Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అత్యాచారాల నివారణలో ప్రభుత్వం విఫలం విపక్ష ఎమ్మెల్యేల ధ్వజం

$
0
0

ఇందుకూరుపేట, డిసెంబర్ 29: అత్యాచారాల నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు ధ్వజమెత్తారు. అట్రాసిటీ కేసుల తీరుతెన్నులపై నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని గోల్డెన్ జూబ్లీ హాలులో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించటంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువైనప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాలకార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ రూపుమాపటంలో అధికారుల చర్యలు శూన్యమన్నారు. కలెక్టర్, ఎస్పీ వెంటనే దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. అల్లూరు మండలంలోని తూర్పుగోగులపల్లిలో 1800 ఎకరాల ప్రభుత్వ భూమి అధికార పార్టీ నేతల హస్తాల్లో ఉందని, దాన్ని స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ కలువాయి మండలంలో ముగ్గురు గిరిజనులకు చెందిన ఐదెకరాల భూమిని అదే ప్రాంతానికి చెందిన ఒకరు ఆక్రమించుకోవటంతో, వారు అనే కష్టాలు పడుతున్నారని, గిరిజనుల భూమిని వారికి ఇప్పించాలని కోరారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసారత్నం మాట్లాడుతూ మూడు నెలలకు ఒకసారి జరిగే ఈసమీక్షా సమావేశాలను అధికారులు నామమాత్రంగా జరుపుతుండటం బాధాకరమన్నారు. డిఆర్‌డిఎ భవనం పక్కనే ఉన్న నక్కలవాళ్లకు దారి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ స్పందించి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో 178 ఎస్సీ అట్రాసిటీ కేసులు ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరలో పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. కలెక్టర్ బి శ్రీ్ధర్, ఎస్పీ బివి రమణకుమార్‌లు మనసున్న మనుషులని, వారి పనులకు ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు రావటం బాధాకరమన్నారు. ఈకార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిడి విశ్వమోహన్‌రెడ్డి, జెసి లక్ష్మీకాంతం, డిఆర్‌ఓ రామిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి సోమయ్య, డిటిడబ్ల్యుఓ నారాయణుడు, డిఎస్పీలు, సిఐ, ఎస్‌లు, సోషల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చంద్రయాన్ ప్రయోగం
సంతృప్తి నిచ్చింది
షార్ డైరక్టర్ దత్తన్ స్పష్టం
సూళ్లూరుపేట, డిసెంబర్ 29: తాను డైరక్టర్‌గా ఉన్న సమయంలో 13 ప్రయోగాలు జరిగాయని, ఇందులో చంద్రయాన్ ప్రయోగం తనకెంతో సంతృప్తి నిచ్చిందని షార్ డైరక్టర్ ఎం చంద్రదత్తన్ అన్నారు. ఈ నెల 31న డైరక్టర్ పదవీ కాలం ముగియ నుండటంతో ఆయన కల్పన అతిథి గృహంలో శనివారం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను డైరక్టర్‌గా ఉన్న కాలంలో ఒకేసారి చంద్రయానం ద్వారా పది ఉపగ్రహాలను నింగిలోకి పంపి విజయం సాధించామని, ఇది భవిష్యత్‌లో మరువరాని ప్రయోగమన్నారు. డైరక్టర్‌గా ఇది తనకు బాగా సంతృప్తి నిచ్చిందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పిఎస్‌ఎల్‌వి -సి 20 ప్రయోగం షార్ నుండి ప్రయోగిస్తున్నట్టు, చెప్పారు. భవిష్యత్‌లో భారీ ప్రయోగాలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇదిలావుండగా ఈ నెల 31తో ఆయన పదవి కాలం ముగియనుంది. ఈయన మహేంద్రగిరిలోని ఎల్‌సిఎస్‌సి సెంటర్‌కు డైరక్టర్‌గా వెళ్లనున్నారు. జనవరి 1 నుండి షార్ డైరక్టర్‌గా ఎంవైఎస్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
సూళ్లూరుపేట అభివృద్ధికి షార్ నిధులు
సూళ్లూరుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి 10 కోట్ల షార్ నిధులతో ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నామని, ఈ నిధుల ద్వారా తాగునీరు, డ్రైనేజి వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్టు షార్ డైరెక్టర్ ఎం.చంద్రదత్తన్ అన్నారు. శనివారం కల్పన అతిథిగృహంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే దీనిపై అసోసియేట్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ అధ్యక్షతన కమిటీని నియమించామని, ఈ కమిటీ ద్వారా నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కలెక్టర్, సబ్ కలెక్టర్‌తో దీనిపై రెండు సమావేశాలు నిర్వహించామని, మరో సమావేశం నిర్వహించి వచ్చే ఏడాది నుండి కొత్త డైరెక్టర్ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట అభివృద్దికి కృషి చేస్తామన్నారు. దీనిపై ఎమ్మెల్యే పరసా రత్నం, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి షార్‌కు ప్రధాని వచ్చినపుడు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని వినతిపత్రం ఇవ్వడంతో ప్రధాని కూడా దీనికి స్పందించారన్నారు.
