హైదరాబాద్, డిసెంబర్ 18: ఈనెల 28న ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వాదాన్ని వినిపించాలని టిడిపి నాయకులను రాయలసీమ జాయింట్ ఆక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కోరారు. రాయలసీమ డిమాండ్‌పై వివిధ పార్టీల అధ్యక్షులకు వినతిపత్రాలు అందజేస్తున్న బైరెడ్డి మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లోని టిడిపి కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్ భవన్‌లోని ఎన్టీఆర్ విగ్రహం పాదాల వద్ద రాయలసీమ రాష్ట్రం డిమాండ్ వినతిపత్రాన్ని ఉంచారు. ఎన్టీఆర్ రాయలసీమ దత్తపుత్రుడని అందుకే ఆయన పాదాల వద్ద వినతిపత్రం పెడుతున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ కూడా స్వయంగా తాను రాయలసీమ దత్తపుత్రుడినని చెప్పుకున్నారని అన్నారు. రాష్ట్రంలో రాయలసీమకే ఎక్కువ అన్యాయం జరిగిందని, రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్‌కు అవకాశం కల్పించినట్టుగా, రాయలసీమ తరఫున మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి కోరారు. అన్ని పార్టీల నాయకులు రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను అఖిలపక్షంలో వివరించాలని కోరారు. నాటి మద్రాసు రాష్ట్రంలో, అనంతరం సమైక్యాంధ్రలో రాయలసీమ తీవ్ర అన్యాయానికి, అవమానాలకు గురైందని తెలిపారు. రాయలసీమ పరిరక్షణ సమితి, రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి ప్రతినిధులకు సైతం అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండాలని కోరారు.
ఇందిరమ్మ బాటలో అన్ని ఆంక్షలెందుకు: దాడి
ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట సందర్భంగా పోలీసులు విపరీతమైన ఆంక్షలు విధిస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నాయకుడు దాడి వీరభద్రరావు మండిపడ్డారు. విశాఖలో ఇందిరమ్మ బాట ఆంక్షలపై డిజిపి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్ల మాదిరిగా వ్యవహరించారని విమర్శించారు. ప్రజా సమస్యల కోసం ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించినా, ఇందిరమ్మ బాట పేరుతో సమస్యలు పెంచుతున్నారని దాడి విమర్శించారు.
ఈనెల 28న ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వాదాన్ని వినిపించాలని
english title:
n
Date:
Wednesday, December 19, 2012