Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నిబంధనలు అతిక్రమించిన కఠిన చర్యలు

$
0
0

కర్నూలు, డిసెంబర్ 30: 2012 సంవత్సరం డిసెంబర్ రాత్రి పూర్తి అవుతున్న సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై అసభ్యకరంగా వ్యవహరించిన మందుబాబులు, యువతపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు డిఎస్పీ లతామాధురి హెచ్చరించారు. ఆదివారం 2వ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ లతామాధురి మాట్లాడుతూ డిసెంబర్ రాత్రి యువత బైక్‌లపై ముగ్గురు వెళ్లడం, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండ ఉండేందుకు వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు. 2013 సంవత్సరాంతం ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని ఆమె కోరారు. మద్యం సేవించి రోడ్లపైకి రాకుండ కుటుంబ సభ్యులతో గడపాలన్నారు. నగరంలోని ప్రధాన సెంటర్లు రాజవీహర్, కొత్తబస్టాండ్, పెద్దాసుపత్రి కూడలిలో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశామని డిఎస్పీ చెప్పారు. మద్యం సేవించిన ఆకతాయిలు ప్రజలు, మహిళలకు ఇబ్బంది కలిగిస్తే 100 ఫోన్ చేసిన వెంటనే వాలిపోతారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఘర్ఘణలకు తావులేకుండ డిసెంబర్ రాత్రి ప్రజలు, యువత గడపాలని డిఎస్పీ కోరారు. విలేఖర్ల సమావేశంలో 2వ పట్టణ సిఐ మురళీధర్, ట్రాఫిక్ సిఐ వినోద్‌కుమార్, 2వ పట్టణ సిఐ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
కాల గమనంలో మరో ఏడాది
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, డిసెంబర్ 30: కాల గమనంలో మరో ఏడాది గడిచిపోతోంది. ఏడాది జ్ఞాపకాలను నెమరువేసుకున్న ప్రజలకు పెద్దగా సంతోషపర్చే అంశాలు లేకపోగా మరో మారు రైతులు నష్టాల బారిన పడి వ్యవసాయ జూదంలో ఓడిపోయారు. రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. భవిష్యత్తులో విజయం కోసం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపి నాయకురాలు షర్మిల జిల్లాలో పాదయాత్ర నిర్వహించగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటుచేసి ప్రత్యేక రాయలసీమ కోసం చేసిన పాదయాత్రలు రాజకీయాల్లో చోటు చేసుకున్న సంఘటనలు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంత్రి పదవి కర్నూలు ఎంపి కోట్లను వెతుక్కుంటూ వచ్చి కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టింది. రైతు ఆత్మహత్యలు ఈ ఏడూ కొనసాగగా, గ్రామాధిపత్యం కోసం కాల్పులు జరిగిన సంఘటన ప్రజలను కలచి వేసింది. కొత్త సంవత్సరంలోనైనా మంచి జరుగుతుందన్న ఆశతో ప్రజలు పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నారు. ఈ ఏడాది వ్యవసాయ పరంగా చూసుకుంటే రైతులను నష్టాలకు గురిచేసిందనే చెప్పుకోవచ్చు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్ సీజన్‌లో వేసిన పంటలు దిగుబడులను ఇవ్వకపోగా రబీలో పంటలే వేయలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ కోతల కారణంగా బావులు, బోర్ల కింద కూడా పంటలను సాగు చేయలేకపోయిన రైతులు ఎక్కడో ఒక్క చోట ధైర్యంచేసి సాగుచేసినా నష్టాలను కొని తెచ్చింది. ప్రకృతి కోపం కారణంగా రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు కూడా ముందుకు రాకపోవడంతో పెద్ద సంఖ్యలో రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందకపోవడం ఇబ్బందులకు గురి చేసింది. అనధికార రికార్డుల ప్రకారం జిల్లాలో ఈ ఏడాది సుమారు 115 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలస్తోంది. వీరిలో 18 మంది కౌలు రైతులు కూడా ఉన్నారని అధికారుల నుంచి వస్తున్న అనధికార సమాచారం. సకాలంలో వర్షాలు కురవక పడమర ప్రాంతంలో రైతులు నష్టపోగా అకాల వర్షాలతో తూర్పు ప్రాంత రైతులు నష్టపోవడం గమనార్హం. శ్రీశైలం జలాశయంలో చేరిన అరకొర నీటిని సద్వినియోగం చేసుకొని పంటల సాగు చేపట్టిన రైతులకు అకాల వర్షం నష్టాన్ని మిగిల్చింది. ఎన్నో కష్టనష్టాలకోర్చి పంటలను పండించిన రైతులను గిట్టుబాటు ధర వెక్కిరించింది. పత్తి, వరి వంటి పైర్లను భారీ ఎత్తున సాగు చేసిన రైతులు సరైన ధర లభించక పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి చేతికి రాని దుస్థితి నెలకొంది. గిట్టుబాటు ధర కల్పనపై ప్రభుత్వం హామీలు ఇస్తున్నా అవి అమలు కాకపోవడం రైతులను కుంగదీస్తోంది. ఇక ఏళ్ల తరబడి పనులు జరుగుతున్న హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావడంతో ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేశారు. పథకం సక్రమంగా పని చేస్తే పడమర ప్రాంతంలో కొంత పొలమైనా
సాగునీటితో కళకళలాడే అవకాశం ఉంది. రాజకీయంగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు జిల్లాలోనూ కొనసాగాయి. పార్టీల మార్పులు చేర్పులు పెద్దగా లేకపోయినా లోపాయికారిగా నేతలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలను కాకుండా తమకు నచ్చిన పార్టీలకు సహాయపడుతూ ముందు చూపు ప్రదర్శిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ ఏడాది జిల్లాలో రాజకీయంగా పెద్దగా మార్పులు లేకపోయినా బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి తెరదీయడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ఆయన ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం పాదయాత్ర చేశారు. ఇక తెలుగుదేశం, వైఎస్సార్సీపిల బలోపేతానికి ఆయా పార్టీల నాయకులు జిల్లాలో పాదయాత్రలు చేసి రానున్న ఎన్నికల్లో విజయానికి తమ వంతు కృషి చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సుమారు 11 రోజులు, వైఎస్సార్సీపి నాయకురాలు షర్మిల సుమారు 13 రోజులు జిల్లాలో పాదయాత్ర చేసి తమ పార్టీల కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి తన వంతుగా పలు దఫాలు జిల్లాలో పర్యటించారు. ప్రధానంగా ఇందిరమ్మ బాట పేరుతో మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. ప్రజల్లోకి వెళ్లి మాట్లాడటం, సంక్షేమ వసతి గృహంలో రాత్రి బస చేయడంతో పాటు చివరి రోజున పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉండగా కేంద్రంలో కొత్తగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి అవకాశం లభించింది. ప్రధానమైన రైల్వే శాఖ సహాయ మంత్రిగా అవకాశం రావడంతో జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఆయన దృష్టి సారించారు. వామపక్ష పార్టీలు ఎప్పటి లాగే ప్రజల పక్షాన పోరుబాటలోనే పయనిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వారు నిప్పులు చెరుగుతున్నారు. పెరిగిన ధరలు, వంట గ్యాస్ సబ్సిడీ సిలిండర్ల పంపిణీ కుదించడం వంటి సమస్యలపై వారు పోరాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న ఎఫ్‌డిఐ, నగదు బదిలీ పథకాలకు వ్యతిరేకంగా వారు ఉద్యమ బాట పట్టారు.
పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్న సామాన్యులకు ఈ ఏడాది చేదు అనుభవాలనే మిగిల్చింది. రైతులు నష్టాల బాటన కొనసాగుతుండగా పెరిగిన ధరలు అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు, నిత్యావసర వస్తు ధరలు, ఆర్టీసీ చార్జీల పెరుగుదలపై ప్రజలు మండిపడుతూ ఆ మేరకు ఆదాయం పెరగకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి దాపురించింది. గత ఏడాది కాలంగా కొనసాగుతున్న ధరల పెరుగుదల కారణంగా సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాయకులు చేసిన పాదయాత్రలు సామాన్యుడికి ఊరటనివ్వకపోవడం విశేషం. పాత సంవత్సరంలో చేదు జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ కొత్త ఏడాదిలోనైనా మంచి జరుగుతుందన్న ఆశతో సగటు జీవి పాతకు వీడ్కోలు కొత్తకు స్వాగతం పలుకుతున్నాడు.