ఫిబ్రవరిలో పిఎస్‌ఎల్‌వి-సి20 ప్రయోగం
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పిఎస్‌ఎల్‌వి-సి20 ప్రయోగం షార్ నుండి ఉంటుందని, అదేవిధంగా భవిష్యత్‌లో భారీ ప్రయోగాలకు సన్నాహాలు చేస్తున్నామమని చంద్రదత్తన్ తెలిపారు. ఈనెల 31తో పదవీ కాలం ముగియనుండడంతో ఈయన మహేంద్రగిరిలోని ఎల్‌సిఎస్‌సి సెంటర్‌కు డైరక్టర్‌గా వెళ్లనున్నారు. జనవరి 1 నుండి షార్ డైరక్టర్‌గా ఎంవైఎస్ ప్రసాద్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌ఓ విజయసారధి, టివి శర్మ ఉన్నారు.

పట్టపగలు
మహిళ దారుణ హత్య
25 సవర్ల బంగారు నగలు చోరీ
పట్టణంలో కలకలం
కావలి, డిసెంబర్ 29: సినిమా థియేటర్ల నడుమ పట్టణంలోని పెద్దపవని రోడ్డు సెంటర్‌లో నిత్యం జనసంచారం వుండే ప్రాంతంలోని విజయ టవర్స్ వ్యాపార సముదాయ భవనంలో ఓవైపు నివాసం వున్న యజమాని భార్య సిద్దారెడ్డి విజయమ్మ(63) శనివారం పట్టపగలే దారుణ హత్యకు గురైంది. ఆమె ఒంటిపై గల సుమారు 25 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. సంఘటన స్థలంలో రక్తంతో వున్న చేతిరుమాలుతోపాటు అట్టపెట్టెలకు సీలువేసే స్టిక్కర్ టేపురోలు ముక్కలు పడి వున్నాయి. మరో వైపు ఎలక్ట్రికల్ హీటర్ వైర్ వుంది. కాగా, మృతదేహం పెదవుల వద్ద గాయం అయివుండగా మెడ భాగంలో కమిలినట్లు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మృతురాలి భర్త గోవిందరెడ్డి పనులపై తన కారులో వెలుపలికి వెళ్ళి తిరిగి 12.30గంటలకు ఇంటికి రాగా, వంటగదిలో విగతజీవిగా విజయమ్మ పడివుండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం తెలియడంతో 1వ పట్టణ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ వీరేంద్రబాబు సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియచేశారు. సిఐ ప్రసాద్, డిఎస్‌పి ఇందిర ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్ కోసం వాకబు చేశారు. వచ్చినవారు పరిశీలించి హత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించి మృతురాలు విజయమ్మ భర్త గోవిందరెడ్డితో పాటు కారు డ్రైవర్‌ని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాగా తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడి వుంటారని పోలీసులు చెబుతుండగా, సమగ్ర విచారణ తర్వాత వివరాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. కాగా, శనివారం రాత్రి ఎఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఘన స్వాగతం
సూళ్లూరుపేట, డిసెంబర్ 29: చెన్నై నుంచి తిరుపతిలో జరుగుతున్న తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు తమిళనాడు గవర్నర్ రోశయ్య శనివారం సూళ్లూరుపేటకు రావడంతో ఘన స్వాగతం లభించింది. ఆయన రోడ్డు మార్గాన స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాకు విచ్చేసి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. గవర్నర్‌ను టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేనాటి రామచంద్రారెడ్డి, చెంగాళమ్మ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి, కాళంగి ప్రభాకర్, అలవల సురేష్, మున్సిపల్ కమిషనర్ కనకారావు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. విశ్రాంతి అనంతరం రోశయ్య తిరుపతికి పయనమయ్యారు. ముందుగా ఆయనకు రాష్ట్ర సరిహద్దు పన్నంగాడు వద్ద సబ్ కలెక్టర్ నివాస్ ఘనంగా స్వాగతం పలికారు. గూడూరు డిఎస్పీ సురేష్‌కుమార్ ఆధర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
