Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం తొక్కిసలాట

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 11: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శన టిక్కెట్ల కోసం ముందుగా టోకెన్లు జారీ చేసే కార్యక్రమం మంగళవారం విశాఖలో గందరగోళ పరిస్థితులకు దారితీసి తీవ్ర తొక్కిసలాట జరిగి 10 మంది భక్తులు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. జరిగిన సంఘటనపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్రంగా స్పందించి అధికారుల వైఫల్యమే ఈ గందరగోళానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖ నగరంలోని టిటిడి కల్యాణమండపంలో నిర్వహించిన టోకెన్ల జారీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచి క్యూ కట్టిన భక్తులు అనేక అవస్థలు పడ్డారు. టిటిడి అధికారులు తీరికగా మధ్యాహ్నం మూడు గంటలకు టోకెన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిస్థితి అదుపు తప్పి వేలాది మంది భక్తులు ఒకేసారిగా లోపలకు వెళ్ళేందుకు ప్రయత్నించగా జరిగిన తొక్కిసలాటలో దాదాపు పదిమందికి గాయాలయ్యాయి. ఇందులో ఓ మహిళ చేతి వేలు దెబ్బతినగా, మరో మహిళ సొమ్మసిల్లి ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నగరంలో పలు స్టేషన్ల నుంచి పోలీసు అధికారులు, సిబ్బంది తరలివచ్చారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భక్తులపై లాఠీచార్జి చేశారు. టిటిడి అధికారుల నిర్లక్ష్యంతో భక్తులకు ఇబ్బందులకు గురయ్యారు. కాగా ముక్కోటి ఏకాదశి టోకెన్లను ప్రతి జిల్లాలో పంపిణీ చేస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. దీంతో తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కట్టారు. భారీగా తరలివచ్చిన భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు టిటిడి చేయలేదు. టోకెన్ల పంపిణీని కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారు.
అధికారుల వైఫల్యమే: స్వరూపానందేంద్ర
టిటిడి అధికారులు వ్యవహరించిన తీరుపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్రంగా స్పందించారు. టిటిడి ప్రతి ఏడాది తోచిన విధంగా ప్రకటనలు చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి టిక్కెట్లను ఏ జిల్లాకు ఆ జిల్లాలో తీసుకోవచ్చని ప్రకటించిన అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయటంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అదే సమయంలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. సామరస్యపూర్వకంగా భక్తులను అదుపు చేయాల్సిన పోలీసులు వారిపై లాఠీచార్జి చేయటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. హిందూ మతంపై ఇప్పటికే అనేక దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వెంకన్న భక్తులను ఈ విధంగా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అఖిలపక్షం పేరుతో
మరో నాటకం
* కాంగ్రెస్‌పై బాబు నిప్పులు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, డిసెంబర్ 11: కేంద్రం తెలంగాణపై అఖిలపక్షం పేరిట మరో నాటకానికి తెర తీస్తోందని, అభిప్రాయ సేకరణతో కాలయాపన చేయకుండా తెలంగాణ అంశాన్ని తక్షణమే తేల్చాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై వుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ అంశంపై తమ పార్టీ 2009లోనే స్పష్టమైన లేఖ ఇచ్చిందని, ఈ నెల 28న జరిగే అఖిల పక్ష భేటీలోనూ తమ వైఖరి తేల్చి చెబుతామని పునరుద్ఘాటించారు. ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం 6వ రోజు చంద్రబాబు పాదయాత్ర నిర్మల్ మండలంలోని సిర్గాపూర్, చిట్యాల, తల్వెడ, నిర్మల్ టౌన్‌లో కొనసాగింది. ఈ సందర్భంగా చంద్రబాబు దారి వెంట పసుపు, పత్తి పంట చేలను పరిశీలించి మధ్యలో మహిళలు, ఆర్టీసీ ప్రయాణీకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ గరీబోళ్ల పెద్దబిడ్డగా తనను ఆదరించి అధికారంలోకి తెస్తే ఐదేళ్ల పాటు మీ సేవకుడిగా సమస్యలు తీరుస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులకు ప్రజలకు ప్రలోభాలకు గురి కాకుంటే సిఎం ఉద్యోగం నాకే దక్కుతుందని ధీమావ్యక్తం చేశారు. అఖిల పక్షం పేరిట కొత్త మంత్రి షిందే కొత్త రాగాలతో తెలంగాణ ఎంపీలను బురిడీ కొట్టించి ఎఫ్‌డిఐ ఓటింగ్‌లో గట్టెక్కించుకున్నారని ఆరోపించారు. 28న జరిగే అఖిలపక్ష సమావేశం నామ్‌కేవాస్తే గాకుండా సమస్య తేల్చేందుకు కేంద్రం చిత్తశుద్దితో ముందుకు రావాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ రైతాంగ సమస్యలపై రాజీలేకుండా పోరాడుతోందని, రైతులకు అండగా పంట రుణాలు మాఫీ చేస్తామని ఎప్పుడో ప్రకటిస్తే నిన్న తిరకాసుల టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తమ వాగ్దానాన్ని అనుసరిస్తూ రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారని ఎద్దేవా చేశారు. సమస్యలను పట్టించుకోకుండా మాటల గారడితో, అబద్దాల హామీలతో ప్రజలను వంచించడం కెసిఆర్‌కు అలవాటేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో 42 పార్లమెంట్ స్థానాలు టిడిపి గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పడమే గాక, రాష్ట్ర ప్రయోజనాలను నెరవేరుస్తూ యేడాదికి 10 గ్యాస్ సిలెండర్లు అందిస్తామని హామీ ఇచ్చారు. సోనియాగాంధీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో 9 సిలెండర్లు ఇవ్వాలని ఆదేశిస్తే ఇక్కడ కిరణ్‌కుమార్ మాత్రం స్పందించకుండా 6 సిలెండర్లతోనే పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు పనుల్లో కాంగ్రెస్ కాంట్రాక్టర్లు పని చేయకుండానే కోట్లాది నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. తెలంగాణ విషయంలో తాను ఎన్నడూ మోకాలొడ్డలేదని, భవిష్యత్తులో కూడా వ్యతిరేకించేది లేదని బాబు స్పష్టం చేశారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులు నిరుద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

