అనంతపురం, డిసెంబర్ 26 : అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు తొలిదశ పనుల ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణమ్మ జలాలు తీసుకురావడంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు చూపిన చొరవ, కృషి అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ఎన్. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం హైదరాబాదులోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆడిటోరియంలో అనంత వెంకటరెడ్డి హంద్రీనీవాసుజల స్రవంతి భగీరథ విజయయాత్ర అభినందన సభకు రాష్ట్ర భారీ పారుదల శాఖ మంత్రి సుదర్శనరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెవెన్యూమంత్రి ఎన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించే బృహత్తర పథకమన్నారు. అనంతపురం, కర్నూలు కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం, ఆర్‌డబ్ల్యుయస్, సమాచార తదితర ప్రభుత్వ శాఖల అధికారులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఈ ఏడాది కృష్ణమ్మ జలాలను తీసుకెళ్లి రైతుల్లో ధైర్యాన్ని నింపాలనే లక్ష్యాన్ని సాధించడానికి సహకారం అందించిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదములు తెల్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అంతకుమునుపు ఈ ప్రాజెక్టు కోసం కృషి చేసిన ప్రముఖులు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరు శివరామకృష్ణయ్యలకు సభ రెండు నిముషాల పాటు వౌనం పాటించి నివాళులర్పించింది. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శనరెడ్డి సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు తొలి దశలో ట్రయల్ రన్ ద్వారా 230 కిలోమీటర్లు వరకు కృష్ణమ్మ జలాలు తీసుకు రాగలిగామని, అధికారులు, ఇంజనీరులు రుజువు చేశారన్నారు. రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి కృష్ణమ్మ జలాలను బీడు భూములకు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి సఫలీకృతులైన సహచర మంత్రులకు, అధికారులకు ధన్యవాదములు తెలుపుతున్నానన్నారు. జిల్లా కలెక్టర్ వి. దుర్గాదాస్ మాట్లాడుతూ జిల్లాలో పనిచేయడం గర్వించదగ్గ విషయమన్నారు. జిల్లాలోని సమస్యలు పరిష్కరించడంలోజిల్లాలోఅభివృద్ది పథంలోనడిపించడంలో జిల్లాకు చెందిన మంత్రులు చూపిస్తున్న చొరవ అమోఘమన్నారు. కృష్ణాజలాలు మా హక్కు అన్న ధీమాను రైతాంగానికి కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలోపలువురు అధికారులను మంత్రులు అభినందించి సత్కరించారు.
అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి
english title:
j
Date:
Thursday, December 27, 2012