ధర్మశాల, డిసెంబర్ 23: హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేలు కొందరు ఐదేళ్లలోనే లక్షాధికారుల నుండి కోట్లకు పడగలెత్తారు! ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యేలలో 44 మంది కోటీశ్వరులు ఉండగా, 26 మంది అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఎన్నికల నిఘా సంస్థ ఎడిఆర్ తెలిపింది. కొంత మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ 1,500 శాతం కంటే ఎక్కువగానే పెరిగాయి.
బిలాస్‌పూర్ నుండి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బంబర్ థాకూర్ ఆస్తుల విలువ 2007లో 1.35 లక్షల రూపాయల నుండి ప్రస్తుతం 1.02 కోట్లకు చేరుకుని 7,463 శాతం వృద్ధి చెందాయి. కసౌలి నుండి ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యే రాజీవ్ సంజాల్ ఆస్తులు ఐదేళ్ల క్రితం రూ.1.53 లక్షల విలువ చేయగా, ప్రస్తుతం 31.15 లక్షలకు చేరుకుని 1,936 శాతం వృద్ధి చెందాయి.
కాగా, పాలంపూర్ నుండి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్రిజ్ బెహారి లాల్ 169 కోట్ల రూపాయల ఆస్తులతో ఆ రాష్ట్రంలో అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలలో తొలి స్థానంలో నిలిచారు. ఐదేళ్ల క్రితం ఆయన ఆస్తుల విలువ 91.9 కోట్ల రూపాయలు. చోపాల్ నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన బల్బీర్ సింగ్ వర్మ 41 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో ఉండగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వీరభద్ర సింగ్ 33కు 33 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేలు కొందరు ఐదేళ్లలోనే
english title:
h
Date:
Monday, December 24, 2012