న్యూఢిల్లీ, డిసెంబర్ 23: వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ యోగా గురువు బాబా రామ్‌దేవ్, సైనికదళ మాజీ ప్రధానాధికారి జనరల్ వి.కె.సింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియా గేట్ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. జంతర్ మంతర్ వద్ద కొద్దిసేపు ఆందోళనకారులను ఉద్ధేశించి ప్రసంగించిన రామ్‌దేవ్, వి.కె.సింగ్ వేదిక మీది నుంచి దిగివస్తుండగా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆందోళనకారులంతా కొద్దిసేపు అక్కడే బైఠాయించారు. అయితే ఆ తర్వాత రామ్‌దేవ్, వి.కె.సింగ్ ఆందోళనకారులతో కలసి ఇండియా గేట్ వైపునకు వెళ్లేందుకు ఉద్యుక్తమవడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది.
జంతర్ మంతర్ వద్ద ఘర్షణ ఇద్దరికి గాయాలు
english title:
r
Date:
Monday, December 24, 2012