డిఇఓ వాకిట్లో అవినీతి చెట్టు
* ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వ జీవోలు
* ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపులో చేతివాటం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 29:‘నేను విద్యాశాఖకు మంత్రిగా పనిచేసిన సందర్భంలో రాష్ట్రంలో ఏ డిఇఓపై రానన్ని ఫిర్యాదులు ఈయనపై వచ్చేవి. సదరు అధికారే ఇప్పుడు నా సొంత జిల్లాలో వెలగబెడుతుండటం శోచనీయం.’అని అధికార కాంగ్రెస్‌పార్టీలో జాతీయస్థాయిలో పలుకుబడి కలిగి ఉండటమేగాక జిల్లాలో ముఖ్య రాజకీయ కుటుంబానికి చెందిన ఓ మహిళా నేత నోట స్వయానా జాలువారిన మాటలివి. నెల్లూరుజిల్లా విద్యాధికారితో ఉపాధ్యాయ సంఘాల తీరు నిత్య కలహం రచ్చ తోరణంలా మారుతోంది. సదరు అధికారి పుష్కరకాలం క్రితం ఇక్కడ ఎఫ్‌ఏసి హోదాలో పనిచేసిన సందర్భంలోనూ విమర్శలు వెల్లువెత్తుత్తాయి. ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు చెక్ పెట్టేవిధంగా ‘కౌనె్సలింగ్’ ప్రక్రియను అమలులోకి తీసుకురావడం అందరికీ తెలిసిందే. అయితే అనివార్యమై అత్యవసరంలో మాత్రమే అక్కరకు రావాల్సిన ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా బదిలీల వ్యవహారం తమ అక్రమార్జనకు నెలవుగా వినియోగించుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయ బదిలీల కౌనె్సలింగ్‌కు ముందుగా జీవోల ద్వారా తమకు ‘గిట్టుబాటు’ అయిన అయ్యోర్లను కోరిన చోటకు స్థానచలనం జరిగేలా చేశారు. తాజాగా నిర్వహించిన డిఎస్సీ-2012 ఉపాధ్యాయ నియామకాల్లోనూ ఇలాంటి జిమ్మిక్కే జరిగింది. గత ఆరు మాసాలుగా విధులకు హాజరుకాని ఉపాధ్యాయుల్ని ప్రభుత్వ జీవోలు తీసుకువచ్చేవరకు నిరీక్షించి, ఆ ప్రక్రియకు ఆద్యంతం తామే మార్గదర్శకత్వం వహించేలా వ్యవహరించడం విడ్డూరకరం. అలా వారు జీవోలు తీసుకొచ్చిన అనంతరమే మిగిలిన పోస్టులకు నూతన ఉపాధ్యాయ నియామక కౌనె్సలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఇందువలనే రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో డిఎస్సీ-2012 కౌనె్సలింగ్ ప్రక్రియ ముగిసి మూడు రోజులపైనే అయినా నెల్లూరులో మాత్రం శనివారం వరకు కొనసాగుతూనే కనిపించిందని చెప్పాలి. ఇదిలాఉంటే జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలకు గుర్తింపుఅంశాన్ని సైతం సర్వత్రా తప్పుపడుతున్నారు. జిల్లాలో గుర్తింపుపొందిన స్కూళ్లకు, పొందకనే నిర్వహించే వాటి సంఖ్య నడుమ వ్యత్యాసం చాలా జాస్తిగానే ఉంది. ఇంకా గుర్తింపుపొందకనే నిర్వహించే విద్యాసంస్థలపై విచారణ చేపట్టాలంటూ ఆయా మండలాల విద్యాధికార్లను ఆదేశించామంటూ శాఖకు చెందిన జిల్లా పెద్దాయన సరిపెట్టుకుంటున్నారు. ఆ విచారణ ఎప్పుడు పూర్తవుతుంది...గుర్తింపుపొందకుండా నిర్వహించే స్కూళ్లపై చర్యలు తీసుకునేదెన్నడనే విషయాలకు సమాధానం సందేహాస్పదమే. ఈవిధమైన దురాగతాలన్నింటిపైనా ఇద్దరు ఎంఎల్‌సిలు, ఉపాధ్యాయ సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నా స్పందించే నాథుడే కరవు.
