కడప (రూరల్), డిసెంబర్ 26 : మే నెల లోపల అన్ని మోడల్ స్కూళ్ల భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వి. అనిల్‌కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్‌లోని సిఇఓ ఛాంబర్‌లో ఆర్‌ఎంఎస్‌ఎ ఫెస్-1 మోడల్ స్కూల్స్ జిల్లాలో అమలు తీరుపై ఇఇ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎపిఇ డబ్ల్యు ఇడిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 మే నెల లోపల జిల్లాలోని అన్ని మోడల్ స్కూళ్ల భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి పిల్లలను చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టుతున్నట్లు తెలిపారు. ఫెస్-1 కింద జిల్లాలో 8 మోడల్ స్కూళ్లు, భవన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టుతున్నామన్నారు. ఇందు కోసం 741.93 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుతున్నామని తెలిపారు. రాయచోటి, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పుల్లంపేట, వల్లూరు, ఖాజీపేట, కాశినాయన ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు చేపట్టుతున్నామని తెలిపారు. సంబేపల్లె, పెనగలూరులో భవన సదుపాయం కోసం భూ సేకరణ జరగాల్సి ఉన్నందున త్వరలో రెండు ప్రాంతాల్లో పనులు చేయడానికి ప్రత్యేక సౌకర్యాలు చేపట్టుతున్నామన్నారు. ఈ స్కూళ్లకు 80 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వ భరిస్తోందన్నారు. భవన నిర్మాణాల పనుల కోసం ఇసుక కొరత ఉన్నందున త్వరలో తెలుగుగంగ ఎస్‌ఇతో మాట్లాడి ఇసుక ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫెస్-2 కింద 17 ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. చాపాడు, ఓబుళవారిపల్లెలలో స్థల సేకరణ కొరకు చర్యలు చేపట్టుతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఎస్‌ఎ అధికారులు సి. చంద్రశేఖర్‌రెడ్డి, గురువిరెడ్డి, మురళీధర్‌రెడ్డి, నసీద్, వరలక్ష్మి, రవీంద్రుడు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* కలెక్టర్ అనిల్‌కుమార్
english title:
m
Date:
Thursday, December 27, 2012