Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మెడికల్ విద్యార్థిని మృతిపై పెల్లుబికిన నిరసన

$
0
0

ఒంగోలు, డిసెంబర్ 29: ఢిల్లీలో గ్యాంగ్ రేప్‌కు గురై తీవ్ర అస్వస్థతకు లోనై సింగపూర్ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సఘటనను నిరసిస్తూ పిడి ఎస్‌యు, పి ఓడబ్ల్యు సంఘాల ఆధ్వర్యంలో శనివారంనాడు ఒంగోలులోని చర్చి సెంటర్లో కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ రమాసుందరి, పి ఓ డబ్ల్యు కార్యదర్శి పద్మలు మాట్లాడుతూ మహిళలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడి ఎస్‌యు జిల్లా అధ్యక్షులు కె మల్లికార్జున్, కార్యదర్శి ఎల్ రాజశేఖర్, నాయకులు బంగారు, బాలు, వరుణ్, రవి, బ్రహ్మం, రామకృష్ణ, పి ఓడబ్ల్యు నాయకులు మస్తానమ్మ, కె ఝాన్సీ, ఐ ఎఫ్‌టియు నాయకులు కె వెంకట్రావు, విజయ శేఖర్ తాదితర విద్యార్థిర్థినిలు వౌనంపాటించి వైద్య విద్యార్థిని మృతికి సంతాపాన్ని తెలిపారు.
‘మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు’
మహిళలకు రక్షణ కల్పించాలేని ప్రభుత్వాలు గద్దె దిగిపోవాలని ఐద్వా, ఎస్ ఎఫ్ ఐ, డివై ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేశారు. అత్యంత రక్షణ వలయంలో ఉండే దేశ రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్‌ను ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం ఒంగోలులో వారు వౌన ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం వారు హెచ్‌సియం కాలేజీ సెంటర్లోని అంబేద్కర్ బొమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థిని మృతికి వారు సంతాపాన్ని, నివాళులను అర్పించారు. అనంతర వారు కోర్టు సెంటర్ వరకు కూడా వౌన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్షురాలు కె రమాదేవి, డైఫీ నగర కార్యదర్శి కె ఎఫ్‌బాబు, ఎస్ ఎఫ్ ఐ నగర అధ్యక్షులు రాంబాబు, ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, డైఫీ నగర అధ్యక్షులు ఉబ్బా శ్రీను, జిల్లా అధ్యక్షులు జి బాలకృష్ణ తదితరులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి
ఢిల్లీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగడంతో వైద్య విద్యార్థిని మృతి చెందిందని, ఈ నేపధ్యంలో యావత్ భారతజాతి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని భారత్ స్వాభిమాన్ జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రమణ్యం, ఫ్రెండ్స్ క్లబ్ నిర్వాహకులు తాతా బద్రీనాథ్ అన్నారు. శనివారంనాడు భారత స్వాభిమాన్ ట్రస్టు, ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థిని మృతికి సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో మాంటిస్సోరి, ఉమామహేశ్వరి, శ్రీహర్షిణి విద్యార్థులు పాల్గొని మానవహారాన్ని నిర్వహించి విద్యార్థినికి సంఘీభావాన్ని తెలిపారు.ఎఎంసి చైర్మన్ ఘనశ్యాం, భారత్ స్వాభిమాన్ నుండి గోపాల్‌రెడ్డి, ఏడుకొండలు, కిషోర్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు పాల్గొన్నారు.
