గాలివీడు, డిసెంబర్ 26 : ఈ ఏడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధ చేయాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండల స్థాయి అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. చావిడిపల్లె, ఎగువగొట్టివీడు పాఠశాలల్లో తాగునీటి చేతి పంపులను అమర్చాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. బక్కిరెడ్డిగారిపల్లె, ఈడిగపల్లెలకు మంజూరైన వాటర్ స్కీంలకు బోర్లు వేయాలని, ఆలుగుంటవాండ్లపల్లె, నల్లగుండ్లపల్లెల్లో రక్షిత మంచి నీటి పథకాలకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ట్రాన్స్‌కో ఇఇ రంగనాయకులు, జయప్రకాశ్‌నాయక్‌కు ఆదేశాలు ఇచ్చారు. గోరాన్‌చెరువు, పెద్దపల్లె వాటర్ స్కీం బోర్లలో నీరు సక్రమంగా రాకపోతే సమీపంలో వేసిన రైతు బోరును సీజ్ చేయాలన్నారు. పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు సంయుక్తంగా తాగునీటి సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పనులు కల్పించి కూలీల వలసలు నివారించాలన్నారు. మండలంలో విద్యుత్ సమస్య ఎలా ఉందని ఎఇతో ఆరాదీశారు. పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిటి మల్లిఖార్జునకు సూచించారు. ఈ సమావేశంలో విఆర్ డిఇఇ ఓబులేసు, ఆర్‌డబ్ల్యూఎస్ డిఇఇ సాంబయ్య, ఎంపిడిఓ శేఖర్‌నాయక్, ఎంఇఓ పెంచలయ్య, ఎఇలు సుబ్బరాయుడు, రంగనాయకులు, జయప్రకాశ్‌నాయక్, డిటి మల్లిఖార్జున, వైకాపా నాయకులు యధుభుషణరెడ్డి, మాజీ ఎంపిటిసి సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షులు నాగభూషణరెడ్డి, ఉమాపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
english title:
n
Date:
Thursday, December 27, 2012