వైద్య విద్యార్థిని మృతికి నిరసనగా హిజ్రాల ర్యాలీ
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 29: ఢిల్లీలో వైద్యవిద్యార్థిని మృతి కారకులను శిక్షించాలని కోరుతూ చైతన్య జ్యోతి వెల్‌ఫేర్ సంస్ధ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకు చెందిన పలువురు హిజ్రాలు విఆర్‌సి సెంటర్‌నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి విద్యార్థిని మృతికి సంతాపం తెలిపారు. ఈసందర్భంగా హిజ్రా నాయకురాలు అలేఖ్య మాట్లాడుతూ దేశంలో మహిళల రక్షణకు, భద్రతకు రాజ్యాంగం చట్టాలు చేసినా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళలు అభద్రతా భావంతో జీవిస్తున్నారని, మహిళల కోసం ఉన్న చట్టాలను కఠినంగా అమలుచేయాలని, అవసరమైతే సవరణచేసి నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టాలు రూపొందించాలని కోరారు. వెల్‌ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఐ శ్రీనివాస రావు మాట్లాడుతూ పరిపాలన, జుడిషియల్, పోలీస్ శాఖలు చట్టలను చిత్తశుద్ధితో కఠినంగా అమలు చేయాలని కోరారు. విఆర్‌సి నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి వినతిపత్రాలు అందచేశారు. ఈకార్యక్రమంలో చిరంజీవి, బాబు, చిట్టి, షీలా, మయూరి, మేఘన, కావ్య, ప్రకాశంతోపాటు పలువురు హిజ్రాలు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
కార్ల దొంగల అరెస్ట్
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 29: ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ కార్లను తస్కరించి అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు దొంగల్ని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు ఎస్పీ రమణకుమార్ స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా వి దుర్గాప్రసాద్ దొంగతనాల ముఠాకు నేతృత్వం వహిస్తుండేవారన్నారు. ఇతనితోపాటు నెల్లూరుజిల్లా మైపాడుకు చెందిన షేక్ షబ్బీర్, ముత్తుకూరుకు చెందిన పి హేమంత్‌కుమార్‌రెడ్డిలు కూడా నేరాల్లో పాలుపంచుకునే వారన్నారు. షబ్బీర్ స్వతహాగా కారు మెకానిక్ కావడంతో ఆయా వాహనాలను ఎంతో చాకచక్యంగా తాళాలు ఛేదించి నిర్జన ప్రదేశానికి తరలించిన అనంతరం నెంబర్‌ప్లేట్లు మార్చడంలో సిద్ధహస్తులన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్‌తోపాటు పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా దొంగతనాలకు పాల్పడ్డట్టు వివరించారు. నిందితులతోపాటు మొత్తం 12 కార్లను స్వాధీనపరచుకున్నామన్నారు. ఈ కేసును చేధించడంలో నెల్లూరు నగర డిఎస్పీ వెంకటాద్రిరెడ్డి విస్తృతంగా కృషి చేసినట్లు ఎస్పీ రమణకుమార్ తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి
సూళ్లూరుపేట, డిసెంబర్ 29: ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన సూళ్లూరుపేట పట్టణంలోని బ్రహ్మంగారి మఠం వద్ద శనివారం జరిగింది. మున్సిపాలిటీ ట్రాక్టర్ శనివారం స్థానిక బ్రహ్మంగారి మఠం జియన్‌టి రోడ్డుపై చెత్త తొలగిస్తుండగా వెనుకవైపు నుంచి మోటారుసైకిల్ ఢీకొంది. దీంతో మోటార్‌సైకిల్ నడుపుతున్న గోవింద్ (35) అక్కడికక్కడే మృతిచెందాడు.

అత్యాచారాల
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>