Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అయ్యప్పస్వామికి మహా పుష్పాభిషేకం

$
0
0

మచిలీపట్నం (కోనేరుసెంటరు), డిసెంబర్ 27: స్థానిక చెమ్మనగిరిపేట గాంధి బొమ్మ శివాలయంలోని అయ్యప్ప దేవాలయంలో గురువారం 21వ మండల పూజా మహోత్సవం సందర్భంగా మహా పుష్పయాగం కన్నులపండువగా జరిగింది. భక్తుల శరణుఘోషలతో ఆలయం మార్మోగింది. అయ్యప్పస్వామి పూలసముద్రంలో తేలియాడుతున్నట్లు భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు బాదంపూడి ఫణిశర్మ, కేరళ నంబూద్రి ఉన్నికృష్ణన్, ఆలయ అర్చకులు ఘంటసాల మురళి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 6.30కి 1008 కలశాలలో ఆవునెయ్యి నింపి శుక్రవారం నాటి అభిషేకానికి ఆవాహన చేశారు.

రహదారులకు 2.31కోట్లు మంజూరు
కూచిపూడి, డిసెంబర్ 27: మొవ్వ మండలంలోని ఆర్ అండ్ బి రహదారుల మరమ్మతులకు తమ శాఖ 2.31కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని ఎఇ ఐ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. మండలంలోని మొవ్వ, పెదపూడి శివారు ప్రాంతాల్లోని జిసిహెచ్‌కె రహదారికి రూ.1.76కోట్లు, కోసూరు నుండి ఘంటసాల రహదారికి రూ.7లక్షలు, ఆర్ అండ్ బి ఐఎన్‌కె రహదారి పరిధిలోని నిడుమోలు, బార్లపూడి రహదారి నిర్మాణానికి రూ.18లక్షలు, మొవ్వ, పెదముత్తేవి రహదారికి 10లక్షలు, కోసూరు, పాలంకిపాడు, అవిరిపూడి రహదారికి రూ.10లక్షలు, గూడపాడు, అచ్చంపాలెం రహదారికి రూ.20లక్షలు కేటాయించినట్లు తెలిపారు. దీంతో దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాపథం సందర్భంగా ఇచ్చిన హామీ పామర్రు శాసనసభ్యులు డివై దాస్ కృషి ఫలితంగా నెరవేరినట్లయింది.
వైభవంగా కలశ జ్యోతుల మహోత్సవం
కూచిపూడి, డిసెంబర్ 27: భవానీల దివ్య కలశ జ్యోతుల కాంతులతో కూచిపూడి, పెదపూడి ప్రధాన రహదారులు శోభాయమానంగా వెలుగొందాయి. మొవ్వ మండలానికి చెందిన వక్కబట్ల నారాయణరావు, వీరంకి శంకరరావు, పులి నాగేశ్వరరావు, పావులూరి వెంకటేశ్వరరావు గురుస్వాముల వందలాది మంది శిష్యులు గురువారం పెదపూడి గ్రామంలోని శ్రీ గంగాపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నుండి మేళతాళాలు, మంగళవాయిద్యాలతో జై భవానీ, జైజై భవానీ అనే నినాదాల మధ్య అలంకృత వాహనంపై దివ్యకాంతులు వెదజల్లుతూ కూచిపూడి గ్రామానికి దుర్గాదేవి తరలివచ్చింది. శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో భవానీలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి జ్యోతులను అమ్మవారికి సమర్పించారు. అనంతరం తీర్థప్రసాద వినియోగం జరిగింది.

సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
అవనిగడ్డ, డిసెంబర్ 27: స్థానిక శ్రీ లంకమ్మ అమ్మవారి ఆలయ ఆవరణ చుట్టూ సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. దివిసీమ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.11లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రోడ్డును ప్రముఖ దంతవైద్య నిపుణలు డా. వి ఆనందర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అన్నపరెడ్డి వెంకటస్వామి, ఎస్‌విఎల్ కళాశాల కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జగన్మోహనరావు, బోగాది చంద్రశేఖర్, పెద్దబాయి తదితరులు పాల్గొన్నారు. లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన కెడిసిసి బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి సుభాష్‌చంద్రబోస్‌ను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.

విద్యుత్ చార్జీల భారంపై సంతకాల సేకరణ
అవనిగడ్డ, డిసెంబర్ 27: విద్యుత్ చార్జీల పెంపుదలకు, ఇంధన సర్‌చార్జీ సర్దుబాటు పేరిట మోపుతున్న భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా సిపిఎం నాయకులు ఆదిశేషు, న్యాయవాది శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, డీజిల్, పెట్రోల్ ధరలు దీనికి తోడవుతున్నాయన్నారు. తక్షణమే విద్యుత్ సర్‌చార్జీలు రద్దుచేయాలని కోరుతూ సంతకాలు సేకరించారు.

