హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రానికి వచ్చే రైల్వే బడ్జెట్‌లో అధికంగా నిధులు మంజూరు చేస్తామని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో పలు విభాగాలను ఆయన తనిఖీ చేశారు. ప్రయాణీకులతో మాట్లాడి రైల్వే శాఖ అందిస్తున్న సేవలు ఎలా ఉన్నదీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రయాణీకులకు సౌకర్యాలను మెరుగుపర్చడమే ప్రధానాంశంగా పని చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు పూర్తికావాలంటే అందుకు దాదాపు రూ.30 వేల కోట్ల రూపాయలు అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఒక్కసారిగా అన్ని నిధులు కేటాయింపు, ప్రాజెక్టుల పని పూర్తికావడం సాధ్యం కాదని, అయితే వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.
రైల్వే సహాయ మంత్రి కోట్ల వెల్లడి
english title:
r
Date:
Saturday, December 22, 2012