Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఓటర్ల నమోదు ప్రజాస్వామ్యానికి దృఢమైన పునాది

$
0
0

గుంటూరు, డిసెంబర్ 27: నాణ్యతాపరమైన ఓటర్ల నమోదు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని భారతీయ ఎన్నికల సంఘం అండర్ సెక్రటరి జెకె రావ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో ఓటర్ల నమోదు ప్రక్రియలో అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జెకె రావ్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గ ఎన్నికల అధికారులు తప్పనిసరిగా బూత్ లెవల్ అధికారి ఓటు నమోదు కోసం పూర్తి చేసిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఒక్కోసారి 40-50 సంవత్సరాల వయస్సులోపు వారు కొత్తగా ఓట్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటుంటారని, అటువంటి వారి నుంచి ఇప్పటివరకు ఓటు కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోలేదో వివరాలు సేకరించాలన్నారు. కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ పౌరుల నుండి తీసుకున్న ఒక్కొక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అసెంబ్లీ స్థాయి ఎన్నికల అధికారులు పరిష్కరించాలన్నారు. ప్రతి దరఖాస్తుపైనా సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారి సంతకం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్ యువరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు, గుంటూరు, తెనాలి, నరసరావుపేట ఆర్‌డిఒలు ఆయా మండలాల తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
పారదర్శకంగా సహకార ఎన్నికలు
* కలెక్టర్ సురేష్‌కుమార్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, డిసెంబర్ 27: జిల్లాలో సహకార ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరిపేందుకు అవసరమైన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సహకార ఎన్నికల నిర్వహణపై సంబంధిత ఎన్నికల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 168 కోఆపరేటివ్ సొసైటీలున్నాయని, వీటిలో దాదాపు 11.50 లక్షల మంది సభ్యులున్నారని చెప్పారు. అయితే ఓటర్లుగా 2.60 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. సహకార సంఘాల్లో సభ్యులైనంత మాత్రాన ఓటుహక్కు రాదని, ఏ సభ్యుడైనా ఓటు హక్కు పొందాలంటే సంబంధిత సహకార సంఘంలో 300 రూపాయల షేర్ క్యాపిటల్ కలిగి ఉండాలన్నారు. సదరు వ్యక్తి గతంలో ఎటువంటి బకాయిలు లేకుండా ఉండటంతో పాటు, ఇతర అర్హతలన్నీ కలిగి ఉండాలని సూచించారు. వచ్చే సంవత్సరం జనవరి 4వ తేదీ వరకూ ఏ సొసైటీలోనైనా ఉన్న సభ్యులు ఓటుహక్కు కావాలంటే షేర్ క్యాపిటల్ చెల్లించడంతో పాటు గతంలో వారు చెల్లించాల్సిన బకాయిలను సైతం కట్టి ఇతర అర్హతలు పూర్తి చేసిన మీదటనే ఓటరుగా అర్హత కలిగి ఉంటారని చెప్పారు. 2005వ సంవత్సరంలో జిల్లాలో జరిగిన సహకార ఎన్నికల్లో 50 శాతం ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. ఏకగ్రీవమైతేనే సహకారానికి సంకేతమని పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులకు శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అంతర్జాతీయ సహకార సంవత్సరంలో సహకార ఎన్నికలు సహృద్భావ వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులను కోరారు. ఓటర్ల జాబితాను సంబంధిత సొసైటీ నోటీసుబోర్డులో ఉంచడంతో పాటు మండల తహశీల్దార్ కార్యాలయంలో కూడా ప్రదర్శించాలన్నారు. సహకార ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ను వచ్చే సంవత్సరం జనవరి 21వ తేదీన ఇవ్వడం జరుగుతుందని, ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయన్నారు. మొదటి విడత ఎన్నికలు జనవరి 31వ తేదీన, రెండవ విడత ఎన్నికలు ఫిబ్రవరి 4న నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 10 సొసైటీలపై ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలిస్తున్నామని కలెక్టర్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం శ్రీకాంత్, డిప్యూటీ రిజిస్ట్రార్ నాగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుభాషా వికాసానికి
నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి

గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 27: తిరుపతిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలలో తెలుగు భాషా వికాసానికి నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సభ్యులు డిమాండ్ చేశారు. అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో ప్రపంచ తెలుగు మహాసభలు-తెలుగు భాషాభివృద్ధి అన్న అంశంపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ కాన్ఫడరేషన్ అధ్యక్షుడు సిహెచ్ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ పాలనాభాషగానూ, బోధనాభాషగానూ, శాసనసభ భాషగానూ, దైనందిన జీవనంలో వ్యవహార భాషగానూ తెలుగు అమలులోకి రాకపోవడానికి గల కారణాలను గుర్తించి చక్కదిద్దే చర్యలను తక్షణమే చేపట్టేందుకు ఈ మహాసభలు ఉపయోగపడాలన్నారు. అవగాహన సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ కనగాల జయకుమార్ మాట్లాడుతూ అధికార భాష అమలుకు సంబంధించిన ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలన్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఈ చంద్రయ్య మాట్లాడుతూ తమిళనాడులో అనుసరిస్తున్న పద్ధతులను కొనసాగించాలన్నారు. తెలుగులో కోర్టు తీర్పులు ఇవ్వడంతో సహా న్యాయ వ్యవస్థలోనూ తెలుగును అధికారికంగా ప్రవేశపెట్టాలన్నారు. సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రకటనలు తప్పనిసరిగా తెలుగులోనే విడుదల చేయాలన్నారు. పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లు, ఆసుపత్రుల్లో వ్యవహారాలు తెలుగులోనే పూర్తిగా నిర్వహించి జన బాహుళ్యానికి అర్థమయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత హెచ్‌ఎం నారపరెడ్డి, సంస్థ సీనియర్ సభ్యులు పి వెంగయ్య, ఎంవి రమణరావు తదితరులు పాల్గొన్నారు.
‘టిడిపి పూర్వవైభవానికి కృషి చేయాలి’
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 27: తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి పార్టీ యంత్రాంగమంతా సమష్టిగా కృషి చేయాలని నగర టిడిపి అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో నగర పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బోనబోయిన మాట్లాడుతూ నగర అనుబంధ విభాగాలైన బిసి, మహిళ, మైనార్టీ, లీగల్, సాంస్కృతిక విభాగాల కమిటీలను వేయడం జరిగిందని, ఆయా విభాగాల అధ్యక్షులు డివిజన్‌లోని పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాలన్నారు. కోడెల శివప్రసాద్, పార్టీ నాయకుల పట్ల నరసరావుపేట డిఎస్‌పి వ్యవహరించిన తీరుపై జిల్లావ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయన్నారు. డిఎస్‌పిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని దీన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీన కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశంలో నగర పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్తినేని రాజేష్, అడపా శివప్రసాద్, వేములపల్లి శ్రీరాం ప్రసాద్, ఎలుకా వీరాంజనేయులు, మాదల వెంకటేశ్వర్లు, బొంతల సాయి, నల్లపనేని విజయలక్ష్మి, షేక్ మీరావలి, పానకాల వెంకటమహాలక్ష్మి, ములకా సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల కౌనె్సలింగ్ ప్రారంభం
52 మందికి నియామక ఉత్తర్వులు
గుంటూరు, డిసెంబర్ 27: 2012 డిఎస్సీ నియామకాల కౌనె్సలింగ్ గురువారం ఉదయం జరగాల్సి ఉండగా కోర్టు వివాదం కారణంగా సాయంత్రం 3 గంటలకు ప్రారంభమైంది. కౌన్సిలింగ్ ప్రక్రియ తీవ్ర జాప్యం కావడంతో అభ్యర్థులు అసహనానికి గురయ్యారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి ఆంజనేయులు ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 108 మందికి కౌనె్సలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఆలస్యంగా ప్రారంభం కావడంతో 52 మందికే నియామక ఉత్తర్వులు అందాయి. తొలిరోజు మున్సిపల్, ఐటిడిఎ పాఠశాలల్లో పోస్టుల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా ఉపాధ్యాయుల అక్రమ బదిలీను నిరసిస్తూ ఎపిటిఎఫ్ నాయకులు కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు.