18న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, డిసెంబర్ 11: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ( ఆలయశుద్ధి) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగే (18వతేది) జరిగే అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవలను రద్దు చేశారు. ప్రతి యేడాదిలోనూ నాలుగు పర్యాయాలు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా ఉగాది, అణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరుడు స్వయం వ్యక్తంగా కొలువుదీరిన గర్భాలయమే ఆనంద నిలయం. తిరుమంజనం రోజున ఆనందనిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకూ సుగంధ పరిమళ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకూ ఈ శుద్ధి కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలా అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
సిమెంట్ కంపెనీలో ప్రమాదం:
ముగ్గురు కార్మికులకు గాయాలు
కమలాపురం, డిసెంబర్ 11: కడప జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లె వద్ద గల భారతి సిమెంట్ పరిశ్రమలో గ్యాస్ లీకైన ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన గంగులయ్య, గంగన్న, వెంకటసుబ్బయ్యను వెంటనేయాజమాన్యం ప్రత్యేక అంబులెన్స్‌లో ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రత్యేక చికిత్స చేయిస్తోంది. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. అయితే విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. తమవారు ప్రమాదంలో గాయపడిన సమాచారాన్ని తెలియజేయకపోవడం పట్ల సుబ్బారెడ్డి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. కాగా ఈ ప్రమాదంపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదుకాలేదు. దీనిపై ఎస్‌ఐ లక్ష్మినారాయణను ప్రశ్నించగా ప్రమాదం గురించి మంగళవారం తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే ఫ్యాక్టరీకి చేరుకుని గ్యాస్ లీక్ అయిన పైపు, భవనాన్ని పరిశీలించామన్నారు.
అమలులోకి వచ్చిన
తక్షణ వసతి కేటాయింపు
తిరుపతి, డిసెంబర్ 11: తిరుమల శ్రీ పద్మావతి ఉప విచారణ కార్యాలయంలో మంగళవారం భక్తుల సౌకర్యార్థం రామ్స్ కియోస్క్ తక్షణ వసతి కేటాయింపు సదుపాయం వినియోగంలోకి వచ్చింది. వసతి కేటాయింపులో మరింత పారదర్శకత కోసం టిటిడి ఈవిధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా టిటిడి ఈ విధానాన్ని సన్నిధానం, శంఖుమిట్ట, ఆదిశేషు, చక్ర వసతి గృహాలకు అమలు చేసింది. ఇందులో భాగంగా 51 గదులను ఈ విధానం కింద భక్తులకు అందుబాటులోకి చింది. తొలిరోజే ఈ విధానానికి భక్తుల నుండి విశేష స్పందన లభించింది. వసతి గృహాన్ని పొందగోరిన భక్తుడు ముందుగా కంప్యూటర్‌లో వివిధ అతిథిగృహాల్లో ఖాళీగా ఉన్న గదుల వివరాలను తెలుసుకుంటారు. అనంతరం తనకు నచ్చిన గదిని ఈ విధానం ద్వారా నమోదు చేసుకుంటారు. భక్తుడు కంప్యూటర్‌లో తన వివరాలను పొందుపరిచి అనంతరం తన వేలిముద్ర, ఫోటోను పొందుపరిచి రసీదు తీసుకుంటారు. ఈ రశీదును తీసుకుని కౌంటర్‌కు వెళితే మరోసారి తన వేలిముద్రను తీసుకుని ఫోటోను అందుకుని 40 నిమిషాలలోపు నగదు చెల్లించి గదిని పొందుతారు.
