషన్ జవాన్లు వినోద్, ఏసు, చెన్నయ్య పాల్గొన్నారు.
ఇకటి మేళాను సందర్శించిన రాధాకృష్ణ

గచ్చిబౌలి, డిసెంబర్ 10: మాదాపూర్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శిస్తున్న ఇకటి మేళాను సంగీత దర్శకుడు కెఎం రాధాకృష్ణ సందర్శించారు. నేత పనివారికి మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి హ్యాండ్లూమ్ పార్క్ ఆధ్వర్యంలో ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. మన సంప్రదాయ చేనేత కళాకారులను ప్రోత్సహించాలంటే వారు తయారుచేసే వస్త్రాలను అందరూ ధరించాలని సూచించారు. తాను సంగీత దర్శకత్వం వహించే సినిమాలద్వారా ఇకటి వస్త్రాలను ప్రమోట్ చేయడానికి కృషి చేస్తానని రాధాకృష్ణ తెలిపారు. ఈ ప్రదర్శన 16 వరకు వుంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పార్క్ డైరెక్టర్ దామోదర్, ప్రమోటర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వసతి గృహాల్లో పెంచిన చార్జీలు అమలుచేయాలి

చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 10: ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రభుత్వం ఇటీవల పెంచిన మెస్ చార్జీలను వెంటనే జిల్లాలోని అన్ని వసతిగృహాల్లో అమలుచేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎస్.ఎ.ఎం. రిజ్వీ అన్నారు. మెనూ అమలు, ఇతర సమస్యల పరిశీలనకు 53 వసతి గృహాల్లో జిల్లా అధికారులతో ఒకరోజు రాత్రి బస పర్యవేక్షణపై సోమవారం కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. వివిధ వసతిగృహాల్లో కొత్త మెనూ ప్రారంభించనివారు వెంటనే అమలుచేయాలని, మెనూ మోడల్‌ను వసతిగృహంలో నోటీసు బోర్డు పక్కన పెయింట్‌తో రాయించాలని ఇఇ సాంఘిక సంక్షేమ శాఖను ఆదేశించారు. కొన్ని వసతి గృహాల భవనాలు విశాలంగా వుండి పిల్లలు తక్కువ వుంటే, తక్కువ సంఖ్య వున్న భవనాలలోకి పిల్లలను మార్చి వసతులన్నీ వుండేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఒక్కో అధికారితో సమస్యలపై సమీక్షించారు.
కొన్ని హాస్టళ్లలో డాక్టర్ చెకప్ జరగడంలేదని, దోమల బెడద వుందని, బాత్రూమ్‌లో నీరు, డ్రైనేజీ సరిగా లేదని, వసతి గృహాల్లో తలుపులకు బోల్టులు పనిచేయడం లేదని, బాలికల వసతి గృహాల్లో సెక్యూరిటీ, వాచ్‌మెన్‌లు లేరని, ఫ్యాన్లు పనిచేయడం లేదని అధికారులు కలెక్టర్‌కు విన్నవించారు. కొన్ని వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువుందని వార్డెన్‌లు, ట్యూటర్లు లేరని అధికారులు వివరించారు. తక్కువ విద్యార్థులు ఏ వసతి గృహాల్లో వున్నారో తెలపాలని బిసి సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ బిల్డింగ్‌లకు అద్దె ఎక్కువ చెల్లిస్తున్నందున పక్కపక్కనున్న వసతి గృహాల విద్యార్థులను ఒక భవనంలోకి చేర్చాలన్నారు. ప్రతి వసతి గృహంలో కలెక్టర్, జాయింట్, అడిషనల్ జాయింట్ కలెక్టర్లు, సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లతో బోర్డులు పెట్టాలన్నారు.
ఏ లోపాలున్నట్లు నిర్ధారించారో వాటిపై వెంటనే చర్య తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ బిసి సంక్షేమ శాఖల అధికారులు, మరమ్మతుల నిర్మాణాలకు సంబంధించి ఇఇ వెంటనే చర్యలు తీసుకుని తమకు నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో జెసి శ్రీ్ధర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు విజయ్‌పాల్, వివిధ శాఖల అధికారులు, మండల తహశీల్దార్లు పాల్గొన్నారు.

అవినీతిలో కూరుకుపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలి

ఘట్‌కేసర్, డిసెంబర్ 10: అవినీతి, అక్రమాలలో కురుకపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పాలని మేడ్చేల్ నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జి నక్క ప్రభాకర్‌గౌడ్ అన్నారు. ఘట్‌కేసర్ మండలంలోని అంకుషాపూర్, ఎన్‌ఎఫ్‌సినగర్ గ్రామాలలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం రాజ్యం ఏలుతుందని, నిత్యవసర సరుకులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రగల్బాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం సరిపడని విద్యుత్ సరఫరాతో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల టిఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాపోలు రాములు, తోటకూర జంగయ్య యాదవ్, మండల టిడిపి అధ్యక్షుడు రఘుపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల నర్సింగ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ డొంకెని బిక్షపతిగౌడ్ పాల్గొన్నారు.
పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి
కంటోనె్మంట్, డిసెంబర్ 10: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలనీ మల్కాజిగరి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జి వికె మహేష్ డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానలు వ్యతిరేకిస్తు అల్వాల్ చౌరస్తాలో ధర్నా చేసి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజల ఇచ్చిన హమిలను యూపిఎ ప్రభుత్వం తుంగలో తోక్కి ప్రజలపైన అన్ని రకాల పన్నులు పెంచి ప్రజలపైన భారం మోపుతుందనీ ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మచ్చబొల్లారం కార్పొరేటర్ ఇఎస్ రాజ్‌జీతేంద్రనాథ్, నాయకులు డోలి రమేష్, అనిల్ కిషోర్, నందివర్థనం రాజు, సూర్యప్రకాష్, రఘు, శకుంతల నాయుడు, స్వరూపరాణి పాల్గొన్నారు.
బాబా ఆలయ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం
దిల్‌సుఖ్‌నగర్, డిసెంబర్ 10: స్థానిక సాయిబాబా ఆలయ నూతన చైర్మన్‌గా ఎన్నికైన వూర నర్సింహగుప్త సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేసారు. అనంతరం గుప్త మాట్లాడుతూ, భక్తులు సహకరిస్తే హయత్‌నగర్ ప్రాంతంలో పదకొండు ఎకరాలలో పేదలకు ఉచితంగా ఆసుపత్రి, వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు. తనపై నమ్మకంతో చైర్మన్ పదవి కట్టబెట్టిన ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి వాసవి పీఠాధిపతి శ్రీ్ధర్‌స్వామి, వైస్ చైర్మన్ వనం యాదయ్య, మాజీ చైర్మన్లు మల్లయ్య, రాజు యాదవ్, పద్మాకర్, వెంకటయ్య, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళల్లో రాజకీయ చైతన్యం పెరగాలి
శేరిలింగంపల్లి, డిసెంబర్ 10: మహిళల్లో రాజకీయ చైతన్యం మరింత పెరగాలని ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటరెడి

* భూమార్పిడి ప్రతిపాదనలే కీలకం! * ఆమోదింపజేసేందుకు ‘స్థారుూ’ ప్రయత్నం * అడ్డుకునేవారి సంఖ్యే అధికం
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>