మోదుమూడిలో హనుమత్ వ్రతాలు
అవనిగడ్డ, డిసెంబర్ 27: మండల పరిధిలోని మోదుమూడి గ్రామంలో హనుమత్ వ్రతాల్లో భాగంగా గురువారం స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం 1080 అరటి పండ్లతో సహస్త్ర నామార్చనలు నిర్వహించారు. ఈసందర్భంగా నవగ్రహ పూజ, నవగ్రహ హోమం కూడా చేశారు. హనుమాన్ జ్యోతి దర్శనం, మండల దీక్ష విరమణలతో పాటు హనుమత్ గాయత్రీ యజ్ఞం వైభవంగా జరిగింది. రొంపిచర్ల శేషుకుమార్, డి పార్థసారథి ఆచార్యులు, అగ్నిహోత్రం సత్యకృష్ణమాచార్యులు క్రతువులు నిర్వహించారు. ఆగమపండితులు రొంపిచర్ల శేషుకుమార్‌ను శ్రీకృష్ణదేవరాయ యూత్ వారు ఘనంగా సన్మానించారు.

ఢిల్లీ సంఘటనకు నిరసనగా ర్యాలీ
మోపిదేవి, డిసెంబర్ 27: ఇటీవల ఢిల్లీలో జరిగిన అత్యాచారానికి నిరసనగా మోపిదేవి జెడ్‌పి పాఠశాల విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుండి జాతీయ రహదారి వెంట ఢిల్లీ సంఘటనను ఖండించాలి, అత్యాచారాలను అరికట్టాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. గ్రామ కూడలిలో మానవహారం నిర్వహించారు. హెచ్‌ఎం కెవిడి నాగేశ్వరమ్మ, ఉపాధ్యాయుల నాగ చెంచయ్య, శివకోటేశ్వరరావు, శేషగిరిరావు పాల్గొన్నారు.

తెలుగుభాషా వికాసంపై ప్రదర్శన
బంటుమిల్లి, డిసెంబర్ 27: ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో ప్రారంభించిన సందర్భంగా స్థానిక కొమ్మారెడ్డి టాలెంట్ హైస్కూల్లో గురువారం తెలుగుభాషా వికాస ప్రదర్శన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అధికారి కె నాగరాజకుమార్ ప్రారంభించారు. తెలుగు మన మాతృభాష అని, తేనెలొలికే తెలుగును ఆస్వాదించాలన్నారు. మన సంప్రదాయం, సంస్కృతిని కాపాడుకుంటూ మాతృభాషను మరచిపోకుండా ఉండటమే తెలుగుతల్లికి మనమిచ్చే గౌరవమన్నారు. ప్రతి తెలుగువారు జాతి గౌరవాన్ని ఇనుమడింప చేయాలని విద్యార్థులకు ఉద్బోధించారు. సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు లిపి, సాహిత్య కళారంగంలో వచ్చిన మార్పులు, అభివృద్ధి గురించి 174 పటాలను ప్రదర్శించారు. కొమ్మారెడ్డి హైస్కూల్ డైరెక్టర్ కిషోర్, విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

న్యాయం కల్పించడానికే కోర్టులు
కలిదిండి, డిసెంబర్ 27: కోర్టులు న్యాయం కల్పించడానికే ఉన్నాయని కైకలూరు జూనియర్ మేజిస్ట్రేట్ కె ప్రభాకర్ అన్నారు. మండలంలోని కొండంగి గ్రామంలో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సును బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కట్టా శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఆడపిల్లను చదివించకపోయినా, పనిలో పెట్టుకున్నా గృహ హింస చట్టం కింద నేరమవుతుందన్నారు. ఎక్కడ ఏ వస్తువు కొన్నా తప్పనిసరిగా రసీదు తీసుకోవటం ప్రజల బాధ్యతన్నారు. సీనియర్ న్యాయవాదులు అడవి రమణ, కారే శరత్‌బాబు, బిఎల్ లక్ష్మణరావు, ఎంఎస్ రావు, ఎంఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు.

