Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నేడు సీమాంధ్ర విద్యా సంస్థల బంద్

$
0
0

ఒంగోలు, డిసెంబర్ 27: నేడు ఢిల్లీలో జరగనున్న అఖిపక్ష భేటీ తరువాత కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ శుక్రవారం జరిగే సీమాంధ్ర విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని సమైక్యాంధ్ర జెఎసి జిల్లా కన్వీనర్‌లు టిఎస్‌ఎస్ సింగ్, గోరంట్ల రవి కుమార్, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కో కన్వీనర్ రాయపాటి జగదీష్ కోరారు. శుక్రవారం స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ బంద్‌కు అన్ని విద్యా సంస్థలు సంపూర్ణ సహకారాలు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రాకు అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాలన్నారు. సమైక్యాంధ్రాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సమైక్యాంధ్ర వ్యతిరేక రాజకీయ పార్టీలను సీమాంధ్ర ప్రాంతం నుండి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఒంగోలు నగర నాయకులు చెన్నుపాటి అశోక్ పాల్గొన్నారు.

‘సహకార’ పోరులో నేతలు నిమగ్నం

‘సహకార’ పోరులో నేతలు నిమగ్నం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,డిసెంబర్ 27: సహకార సంఘ ఎన్నికలకు సంబంధించిన నూతన ఓటర్ల చేర్పుల కార్యక్రమం ఒక విడత ముగియగా మరో విడత వచ్చేనెల నాల్గవతేదీతో ముగియనుంది. తొలివిడతగా 330 రూపాయల ఓటర్ల చేర్పుల ప్రక్రియ ఈనెల 21తో ముగిసింది. జిల్లాలోని అన్నినియోజకవర్గాలనుండి వచ్చిన ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు పరిశీలించిన నివేదిక రూపొందించారు. జిల్లావ్యాప్తంగా ఒకలక్షా 64వేల ఓటర్లు ఉండగా నూతనంగా మరో 30,640ఓటర్లు చేరారు. దీంతో జిల్లాలో 330రూపాయల షేర్‌ధనం కలిగిన ఓటర్లు లక్షా 94వేల 640మంది ఉన్నారు. అదేవిధంగా పదిరూపాయల షేర్‌ధనం కలిగిన ఓటర్ల చేర్పింపుప్రక్రియ వచ్చేనెల 4 వరకూ ఉంది. దీంతో ప్రధాన రాజకీయ పక్షనేతలు ఓటర్ల చేర్పింపులో నిమగ్నమయ్యారు. ఓటర్ల చేర్పింపు కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన నేతలు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్ సిపి నాయకులు ధ్వజమెత్తుతున్నారు. కనీసం కార్యదర్శులు సైతం అందుబాటులో ఉండటం లేదని, అధికారపక్షానికి మద్దతు తెలుపుతున్నారని వైఎస్‌ఆర్ సిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రధానంగా వైఎస్‌ఆర్ సిపి నాయకులు, కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు పోటాపోటీగా ఓటర్లను చేర్పిస్తున్నారు. ఓటర్ల చేర్పింపు ముందువరసలో వైఎస్‌ఆర్ సిపి నాయకులు ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఇదిఇలాఉండగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో సహకార సంఘ ఎన్నికల హాడావుడి ప్రారంభమైంది. రైతులు ఏవరికి ఓటువేస్తారో వారిని ఎన్నుకుని వారికి ఓటు హక్కుకల్పిస్తున్నారు. ఎవరికివారే తమపార్టీ గెలుస్తుందన్న ధీమాలో ఉన్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌పార్టీకి చెందిన సహకార సంఘ అధ్యక్షులు ఎక్కువుగా ఉన్నారు. కాని జిల్లాలోని అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుల్లో మాత్రం సయోధ్య లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతవరకు ప్రస్తుత పిడిసిసి బ్యాంకు చైర్మన్ మేదరమెట్ల శంకరారెడ్డితో ఎమ్మెల్యేల
మంతనాలు సాగించని పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎన్నికలపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సాకే శైలజానాథ్, మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డిప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిఇలాఉండగా జిల్లాలోని మెజార్టీ అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల మాటలు వినటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయంలోనే అధికారులు తమకు గుర్తింపుఇచ్చారని, అయితే ప్రస్తుత అధికారులను ప్రతిపనికి బ్రతిమలాడిన పనులు కావటం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద సహకార సంఘ ఎన్నికల వేడి జిల్లాలో ఊపందుకుంది.

