కర్నూలు, డిసెంబర్ 19: పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించే ఉద్దేశ్యంతో బియ్యం రూపేణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు రూ.10వేల కోట్లు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఖర్చు చేస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి.శ్రీ్ధర్‌బాబు పేర్కొన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మండల స్థాయి గిడ్డంగుల పటిష్టతపై కర్నూలు, అనంతపురం, కడప, మహబూబ్‌నగర్ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, డిఎస్‌ఓలు, గిడ్డంగుల అధికారులు, స్టేజ్-1,2 కాంట్రాక్టర్లతో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీ్ధర్‌బాబు మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు పక్కదారి పడితే అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారులు, కాంట్రాక్టర్లు చిత్త శుద్ధితో పని చేయాలన్నారు. రాష్ట్రంలోని 439 మండల స్థాయి స్టాక్‌పాయింట్లకు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు సరఫరా చేస్తున్నామన్నారు. స్టాక్ పాయింట్లలో వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రాంతీయ స్థాయిలో సదస్సులు ఏర్పాటు చేసి మండల స్థాయి గిడ్డంగుల అధికారులు, కాంట్రాక్టర్ల అనుభవాలు, సలహాలు, సూచనలు సేకరిస్తున్నామన్నారు. మండల స్టాక్ పాయింట్ నుండి డీలర్ వరకు జరిగే వస్తువుల రవాణా వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. రూట్ ఆఫీసర్లు లేకపోవడం, హమాలీల సమస్య ప్రతిబంధకాలుగా ఉన్నాయన్నారు. లోపాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అభిప్రాయాలు తీసుకొని పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. నియంత్రణ, పర్యవేక్షణలో లోపాల వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థలో నిత్యావసర వస్తువులు పక్కదారి పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కిలో రూపాయి బియ్యం పథకానికి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. ఈ బియ్యం దారిమళ్లితే సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతోపాటు సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ్ధర్‌బాబు
english title:
s
Date:
Thursday, December 20, 2012