కౌనె్సలింగ్ ద్వారా ఉపాధ్యాయుల నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 27: డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను కౌనె్సలింగ్ ద్వారా ఉపాధ్యాయులుగా నియమించారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు మచిలీపట్నంలో జిల్లా విద్యాశాఖాధికారి డి దేవానందరెడ్డి కౌనె్సలింగ్ నిర్వహించి కోరుకున్న ప్రదేశాల్లో నియమిస్తూ వారికి నియామక పత్రాలు జారీ చేశారు. మొత్తం జిల్లాలో వివిధ విభాగాల్లో 359 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా 321 మందిని నియమించారు. 33మంది అభ్యర్థులు లేకపోవటం వల్ల పోస్టులు భర్తీకాలేదు. సంబంధిత ధృవపత్రాలు చూపించలేకపోవటం వల్ల ఐదుగురు అభ్యర్థుల నియామకాలను పెండింగ్‌లో ఉంచారు. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్, తెలుగు, ఉర్దూ, భాషాపండితుల పోస్టులకు డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు కౌనె్సలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందచేశారు. స్కూల్ అసిస్టెంట్ల విభాగంలో 27పోస్టులకు 27మందిని, ఫిజికల్ సైన్స్‌లో రెండు పోస్టులకు ఒక పోస్టు, బయోలాజికల్ సైన్స్‌లో నాలుగు పోస్టులకు నలుగురు, సాంఘిక శాస్త్రంలో 20పోస్టులకు 18 మందిని, ఇంగ్లీష్ విభాగంలో 39పోస్టులకు 35మందికి నియామక పత్రాలు అందచేశారు. రెండు పోస్టులకు అభ్యర్థులు లేరు. మరో రెండు పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలుగు విభాగంలో 44 మందిని, హిందీ విభాగంలో 10 మందిని, సంస్కృతంలో ఒక పోస్టుకు కౌనె్సలింగ్ నిర్వహించారు. అలాగే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల తెలుగు విభాగంలో 137 పోస్టులకు గాను 130 మందిని నియమించారు. ఏడు పోస్టులకు అభ్యర్థులు లేరు. ఉర్దూ విభాగంలో 39పోస్టులకు గాను 23 పోస్టులు భర్తీకాగా 16 పోస్టులు అభ్యర్థులు లేక ఖాళీగా ఉన్నాయి. తెలుగు విభాగంలో 25పోస్టులకు గాను 21 పోస్టులు భర్తీ చేశారు. నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హిందీ విభాగంలో ఏడు పోస్టులకు ఐదు, ఉర్దూ విభాగంలో రెండు పోస్టులకు అభ్యర్థులు లేక ఖాళీగా ఉన్నాయి. పిఇటి రెండు పోస్టులను భర్తీ చేశారు. మొత్తమీద అభ్యర్థులు లేక 33పోస్టులు ఖాళీగా ఉండగా, ధృవపత్రాలు సకాలంలో అందచేయకపోవటం వల్ల ఐదు పోస్టులను పెండింగ్‌లో ఉంచారు. మిగతా 321 పోస్టులను భర్తీచేసి నియామక పత్రాలు అందచేశారు. నియమితులైన ఉపాధ్యాయులు వెంటనే విధుల్లో చేరాలని డిఇఓ దేవానందరెడ్డి కోరారు. కౌనె్సలింగ్‌లో అదనపు జెసి రమేష్ కుమార్, విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్, తదితర అధికారులు పాల్గొన్నారు.

30, 31తేదీల్లో హెడ్‌మాస్టర్ అకౌంట్ పరీక్షలు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), డిసెంబర్ 27: హెడ్‌మాస్టర్ అకౌంట్ పరీక్షలను ఈ నెల 30, 31తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డిఇఓ డి దేవానందరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్-1 పరీక్ష 30న, పేపర్-2 పరీక్ష 31న విజయవాడ పటమటలోని జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, విజయవాడ పటమట జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, విజయవాడ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉదయం 11.30కి నిర్వహిస్తున్నట్లు డిఇఓ వివరించారు.

వర్షాలకు మునిగే రోడ్లనూ
పట్టించుకోని అధికారులు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), డిసెంబర్ 27: బందరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ కొల్లు రవీంద్ర నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం 6వ వార్డులో సాగింది. ఈసందర్భంగా ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మపురంలోని జిల్లా కలెక్టర్ ఆఫీస్‌కు ఆనుకుని ఉన్న రోడ్డు వర్షం వస్తే మునిగిపోతుందని, అసలు ఈప్రాంతంలో మంచినీరే రావటం లేదని, అధికారులు ఎంతమంది తిరిగినా ఈ రోడ్డును పట్టించుకోవటం లేదని, డ్రైనేజీలు కూడా లేవని ప్రజలు రవీంద్రకు విన్నవించుకున్నారు. ఈసందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో టిడిపి నాయకులు గొర్రెపాటి గోపీచంద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, పచ్చిగోళ్ళ కొండలరావు, కాసాని భాగ్యారావు, కర్రా శ్రీనివాసరావు, వంపుగడల బేదరి, సిహెచ్ హరేరామ్, అంగర శ్రీనివాసరావు, వి రాంబాబు, కె సత్యనారాయణ, మాదిరెడ్డి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకట స్వామి, కనగాల గోపాలరావు పాల్గొన్నారు.