ముగిసిన సాక్షర భారత్ శిక్షణ
సంతనూతలపాడు, డిసెంబర్ 27: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని సాక్షర భారత్ గ్రామ కో ఆర్డినేటర్లకు రెండు రోజులపాటు జరిగిన శిక్షణా కార్యక్రమాలు ముగిశాయి. చివరి రోజు జిల్లా సాక్షర భారత్ ప్రాజెక్టు అధికారి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ మండలంలో సాక్షర భారతి మూడవ విడతలో భాగంగా 5 వేల మంది నిరక్ష్యరాశ్యులును అక్షరాశ్యులుగా చేయాలనే లక్ష్యంగా తీసుకున్నామన్నారు. అందులో భాగంగా ప్రతి పదిమందికి ఒక వలంటీర్‌ను నియమించాలన్నారు. గ్రామ కో ఆర్డినేటర్లు లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు నిరక్ష్యరాశ్యులను అక్షరాశ్యులుగా చేయడంలో అందరు చిత్తశుద్దితో పనిచేసి ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు సాక్షర భారత్ కో ఆర్డినేటర్ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షర భారతి మండల కో ఆర్డినేటర్ బొంతా సుబ్బారావు, గ్రామ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఢిల్లీ ఘటనపై కదం తొక్కిన విద్యార్థులు
దర్శి, డిసెంబర్ 27: ఢిల్లీలో గ్యాంగ్ రేప్‌కు గురైన విద్యార్థినికి మద్దతుగా దర్శి పట్టణంలో గురువారం ఎస్‌ఎఫ్‌ఐ, ఎపి మహిళా సమతా సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ఘటనను ఖండించారు. ఈ సందర్భంగా మహిళా కన్వీనర్ అనురాధ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు మహిళలు సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి సంఘటనల పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని, పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్ ఐ నాయకులు వర్మ, సురేంద్ర, అమర్, సి ఐటియు నాయకులు జూపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
రాష్టస్థ్రాయి క్రికెట్‌పోటీల్లో
వైడిపాడు జట్టుకు మూడో స్థానం
పెద్దారవీడు, డిసెంబర్ 27: ఇటీవల విశాఖపట్నం చోడవరంలో రాష్టస్థ్రాయి క్రికెట్ పోటీల్లో పెద్దారవీడు మండలం వైడిపాడు జిల్లాపరిషత్ హైస్కూల్‌కు చెందిన జట్టు మూడవస్థానం సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు ఏరువ వెంకటరామిరెడ్డి తెలిపారు.
అండర్ -19 క్రికెట్ రాష్టస్థ్రాయి పోటీల్లో ప్రకాశంజిల్లా జట్టులో పాల్గొన్న వైడిపాడు విద్యార్థులు ఏరువ రమాదేవి, ఏరువ శివప్రియలు అత్యధిక స్కోర్ సాధించి మూడవ స్థానం కైవసం చేసుకున్నారని తెలిపారు. వీరి ప్రతిభకు ప్రధానోపాధ్యాయులు ఏరువ వెంకటరామిరెడ్డి, పిడి ఓ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
ఘనంగా దత్తాత్రేయ జయంతి
బేస్తవారపేట, డిసెంబర్ 27: బేస్తవారపేటలో దత్తాత్రేయ జయంతి వేడుకలను గురువారం భక్తులు ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ ఆలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించారు. దత్తమాల స్వీకరించిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా 1500మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మాజీసర్పంచ్ గాజుల విశ్వనాధం, టివిఎస్‌వి శర్మ, చటిచర్లగ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, గాలిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

