సరూర్‌నగర్, డిసెంబర్ 27: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని ఎల్‌బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. కర్మాన్‌ఘాట్ డివిజన్ వెంకటేశ్వరకాలనీలో సుమారు ఇరవై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరాను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. నియెజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు అన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తానన్నారు. ప్రధానంగా ప్రతికాలనీకి మంచినీరు సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటానన్నారు. వౌలిక సదుపాయాలైన మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుద్ధ్య నిర్వాహణ, పార్కుల ఏర్పాటుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానన్నారు. కార్పొరేటర్ గజ్జెల సుష్మ మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ కాలనీలో కనీస సౌకర్యాలు ఏర్పాటుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఎ.కృష్ణగౌడ్, కె.శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, టిడిపి నేతలు పెంటయ్య, నాగేశ్వర్‌రావు, బొంబాయి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రాజకీయాలకు
english title:
r
Date:
Friday, December 28, 2012