విద్యుత్ సర్‌చార్జీలకు నిరసనగా ప్రదర్శన, ధర్నా
మంగళగిరి, డిసెంబర్ 27: విద్యుత్ వినియోగదారులపై సర్‌చార్జీ పేరిట భారీగా భారం మోపడాన్ని నిరసిస్తూ గురువారం సిపిఐ (ఎం-ఎల్) ఆధ్వర్యాన మంగళగిరి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని రత్నాల చెరువు నుంచి ప్రదర్శనగా విద్యుత్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. సిపిఐ (ఎంఎల్) నాయకులు జగ్గారపు సుబ్బారావు మాట్లాడుతూ రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు, కూలీల కుటుంబాలకు 2600 రూపాయలు, 4వేల200 రూపాయల వరకు బిల్లులు వచ్చాయని ఆయన విమర్శించారు.ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు భారం ప్రజలపై మోపిందని, సేవల రంగమైన విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం వ్యాపారంగా మార్చిందని ఆయన దుయ్యబట్టారు. ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎడిఇ రాజేష్‌ఖన్నాకు అందజేశారు. విద్యుత్ సర్‌చార్జీలను రద్దు చేయాలని వినతిపత్రంలో కోరారు. కె వెంకటపతి, వెంకట్రావు, ఆంజనేయులు, నాగరాజు, గోపి, మల్లి, బాలాజీ, ఎన్‌వైఎస్ జిల్లా నాయకులు దుర్గాప్రసాద్, స్ర్తి విముక్తి సంఘటన సభ్యులు జెన్ని, లక్ష్మి, రమణ, జాన్‌బీ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా పద్మావతి శ్రీనివాసుల కల్యాణం
తెనాలి, డిసెంబర్ 27: నేటి ఆధునిక వ్యవస్థలో అలుముకుంటున్న అశాంతి, అభద్రతా భావం, నిర్లక్ష్య పోకడలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని, ఈ తరుణంలో లోక కల్యాణం కోసం అనేక మంది వితరణశీలురు ఆధ్యాత్మిక చింతనను పెంచే కార్యక్రమాలను ప్రోత్సహించడం ముదావహమని హైదరాబాద్ జిల్లా జడ్జి గ్రంధి గోపాలకృష్ణ అన్నారు. స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణం వేదికగా ఈ నెల 24 నుండి సాగుతున్న నవకోటి జప సప్తదశ పూర్ణాహుతి మహాయజ్ఞం పూజలలో గురువారం జడ్జి గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ క్రమంలో మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ ఆశీస్సులు అందుకున్న న్యాయమూర్తి గోపాలకృష్ణమూర్తి సద్గురు జగన్నాధస్వామి సన్నిధిలో జ్యోతిప్రజ్వలన చేశారు. నవకుండాత్మకంగా అనేక మంది దంపతులు సామూహికంగా హోమ పూజలలో పాల్గొన్నారు. వైకుంఠపురం పాలక మండలి మాజీ చైర్మన్ వితరణశీలి నంబూరు వెంకటకృష్ణ దంపతులు ప్రధాన యజ్ఞవేదిక వద్ద హోమ పూజలు నిర్వహించారు. సాయంత్ర పూజలలో భాగంగా పద్మావతి శ్రీనివాసుల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. విశేషంగా దంపతులు కల్యాణ ఘట్టంలో భాగస్వాములయ్యారు. ఇదిలా ఉండగా మాతృశ్రీ లక్ష్మికాంతమ్మ స్వీయ పర్యవేక్షణలో ఈనెల 28న 25కిలోల కర్పూరంతో చేపట్టే పూర్ణాహుతితో నవకోటి జపయజ్ఞం పరిసమాప్తం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
రాష్ట్ర పోటీలకు ఎంపికైన అథ్లెట్స్‌కు దుస్తుల పంపిణీ