రేపిస్టులను ఉరితీయాలి
ముండ్లమూరు: ఢిల్లీలోని వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆమె మృతికి కారకులైన వారిని ఉరి తీయాలని పాఠశాల విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ వైద్య విద్యార్థిని సింగపూర్‌లోని వౌంట్ ఎలిజిబెత్ వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆమె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థులు, కెజిబి ఎస్ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించి ఆమె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘురామయ్య, రవణయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వీడియో పైరసీని అరికట్టేందుకు చర్యలు: జెసి
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 29: వీడియో పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి లక్ష్మీనృసింహం తెలిపారు. శనివారం స్థానిక సిపి ఓ సమావేశ మందిరంలో జరిగిన వీడియో పైరసీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త సినిమా విడుదలైన ఒకటి, రెండు రోజుల్లో ఆ సినిమా సిడిల రూపంలో మార్కెట్‌లోకి వస్తున్నాయరన్నారు. ఫిలిం ఛాంబర్ నిబంధనల మేరకు సినిమా విడుదలైన ఆరు మాసాల వరకు సినిమా సిడిల రూపంలో బయటకు రాకూడదన్నారు. ఎస్పీ కార్యాలయంలో జరిగే పోలీస్ క్రైం క్లాసుల సమయంలో సినిమా థియేటర్ల యాజమాన్యం పాల్గొని వీడియో పైరసీని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో వీడియో పైరసి కమిటి సభ్యులు జి వీరనారాయణబాబుతోపాటు పోలీసులు, సినిమా థియేటర్ల యాజమాన్యం పాల్గొన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలంటూ ఎమ్మెల్సీ ఇల్లు ముట్టడి
ఒంగోలు, డిసెంబర్ 29: సమైక్యాంధ్రాకు మద్దతు తెలపాలని కోరుతూ ఒంగోలులో ఎమ్మెల్సీ శిద్ధా రాఘవరావు ఇంటిని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు శనివారం ముట్టడించారు. విద్యార్థి జె ఎసి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర విద్యార్థి జె ఎసి రాష్ట్ర కోకన్వీనర్ రాయపాటి జగధీష్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్ళి సిద్ధా ఇంటిని ముట్టడించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీ, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. విద్యార్థి జె ఎసి నాయకుడు రాయపాటి జగధీష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధులకు భయపడి కేంద్రానికి లేఖ రాయడం వల్ల సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. విద్యార్థి జె ఎసి నాయకులు సిహెచ్ అశోక్, శివ, మహేష్, మణికంఠ, వరప్రసాద్, వివిధ డిగ్రీకళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం
మార్కాపురం, డిసెంబర్ 29: పట్టణంలోని విజయాటాకీస్ సమీపంలో ఒక యువకుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం విజయాటాకీస్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆరేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన మాబు అనే యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించగా, ఆప్రాంతంలోని ప్రజలు గమనించటంతో యువకుడు పరారయ్యాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్‌ఐ రాజమోహన్‌రావు తెలిపారు. నిందితుని కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు.
ఒంగోలుకు జనరల్ నర్సింగ్ కళాశాల మంజూరు
ఒంగోలు, డిసెంబర్ 29: ప్రభుత్వం ఒంగోలుకు జనరల్ నర్సింగ్ కళాశాలను మంజూరు చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి అంజయ్య తెలిపారు. శనివారం రిమ్స్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో డాక్టర్ అంజయ్య మాట్లాడుతూ రిమ్స్ కళాశాల పర్యవేక్షణలో ఈ నర్సింగ్ కళాశాలను నడుపుతామన్నారు.
గుండెపోటుతో బాలింత మృతి
ఒంగోలు, డిసెంబర్ 29: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నడిచే ఒంగోలులోని కుటుంబ నియంత్రణ కేంద్రంలో ఆపరేషన్ చేయించుకున్న నాగులుప్పలపాడుకు చెందిన రేపూరి ధనలక్ష్మి (30) అనే మహిళ శనివారం గుండె పోటుతో మృతి చెందింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్‌బాబు అందించిన వివరాల ప్రకారం నాగులుప్పలపాడు గ్రామానికి చెందిన రేపూరి ధనలక్ష్మి 17 రోజుల ఇంటి వద్ద ప్రసవించిందన్నారు. పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఒంగోలులోని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొనేందుకు ఒంగోలులోని కుటుంబ నియంత్రణ కేంద్రానికి శనివారం వచ్చిందన్నారు. ఆమేరకు ఆమెకు కుటుంబ నియంత్రణ కేంద్రం డాక్టర్ వెంకయ్య ఆపరేషన్ చేశారన్నారు. ఈ లోగా ఆమెకు హఠాత్తుగా గుండె నొప్పి రావడం, శ్వాస పీల్చడం కష్టంగా ఉండటంతో గమనించిన డాక్టర్ వెంటనే ఒంగోలులోని అమృత హార్ట్ హాస్పటల్‌కు తరలించారన్నారు. అయితే అమృత హాస్పటల్ డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి ధనలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారన్నారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. ఈ నేపథ్యంలో ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉసురుపాటి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో డిఎంఅండ్‌హెచ్‌ఓతో నష్ట పరిహారం అందించే విషయంపై చర్చించారు.
వెల్లివిరిసిన తెలుగుదనం
సంతనూతలపాడు, డిసెంబర్ 29: మండలంలోని సమతానగర్ ఉషోదయ కాన్సుప్ట్ స్కూల్ విద్యార్థులు గత మూడు రోజులుగా తిరుపతిలో జరుగుతున్న తెలుగు మహాసభల ముగింపును పురష్కరించుకొని స్కూల్ డైరెక్టర్ రమణ కూమారి ఆధ్వర్యంలో అమ్మలాంటి తెలుగుధనం, నిండు తనాన్ని పిల్లల్లో చూపే ప్రయత్నంలో స్కూల్ విద్యార్థులకు తెలుగు సాంప్రదాయ రీతిలో వస్త్ర ధారణ చేయించారు. విద్యార్థినులు అచ్చం గ్రామీణ ప్రాంత ఆడపడుచుల ఓణి, లంగాలు ధరించి ఆకట్టుకున్నారు.