ఒకేరోజు మూడు ఆలయాల్లో చోరీ
చోడవరం, డిసెంబర్ 11: విశాఖ జిల్లా చోడవరం మండలం గంధవరం గ్రామంలో దొంగలు ఒకేరోజు రాత్రి మూడు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. చోరీకి గురైన సొత్తు విలువ తక్కువే అయినప్పటికీ ఒకేరోజు మూడు ఆలయాల్లో దొంగలు పడటం స్థానికంగా కలకలం రేపింది. సోమవారం రాత్రి కృష్ణమందిరం తలుపులు పగులగొట్టి లోనికి చొరబడిన దొంగలు 60వేల రూపాయల విలువ చేసే వెండి శఠగోపం, వెండి పళ్లెం, వెండి గ్లాసుతోపాటు హుండీలను పగులగొట్టి సుమారు మూడువేల రూపాయల వరకు దోచుకుపోయారు. అలాగే అదే గ్రామంలో ఆంజనేయస్వామి, పరదేశమ్మ దేవాలయాల్లో కూడా దొంగలు ప్రవేశించి అక్కడి హుండీలను బద్దలుకొట్టి సుమారు 12వేల రూపాయలను పట్టుకుపోయారు.
పురంధ్రీశ్వరికిది తగదు: కెయి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, డిసెంబర్ 11: కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరికి ఎన్టీ రామారావుపై తండ్రి అనే గౌరవముందా? అని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కెయి కృష్ణమూర్తి ప్రశ్నించారు. మంగళవారం కర్నూలులో విలేఖరులతో మాట్లాడుతూ లోక్‌సభలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును రాజకీయం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కల్పించే రీతిలో వ్యవహరిస్తున్న ఆమె శంషాబాద్‌లోని ఎన్టీఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి రాజీవ్‌గాంధీ పేరు పెడుతుంటే ఏం చేశారని అన్నారు. లోక్‌సభలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు చంద్రబాబు నాయకత్వంలో టిడిపి లోక్‌సభసభ్యులు ఎంతగానో ప్రయత్నించిన విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. కాగా రాజ్యసభసభ్యులు సుజనా చౌదరి, దేవేందర్ గౌడ్, సుధారాణి ఎఫ్‌డిఐలపై ఓటింగ్ విషయంలో గైర్హాజరు కావడం తప్పే అయినా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామన్నారు. లోక్‌సభలో తీర్మానం నెగ్గిన తరువాత అదే పద్ధతిలో రాజ్యసభలోనూ జరుగుతుందన్న భావనతోనే పార్టీ ఎంపిలు అలా వ్యవహరించారన్నారు.
ఎసిబికి చిక్కిన తహశీల్దార్, ఆర్‌ఐ
సరుబుజ్జిలి, డిసెంబర్ 11: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మంగళవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. విజయనగరం ఎసిబి డిఎస్పీ కెసి రఘువీర్ అందించిన వివరాల ప్రకారం.. గోనెపాడు గ్రామానికి చెందిన మెట్ట మోహనరావు తనకు చెందిన వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మార్చాలని గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ అధికారులు పనిపూర్తి చేయాలంటే ఐదువేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో మోహనరావు నాలుగువేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఎసిబి అధికా