కొవ్వొత్తులతో విద్యార్థినుల వౌన ప్రదర్శన
చల్లపల్లి, డిసెంబర్ 27: దేశ రాజధాని ఢిల్లీలో ఫిజియోథెరపీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలని, బాధిత విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ విద్యార్థినిలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కొవ్వొత్తులతో వౌన ప్రదర్శన నిర్వహించారు. గురువారం స్థానిక విజయ అకాడమీకి చెందిన విద్యార్థినులు లయన్స్ క్లబ్ ఆఫ్ చల్లపల్లి, ఇన్నర్‌వీల్ క్లబ్, వాసవీ క్లబ్, డిఎన్‌డిఎన్ సేవా ట్రస్టులతో కలిసి అకాడమీ వద్ద నుండి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులు, ప్లకార్డులు చేతబట్టి వౌన ప్రదర్శనలో పాల్గొన్నారు. ముమ్మనేని రాజకుమార్, మేకా లక్ష్మీకుమారి, దింటకుర్తి జ్యోతి, వాసిరెడ్డి కోటేశ్వరరావు, తాతా ప్రదీప్‌కుమర్, పివి మాధవేంద్రరావు, ఎస్ వాణికుమార్, దాసి సీతారామారావు, వరద హరగోపాల్ పాల్గొన్నారు.
భవానీ భక్తుల కలశ జ్యోతుల ప్రదర్శన
చల్లపల్లి, డిసెంబర్ 27: భవానీ భక్తుల కలశ జ్యోతుల ప్రదర్శన సంప్రదాయబద్ధగా జరిగింది. గురువారం రాత్రి చల్లపల్లి గ్రామదేవత శ్రీ సంపటాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి గుంటూరు వెంకటేశ్వరరావు గురు భవానీ, స్థానిక పంచముఖ ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి చంటి గురు భవానీ, వేముల కుమారస్వామి గురు భవానీ, పడమరవీధిలోని శ్రీరామలింగ చౌడేశ్వరి ఆలయం వద్ద నుండి పాండు గురు భవానీ ఆధ్వర్యంలో భవానీ భక్తులు కలశ జ్యోతులతో గ్రామ ప్రధాన రహదారుల వెంట ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక వాహనంపై అమ్మవారి చిత్రపటాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశ జ్యోతులతో ప్రదర్శనగా వచ్చిన అమ్మవారికి భక్తులు పసుపుకుంకుమలు, టెంకాయలు సమర్పించారు.
ఆకట్టుకున్న షణ్ముఖశర్మ ప్రవచనం
నందిగామ, డిసెంబర్ 27: శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా స్థానిక రథం సెంటర్‌లో గల శతవార్షిక ముక్కోటి మహామండపంలో కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు సామవేదం షణ్ముఖ శర్మ బుధవారం రాత్రి చేసిన ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మహోత్సవ కమిటీ కన్వీనర్ దీవి మంగనాధాచార్యులు ఆధ్వర్యంలో గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెలది సుగుణశేఖరరావు, వైఎస్‌ఆర్‌కె ప్రసాద్, ప్రతినిధులు సదాశివరావు, ఈమని సూర్యనారాయణ, బండారు కేదానాధ్, బొమ్మకంటి ప్రసాద్ తదితరులు షణ్ముఖశర్మను సత్కరించారు. గురువారం ఉదయం మైసూర్‌కు చెందిన సుందర రామన్‌చే సామవేద పారాయణం, భారతి భాగవతారిణిచే హరికథ, సాయంత్రం భగవాన్ సత్యసాయి సేవా సమితి మహిళా విభాగ్ ఆధ్వర్యంలో దివ్యనామ సంకీర్తన, విజయవాడకు చెందిన తెలుగు పండిట్ పరాశరం వేంకట రమణాచార్యులు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.
సహకార సంఘాలకు ఎన్నికల అధికారుల నియామకం
కంచికచర్ల, డిసెంబర్ 27: కంచికచర్ల జిల్లా సహాకార బ్యాంకు పరిధిలో గల 13 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఎన్నికల అధికారులు నియమితులయ్యారు. కంచికచర్ల సహకార సంఘానికి విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలకు చెందిన అధ్యాపకులు హరిచంద్ర ప్రసాద్, గొట్టుముక్కలకు వి శ్రీనివాసరావు, నక్కలంపేటకు ఎం శ్రీనివాసరావు, గనిఆత్కూరుకు టి సత్యభాస్కర్, చెవిటికల్లుకు ఎన్ వెంకటేశ్వర్లు, మొగులూరుకు బి వెంకటేశ్వరరావు, గండేపల్లికి పివిఎన్ మూర్తి, పేరకిలపాడుకు బి రెడ్డి, పరిటాల సంఘానికి విజయవాడ సప్తగిరి కళాశాలకు చెందిన అధ్యాపకుడు రామారావు, వేములపల్లికి లయోల కళాశాలకు చెందిన అధ్యాపకులు విజెఎన్ ప్రసాద్, పొన్నవరంకు జగ్గయ్యపేట ఎస్‌జిఎస్ కళాశాలకు చెందిన అధ్యాపకుడు ఈశ్వరయ్యశెట్టి, జమ్మవరానికి కె హరిబాబు, వెల్లంకికి రవికుమార్ నియమితులయ్యారు. వచ్చే నెల 21న ఈ సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. 22న ఓటర్ల జాబితా ప్రకటన, 24న నామినేషన్ల స్వీకరణ, 25న పరిశీలన, 26న ఉపసంహరణ, 31న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్, అనంతరం లెక్కింపు జరుగుతుంది.