పటిష్టంగా ‘ఇందిరమ్మ అమృత హస్తం’ అమలు
మార్కాపురంరూరల్, డిసెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి జనవరి 1 నుంచి ఎంపిక చేసిన ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాల్లో అమలు చేస్తున్న ఇందిరమ్మ అమృతహస్తాన్ని ఐసిడిఎస్ అధికారులు, ఐకెపి సిబ్బంది సమన్వయంతో పటిష్టంగా అమలు చేయాలని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ కోరారు. శనివారం సాయంత్రం స్థానిక డ్వాక్రా బజారులో 12మండలాల ఐకెపి అధికారులు, ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపర్‌వైజర్లు, మహిళ సమైఖ్య సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జనవరి 1 నుంచి మార్కాపురం, బేస్తవారపేట, కనిగిరి ప్రాజెక్టుల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో నమోదైన గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజూ ఒక గుడ్డు, 200మిల్లీలీటర్ల పాలు, కూరగాయలు అందిస్తామని, ఎక్కడ అవినీతికి తావులేకుండా పొరపాట్లు జరగకుండా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన వనరులను ఆయాకేంద్రాల సిడిపిఓలు, సూపర్‌వైజర్లు, ఐకెపి ఏరియా కోఆర్డినేటర్లు, ఎపిఎంలు సమకూర్చుకోవాలని తెలిపారు. డిఆర్‌డిఎ ఎపిడి రామచంద్రరావు, జిల్లా డైరీ ఎపిఎం రామారావు, సిడిపిఓలు రమిజభాను, వెంకటలక్ష్మి, లక్ష్మీదేవి, పలువురు సూపర్‌వైజర్లు, మార్కాపురం, బేస్తవారపేట, యర్రగొండపాలెం, కనిగిరి ఏరియా కోఆర్డినేటర్లు ఎ లక్ష్మణచారి, రాంబాబు, అంబేద్కర్, అఫ్జల్‌ఖాన్ పాల్గొన్నారు.
రైతులకు ‘కంప్యూటరీకరణ’ ఇబ్బందులు
మార్కాపురం, డిసెంబర్ 29: భూ రికార్డుల కంప్యూటరీకరణ పేరుతో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక నెంబర్‌లో 10సెంట్ల భూమి రిజిష్టర్ కాకుండా పాసుపుస్తకంలో నమోదు లేకపోయినా కంప్యూటర్ స్వీకరించడం లేదని అధికారులు చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మండలాల్లో గ్రామరెవెన్యూ అధికారులు భూ వివరాలను కంప్యూటరీకరణ చేయడంలో జాప్యం జరగడం, చేసిన తహశీల్దార్ కౌంటర్ సంతకం చేయడంలో జాప్యం అన్నీ కలసి ఆ రైతుకు సంబంధించిన భూ వివరాలు రాకుండా పోయాయి. దీంతో కంప్యూటరీకరణ జరగని భూములకు వ్యవసాయ రుణాలు ఇచ్చేది లేదంటూ బ్యాంకు అధికారులు మొరాయించడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టు కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక గ్రామాల్లో నేటికీ 30శాతం నుంచి 40శాతం మించి భూముల వివరాలను కంప్యూటరీకరణ చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే గ్రామస్థాయిలో రైతుల భూములను కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన గ్రామరెవెన్యూ అధికారుల కొరత కూడా తీవ్రతరంగా ఉంది. అనేక గ్రామాల్లో పూర్తిస్థాయి రెవెన్యూ అధికారులు లేక ఒక్కొక్క విఆర్‌ఓ మూడు నుంచి నాలుగు గ్రామాల వరకు అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అటు విఆర్‌ఓలను కేటాయించకుండా, ఇటు రైతులకు అవసరమైన కంప్యూటర్ రికార్డులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండటంతో కరువు పరిస్థితుల్లో వ్యవసాయ రుణాలు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి కంప్యూటరీకరణ జరిగేవరకు రైతులకు అవసరమైన 10-1 అడంగల్‌ను లిఖితపూర్వకంగిక్లడ ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టాలని, అలాగే బ్యాంకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.
వైఎస్‌ఆర్ సిపిలోకి
గొట్టిపాటి?
అద్దంకి, డిసెంబర్ 29: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్ నుండి వైఎస్‌ఆర్ సిపిలో చేరేందుకు సన్నాహాలు ప్రారంభమైనట్లు భోగట్టా. 2004లో మార్టూరు నుండి, 2009లో అద్దంకి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన గొట్టిపాటికి ఈరెండు ప్రాంతాల్లోనూ మంచి పట్టుంది. ఈనేపథ్యంలో ఈసారి అద్దంకి నుండి వైఎస్‌ఆర్ సిపి తరఫున పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. వైఎస్‌ఆర్ సిపి అధిష్ఠానంతో సమాలోచనలు పూర్తయ్యాయని, ఇక పార్టీలో చేరడమే తరువాయని ఆయన సన్నిహత వర్గాల సమాచారం.