బొకారో ఎక్స్‌ప్రెస్ కిందపడి కుటుంబం ఆత్మహత్య
మండపేట, డిసెంబర్ 11: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం రైల్వే స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అనపర్తి ఐఎల్‌టిడిలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న చవికుల రామం (55), అతని భార్య కనకమహాలక్ష్మి (48), కుమార్తె నాగేంద్ర ఉజ్వల (22) ధన్‌బాద్ నుంచి అలెప్పీ వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్ కిందపడి ఆత్మహత్యచేసుకున్నారు. రైలు కేశవరం రైల్వేస్టేషన్‌కు వచ్చేసరికి హఠాత్తుగా ఆ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మృతుడు రామంకు ఫణికుమార్ అనే కుమారుడు కూడా ఉన్నారు. అతను హైదరాబాద్‌లో ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.రులు వలపన్ని లంచం సొమ్ము తీసుకుంటున్న ఆర్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. తహశీల్దార్ భాస్కరరావు చెబితేనే లంచం తీసుకున్నానని ఆర్‌ఐ చెప్పటంతో ఆయనపైనా కేసు నమోదు చేశారు. అయితే తాము కేవలం చలానా సొమ్ము కట్టాలని మాత్రమే చెప్పామని తహశీల్దార్ పేర్కొన్నారు.