బడిబయట ఉన్న 10మంది పిల్లల గుర్తింపు
గుడివాడ, డిసెంబర్ 27: విద్యాశాఖ, సీఎంవో, రాజీవ్ విద్యామిషన్ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో బడిబయట ఉన్న 10మంది పిల్లలను గుర్తించారు. వీరిని వేలేరులోని ఆశ్రమ పాఠశాలకు తరలించారు. ఈసందర్భంగా మండల విద్యాశాఖాధికారి ఆర్‌వి సోమశేఖర్ మాట్లాడుతూ బడిబయట ఒక పిల్లవాడు కూడా ఉండకూడదనే లక్ష్యంతో పలు శాఖల సమన్వయంతో 6నుండి 14ఏళ్ళ లోపు బాలల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. యానాదుల కాలనీ, బాపూజీనగర్, నాగన్నచెరువు, బంటుమిల్లి రోడ్డు ప్రాంతాల్లో 10మంది పిల్లలు బడి బయట ఉన్నట్టుగా గుర్తించామన్నారు. ఆశ్రమ పాఠశాల సమన్వయకర్త కె గాయత్రీ మాట్లాడుతూ ఎక్కడైనా అనాథలు, నిరాదరణకు గురైన బాలలు కనిపిస్తే 9491378775 నెంబర్‌కు గాని, స్థానిక విద్యాశాఖ అధికారులకు గాని సమాచారమివ్వాలన్నారు. కార్యక్రమంలో సీఎంవో కోఆర్డినేటర్ టి రామారావు, సీఆర్పీలు జి దుర్గ్భావానీ, సిహెచ్ ఇస్సాక్ పాల్గొన్నారు.
14.97లక్షలతో డంపింగ్ యార్డ్ ఆధునీకరణ
గుడివాడ, డిసెంబర్ 27: గుడివాడ మున్సిపల్ డంపింగ్ యార్డ్‌ను 14.97 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ ఎన్ ప్రమోద్‌కుమార్ చెప్పారు. గురువారం ఆయా పనులను ప్రారంభించిన అనంతరం పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 4.22ఎకరాల స్థలంలో ఉన్న డంపింగ్ యార్డ్ అధ్వానంగా తయారైందన్నారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా డంపింగ్ యార్డ్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేస్తామన్నారు. కొంత స్థలంలో వర్మీకంపోస్ట్ షెడ్లు, పొడి చెత్తను కట్‌చేసే పల్వనేజర్ యంత్రాలు, ప్లాస్టిక్, పాలిథిన్ చెత్తలను వేరుచేసే యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మరో ఆరు ఎకరాల స్థలాన్ని కూడా సేకరించామని, ఇందుకు సంబంధించిన సొమ్మును బ్యాంక్‌లో డిపాజిట్ చేశామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎఇ కోటేశ్వరరావు, ఇన్‌చార్జ్ హెల్త్ ఆఫీసర్ బి గోవర్ధనరావు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు శ్రీమన్నారాయణ, ప్రసాద్ పాల్గొన్నారు.

నూరేళ్ళు జీవించేవారే నిజమైన కోటీశ్వరులు
గుడివాడ, డిసెంబర్ 27: కోట్లాది రూపాయలను సంపాదించిన వారి కంటే నూరేళ్ళు సంతోషంగా జీవించినవారే నిజమైన కోటీశ్వరులని మున్సిపల్ కమిషనర్ ఎన్ ప్రమోద్‌కుమార్ అన్నారు. గురువారం స్థానిక బంటుమిల్లి రోడ్డులోని లయన్స్ మల్టీసర్వీస్ సెంటర్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ, సంఘమిత్ర, రూరల్, ప్రగతి క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం, క్యాన్సర్ వ్యాధి నిర్థారణ వైద్యశిబిరాలను నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తీ ఆరోగ్య రక్షణపై అవగాహన కలిగి వుండాలన్నారు. ఖరీదైన క్యాన్సర్ వ్యాధి నిర్థారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్ పొట్లూరి గంగాధరరావు, డాక్టర్ వల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు, డాక్టర్ మనె్నం భవానీశంకర్, డాక్టర్ పెరుమాళ్ళ కేశవరావు, యార్లగడ్డ దినకరరావు, వల్లూరుపల్లి లక్ష్మి, అడుసుమిల్లి దుర్గావరప్రసాద్, సనకా సుబ్బారావు, ఎన్ శివశంకర్, బొగ్గరపు తిరుపతయ్య, ఎంఎస్సీ బోస్, పి సతీష్, ఎకెసి ఛటర్జీ, వి కొండలరావు పాల్గొన్నారు.

