హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రత్యేక తెలంగాణ విషయమై తమ పార్టీలకు ఎలాంటి రెండో ఆలోచన లేదని బిజెపి మరో పక్క వామపక్షాల నాయకులు బుధవారం నాడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకే చిత్తశుద్ధి లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎఫ్‌డిఐ వ్యవహారం నుండి గట్టెక్కేందుకే కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం పేరిట కొత్త ఎత్తుగడ వేసిందని విమర్శించారు. తెలంగాణ సమస్యను నేటికీ పరిష్కరించలేదని, కాంగ్రెస్ పార్టీకి , కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అధికార పార్టీ తరఫున సోనియాగాంధీ అభిప్రాయాన్ని తీసుకోవాలని కిషన్‌రెడ్డి సవాలు విసిరారు. తూతూ మంత్రంగా ఇలాంటి అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తే ప్రయోజనం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. కాగా అఖిలపక్షం కంటే ముందే కాంగ్రెస్ పార్టీ నిర్ధిష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని, లేకుంటే అఖిలపక్ష సమావేశాల వల్ల ఫలితం ఉండదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి. వి. రాఘవులు పేర్కొన్నారు. అలాగే హోం మంత్రి నిర్వహించే అఖిలపక్షానికి ఎవరు వెళ్లాలనేది గురువారం నాడు నిర్ణయిస్తామని తెలిపారు. కాగా సిపిఐ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని సిపిఐ రాష్టక్రార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏమిటో చెప్పకుండా పదే పదే అఖిలపక్ష సమావేశాల పేరిట ప్రజలను మోసగించడమే తప్ప మరొకటి కాదని అన్నారు.
స్పష్టం చేసిన బిజెపి, వామపక్షాలు
english title:
p
Date:
Thursday, December 13, 2012