ఈడి కేసులో
సత్యం రాజుకు ఊరట

స్టే ఇచ్చిన హైకోర్టు
ఆంధ్రభూమి లీగల్ కరస్పాండెంట్
హైదరాబాద్, డిసెంబర్ 11: సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజుకు ఊరట లభించింది. సత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ రామలింగరాజు ఆస్తులను జప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) ఇచ్చిన ఆదేశాలపై మంగళవారం హైకోర్టు స్టే విధించింది. రామలింగరాజుకు చెందిన 822 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడి జప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఈడి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రామలింగరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు ఈడి ఆదేశాలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, రెండు నెలల క్రితమే 822 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేయగా, ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను జప్తు చేయడం ఈడి చరిత్రలో అదే మొదటి సారి.

ప్రయోజనాల కోసమే కెసిఆర్ తెలం‘గానం’

వైకాపా విమర్శ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: తమ కుటుంబ ప్రయోజనాల కోసమే కెసిఆర్ తెలంగాణ వాదాన్ని ఉపయోగించుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కె ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు కెసిఆరే అడ్డంకి అని ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రజలు చేసిన త్యాగాలతో కెసిఆర్ కుటుంబం ప్రయోజనం పొందుతోందని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని 12 ఏళ్ల క్రితం కెసిఆర్ ప్రశ్నించారని, ఇదే అంశంపై ఉద్యమించారని అయితే ఇప్పటికీ ఈ సమస్యను అలానే వదిలేశారని విమర్శించారు. ఈ అంశంపై ఉద్యమాన్ని ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేదని నిలదీశారు. ఉద్యమం ఉధృతంగా సాగే కాలంలో తన సొంత ప్రయోజనాల కోసం కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని మండిపడ్డారు.
విజయ డెయిరీని అభివృద్ధి పరచాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో విమర్శించింది. విజయ డెయిరీని అభివృద్ధి పరచాలని, పాల సేకరణ ధరను పెంచడం ద్వారా దీనిని ప్రోత్సహించాలని ఆ పార్టీ నాయకులు సూచించారు. డెయిరీ హాలిడే ప్రకటించి పాల సేకరణ నిలిపివేస్తే పాడి రైతులకు తీవ్రంగా నష్టం కలుగుతుందన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేస్తూ తన సొంత కంపెనీ హెరిటేజ్‌ను అభివృద్ధి చేశారని విమర్శించారు. పాల సేకరణ నిలిపివేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందంటూ ఆందోళన వ్యక్తంచేశారు. టిటిడి దేవస్థానం రోజుకు నాలుగువేల లీటర్ల పాలు కొనుగోలు చేస్తుందని, దీనిలో రెండువేల లీటర్లు ప్రైవేటు నుంచి కొంటున్నారని తెలిపారు. విజయ డెయిరీకి కాంట్రాక్టు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ డెయిరీని ప్రోత్సహించాలని కోరారు.
సహకార ఎన్నికల్లో పోటీ చేస్తాం
సహకార ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ చట్టం వల్లనే తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తోందని, అంతే తప్ప ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకం వారికి ఉండడం వల్ల కాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి లోపుగా ఎన్నికలు నిర్వహించడం చట్టం ప్రకారం తప్పనిసరి అని ప్రభుత్వానికి మరో మార్గం లేదని తెలిపారు. ఈ ఎన్నికలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సన్నద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం ఈ ఎన్నికలకు అధికార దుర్వినియోగానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
జగన్ బెయిల్ పిటిషన్‌పై
విచారణ రేపటికి వాయిదా
ఆంధ్రభూమి లీగల్ కరస్పాండెంట్
హైదరాబాద్, డిసెంబర్ 11: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌పై విచారణను మంగళవారం హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. రెగ్యులర్, స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్లపై 13న న్యాయస్థానం వాదనలు వింటుంది. రెండు పిటిషన్లపై ఒకేసారి వాదనలు వినాలని

‘అణు’ ప్రాజెక్టులు అవసరమే: జెపి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, డిసెంబర్ 11: భారతదేశంలో అణువిద్యుత్ వినియోగం చాలా తక్కువగానే ఉందని, దీనిపై ప్రభుత్వాలకు దూరదృష్టి లేకపోవడంతోనే విద్యుత్ సంక్షోభంలో రాష్ట్ర కొట్టుమిట్టాడుతుందని, అందుకే అణువిద్యుత్ ప్రాజెక్టులను ఆహ్వానించాలని లోక్‌సత్తా జాతీయ కన్వీనర్ జయ్‌ప్రకాష్‌నారాయణ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ అణు ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా 50 శాతం విద్యుత్ వాటా రాష్ట్రానికే చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే పారిశ్రామిక ప్రయోజనాలు సంపూర్ణంగా అందుతాయన్నారు. జపాన్‌లో అణువిద్యుత్ రియాక్టర్లతో సంభవించిన భూకంపాలు తెచ్చిన నష్టం భారతదేశంలో లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అణు ప్రాజెక్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే నిర్వాసిత గ్రామాలకు చెందిన ప్రజలకు పునరావాసం కల్పించడంలో ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం చిత్తశుద్ధితో ఏర్పాటు చేస్తే లోక్‌సత్తా పార్టీ ఆహ్వానిస్తుందన్నారు. రాజకీయ ఎత్తుగడలతో చేస్తే అడ్డుకుంటామన్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి చిచ్చుపెడుతున్నాయన్నారు. నిజాయితీగా, సామరస్యంగా సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా తెలుగువారంతా కలిసి బతకాల్సిన అవసరం ఉందన్నారు. అందరి ప్రయోజనాలను కాపాడేవిధంగా తెలంగాణ వస్తే ఆహ్వానిస్తామన్నారు. ఆందోళనలను, ద్వేషాలను పెంచే రాజకీయాలను తిరస్కరించాలన్నారు. ఏమి జరిగినప్పటికీ తెలుగువారంతా కలిసి ఉండాలన్నదే లోక్‌సత్తా అభిమతంగా పేర్కొన్నారు.