అదనపు డిజి సైకిల్ యాత్రకు అపూర్వ స్వాగతం
హనుమాన్ జంక్షన్, డిసెంబర్ 27: పోలీస్ వ్యవస్థ ఆవిర్భవించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదనపు డిజి రాజీవ్ త్రివేది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర గురువారం కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. ఉదయం ఆరు గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లాలో ప్రవేశించిన రాజీవ్ బృందానికి పలువురు రాజకీయా పార్టీల నాయకులు, వివిధ విద్యా సంస్థల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. జంక్షన్ చేరుకున్న సైకిల్ యాత్ర బృందానికి జిల్లా అడిషన్ ఎస్పీ ప్రేమ్‌కుమార్ పుష్పగుచ్ఛాలు ఆందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానంలో రాజీవ్ త్రివేది ప్రత్యేక పూజలు చేశారు. స్వాగతం పలికేందుకు వచ్చిన విద్యార్థులకు కరచాలనం చేశారు. అదిత్య బధిరుల, ఆశాజ్యోతి వికలాంగుల పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహర ప్యాకెట్లు అందజేశారు. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి వారితో ఫోటోలు దిగారు. అనంతరం హనుమాన్ జంక్షన్ నుంచి హైదరాబాద్‌కు యాత్ర ప్రారంభమైంది.
వ్యక్తి ఆరోగ్యంతోనే సమాజ ఆరోగ్యం
సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని రాజీవ్ త్రివేది అన్నారు. నేటి అధునిక యుగంలో యువత, ప్రజలు వినోద కార్యక్రమాలకు కేటాయిస్తున్న సమయంలో కొంతైనా వ్యాయామం కోసం కేటాయించాలని హితవు పలికారు. వ్యాయామం వలన శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, ఒత్తిళ్ళను సులభంగా ఎదుర్కొనే అవకాశం కలుగుతుందని వివరించారు.

