గుంటూరు, డిసెంబర్ 24: సహకార ఎన్నికల నేపథ్యంలో ఓట్ల మార్పులు, చేర్పుల్లో జరుగుతున్న అక్రమాలను నివారించాలంటూ ఆందోళన చేపట్టి నర్సరావుపేటలో అరెస్టయిన టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు సోమవారం సాయంత్రం బెయిల్ మంజూరైంది. కోడెల, ఆయనతోపాటు అరెస్టయిన 13మందికి చిలకలూరిపేట కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గుంటూరు జిల్లా జైలు నుంచి కోడెల బృందం విడుదలయ్యారు. రాత్రి 8గంటల ప్రాంతం కోడెల జైలు నుంచి బయటకు రాగానే అప్పటికే అక్కడకు చేరుకున్న వందలాది మంది కోడెల అభిమానులు భారీ వాహనశ్రేణితో గుంటూరులో ప్రదర్శన నిర్వహించారు. కాగా, కోడెల అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. గుంటూరు నగరంలో ప్రధాన వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేసి బంద్ పాటించారు. గుంటూరు నగరంలో ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద బస్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ తదితరులను పోలీసులు అరెస్ట్‌చేశారు. శంకర్‌విలాస్ సెంటర్‌లో రోడ్డుకు అడ్డుగా బైఠాయించి రాస్తారోకో చేశారు. మధ్యాహ్నం టిడిపి రాష్టన్రేతలు కరణం బలరాం, దాడి వీరభద్రరావు, జిల్లాపార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు జైలులో ఉన్న కోడెలను పరామర్శించారు. అనంతరం ఐజి రవిగుప్తా కలిసి కోడెలపై లాఠిచార్జి చేసిన నర్సరావుపేట డిఎస్పీ వెంకట్రామిరెడ్డిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అక్రమాలకు డిఎస్పీ వత్తాసు : కోడెల
సహకార ఎన్నికల్లో మంత్రి కాసు కుటుంబం చేస్తున్న అక్రమాలకు డిఎస్పీ వెంకట్రామిరెడ్డి వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న తమపై అకారణంగా లాఠీలు ఝళిపించారని టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల ఆరోపించారు. సోమవారం రాత్రి జైలునుంచి విడుదలయ్యాక ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... కాసు కుటుంబంతో తనకు ఎటువంటి వ్యక్తిగతమైన విభేదాలు లేవని, తమది రాజకీయ పోరాటం మాత్రమేనన్నారు. సహకార సంఘాల ఓట్ల నమోదులో కేవలం గుంటూరు జిల్లాలోనేగాక రాష్టవ్య్రాప్తంగా అక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. పోలీసులతో కుమ్మక్కయి కాంగ్రెస్ నేతలు చేపట్టిన దమనకాండకు భయపడేదిలేదని, అక్రమాలపై రాష్టవ్య్రాప్తంగా ఆందోళన చేపడతామని డాక్టర్ కోడెల పేర్కొన్నారు. మంత్రి కాసు కృష్ణారెడ్డి తక్షణం మంత్రివర్గం నుంచి బర్త్ఫ్ చేయాలని, డిఎస్పీని విధులనుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలో టిడిపి బంద్ ప్రశాంతం
english title:
b
Date:
Tuesday, December 25, 2012