హైదరాబాద్, డిసెంబర్ 12: శృంగేరి శారదాపీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామికి ఈ నెల 14న హైదరాబాద్ (తెలుగు లలిత కళాతోరణం) లో ‘శ్రీ జగద్గురు వందన సభ’ నిర్వహిస్తున్నారు. శ్రీమత్‌శంకర భగవత్పాదులు స్థాపించిన నాలుగు పీఠాల్లో దక్షిణాన శృంగేరి ప్రధానమైంది. భగవత్పాదులు స్థాపించిన పీఠాల్లో ఉత్తరాన బదరీ, తూర్పున పూరీ, పశ్చిమాన ద్వారక ఉన్నాయి. శృంగేరి శారదాపీఠాన్ని అధిరోహించిన శ్రీ భారతీ తీర్థ మహాస్వామి సనాతన ధర్మంతో సహా అనేక అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసిన మహాతపస్వి. వేదవేదాంత యోగశాస్త్రాల్లో పాండిత్యంతో పాటు గత రెండు దశాబ్దాలుగా వేదశాస్త్ధ్య్రాయనాలను ప్రోత్సహిస్తూన్నారు. భారతీ తీర్థమహాస్వామిని జగద్గురు శ్రీ శారదాంబ అవతారమని భక్తులు భావిస్తారు. శ్రీభారతీ తీర్థమహాస్వామి విజయయాత్ర చేపట్టి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి మన రాష్ట్రానికి వచ్చారు. ఈ నెల 16 వరకు హైదరాబాద్‌లోని శంకర్‌మఠంలో బసచేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక నేతృత్వంలో ‘శ్రీ జగద్గురు వందన సభ’ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది.
లలిత కళాతోరణంలో ‘శ్రీ జగద్గురు వందన సభ’
english title:
g
Date:
Thursday, December 13, 2012