అనంతపురం సిటీ, డిసెంబర్ 26: జెఎన్‌టియూ అనంతపురం యూనివర్సిటీ ప్రారంభమై నాలుగు సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. నేడు జరగనున్న నాల్గవ స్నాతకోత్సవ ఏర్పాట్లును పూర్తి చేశామని, ఇందులో 13,942 మందికి డిగ్రీలు, 1844 పిజి డిగ్రీలు, 50 పిహెచ్‌డిలు ప్రదానం చేయనున్నట్లు జెఎన్‌టియూ ఉపకులపతి ఆచార్య కె.లాల్‌కిషోర్ తెలిపారు. బుధవారం స్థానిక జెఎన్‌టియూ కాన్ఫరెన్సు హాల్‌లో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ ఉదయం పది గంటలకు స్థానిక జెఎన్‌టియూ పరిపాలన భవనము నందు నాల్గవ స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజి ఉపకులపతి ఆచార్య ప్రహ్లాద పాల్గొంటారని తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 25 మంది విద్యార్థులకు డిగ్రీ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్, పిజిలో ఇద్దరికి గోల్డ్ మెడల్స్‌ను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 12989 మంది బి.టెక్ విద్యార్థులు, 1044 బి.్ఫర్మసీ, 342 మంది ఎం.టెక్, 127 మంది ఎం.్ఫర్మసీ, 479 మంది ఎంసిఎ, 842 ఎంబిఎ, 54 ఎంయస్సీ, 50 మంది పిహెచ్‌డిల విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో కాన్వికేషన్ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2011-12 సంవత్సరానికి యూనివర్సిటీ పరిధిలో 80,042 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని తెలిపారు. యూనివర్సిటీలో గర్ల్ హాస్టల్స్‌కు, పరీక్షల విభాగం బిల్డింగ్స్‌ను, అకడమిక్ ప్లానింగ్‌లో విద్యార్థులకు సిలబస్, విద్యార్థులకు ఉద్యోగ కల్పనలోను ప్రతి విషయంలోను యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో పిజి కోర్సులతో పాటు వారి పరికరాలు వుంటే పరిశోధన చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. అలాగే విద్యార్థులకు ఇతర దేశాలలోని యూనివర్సిటీలలో ఒక సంవత్సరం, మన యూనివర్సిటీలో ఒక సంవత్సరం చదివేలా పిజి కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీని వివిధ రూపాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కళాశాల ప్రతినిధులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియూ రిజిష్టర్ హేమచంద్రారెడ్డి, రెక్టార్ సుదర్శనరావు, ఓటిఆర్‌ఐ డైరెక్టర్ దేవన్న, పిఆర్‌ఓ రామశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జెఎన్‌టియూ అనంతపురం యూనివర్సిటీ ప్రారంభమై నాలుగు సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. నేడు
english title:
j
Date:
Thursday, December 27, 2012