తిరుపతి, డిసెంబర్ 24: ప్రపంచ తెలుగు మహాసభలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 56 గంటల్లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగే ప్రపంచ తెలుగుమహాసభలకు సంబంధించి సోమవారం నాటికి 70 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఒక ప్రదాన వేదిక, ఐదు ఉప వేదికలు, ఐదు సెమినార్ హాల్స్‌తో పాటు రోజుకు 25 వేల మందికి అల్పాహార భోజన సౌకర్యాలు కల్పించేందుకు ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రధాన వేదిక మంగళవారం సాయంత్రానికి కూడా పూర్తి అయ్యే అవకాశం కనపడటం లేదు. ప్రదాన వేదిక వెనుక భాగాన రామప్ప ఆలయం, ఏడుకొండలు, తెలుగుతల్లి, తెలుగు పుస్తకం నమూనాలు ఏర్పాటు చేస్తున్నారు.
సోమవారం అర్ధరాత్రికి వీటి ఏర్పాటు పూర్తి అయినా కొసరు పనులు అలాగే మిగిలి ఉంటాయి. అవి మంగళవారానికి పూర్తి అవుతాయని అధికారులు అంటున్నారు. కాగా ప్రధాన వేదికలో బ్యాక్‌డ్రాప్‌లో మామిడి తోరణాలను ఏర్పాటు చేసి ఆ తోరణానికి తెలుగులోని 56 అక్షరాలను అలంకరించి మహాసభలకు కొత్త శోభ తీసుకువస్తున్నారు. వేదిక కమలం పుష్పాల నుండి సర్వస్వతి పుట్టినట్లుగా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి డిజైనర్ అంబాజీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ప్రతినిధులు ఆశీనులయ్యే ప్రధాన వేదిక సభా ప్రాంగణంలో ఇనుప బారికేడ్ల పనులు కూడా మంగళవారం ఉదయానికి పూర్తి అవుతాయి. విద్యుత్ పనులు ఇప్పటి వరకూ 50 శాతం పూర్తి అయ్యాయి. భోజన శాలల వద్ద సోమవారం సాయంత్రం కూడా ట్రాన్స్‌పార్మర్లను ఏర్పాటు చేస్తూ కనిపించారు. ఇక రోడ్లు పూర్తి అయ్యాయని అనిపించుకోవడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సంబందిత రోడ్డు పనుల కాంట్రాక్టర్లు వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా డివైడర్ల పనులు మాత్రం నత్తనడకన జరుగుతున్నాయి. పగలు పశువైద్య విశ్వవిద్యాలయం నుండి నగరంలోకి వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో పనులకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో రాత్రి పూట మాత్రమే వీటిని చేస్తున్నారు. ఇక విద్యుత్ అలంకరణలు నగరంలో టిటిడి ఎంతో గొప్పగా చేస్తోంది. ఈసందర్భంగా జెసి వినయ్‌చంద్ ఆంధ్రభూమితో మాట్లాడుతూ మంగళవారం నాటితో పనులన్నీ పూర్తి అవుతాయని పేర్కొన్నారు. ఇదిలా వుండగా మహాసభల మాట ఎలా ఉన్నా ఈ నెల 19 నుండి ప్రభుత్వ, ఫ్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు నగరంలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడం, అందులోనూ వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణలు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే వ్రస్త్ధారణలతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల్లో వచ్చిన స్పందనతో అధికారులు కూడా ఉత్సాహంగా పని చేస్తున్నారు. కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు శ్రీచైతన్య టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల స్పందన చూస్తుంటే తెలుగుభాష అజరామరంగా కొనసాగుతుందన్న పరిపూర్ణ విశ్వాసం కలుగుతోందన్నారు. ఇక గోడలపై రాసిన అలనాటి పద్యాలు, శ్రీకృష్ణదేవరాయుల భువన విజయ వైభవ చిత్రాలు, కవులు, కళాకారులు, కవయిత్రుల చిత్రాలతో నగరం కళాత్మకంగా తయారైంది.
ప్రపంచ తెలుగు మహాసభలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 56 గంటల్లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర
english title:
t
Date:
Tuesday, December 25, 2012