చెరువులో అక్రమంగా వేసిన పంట తొలగించాలి
మార్కాపురం, డిసెంబర్ 27: మండలంలోని బొందలపాడు చెరువును కొందరు రైతులు అక్రమంగా ఆక్రమించుకొని పప్పుశనగ పంటను సాగు చేశారని, పంటను తొలగించాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గురువారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయాన్ని దిగ్భందించారు. ఈ చెరువును ఆక్రమించి పప్పుశనగ సాగుచేయడం వలన చెరువులో నీరు లేక సమీప ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయి ప్రజలు నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని, పంట సాగుకు ముందే విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో ఆక్రమణదారులు పంటను సాగుచేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పేదలకు న్యాయం చేయమని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తే ఆ వినతిపత్రం విఆర్‌ఓకు ఎలా చేరిందని రైతులు ప్రశ్నించారు. దీనిపై తహశీల్దార్ నాగూర్‌షరీఫ్ మాట్లాడుతూ తన దృష్టికి రాగానే ఇరువురు గ్రామనౌకర్లను సస్పెండ్ చేయడంతోపాటు అక్రమ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టామని, త్వరలో ఈ పంట తొలగింపుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమాధానంపై సంతృప్తి చెందని ఎమ్మెల్యే కందుల పంట కోసుకున్న తరువాత చర్యలు చేపడుతారా..? ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారంటూ ప్రశ్నించి, అక్రమంగా పంట సాగుచేసిన వారితో అక్రమ మిలాకత్ ఉందా..? అని ప్రశ్నించారు. అలాంటిదేమి లేదని, తాను ఉద్యోగం చేసుకునేందుకు వచ్చానని, తన బాధ్యతలను తాను సక్రమంగా నిర్వర్తించడం జరుగుతుందని తహశీల్దార్ తెలిపారు. బొందలపాడు చెరువు సర్వేనెంబర్ 287/2లో 107 ఎకరాల 93సెంట్ల భూమిలో సుమారు 70ఎకరాల భూమిని 13మంది రైతులు అక్రమంగా ఆక్రమించుకొని పప్పుశనగ సాగు చేస్తున్నారని, అయితే వారిపై చర్యలు తీసుకోలేదని, తనవర్గం వారు తమ భూముల కింద ఉన్న సుమారు 97ఎకరాల భూమిని 23మంది రైతులు సాగు చేసుకుంటుంటే అధికారులు కేసులు పెడుతామని వత్తిడి చేసి తాము సాగు చేసుకోమని రాయించుకున్నారని, అదే చెరువులో సాగుచేసిన రైతులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే కందుల ప్రశ్నించారు. విషయాన్ని మార్కాపురం ఆర్డీఓ ఎం రాఘవరావు దృష్టికి తీసుకువెళ్ళగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగిస్తామని చెప్పడంతో సంతృప్తి చెందని ఎమ్మెల్యే కందుల తనకు స్పష్టమైన హామీ రావాలని పట్టుబట్టారు. వెంటనే తహశీల్దార్ నాగూర్‌షరీఫ్ జిల్లా జాయింట్‌కలెక్టర్ లక్ష్మీనృశింహం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళగా చిన్ననీటి పారుదలశాఖ అధికారులతో చర్చించి ఎజిపితో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనితో తహశీల్దార్ మూడురోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే కందుల ముట్టడి కార్యక్రమాన్ని విరమించారు. ఇదే సమయంలో ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెడితే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించగా రూరల్‌ఎస్సై శ్రీరాములునాయక్ మాట్లాడుతూ లీగల్ ఒపీనియన్ కోసం పంపడం జరిగిందని, అక్కడి నుంచి సమాచారం రాగానే కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
తాము ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయమని చెప్పడం లేదని, చెరువులో నీరు ఉంటే బోర్లద్వారా నీరు వచ్చి పంటలు పండటమే కాక తాగునీటి సమస్య ఉండదని కందుల తెలిపారు.
ఈ ముట్టడిలో జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మాం, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు టి బాలసుబ్బారావు, అమిరుల్లాఖాన్, మాజీకౌన్సిలర్లు మయూరి కాశీం, కొప్పుల శ్రీనివాసరావు, మహిళ నేత పోరుమామిళ్ళ విజయలక్ష్మీ, పట్టణ, రూరల్ మాజీఅధ్యక్షులు టి సత్యనారాయణ, జి వెంకటరెడ్డిలతో పాటు పలువురు టిడిపి నేతలు, రైతులు పాల్గొన్నారు. ఈకార్యక్రమానికి పట్టణ ఎస్సై రాజమోహన్‌రావు బందోబస్తు నిర్వహించారు.
‘యానాదులను అనాథలుగా చూస్తున్న ప్రభుత్వాలు’
ఒంగోలు, డిసెంబర్ 27: రాష్ట్రంలో యానాదులను అగ్రకుల ప్రభుత్వాలు అనాధులగా చూస్తున్నాయని దళిత బహుజన ఫ్రెంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్ దుయ్యబట్టారు. స్థానిక అంబేద్కర్ భవనంలో శుక్రవారంనాడు జరిగిన యానాదుల చైతన్య సదస్సుకు వినయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు అయినప్పటికి యానాది కులానికి చెందిన ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ప్రవేశించకపోవడం బాధాకరమన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలకు 40 కోట్లు ఖర్చు పెడుతున్న ఇంగ్లీషు ముఖ్యమంత్రి తెలుగు ప్రాచీనజాతి అయిన యానాదుల సంక్షేమానికి యాక్షన్ ప్లాన్‌లో నిధులు కేటాయించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఐక్యవేధిక నాయకులు వివేక్ నాయక్ మాట్లాడుతూ అక్షర జ్ఞానం ద్వారానే యానాదలు అభివృద్ధి చెందుతారని, దళితులతో మమేకమై తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎకుల వెంకటేశ్వర్లు, ఎ ఆర్‌డి భషీర్, యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు కర్నూలు రోడ్డు ఫ్లై ఓబర్ బ్రిడ్జి నుండి ఆర్‌టిసి బస్టాండ్ నుండి అంబేద్కర్ భవనం వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో నీలం నాగేంద్రరావు, మాచవరపు జూలియన్, చప్పిడి వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.

