నేరేడ్‌మెట్, డిసెంబర్ 17: మల్కాజిగిరి పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. వరుసగా ఆరు ఇళ్ల తాళాలు విరగ్గొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటిలోని కుక్క అరవడంతో దానిని చంపేశారు. ఈ సంఘటనతో మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయ. ఏక్షణంలో ఏం జరుగుతుందోఅన్న భయంతో స్థానికులు గజగజలాడుతున్నారు.
వివరాలు- మల్కాజిగిరి- యాదవనగర్‌లో ఆదివారం రాత్రి రాకేష్ అనే ప్రైవేటు ఉద్యోగి ఇంట్లో తాళాలు విరగ్గొట్టి బీరువాలో దాచిన 3 తులాల బంగారు నగలు, ఐదువేల నగదును దొచుకెళ్లారు. పక్కపక్కనే ఐదు ఇళ్లలో తాళాలు విరగొట్టగా అక్కడ ఎమీ దొరక్కపోవడంతో వస్తువులను చిందర వందర చేసి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎసిపి రాధాకిషన్‌రావు, సిఐలు వెంకటేశ్వర్లు, ఆశోక్‌కుమార్, ఫింగర్ ప్రింట్స్ పోలీసులు పరిశీలించారు. రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జానయ్య తెలిపారు.
సామాజిక మార్పుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి
శామీర్‌పేట, డిసెంబర్ 17: సామాజిక మార్పుకు వివిధ సంస్థలు ముందుకు రావాలి రాష్ట్ర డిజబిలిటీ సీనియర్ డైరెక్టర్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. చాయ్ సంస్థ ఆధ్వర్యంలో దేవరయాంజాల్ కమ్యూనిటీ డిజబిలిటీ రిహాబిలిటేషన్ సదస్సును సోమవారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదరికంతో వివిధ రకాల జబ్బులతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని వీరిని ఆదుకునేందుకు చాయ్ లాంటి సంస్థలతో పాటు మరిన్ని ముందుకు రావాలని అన్నారు. నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజలు అనేక కొత్త రోగాలతో ప్రజలు బాధపడుతున్నారని వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నప్పటికీ అవసరమైన చికిత్సలు సకాలంలో అందడం లేదని అందువల్ల వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆయన కోరారు. పేద ప్రజలకు ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారిని ఆదరించి నిస్వార్థంగా సేవలందించే సంస్థలకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఇస్తుందని ఆయన తెలిపారు. పేద ప్రజలకు సేవలందించడంతో చాయ్ సంస్థ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు. గ్రామీణ ప్రజలను చైతన్య పరచి వారికి వివిధ రోగాల పట్ల అవగాహన కల్పించి వారిలో దాగి ఉన్న భయాలను తొలగించేందుకు కేవలం స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు మాత్రమే చేయగలరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చాయ్, మిలియన్‌పౌండ్, జనవికాస్ సంస్థలకు చెందిన ప్రతినిధులు జోరిట్‌ఫ్రాక్లిన్, జి. ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హయత్‌నగర్, డిసెంబర్ 17: మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో హయత్‌నగర్ మండల కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
నేరేడ్‌మెట్, డిసెంబర్ 17: విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో వారిని విడిపించేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం చంద్రబాబునాయుడు నగర్‌లో నివసించే రంగా(18) రిక్షాలో చెత్తను సేకరిస్తుంటాడు. కాగా ఈనెల 14వ తేదీన తన అల్లుడు హరికృష్ణ(15) తనను అర్జున్ అనే బాలుడు సైకిల్‌తో ఢీకొట్టాడని తెలిపాడు. ఈవిషయంపై రంగా అర్జున్‌ను అడిగేందుకు వెళ్లగా అక్కడ వారికి గొడవ జరిగింది. పక్కనే వౌలాలికి చెందిన అర్జున్ స్నేహితుడు వసీం (16) రంగాను కడుపులో బలంగా గుద్దాడు. అక్కడినుండి వెళ్లిన రంగా కడుపునొప్పి వస్తుందని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.