మైలవరం జలాశయానికి ‘బ్రహ్మణి’ అడ్డుకట్ట

* ప్రభుత్వ ఆదేశాలతో సిద్ధమవుతున్న ఇరిగేషన్ శాఖ

జమ్మలమడుగు, డిసెంబర్ 11: కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని బ్రహ్మణి యాజమాన్యంపై నీటిపారుదల శాఖ మరో ఫిర్యాదుకు సిద్ధమవుతోంది. విశ్వనీయ సమాచారం మేరకు పెన్నాజలాలతో కరువు సీమను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో నిర్మించిన మైలవరం జలాశయం పూడిపోయేలా బ్రహ్మణి యాజమాన్యం 2009లో మట్టికట్టలు నిర్మించిన విషయం విదితమే. బ్రహ్మణి ఫ్యాక్టరీకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జమ్మలమడుగు ప్రాంతంలో 14, 015 ఎకరాల భూమిని కేటాయించారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం వద్ద బ్రహ్మణి కోసం 68 హెక్టార్ల గనులను కేటాయించారు. దీంతో పాటు జివోనెం.84 తేదీ 9.5.2008 ద్వారా గండికోట ప్రాజెక్టు నుండి 2 టియంసిల నీటి కేటాయించారు. అయితే గండికోట నుండి నీరు తీసుకోవడం తమ వల్ల కాదని బ్రహ్మణి చేసుకున్న విన్నపాలపై అప్పటి ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా గండికోట నుండి మైలవరం జలాశయానికి 2 టియంసిల నీటిని వదిలి, ఈ జలాశయం బ్యాక్ వాటర్ ద్వారా నీటిని తీసుకొనేలా వెసలుబాటు కల్పించింది. స్పష్టత లేని జివోను అడ్డుపెట్టుకుని అప్పట్లో బ్రహ్మణి యాజమాన్యం జలాశయం బ్యాక్‌వాటర్‌లోకి చొరబడి సుమారు 1.5 కిలోమీటర్ మేర పూడ్చి వేస్తూ నిర్మాణాలు చేపట్టింది. విషయం బయటకు పొక్కడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ దీనిపై ఉన్నతాధికారులతో విచారణ చేయించారు. ఫలితంగా ఇద్దరు మైలవరం నీటిపారుదల శాఖ అధికారులను సస్పెండ్ చేశారు. తరువాత వౌనంగా వున్న ప్రభుత్వం తాజాగా మైలవరం పూడ్చివేతపై చర్యలకు ఉపక్రమించింది.బ్రహ్మణి యాజమాన్యంపై ఫిర్యాదు చేయాలంటూ మైలవరం ఇరిగేషన్ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు పంపినట్లు తెలుస్తోంది.

అక్రమాస్తుల రక్షణకే సమైక్యరాగం

* లగడపాటి, కావూరిపై ఎంపి గుత్తా ఫైర్

మిర్యాలగూడ, డిసెంబర్ 11: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుల అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే సమైక్యరాగం పాటపాడుతున్నారని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో దోచుకున్న ఆస్తులను రక్షించుకోవడానికి ఎంపిలు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. దోపిడీ చేసింది నిజం కాదా? అని ఆయన నిలదీశారు. కేంద్ర మంత్రి పదవి రాలేదని రాజీనామా చేసిన కావూరి తెలంగాణ నాయకుల గురించి విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ విభజనలు జరిగితే ఆంధ్ర ప్రాంతం యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. లగడపాటి, కావూరి స్వార్థం కోసం అక్కడి యువకులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.
యుపిఎను బొందపెడతాం: నాగం
మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే యుపిఎ ప్రభుత్వాన్ని బొందపెట్టి ఎన్డీఎను తీసుకువస్తామని ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని అన్నారు. కాంగ్రెస్‌తో పాటు టిడిపి, వైకాపాలు అఖిలపక్ష సమావేశానికి ముందే బహిరంగంగా తీర్మానాలు చేసి 26వ తేదీ వరకు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో టిడిపి, కాంగ్రెస్, వైకాపాల దిమ్మెలను కూల్చేస్తామన్నారు.

పది మందికి గాయాలు ఔ పోలీసుల లాఠీచార్జి
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>