న్యూఢిల్లీ, డిసెంబర్ 20: బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లుకు నిరసనగా ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన ఒకవర్గం ఉద్యోగులు గురువారం జరిపిన ఒకరోజు సమ్మె కారణంగా కొన్ని బ్యాంకుల్లో వ్యాపార లావాదేవీలకు అంతరాయమేర్పడింది. నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగ సం ఘాలు ఎఐబిఇఏ, బిఇఎఫ్‌ఐ, ఎఐబిఓఏ, ఎన్‌యుబిఇ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ నాలుగు యూనియన్ల సభ్యులు అధిక సంఖ్యలో వున్న బ్యాంకుల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా కన్పించింది. మిగతా బ్యాం కుల్లో ప్రభావం పాక్షికంగా వున్నప్పటికీ లావాదేవీలు దాదాపు యథావిథిగా జరిగాయి. బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపధ్యంలో బ్యాంకింగ్ సిబ్బంది సమ్మెకు వెళ్లిన సంగతి తెలిసిందే.్భరతీయ స్టేట్‌బ్యాంక్ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొనని కారణంగా ఈ బ్యాంక్ మామూలుగానే పనిచేసింది. అయతే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, త్రిపురలో ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. మెట్రో నగరాల్లోని వివిధ పిఎస్‌యు బ్యాంకుల శాఖల్లో అధికారులు సమ్మెలో పాల్గొన కపోవడంతో ఇవి మామూలు గానే పనిచేశాయ. ఐతే ద పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకులు పూర్తిసా థయలో పనిచేయలేదు. నగదు విత్‌డ్రాయల్స్, డిపాజిట్, చెక్కుల క్లియరింగ్, ఎలక్ట్రానిక్ క్యాష్ బదిలీ వంటి కార్యకలాపాలపై సమ్మె ప్రభావం కొంతమేరకు కనిపించింది.
.................
ఇరాన్ చమురు దిగుమతులు
తగ్గించుకోనున్న భారత్
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులను 10 నుంచి 15 శాతం వరకు తగ్గించుకోవాలని మనదేశం యోచిస్తోంది. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా పెరిగిపోయిన వ్యయంలో కొంత కవర్ చేసేందుకు ఇరాన్ చమురు ధరలు తగ్గించని పక్షంలో వచ్చే ఏడాది దిగుమతులు తగ్గించివేయాలని భారత్ భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరాన్ నుంచి పెద్దఎత్తున చమురు కొనుగోలుచేసే చైనా, భారత్, జపాన్, దక్షిణకొరియా తదితర కొన్ని దేశాలు అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇరాన్‌పై ఆంక్షలు విధించిన అనంతరం ఈ చమురు దిగుమతులు తగ్గించుకున్నాయి. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ఈ ఏడాది ఇరాన్ ఆయిల్ ఎగుమతుల రంగం కుప్పకూలింది.
వచ్చే ఏడాది ఇరాన్ నుంచి భారత్ ఆయిల్ దిగుమతులు ఈ ఏడాది కంటే కనీసం 10-15శాతం తగ్గించే అవకాశం వుందని దీంతో ప్రత్యక్ష సంబంధం వున్న సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇరాన్ ఆయిల్ ధరలు తగ్గించని పక్షంలో దిగుమతులు మరింత తగ్గిపోయే వీలుందని ఆయన చెప్పారు. తగిన రుణ లభ్యత లేక భారతీయ రిఫైనరీలు ఇబ్బందులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆయిల్ దిగుమతుల్లో మనదేశం ప్రపంచంలో నాలుగో స్థానం లో వుంది. భారత్ తన దేశీయ ఆయిల్ అవసరాల్లో 80% వరకు దిగుమతులపైనే ఆథారపడుతోంది. కాగా, ఇరాన్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవాలని ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని దేశీయ రిఫైనరీలు తెలిపాయి
బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లుకు నిరసనగా
english title:
psu
Date:
Friday, December 21, 2012