సిమ్లా, డిసెంబర్ 23: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిన వీరభద్ర సింగ్ ఆరోసారి రాష్టమ్రుఖ్యమంత్రిగా ఈ నెల 25న ఇక్కడి చరిత్రాత్మక రిడ్జ్ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ ఊర్మిళా సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా, ఈ నెల 25న ప్రమాణం స్వీకారం చేయాలని వీరభద్ర సింగ్‌ను ఆహ్వానించారు. అయితే ఆ రోజు వీరభధ్ర సింగ్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని, పార్టీ అధిష్ఠానవర్గంతో సంప్రదించిన తర్వాత మంత్రిమండలిని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వీరభద్ర సింగ్ శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి హైకమాండ్ పరిశీలకుడిగా విచ్చేసిన జనార్ధన్ ద్వివేదితో సుదీర్ఘంగా సమావేశమై పలు ముఖ్యమైన అంశాలను చర్చించారు. సిఎల్‌పి నాయకుడిగా ఎన్నికయిన తర్వాత మీడియాతో మాట్లాడిన వీరభద్ర సింగ్ తన మంత్రివర్గం మూడంచెల మంత్రివర్గంగా ఉంటుందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు ప్రాతినిధ్యం వహించేదిగా ఉంటుందని, అన్ని వర్గాలు, మతాలకు చెందిన వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పారు. 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 36 మంది సభ్యులుండగా, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు సింగ్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. వీరభద్ర సింగ్ 1983నుంచి 85 వరకు, 85నుంచి 90 వరకు, 1993నుంచి 98, 2003, 2007లలో అయిదు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో 7సార్లు ఎమ్మెల్యేగా, 5సార్లు ఎంపీగా, 5సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ప్రమాణం రేపు
english title:
h
Date:
Monday, December 24, 2012