వైఎస్‌ఆర్ సిపిలో గొట్టిపాటి చేరితే ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న శ్రేణులంతా ఆయన వెంట వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు.
వైఎస్ విజయలక్ష్మి సమక్షంలో జిల్లాలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు గొట్టిపాటి కూడా జనవరి నెలలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
అద్దంకిపై ఆశపెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే గరటయ్య
అద్దంకి నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాచిన చెంచుగరటయ్య అద్దంకి నియోజకవర్గం నుండి వైఎస్‌ఆర్‌సిపి తరపున పోటీ చేసేవిధంగా అధిష్ఠానంతో ఒప్పందం కుదుర్చుకొని ముందుగానే పార్టీలో చేరి ఇప్పటికే పార్టీ తరఫున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి కూడా పార్టీలో చేరితే అద్దంకి నుండి పోటీ చేసేందుకు టికెట్ ఎవరికిస్తారనేది ప్రశ్న. టిడిపి నుండి కాంగ్రెస్ ఆ తరువాత వైఎస్‌ర్ సిపిలో చేరిన గరటయ్య కూడా గతంలో మంచి పట్టున్న నాయకుడే. ఏదిఏమైనా గొట్టిపాటి అద్దంకి టికెట్ ఆశిస్తూ వైఎస్‌ఆర్ సిపిలో చేరితే గరటయ్య వర్సెస్ గొట్టిపాటి మధ్య రాజకీయం రసకందాయకమే అవుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు.

రాష్ట్రంలో 36 వేల గ్రామ సమైక్య కమిటీల ఏర్పాటు
* ప్రాజెక్టు మేనేజర్ అరుణ వెల్లడి
మార్కాపురం రూరల్, డిసెంబర్ 29: రాష్ట్రంలో ఇప్పటివరకు 36వేల గ్రామసమైఖ్య కమిటీలను ఏర్పాటు చేశామని, ఇందులో కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు మేనేజర్ ఆర్ అరుణ తెలిపారు. శనివారం మార్కాపురంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ ప్రాజెక్టు ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత ఇవ్వడంతోపాటు వారి కుటుంబ, సామాజిక సమస్యలపై కూడా దృష్టి పెట్టి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. మహిళ సమస్యలపై పలుజిల్లాల్లో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు రాష్టవ్య్రాప్తంగా 45వేల ఫిర్యాదులు తమ దృష్టికి రాగా 35వేల ఫిర్యాదులను పరిష్కరించి, బాధిత మహిళలకు సుమారు 45కోట్ల రూపాయలను సంబంధిత వ్యక్తుల నుంచి పరిహారంగా ఇప్పించామని వెల్లడించారు. బాల్య వివాహాలు, బాలకార్మికులు, లైంగిక వేధింపులపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, వీలైనంతవరకు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలోనే ఈ సమస్యలు గుర్తించేందుకు గ్రామసమైఖ్య కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌రేప్‌ను దృష్టిలో పెట్టుకొని చట్టాల్లో ప్రభుత్వం సమూలమైన మార్పులను తీసుకురావాల్సి ఉందని, పోలీసు వ్యవస్థలో కూడా మార్పులు చేయాలని ఆమె సూచించారు. మహిళా సంఘాల పరిధిలో ఔట్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు అరుణ తెలిపారు.

‘అధికార భాషా సంఘానికి
సంపూర్ణ అధికారాలు ఇవ్వాలి’
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 29: అధికార భాషా సంఘానికి సంపూర్ణ అధికారాలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వేంకట శ్రీనివాసులు కోరారు. తిరుపతిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సందర్భంగా శనివారం జరిగిన మూడవ వేదికలో రచయితల సంఘాలు చేస్తున్న సేవ అనే అంశంపై ఆయన మాట్లాడారు. భాష అంతరిస్తే జాతి అంతరించిపోతుందని తెలుగు భాషను బ్రతికించుకోవాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో సాహితీ మందిరాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలుగుభాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. తెలుగు అకాడమీ సంచాలకులు యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ద ప్రసాద్, హోసూరు శాసన సభ్యులు గోపినాథ్, మాజీ ఉప కులపతి కొలకలూరి ఇనాక్, పలు సాహితీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నూరు వేంకట శ్రీనివాసులను శాలువ, మహాసభల పతకంతో ఘనంగా సత్కరించారు.

ఢిల్లీలో గ్యాంగ్ రేప్‌కు
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>