గుంటూరు (స్పోర్ట్స్), డిసెంబర్ 27: వరంగల్లులో ఈనెల 29, 30 తేదీల్లో జరగనున్న రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెట్స్‌కు డిఎస్‌ఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు క్రీడాదుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్‌టిఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో డిఎస్‌ఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సంఘ కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు రాష్ట్ర పోటీల్లో పాల్గొనే 40 మంది క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. ప్రతి క్రీడాకారుడు గుర్తింపు తెచ్చుకోవడాకి శాయశక్తులా కృషి చేయాలన్నారు. క్రీడల్లో ప్రతిభను కనబర్చిన క్రీడాకారులకు డిఎస్‌ఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మర్రి సురేష్‌బాబు, యర్రగుంట్ల అప్పారావు, కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ఓం సా యి శ్రీనివాసరావు, మానుకొండ శ్రీనివాసరావు, నాయుడు లక్ష్మణరావు, మద్దుకూరి శ్రీ్ధర్, మక్కెన సింగయ్య, పంచుమర్తి హరిబాబు, గాంధీ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పోటీలకు
ఇండియన్ స్ప్రింగ్స్ విద్యార్థులు
గుంటూరు (స్పోర్ట్స్), డిసెంబర్ 27: వరంగల్లులో జరగనున్న సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో స్థానిక ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలకు చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొంటున్నట్లు స్కూలు కరస్పాండెంట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. వివిధ విభాగాల్లో జరగనున్న ఈ పోటీల్లో మనోజ్‌కుమార్, అమన్, కల్యాణ్ చక్రవర్తి, రాజేష్, కౌశిక్, అశోక్‌సాయి, సాయిచక్రవర్తి, విష్ణుసాయి, శివనాగిరెడ్డి, వీరాంజనేయులు, నరసింహనాయుడు, బాలికల్లో లిఖిత, షాలిని, సిరిచందన, సాయిజ్యోతి, గౌతమి, ప్రియాంక, నందిని, సంగీతలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు ఆర్ శివాజీ, శివశంకర్, అంకమ్మరావులను అభినందించారు.

రేపు జమీఅత్ ఉలమా ఆధ్వర్యంలో మత సామరస్యంపై బహిరంగ సభ
గుంటూరు, డిసెంబర్ 27: జాతీయ సమగ్రత, సెక్యులర్ భావాలు, మత సామరస్యం, సమాజ ఐక్యతపై ఈనెల 29వ తేదీన స్థానిక ఆంధ్రా ముస్లిం కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జమీఅత్ ఉలమా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీద్ అహమ్మద్ సాబీర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నల్లచెరువులోని మదర్సాలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సాబీర్ మాట్లాడుతూ ముస్లింలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు జమీఅత్ ఉలమా ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా మతసామరస్య సమాజ ఐక్యతపై అన్ని వర్గాలను కలుపుకుపోతూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 5న హైదరాబాదులో తొలి బహిరంగ సభ నిర్వహించామన్నారు. ఆ తర్వాత కోస్తాంధ్రలోని గుంటూరులో ఈ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో చిత్తూరు, మార్చి మొదటివారంలో నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాతీయ సమగ్రతను, సెక్యులర్ భావాన్ని దెబ్బతీసే విధంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వారిని ముస్లింల నుంచి బహిష్కరించేందుకు ఇటీవల 6 వేల మంది మత పెద్దల సంతకాలతో కూడిన ఫత్వాను జారీ చేసినట్లు చెప్పారు. శనివారం జరిగే మహాసభకు ఎయుబివి నుంచి రామశాస్ర్తీ, యునైటెడ్ క్రిస్టియాంట్ నుండి డాక్టర్ కెహెచ్ బెంజిమన్ హాజరుకానున్నారని చెప్పారు. ముఖ్య అతిథిగా జెమీఅత్ ఉలమా జాతీయ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమ్మద్ మదనీ హాజరు కానున్నట్లు సాబీర్ పేర్కొన్నారు. విలేఖర్ల సమావేశంలో జమీఅత్ ఉలమా జిల్లా అధ్యక్షుడు హబిబుల్లా ఖాశిం, కార్యదర్శి ముఫ్తి అబ్దుల్ బాసిత్, ఉపాధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

