‘ఢమరుకం’ టైటిల్ వివాదంతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు నవీన్ కళ్యాణ్, ప్రస్తుతం నూతన తారలతో ‘ప్లస్ 2 లవ్ స్టోరీస్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్శకుడు త్వరలో మరో వివాదాస్పద అంశంతో ‘టెర్ర’నిజం’ పేరుతో జిఎన్‌కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ ‘గాంధీ నుంచి కసబ్ వరకు చరిత్ర మరిచిపోలేనిది. ప్రభుత్వ’ం దాచిపెట్టిన తెలియని నిజాలెన్నో ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం.
స్క్రిప్ట్ కోసం గత ఆరు నెలలుగా ఎంతోమంది మేధావులను, రాజకీయ నాయకులను కలిసి పలు ఆసక్తికరమైన విషయాలను సేకరించాం. ఈ చిత్రానికి ‘టెర్ర‘నిజం’ టైటిల్‌తోపాటు ‘అన్ టోల్డ్ ట్రూత్’ అనే ఉపశీర్షికను జత చేశాం. ఈ నెల 21న చిత్రీకరణ ప్రారంభిస్తామ’ని తెలిపారు.
‘్ఢమరుకం’ టైటిల్ వివాదంతో వెలుగులోకి
english title:
n
Date:
Monday, December 17, 2012