విశాఖపట్నం, డిసెంబర్ 19: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకోబోమని సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ బాట ముగించుకుని హైదరాబాద్ వెళ్తూ బుధవారం రాత్రి విశాఖ విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మైనింగ్ విధానంపై కొత్త చట్టాన్ని తీసుకురానుందని, దాన్ని కూడా పరిశీలించిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రంలో 22 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుందన్నారు. వచ్చే ఐదేళ్ళలో ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుందన్నారు. జిల్లాకు 15 వేల ఇళ్ళు మంజూరు చేశామని వీటిలో 6000 మాత్రమే పూర్తయ్యాయని, మిగిలినవి వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్‌కు 30 కోట్ల రూపాయలు కేటాయించామని, ఈ మొత్తాన్ని మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేస్తే, వచ్చే బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయిస్తామని అన్నారు. సింహాచల భూములకు సంబంధించి న్యాయపరమైన చిక్కులేమైనా ఉన్నాయా? అన్న అంశం పరిశీలనలో ఉందని అన్నారు. ఐటి ఎస్‌ఇజెడ్‌లో వ్యక్తిగత సమస్యలతో ఆయా కంపెనీల యజమానులు తనను కలిశారని, మొత్తం ఆ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తెస్తే, వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇంధన సర్దుబాటు
భారం తగదు: డిఎల్
మైదుకూరు, డిసెంబర్ 19: విద్యుత్ వినియోగదారులపై ఇంధన సర్దుబాటు భారం మోపడం సముచితంగా కాదని రాష్ట్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. మన బొగ్గును మనమే వినియోగించుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కడప జిల్లా మైదుకూరు మండలంలోని లెక్కల వారిపల్లెలో 33/11 ఎపి సబ్‌స్టేషన్‌ను బుధవారం సాయంత్రం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. ముందుచూపుతో విద్యుత్ ఉత్పత్తిపై తగిన చర్యలు చేపట్ట లేదన్నారు. 300 మిలియన్ల యూనిట్ల విద్యుత్ అవసరం కాగా 100 మినియన్ల యూనిట్ల లోటు ఉందని తెలిపారు. రైతులకు కనీసం 5 గంటలైనా నిరవధికంగా విద్యుత్ సరఫరా చేస్తే సంతోషిస్తారని తెలిపారు. వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకొని లబ్ధిపొందాలని సూచించారు.
ఆర్టీపీపీలో విధ్వంసం
వీరపునాయునిపల్లె, డిసెంబర్ 19: కడప జిల్లా యర్రగుంట్ల మండల పరిధిలోని ఆర్టీపీపీ ఆరవ యూనిట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు బుధవారం నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారితీసింది. ఆందోళనకారులు ఆర్టీపీపీలో 6వ యూనిట్ పనులు నిర్వహిస్తున్న ప్రైవేటు కార్యాలయంలోకి చొరబడి కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న మూడు కాంక్రీటు మిల్లర్లు, మరో మూడు వాహనాలు, ఒక స్ట్ఫా బస్సును ధ్వంసం చేశారు. బ్యాచింగ్ ప్లాంట్‌లోని ల్యాబ్, కంప్యూటర్, ఫర్నిచర్, క్రేన్, తదితర వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో దాదాపు రూ. కోటి నష్టం వాటిల్లినట్లు హిందూ కంపెనీ డిఇ శ్రీని
లారీని ఢీకొన్న రైలు
* డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్ర గాయాలు
* ఐదు గంటల పాటు ఆగిన రైళ్లు
మెదక్, డిసెంబర్ 19: కాపల లేని గేట్‌లో లారీని రైలు ఢీకొన్న సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శంకాపూర్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ వైపు నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో శంకాపూర్ రైల్వే గేట్‌లో ఇనుప ముడిపదార్థం తీసుకువస్తున్న లారీని ఢీకొంది. గేట్ వద్ద కాపలదారుడు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సాయిలు, క్లీనర్ సాయిలులు ఇద్దరికి తీవ్ర గాయాలుకాగా వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. లారీ పెద్దయెత్తున ధ్వంసమైంది. దీంతో 11 గంటల వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లు అక్కన్నపేటలో మరికొన్ని ఖాజాపూర్ వద్ద నిలిచిపోయాయి. ఇందులో విశాఖ ఎక్స్‌ప్రెస్, అజంతా ఎక్స్‌ప్రెస్‌లతో పాటు లోకల్ ప్యాసింజర్ రైళ్లున్నాయి.