పెబ్బేరు, డిసెంబర్24: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు జాతీయ రహదారి బైపాస్‌రోడ్డు సమీపంలో రెండు డిసిఎంలలో తరలిస్తున్న ఎర్ర చందనాన్ని పట్టుకున్నట్లు, పెబ్బేరు మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీని విలువ రూ. 5 కోట్లు ఉంటుందని తెలిపారు. రోజువారీ వాహనాల తనిఖీల్లో భాగంగా సోమవారం సాయంత్రం పెబ్బేరు బైపాస్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా కర్నూలు నుండి హైదరాబాద్‌కు వెళుతున్న ఎపి 03 ఎక్స్ 6843, ఎపి 03 ఎక్స్ 4460 నెంబర్లు గల డిసిఎం వ్యాన్‌లలో దాదాపు 12 టన్నుల ఎర్రచందనం పట్టబడినట్టు తెలిపారు. సమాచారాన్ని సంబంధిత పోలీసు శాఖకు, ట్రాన్స్‌పోర్టు అధికారులకు, జిల్లా ఎస్పీకి చేరవేసినట్లు ఎంవిఐ తెలిపారు. కాగా కొత్తకోట సిఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని లారీలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పెబ్బేరు పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఫారెస్టు అధికారులకు అప్పగించనున్నట్లు సిఐ తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు జాతీయ రహదారి బైపాస్‌రోడ్డు
english title:
y
Date:
Tuesday, December 25, 2012