రాజంపేట, డిసెంబర్ 26 : కొన్ని సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉంటాయి. ఏళ్ళ తరబడి వివిధ వర్గాల ప్రజలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నా సమస్యల పరిష్కారంలో జాప్యం నెలకొంటూనే ఉంటుంది. రాజంపేటలో ఈ కోవలో రోడ్డు మధ్యలోనే కరెంటు స్తంభాలు సమస్య ఒకటి. పట్టణంలో రోడ్లు విస్తరిస్తున్నారు కాని నడిరోడ్లో ఉండే కరంట్ స్తంభాలను ఎవరూ రోడ్డు చివరకు జరపాలన్న విషయాన్ని పట్టించుకోరు. కొన్ని స్తంభాలైతే జరిపారు కాని పూర్తిస్థాయిలో జరపనందున ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవన్న విషయం సంబంధిత అధికారులకు అర్థం కాలేదు. కొన్ని సందర్భాల్లో గతం పరిశీలిస్తే రోడ్డు చివరకు జరిపేందుకు అవసరమైన అన్ని మెటీరియల్స్ వచ్చినా పూర్తిస్థాయిలో ఈ పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో పలుచోట్ల రోడ్డు మధ్యలోనే ఉన్న కరెంటు స్థంబాలను తొలగించినా ఇంకా అనేకచోట్ల రోడ్డు మధ్యలోనే ఉన్నాయి. వీటిని జరిపేందుకు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటుండడంపై సంబంధిత అధికార్లు పలు కారణాలు చెప్పడం షరామామూలు తంతుగా మారింది. ఏది ఏమైనా త్వరితగతిన రోడ్డు మధ్యలోనే ఉన్న కరెంటు స్తంబాలను చివరకు జరిపేందుకు అవసరమైన చర్యలు సంబంధిత అధికార్లు తక్షణం తీసుకొనేందుకు వీలుగా స్పందించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
దోపిడీ లేని సమాజం కోసం పోరాడాలి
* సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య
కడప (అర్బన్), డిసెంబర్ 26 : ఒక మనిషి ఇంకో మనిషిని దోచుకోకుండా దోపిడీలేని సమ సమాజం కోసం ప్రజలు పోరాటాలకు సమాయత్తం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎర్రముక్కపల్లెలో జరిగిన సిపిఐ 87వ వ్యవస్థాపక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం అనేక కుట్ర కేసులు, నిర్బంధాలను ఎదుర్కొని స్వతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన నిలిచిన ఏకైక విప్లవ పార్టీ సిపిఐ అన్నారు.
* అధికారులకు పట్టని ట్రాఫిక్ ఇబ్బందులు
english title:
n
Date:
Thursday, December 27, 2012