తెనాలి శిల్పులకు అందని తెలుగు మహాసభల ఆహ్వానం
తెనాలి రూరల్, డిసెంబర్ 27: తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలు నలుదిక్కులా చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం తెలుగు మహోత్సవాలను తిరుపతిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకుగాను రాష్టవ్య్రాప్తంగా అనేక విభాగాల్లో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు, శిల్పులకు ఆహ్వానాలు పంపింది. అయితే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కేంద్ర, రాష్టస్థ్రాయి స్థాయి శిల్పులకు రాష్ట్ర సాంస్కృతికశాఖ నుండి మహాసభలకు పిలుపు రాకపోవటంతో డెల్టా ప్రాంత ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మహాసభలకు శిల్పులుకూడా తమ ప్రదర్శనలుఇచ్చి తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రగల్బాలు పలికిన రాష్ట్ర సాంస్కృతికశాఖ తెనాలి శిల్పుల గొప్పతనం తెలియక పోవటం, జిల్లా మంత్రులు, అధికారులు పట్టించుకోక పోవటంపై ఈప్రాంతంలో సర్వత్రా నిరసనలు వ్యక్తవౌతున్నాయి. గతంలో హైదరాబాద్‌లో జరిగిన జీవవైవిధ్య సదస్సులోను తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరావు తన కుమారుల సహకారంతో అద్భుతమైన శిల్పాలను సదస్సులో ప్రదర్శించి పలువురి మెప్పులు పొందారు. ప్రత్యమ్నాయాలతో కూడిన శిల్పాలను తయారుచేసి గిన్సీస్ బుక్ ఆఫ్‌ది రికార్డులో తెలుగుతేజాన్ని నెలకొల్పాలన్న ఆశయంతో ఉన్నారు కాటూరికి ఆహ్వా నం అందక పోవటం విచారకరం. ఈఉద్దేశ్యంతోనే ఎవరు ఏవిధమైన ఆర్ధిక సహాయం చేయకపోయినప్పటికీ జీవవైవిద్య సదస్సును పురస్కరించుకొని హైదరాబాద్‌లో కాటూరి స్వయంగా శిల్పప్రదర్శన ను ఏర్పాటుచేశారు. అలా గే ఎంతో ప్రతిష్టాత్మకమైన తెనాలి మహోత్సవాల్లోను కాటూరి శిల్పకళా విగ్రహాల ప్రదర్శన హైలెట్‌గా నిలిచాయి. గతంలో కాటూరి తయారుచేసిన పలు శిల్పాలను హైదరాబాద్‌లోని శిల్పారామంలోను ప్రదర్శనగా ఉంచారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సాంస్కృతికశాఖ పిలుపుకోసం ఎదురుచూస్తూ సుమారు 12 రకాల శిల్పకళాఖండాలను తయారుచేసి సిద్ధంగాఉన్న శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులకు నిరాసే మిగిలింది. గురువారం తెలుగు మహాసభలు ప్రారంభం కావటంతో ఆయన నిరుత్సాహానికిగురై రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. శిల్పకళ అంతరించిపోతున్న తరుణంలో ఎక్కడో మారుమూలనున్న కళాకారులను సైతం బయటకు తీసుకువచ్చి, కళాకారులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం శిల్పులను పట్టించుకోక పోవటంపట్ల సర్వత్ర నిరసనలు వ్యక్తవౌతున్నాయి. ఇదిలాఉండగా ఇటీవల కాలంలో దేశ పార్లమెంటు ఆవరణలో తెలుగుతేజం నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు తెనాలికి చెందిన శిల్పులను మంత్రులు ఎంపిక చేసిన విషయం విదితమే. అయతే రాష్ట్రప్రభుత్వం తెలు గు మహాసభలకు వారికి ఆహ్వానం పంపకుండా ‘షాక్’ ఇచ్చిందనే చెప్పాలి.

అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి
మంగళగిరి, డిసెంబర్ 27: దేశ రాజధాని ఢిల్లీలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పిడిఎస్‌ఓ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కె అజిత అన్నారు. పిడిఎస్‌ఓ, ఎన్‌వైఎస్ ఆధ్వర్యాన గురువారం స్థానిక నలంద ఒకేషనల్ జూనియర్ కాలేజీలో రవికిషోర్ అధ్యక్షతన జరిగిన సభలో అజిత మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన ఘటన అమానుషమని, సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని అన్నారు. దేశ వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, రాజధానిలోనే మహిళలకు రక్షణ లేకపోతే మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని అజిత ప్రశ్నించారు. యువతరాన్ని సెక్స్, క్రైంతో వెర్రెక్కించే టీవీ, సినిమా సంస్కృతి వలన మానవత్వం సంస్కారాన్ని మర్చిపోయి కొందరు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని, ఇటువంటి విష సంస్కృతికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువజనులు ఉద్యమించాలని అజిత పిలుపు నిచ్చారు. ఎన్‌వైఎస్ జిల్లా నాయకుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అశ్లీల విష సంస్కృతికి వ్యతిరేకంగా మహిళలకు రక్షణ ఇచ్చే నూతన సమాజం కోసం విద్యార్థులు, యువత నడుంబిగించాలని అన్నారు. ఎస్‌కె బాజీసైదా, ఎన్ సాంబశివరావు, అజ య్, షఫి తదితరులు పాల్గొన్నారు.
తెలుగుభాషకు వెలుగులు అద్దడం ప్రతి ఆంధ్రుడి ప్రథమ కర్తవ్యం
గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 27: ఆదర్శవంతమైన సమాజస్థాపనలో కీలకపాత్ర పోషించి, ఉత్తమ సంస్కృతి, సంప్రదాయాలకు మూలస్తంభమైన మన తీయనైన తెలుగుభాషకు వెలుగులు అద్దడం ప్రతి ఆంధ్రుడి తొలి కర్తవ్యమని మున్నంగి హైస్కూల్ డైరెక్టర్ ఎం చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఎన్‌జిఒ కాలనీలోని పాఠశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరుగుతున్న సందర్భంలో తెలుగువారంతా మనభాష ఔన్నత్యాన్ని పదిలం చేసుకోవడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. స్కూలు కార్యదర్శి ఎం లక్ష్మీనారాయణరెడ్డి, మున్నంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ సాంబిరెడ్డి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినీ, విద్యార్థులు తెలుగు పాఠ్యాంశాలను శ్రద్ధగా పఠించాలన్నారు. తెలుగు మహాసభల సందర్భంగా మాస్టర్‌మైండ్స్ సంస్థ జిల్లాస్థాయిలో నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబర్చిన తమ పాఠశాల విద్యార్థులు గోపీకృష్ణప్రసాద్, ఎస్ నాగవిమను ప్రిన్సిపాల్ టి విజయకృష్ణ అభినందించారు.