వ్యాట్‌కు నిరసనగా వస్త్ర వ్యాపారుల బంద్
చీరాల, డిసెంబర్ 27: వస్త్ర వ్యాపారులు వ్యాట్ ట్యాక్స్ నిరసనగా గురువారం ఉదయం రెండు గంటలపాటు బంద్‌ను పాటించారు. ప్రభుత్వం చర్చల ఫలితంగా విధించిన ట్యాక్స్‌ను వసూలు చేయకుండా తమను వస్త్ర బేళ్ళను నిలుపుదల చేసి పలు ఇబ్బందులకు గురి చేస్తుందంటూ నిరసనగా పట్టణంలోని పలు వస్త్ర వ్యాపార సంస్థలను మూసివేశారు. అనంతరం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను కలసి తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నేడు బంద్
చీరాల, డిసెంబర్ 27: రాష్ట్ర సమైక్యంగా ఉంచాలని, ముక్కలు చేయరాదని, కొంతమంది రాజకీయ నాయకులు తమ లబ్ధికోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, దీనికి నిరసనగా చీరాల నియోజకవర్గ జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టనున్న బంద్‌కు సహకరించాలని జెఎసి కన్వీనర్ గుంటూరు మాధవరావు ఒక ప్రకటనలో కోరారు. నియోజకవర్గంలోని స్కూల్స్, కాలేజిలు బంద్‌కు సహకరించి స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలపాలన్నారు.
అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి
చీరాల, డిసెంబర్ 27: ఢిల్లీలో ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన పారామెడికల్ విద్యార్ధినిపై జరిపిన సామూహిక అత్యాచారంలోని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ స్ధానిక యార్లగడ్డ అన్నపూర్ణాంబ కళాశాల విద్యార్ధినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలువురు నాయకులు మాట్లాడుతూ నిందితులపట్ల ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందని, నిందితులపై శిక్షలను కఠినంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులు ఆ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరి అగ్నిమాపక కేంద్రం, మునిసిపల్ కార్యాలయం వరకు చ్చి అక్కడ మానవహారం నిర్మించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఏసురాజు, రవి, శ్యామ్, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.

కార్యదర్శుల నిర్వాకం వల్లే బోగస్ ఓటర్ల చేరిక
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 27: సహకార సంఘాల ఎన్నికల ఓటర్ల చేర్పుల్లో కార్యదర్శుల నిర్వాకం వల్ల బోగస్ ఓటర్లు విపరీతంగా చేరారని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బోగస్ ఓటర్లను గుర్తించి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి లక్ష్మీనృసింహంను కలిసి బోగస్ ఓటర్లకు సంబంధించిన దరఖాస్తుల జిరాక్స్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా జెసితో బాలినేని మాట్లాడుతూ ఈ నెల 21తో జిల్లాలో సహకార సంఘాల ఓటర్ల చేర్పుల ప్రక్రియ పూర్తయినప్పటికీ పాత తేది వేసి ప్రస్తుతం కూడా ఓటర్ల చేర్పుల ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. జిల్లాలోని గుమ్మలంపాడు, కెవిపాలెం, ఓబన్నపాలెం సొసైటీలో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. కెవిపాలెం కార్యదర్శి పుల్లయ్య అక్రమాలకు పూర్తిస్థాయిలో తెరతీశారని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా తమవద్ద ఉన్నాయన్నారు. నాగులుప్పలపాడు మండలంలోని ఓబన్నపాలెం సొసైటీకి సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలిస్తే బోగస్ ఓటర్ల పరిస్థితి బయట పడుతుందని, వెంటనే ఆ జాబితాను తనకు ఇవ్వాలని కోరారు. ఈ ఒక్క జాబితాను పరిశీలిస్తే జిల్లాలోని సొసైటీలలో ఎన్ని అక్రమాలు జరిగాయో వెలుగులోకి వస్తాయన్నారు. కెవిపాలెం సొసైటీ కార్యదర్శి పుల్లయ్య అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ విషయాలపై జిల్లా సహకార అధికారి కొండయ్యను జెసి చాంబర్‌కు పిలిచి మాట్లాడారు. పుల్లయ్యకు సంబంధించిన ఫైల్ కలెక్టర్ వద్ద ఉందని, పరిశీలించిన అనంతరం తగు చర్యలు తీసుకుంటామని జెసికి చెప్పారు. జెసిని కలిసిన వారిలో వైకాపా నాయకులు పాలపర్తి డేవిడ్ రాజు, చుండూరి రవిబాబు, నరాల రమణారెడ్డి, కట్టా శివయ్య, కెవి రమణారెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* జయప్రదం చేయాలని జెఎసి వినతి
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>