దానిమ్మలో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్, ఫాలిఫెనాల్స్, టానిక్స్, యాంతో సియానిక్స్ అధికంగా ఉన్నాయి. ఇవన్నీ గ్రీన్ టీలో కంటే దానిమ్మలోనే ఎక్కువ మోతాదులో లభిస్తాయి. వృద్ధాప్య లక్షణాలను తగ్గించి, వివిధ రకాల క్యాన్సర్‌లను తగ్గించే ఉపకారిగా దానిమ్మ బాగా పనిచేస్తుంది.
రక్తంలో చెడు కొలెస్టరాల్ స్థాయిల్ని తగ్గించగల ఓ రకం మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అయిన ఓలిక్ యాసిడ్‌కు ఆలివ్ ఆయిల్ మంచి ఆధారం. దీనివల్ల గుండె గోడలకు రక్షణ ఏర్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని క్రమబద్ధీకరించి, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడే గుణం ఆలివ్ ఆయిల్‌లో ఉంది.
శరీరానికి ప్రొటీన్స్, కాల్షియం, రొబోఫ్లేవిన్, విటమిన్ బి12లను పెరుగు అందిస్తుంది. శరీరంలో అన్ని వ్యవస్థలు బాగా పనిచేసేలా పెరుగు సహకరిస్తుంది.
వీలైనప్పుడల్లా పంచదారకు ప్రత్యామ్నాయంగా తేనెను ఎంచుకోవాలి. ఇది అద్భుతమైన ఎనర్జీ బూస్టర్. కాల్షియాన్ని పెంచడానికి, జీర్ణశక్తిని, ముక్కు దిబ్బడను తగ్గించడానికి, గుండె బలానికి తేనె దివ్యమైన ఔషధం లాంటిది.
దానిమ్మలో శరీరానికి మేలు
english title:
d
Date:
Monday, December 17, 2012