సాక్షర భారత్‌కు గ్రామ కోఆర్డినేటర్లే పునాది
అచ్చంపేట, డిసెంబర్ 27: పదిహేనేళ్లు దాటిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే సాక్షర భారత్ కార్యక్రమాలను గ్రామ కోఆర్డినేటర్లు ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సాక్షర భారత్ జిల్లా డెప్యూటీ డైరెక్టర్ పి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సాక్షర భారత్ రెండవ విడత శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరంలో నేర్పిన అంశాల నైపుణ్యతను దృష్టిలో ఉంచుకుని విద్యావ్యాప్తికి కృషి చేయాలని ఆయన కోరారు. శిబిరానికి 38 మంది హాజరు కావాల్సి ఉండగా, 8 మంది గైర్హాజరు కావడంపై మండల కోఆర్డినేటర్ రాంబాబుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్రోసూరు మండల కోఆర్డినేటర్ ఆంజనేయులు, వివిధ గ్రామాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో దత్తాత్రేయ జయంతి
అమరావతి, డిసెంబర్ 27: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్థానిక శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగస్వామి దేవస్థానంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. స్థానిక క్షేత్ర పురోహితులు కౌశిక శ్రీరామశర్మ, వేద పండితులు లంకా సోమేశ్వరశర్మ అవధాని, దత్తాత్రేయ పాదాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. భక్తుల పేర సహస్ర నామార్చనలు గావించారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు పరాశరం రామకృష్ణమాచార్యులు, ఆలయ ఇఒ డి వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.
అప్పా డైరెక్టర్‌ను కలిసిన ఎస్పీ
తాడేపల్లి, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (ఎపిపిఎ) డైరెక్టర్ రాజీవ్ త్రివేదిని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ ఎ రవికృష్ణ గురువారం తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్ట, కృష్ణాతీరం వెంబడి ఉన్న గోకరాజు గంగరాజు అతిథిగృహంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ట్రైయథ్లాగ్ నిర్వహిస్తూ మార్గమధ్యంలో కొద్దిసేపు రాజీవ్ త్రివేది గంగరాజు అతిథిగృహంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఆయనను కలుసుకున్నారు. తాడేపల్లి ఎస్‌ఐ చిట్టెం కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో దాచేపల్లి మాజీ సర్పంచ్?
దాచేపల్లి, డిసెంబర్ 27: గురజాల ఎమ్యేల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆచూకీ తెలుసుకునేందుకు గురువారం పోలీసులు దాచేపల్లి మాజీ సర్పంచ్ తంగెళ్ళ శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పిడుగురాళ్ళ మండలం జానపాడుకు చెందిన ఉన్నం నరేంద్ర హత్య కేసులో నిందితుడిగా వున్న యరపతినేని అదృశ్యమవడంతో ఆయన ఆచూకీ కోసం పోలీసులు గత కొన్ని రోజులుగా గాలిస్తున్న విషయం విదితమే. యరపతినేని ముందస్తు బె యిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని న్యా యస్థానం ఈనెలాఖరుకు వాయిదా వేసి న నేపథ్యంలో యరపతినేని ఆచూకి కోసం పోలీసులు తమ గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం దాచేపల్లి మాజీ సర్పంచ్ తంగెళ్ళ శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విష యమై వారి బంధువులలో ఆందోళన వ్యక్తమవుతోంది. యరపతినేని ఆచూ కీ కోసం మరికొంత మంది తెలుగుదేశం నాయకులను అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిసింది.
మహిళలపై దాడులకు నిరసనగా ధర్నా
సత్తెనపల్లి, డిసెంబర్ 27: శాంతి భద్రతలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి కుర్రం శ్రీనివాస్ ధ్వజమెత్తారు. నేడు దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ స్థానిక తాలుకా సెంటర్లో జరిపిన ధర్నా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశరాజధానిలోనే మహిళలకు భద్రత లేకుంటే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలాఉంటుందో ఇట్టే అర్థమవుతుందన్నారు. అనంతరం రేపిస్ట్భుతం దిష్టిబొమ్మను ఎఐఎస్‌ఎఫ్ నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మస్తాన్‌వలీ, మణికంఠ, హరిబాబు, హరీష్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

నాణ్యతాపరమైన
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>