1998 నుంచి 2001 దాకా ఆఫ్గనిస్తాన్ జనాలకు ముఖ్యంగా స్ర్తిలకి నరకం చూపెట్టిన తాలిబన్లకు- ‘తమదాకా వస్తేగానీ తగువు తెలీదు’- అన్న సామెత చందాన బుద్ధిలో మార్పువచ్చినట్లు కనబడుతోంది.
తాలిబన్ల దారుణ పరిపాలనా కాలంలో- అక్కడ ‘యునిసెఫ్’ ప్రతినిధిగా పనిచేసిన- లూరుూ జార్జ్ ఆర్సినాల్డ్ చెప్పినదాన్ని బట్టి- ఇప్పుడిప్పుడు తాలిబన్లు వాళ్ల కుటుంబాల్లో ఆడపిల్లల్ని- ‘సమితి’ సంస్థల మద్దతుతో నడిచే పాఠశాలలకు పంపిస్తున్నారు. ‘‘ఆనాటి ‘్ఫత్వా’ మాటేమిటి?’’ అంటే ‘‘అప్పుడు యుద్ధం సాగుతోంది. మా సైనిక బలగాలు ఏకోన్ముఖంగా సాగాలంటే వాళ్లదృష్టిని కూడా మరోవైపునకు మరలించకూడదు. రోడ్లమీద ఆడపిల్లలు పుస్తకాలూ గట్రా పట్టుకుని- సందడిగా - తిరుగుతూ వుంటే- ఇంకేముందీ?’’ అని యునిసెఫ్ ప్రతినిధులతో- మాటల మధ్య తాలిబన్లు అంటున్నారుట! నిజమే..! వారికి బుద్ధొస్తే మంచిదే కదా మరి!
స్ర్తిల కోసమే కాఫీ!
వెనుకటి కాలంలో బామ్మలు కాఫీ పొడి తయారీ నుంచి కాఫీ చేసుకోడం దాకా- అంతా ఓ యజ్ఞంలా- దీక్షగా సాగించేవారు. ఇప్పుడు లండన్‌లో- కాఫీ మీద, దాన్ని మక్కువగా తాగేవాళ్ల మీద బోలెడన్ని పరిశోధనలు చేశారు. నాలుగైదు కప్పుల కాఫీ తాగితే..? ఆగండి- ఆడవారు తాగితే వాళ్లకి ఎక్కువగా హుషారుగా వుంటుందట. అదే, ఐదారు కప్పుల కాఫీని మగ మహారాజులు సేవిస్తే- కెఫిన్ విషం శరీరంలోకి ఎక్కించుకోవడం తప్ప- వాళ్లలో డిప్రెషన్ అంతగా తగ్గదట!
తెలుగువాడు ఎక్కడున్నా-‘కాఫీ’ కావాలంటూ అడుగుతాడు. అరవవాడు మాత్రం- ‘కాపీ’ తాగుతాడు (తమిళంలో ‘ప’కి ఒత్తులేదు) కానీ, తమిళ్ అయ్యర్ ‘కాపీ’ భలే మజాగా వుంటుంది. అసలు విషయం ఏమిటీ అంటే- ఏభై ఒక్క వేలమంది ఆడాళ్లని జాగ్రత్తగా పరిశీలించారు. స్ర్తిలలో మానసిక ఒత్తిడి, ‘డిప్రెషన్’ తగ్గడానికి- ఘుమఘుమలాడే ‘కాఫీ’ బెటర్. అయితే, మగాళ్లు ‘టీ’ తాగితే మంచిదే. కార్మికులు, ఆటో డ్రయివర్లూ- అందుకనే- చాయ్.. గరమ్ చాయ్- సేవిస్తూ వుంటారు. ఈ రెండూ కూడా- తాగే మగమహారాజులున్నారు. అయినా, కాఫీ ఆడాళ్లకే మేలు చేస్తుంది. అదీ సంగతి!
1998 నుంచి 2001 దాకా ఆఫ్గనిస్తాన్
english title:
b
Date:
Monday, December 17, 2012