అవినీతిపై
ధ్వజమెత్తిన ఎర్రసైన్యం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 27: అవినీతిపై ఎర్రదండు సమరం నినాదంతో సిపిఐ విజయవాడ నగర సమితి గురువారం నగరంలో చేపట్టిన రెడ్‌షర్ట్ వాలంటీర్ల మార్చ్‌పాస్ట్ ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా కొనసాగింది. పార్టీ కార్యకర్తలు, యువకులు, మహిళలు వేలాదిగా పురవీధుల్లో కదంతొక్కిన ఎర్రదండు కవాతు పార్టీశ్రేణుల్లో నూతనోత్సహాన్ని నింపింది. తొలుత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డా కె నారాయణ అమరజీవి చండ్రరాజేశ్వరరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అరుణపతాకాన్ని ఊపి మార్చ్ఫాస్ట్‌ను ప్రారంభించారు. ప్రథమ మేయర్ టి వెంకటేశ్వరరావు 97 సంవత్సర వృద్ధాప్యంలో సహితం మార్చ్ఫాస్ట్‌ను కళ్ళారా చూడాలన్న ఆకాంక్షతో కళాక్షేత్రం వద్దరు చేరుకుని ఎర్రసైన్యం కవాతును అమితశక్తితో తిలకరించారు. మార్చ్ఫాస్ట్ ప్రారంభ సందర్భంలో నాయకులు శాంతికపోతాలను ఎగురవేశారు. అనంతరం ప్రారంభమైన మార్చ్ఫాస్ట్ నగర ప్రజలకు విశేషంగా ఆకట్టుకుంది. మార్చ్ఫాస్ట్ ముగింపు సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి
దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో డా.కె నారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు. ఢిల్లీలో ఓ మెడికల్ విద్యార్థిని దారుణంగా అత్యాచారానికి గురైందని, మహిళలపై దాడులకు పాల్పడినవారిని నడిరోడ్డులో దిష్టిబొమ్మల్లా తగలబెట్టాలి లేదా అక్కడికక్కడే కాల్చి చంపాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షేక్ నాసర్‌వలీ, సిపిఐ నగర సహాయ కార్యదర్శులు జి కోటేశ్వరరావు, ఏ దుర్గ్భావాని, నగర కార్యవర్గ సభ్యులు పల్లా సూర్యరావు, వియ్యపు నాగేశ్వరరావు, నూతక్కి సీతారామయ్య, నీలం దుర్గారావు, బుట్టి రాయప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ప్రజానాట్యమండలి కళాకారులు స్వార్థరాజకీయ నాయకులు, విద్యార్థి, యువత, సామాన్యుడు, కార్మికులపై చేస్తున్న దాడుల వేషధారణ దృశ్యాలు ఆలోచింపచేశాయి.
త్రివేది సైకిల్ యాత్ర
నగర పోలీసులకు స్ఫూర్తి
విజయవాడ (క్రైం), డిసెంబర్ 27: రాష్ట్ర పోలీసుశాఖ అదనపు డిజిపి (స్పోర్ట్స్) రాజీవ్ త్రివేది సైకిల్ యాత్ర నగర పోలీసు యంత్రాంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన సైకిల్ రన్ ఇక్కడి పోలీసులకు స్ఫూర్తిగా నిలిచింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన అదనపు డిజిపి సైకిల్ యాత్ర గురువారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందికి ఫిట్‌నెస్‌పై పలు సూచనలు చేశారు. తొలిరోజు నగరానికి చేరుకున్న ఆయన గురువారం రాత్రి ఇక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం తిరిగి ఆయన సైకిల్ యాత్ర ప్రారంభం కానుంది. పోలీస్‌శాఖ ఆవిర్భవించి 150ఏళ్లు పూర్తయిన సందర్భంగా అడిషనల్ డిజి రాజీవ్ త్రివేది ఈ సైకిల్ యాత్ర తలపెట్టారు. సాహస విన్యాసాలకు చిరునామా అయిన త్రివేది కొద్దిరోజుల క్రితం నగరానికి వచ్చినప్పుడు కృష్ణానదిలో ఈదిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు నుంచి విజయవాడ వైపు నది ఈదుకుంటూ అవలీలగా దాటారు. కాగా విశాఖపట్నం నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తలపెట్టిన సైకిల్ యాత్ర నగరానికి చేరుకోగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్‌పి రమేష్ ఏలూరు నుంచి హనుమాన్ జంక్షన్ వరకు త్రివేది వెంట సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన ఏడో తరగతి విద్యార్థి 12ఏళ్ల బుడతడు సుహాన్ ప్రారంభం నుంచే ఆయన వెంట ఉన్నారు. త్రివేది సైకిల్ యాత్ర నగరంలోకి ప్రవేశించగానే రామవరప్పాడు రింగ్ వద్ద పోలీస్ కమిషనర్ ఎస్.మధుసూదనరెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు గంగరాజు, సైక్లింగ్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, విద్యార్థినీ, విద్యార్థులు పెద్దసంఖ్యలో ఎదురేగి ఘనస్వాగతం పలికారు. 150ఏళ్ల క్రితం దేశంలో ఆవిర్భవించిన రెండో పోలీస్ స్టేషన్ భీమిలీ నుంచి ఈనెల 23న ఈ సాహస సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఆయన ఈనెల 22వ తేదీ బంగాళాఖాతంలో 25 కిమీ మేర ఈది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 370కిమీ మేర ప్రయాణం పూర్తి చేసిన ఆయన ఈ నెల 31న హైదరాబాద్ చేరుకుని 42కిమీ పరుగుతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకనున్నారు. కాగా నగరానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈత, సైక్లింగ్, నడక, పరుగు, వ్యాయామం, యోగ అనేవి మనిషికి శారీరక దృఢత్వాన్ని, మనోస్థైర్యాన్ని, పట్టుదలను, ఆరోగ్యాన్ని అందిస్తాయంటూ తన సైక్లింగ్ ద్వారా యువతను మేల్కొల్పడంతోపాటు, పోలీసుశాఖ సిబ్బందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన వచ్చిన సందర్భంగా డిసిపిలు, ఏసిపిలు, సిఐలు పెద్ద ఎత్తున సిబ్బంది తరలిరాగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ సహకార ఎన్నికలకు నేడు
నామినేషన్ల ఘట్టం ప్రారంభం
అజిత్‌సింగ్‌నగర్, డిసెంబర్ 27: ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో విజయవాడ నగర పాలక సంస్థ కో ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పదవీకాలం ముగియడంతో కార్మికశాఖ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు సిద్ధం చేసింది. గడిచినకాలంలో వరుసగా రెండుసార్లు అధికారాన్ని కైవసం చేసుకున్న ఐఎన్‌టియుసి బలపర్చిన ఈశ్వర్ ప్యానల్ మూడోసారి కూడా విజయడంకాను మ్రోగించి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతుండగా కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించుకోవాలన్న ఉద్దేశ్యంతో వామపక్ష కూటమి తహతహలాడుతుండగా రాజకీయాలకు అతీతంగా వివిధ విభాగాలలో పనిచేసే ఉద్యోగులు కలిసి ఎంప్లారుూస్ ప్యానల్‌గా ఏర్పడి మూడో కూటమి పేరిట ఎన్నికలు బరిలోకి దిగి నూతన ఒరవడిని సృష్టించి ఉద్యోగుల అభ్యున్నతికి పాటుపడాలన్న దిశగా ప్రయాణం మొదలుపెట్టగా ఈ మూడు కూటమిల మధ్య జరిగే సహకార ఎన్నికల యుద్ధంలో ఎవరు విజేతలుగా నిలుస్తారన్న ఉత్కంఠ అందరిలో ఉంది. సహకార ఎన్నికల ప్రక్రియ శుక్రవారం నామినేషన్ స్వీకరణతో మొదలవుతున్న తరుణంలో నగర పాలక సంస్థ ఉద్యోగుల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఉద్యోగుల ఓట్ల కోసం మూడు కూటమిల ప్యానల్ అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నారు. 2013 జనవరి 6వ తేదీన జరిగే ఎన్నికలకు ఈనెల 28వ తేదీన నామినేషన్ ప్రక్రియ ప్రారంభవుతుండగా అదేరోజుసాయంత్రం ముగుస్తుంది. 29న నామినేషన్ల పరిశీలన, 30వ తేదీన ఉపసంహరణ ప్రక్రియతో నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. ఇందుకు సంబంధించి సంబంధిత కార్మికశాఖ నోటిఫికేషన్‌ను కూడా వెలువరించింది. మున్సిపల్ కార్పొరేషన్ ట్రేడ్ యూనియన్ల పోరుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాయి. ఐఎన్‌టియుసి బలపర్చిన ఈశ్వర్ ఒంటరిపోరు కాగా ఎఐటియుసి, సిఐటియు మిత్రపక్షాలుగా బరిలో ఉన్నాయి. అదేవిధంగా నూతనంగా ఏర్పాటైన ఎంప్లారుూస్ ప్యానల్ - 11 కూడా ఇరుప్యానల్స్‌కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా విజయం కోసం రాజకీయ పావులు కదుపుతుండటం గమనార్హం. గడిచిన కాలంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ విజయానికి బాటగా నిలుస్తాయని ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈశ్వర్ ప్యానల్ గట్టినమ్మకంతో ఉండగా మిత్రపక్షాలుగా పోటీచేస్తున్న తమకు కార్మిక, ఉద్యోగుల అండతో తాము మరోసారి గెలుపుసాధిస్తామని, సాధించాలని రెండ కూటమి ప్రయత్నిస్తోంది. సిద్ధాంతాలు ఒక్కటైనా రెండుగా ఉద్యమాలు చేపట్టే సిఐటియు, ఎఐటియుసిలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్న వైనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సిపిఐకి చెందిన ఎఐటియుసి అనుబంధ సంస్థ అయిన మున్సిపల్ ఎంప్లారుూస్ యూనియన్, సిపిఎంకు చెందిన సిఐటియు అనుబంధ యూనియన్‌గా ఉన్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్‌ల కలయికపై ర్రాజకీయ పార్టీలు ఆసక్తితో ఉన్నాయి. గత రెండు దశాబ్ధాలుగా పాలనలో ఉన్న ఐఎన్‌టియుసి బలపర్చిన ఈశ్వర్ ప్యానల్ సొసైటీ పగ్గాలను ఏమాత్రం విడిచిపెట్టేది లేదంటూ ముందుకు పోతుండగా పలు అవినీతి అక్రమాలతో ఉద్యోగులను తీవ్రంగా నష్టపర్చారన్న ఆరోపణలతో ఉద్యోగుల ముందుకెళ్ళి అధికారం కైవసం చేసుకోవాలని మూడో కూటమి ప్రయత్నాలు చేస్తున్నాయి. 1937 వ సంవత్సరంలో ఏర్పాటైన మున్సిపల్ కో అపరేటీవ్ క్రెడిట్ సొసైటీ సుధీర్ఘకాలంపాటు వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు తమ హవా కొనసాగించాయి. గడిచిన 2002 ఎన్నికల్లో ఆధిపత్యాన్ని కోల్పోయిన వామపక్ష పార్టీలు తిరిగి 2008లో జరిగిన ఎన్నికల్లో కూడా భంగపాటు తప్పలేదు. ఈ రెండు ఎన్నికల్లో ఐఎన్‌టియుసి ఘన విజయం సాధించి మూడోసారి గెలుపుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. తాము సొసైటీ ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలులోకి తీసుకురావడమే కాకుండా కచ్చితంగా అమలుచేసామని, ఇప్పుడు కూడా ఉద్యోగులు హ్యాట్రిక్ విజయం అందిస్తారని అధ్యక్షుడు ఈశ్వర్ ధీమాను వ్యక్తం చేశారు.

