ఏదైనా శుభకార్యం అంటే ఆ ఇంట్లో నవ్వుల జల్లు కురుస్తుంది. కానీ - నైరుతి చైనాలోని ‘సిచువాన్’ ప్రావిన్స్‌లో జనం మాత్రం భోరుమని ఏడుస్తారు. క్రీ.శ.17వ శతాబ్దం నాటి మాట. 1911లో ఈ ప్రాంతాన్ని క్వింగ్ వంశీకులు పరిపాలించేవారు. వీరు క్రీ.పూ.475 - 221 మధ్యకాలంలోని వారింగ్ స్టేట్స్ యుగానికి చెందిన వారని చరిత్ర కథనం. ఆ వంశీకురాలైన యువరాణి పెళ్లి సందర్భంలో తన తల్లి పాదాలకు నమస్కరించి ఏడుస్తూ త్వరలోనే మెట్టినింటికి రావల్సిందిగా కోరిందట. ఆ సంప్రదాయం అలా కొనసాగుతూ - పెళ్లి వేడుకలు ‘ఏడుపు’తో ఆరంభమయ్యాయి. ఒకవేళ పెళ్లి కూతురికి ‘ఏడ్పు’ రాకపోతే తల్లి చొరవ తీసుకొని గట్టిగా చెంప దెబ్బ కొట్టి మరీ ఏడిపిస్తుందిట. ఆ ఏడుపేదో పుట్టింట్లోనే ఏడ్చేస్తే.. మెట్టింట అంతా శుభమేనని అక్కడి వారి నమ్మకం. దాంతో పెళ్లికూతురిని అలంకరించేప్పుడు కూడా ఏడుస్తూ ఆమె దుస్తులతో కళ్లనీళ్లు తుడుచుకుంటార్ట ఊరి జనం.
సరిగ్గా 17 ఏళ్ల క్రితం - డిమిట్రి బోక్‌కరేవ్ ఆరోగ్య పరిస్థితిని విశే్లషించిన వైద్య బృందం అతనికి ‘క్లినికల్ డెత్’ సంభవించిందని చెప్పార్ట. చాన్నాళ్లపాటు కోమాలోనే ఉండిపోయాడు. అలా వెళ్లినవాడు మళ్లీ బోలెడన్ని ‘రంగుల కల’లతో తిరిగి వచ్చాడు. అతని ఇంటిని చూస్తే ఎవరికైనా ఈ సంగతి నమ్మశక్యం అనిపించదు. కానీ అక్షరాలా నిజం. ‘క్లినికల్ డెత్’లోకి వెళ్లిపోయిన డిమిట్రి ఆలోచనల్లో ఎనె్నన్నో రూపాలు కదలాడేవి. ఆ రంగులన్నింటినీ మదిలో నిక్షిప్తం చేసుకుని ‘కోమా’లోంచి బయటికి వచ్చిన తర్వాత - తన గ్రాఫితి కళకి జీవం పోశాడు. ఎన్నో కళాఖండాలను సృష్టించాడు. ‘గ్రాఫితి’ ఆర్ట్‌ని కొన్ని దేశాలు నిషేధించినప్పటికీ - ఈ కళ దినదిన ప్రవర్ధమానం చెందుతూనే ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ మాస్కోవాసి తన ఇంటి గోడల్నే ఈ కళకు అంకితం చేశాడు. చుట్టూ ఉన్న గోడలూ.. మెట్లు - ఇలా ఒకటేమిటి? ఎనె్నన్నింటినో అతడు పెయింట్ చేశాడు. దీన్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు కూడా తమ ఇంటినీ అలా అలంకరించమని ఆఫర్ చేయటం మొదలుపెట్టారు. కొన్నాళ్లకి తన ఊరినే మార్చేస్తానంటున్నాడీ గ్రాఫితి ఆర్టిస్ట్.