హైదరాబాద్, డిసెంబర్ 21: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు తిరస్కరిస్తూ మంత్రిమండలి నిర్ణయానికి సంబంధించిన ఫైలును ఆమోదించకుండా ప్రభుత్వానికి తిప్పి పంపుతూ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ తీసుకున్న నిర్ణయం సబబేనని ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సమర్థించారు. జరిగిన పరిణామాలు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చిన ఫైల్‌ను తిరిగి మళ్ళీ గవర్నర్‌కు పంపుతారని తాను భావించడం లేదన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ సిబిఐ, కోర్టు తప్పు పట్టినప్పటికీ ధర్మానను వెనకేసుకురావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ సంతృప్తి చెందకపోవడంతో ఫైలును తిప్పిపంపించారన్నారు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోనే ముందు న్యాయ సలహాలను తీసుకోవాలని, అలాగే సీనియర్ మంత్రుల అభిప్రాయాలను పరిశీలించాలని ఆయన సూచించారు. కేబినెట్‌లో తాను లేవనెత్తిన అంశాన్ని పరిశీలించాలన్న ఇంగిత జ్ఞానం ప్రభుత్వ అధినేతకు లేకపోవడం విచారకరమన్నారు. రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా కేబినెట్ వ్యవహరించాలని ఆయన గుర్తు చేశారు. అభిప్రాయాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ మంత్రికి సంబంధం లేకపోతే ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి అవసరం లేదన్న సుప్రీం నిర్ణయాన్ని మంత్రి గుర్తు చేశారు. సహచర మంత్రి ధర్మానపై ప్రాసిక్యూషన్ కోరారన్న బాధ తనకు ఉందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇదొక గుణపాఠంగా పరిగణించాలని, న్యాయ వ్యవస్థలో తలదూర్చడం మంచిది కాదన్న విషయం ప్రభుత్వం గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు క్షమాపణ చెప్పండి: సిఎంకు టిడిపి లేఖ
వాన్‌పిక్ కుంభకోణంలో ధర్మాన ప్రసాదరావును రక్షించేందుకు ప్రయత్నించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వాన్‌పిక్ కుంభకోణంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు అయిందని, కోర్టు ఉత్తర్వుల మేరకు సిబిఐ విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు పై విచారణ కోసం సిబిఐ ప్రభుత్వ అనుమతి కోరితే మంత్రివర్గం విచారణ అవసరం లేదని తీర్మానం చేయడం జగన్‌ను రక్షించడానికేనని యనమల ఆరోపించారు. 26 వివాదాస్పద జివోల విషయంలో మంత్రులకు న్యాయ సహాయం చేయడం తగదని అన్నారు. ధర్మానపై విచారణను నిరాకరిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపితే, గవర్నర్ దాన్ని వెనక్కి పంపుతూ న్యాయ సలహా తీసుకోవాలని, నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని సూచించారని తెలిపారు. కుంభకోణంలో ధర్మాన పాత్రపై స్పష్టమైన ఆధారాలు సిబిఐ వద్ద ఉన్నట్టు గవర్నర్ చర్య స్పష్టం చేస్తోందని అన్నారు. న్యాయ సహాయం తీసుకోవడం కాదు ధర్మానపై విచారణకు వెంటనే సిబిఐకి అనుమతి ఇవ్వాలని యనమల తెలిపారు. ధర్మానపై సిబిఐ విచారణకు నిరాకరించడం ద్వారా జగన్‌ను రక్షించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్న విషయం స్పష్టమైందని యనమల తెలిపారు. తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
అవసరం లేకపోతే ఎందుకు కోరారు: బొత్స
సిబిఐ తన సొంత నిర్ణయంపై తానే న్యాయ స్థానానికి వెళ్ళిందని ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏదీ లేదని పిసిసి అధినేత, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ధర్మాన ప్రాసిక్యూషన్ ఫైలును గవర్నర్ తిప్పి పంపించిన విషయం తనకు తెలియదని శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేందటున్న సిబిఐ మొదట అనుమతి ఎందుకు కోరిందని ప్రశ్నించారు.
ధర్మాన వ్యవహారంపై మంత్రి డిఎల్
english title:
g
Date:
Saturday, December 22, 2012