లైంగిక వేధింపులకు నిరసనగా ధర్నా
సబ్ కలెక్టరేట్, డిసెంబర్ 27: మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలని విద్యార్థినులు, మహిళా సంఘాల నాయకురాళ్లు డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం ఉదయం బందరురోడ్డులోని సబ్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థినులు, మహిళా సంఘాలు కలిసి ధర్నా నిర్వహించాయి. ధర్నాలో మాంటిస్సోరి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరమ్మ మాట్లాడుతూ ఆడ పిల్లలు ధైర్యంగా బయట తిరగాలంటేనే భయం వేస్తుందన్నారు. మహిళలపై దాడులు చేయడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా పటిష్టమైన చట్టాలు చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ స్వరూపరాణి మాట్లాడుతూ మహిళలకు కరాటేలో శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 2011 సంవత్సరంలో దేశంలో బాలికలు, మహిళలపై 2లక్షల, 28నేరాలు జరిగాయని నేషనల్ క్రైం రిపోర్టు తెలుపుతుందన్నారు. ఇవి నమోదు అయినవేనని ఇంకా నమోదుకాని ఘోరాలు ఎన్నో ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. మాంటిస్సోరి కళాశాల అధ్యాపకులతోపాటు ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి ప్రవీణ్, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి మాధవ్, ఐద్వా నగర కార్యదర్శి శ్రీదేవి పాల్గొన్నారు.

పరిశ్రమల స్థాపనకు యువతను ప్రోత్సహించండి
విజయవాడ (క్రైం) డిసెంబర్ 27: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేవిధంగా పరిశ్రమల స్ధాపనకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాశ్ యం జ్యోతి చెప్పారు. జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగవకా

స్థానిక చెమ్మనగిరిపేట
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles