న్యూఢిల్లీ, డిసెంబర్ 23: గగనతలం నుండి ప్రయోగించగల బ్రహ్మోస్ అతిధ్వానిక క్షిపణిని అభివృద్ధి చేసేందుకు భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందం జరగడం గమనార్హం. 290 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఈ క్షిపణిని ఎస్‌యు-30ఎమ్‌కెఐ యుద్ధ విమానానికి అమర్చేలా రూపొందిస్తారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్, రష్యన్ రొసబ్‌రాన్ ఎక్స్‌పోర్ట్, సుఖొయ్ డిజైన్ బ్యూరో మధ్య ఈ ఒప్పందం కుదిరినట్లు భారత రక్షణశాఖ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇరు దేశాలు గగనతల ప్రయోగ బ్రహ్మోస్ క్షిపణిపై గత కొంతకాలంగా చర్చిస్తున్నాయని, వచ్చే ఏడాది మధ్యనాటికి తొలి ప్రయోగం చేస్తామని వెల్లడించాయి. రష్యా రూపొందించిన ఎస్‌యు-30ఎమ్‌కెఐ యుద్ధ విమానాలకు బ్రహ్మోస్‌ను అమర్చేందుకు భారత వైమానికి దళానికి 6 వేల కోట్ల రూపాయల ప్రణాళికను ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
గగనతలం నుండి ప్రయోగించగల బ్రహ్మోస్
english title:
g
Date:
Monday, December 24, 2012