పకడ్బందీగా సహకార ఎన్నికలు
ఆదోని, డిసెంబర్ 30: ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఉన్న సహకార సంఘాల ఎన్నికల నిర్వాహణకోసం ప్రత్యేక ఎన్నికల అధికారులను నియమించినట్లు సహకార శాఖ డివిజనల్ అధికారి ఆంజనేయులు, ఎన్నికల అధికారి రమేష్‌లు తెలిపారు. డివిజన్‌లోని గోనెగండ్ల సహకార సంఘానికి గోనెగండ్ల ఎంపిడిఓ శివశంకర్‌ను ఎన్నికల అధికారిగా నియమించినట్లు వారు తెలిపారు. కౌతాళం సహకార సంఘానికి నందవరం ఇఓఆర్‌డి జయరాం, మద్దికెర సహకార సంఘానికి ఎంఏఓ కిరణ్‌కుమార్, బురుజుల సహకార సంఘానికి ఇఓఆర్‌డి రాంబాబు, దేవనకొండ సహకార సంఘానికి ఇఓఆర్‌డి రామకృష్ణరావును, పత్తికొండ సహకార సంఘానికి ఎంఏఓ బాలవర్ధిరాజు, ఉప్పర్లపల్లె సహకార సంఘానికి పత్తికొండ డిప్యూటీ తహశీల్దార్ నాగభూషణం, మారెళ్ల ఆశోక్ సహాకార సంఘానికి తుగ్గలి డిప్యూటీ తహశీల్దార్ గోపాల్‌రావు, ఆస్పరి సహకార సంఘానికి డిప్యూటీ తహశీల్దార్ శేక్షావలి, ఆలూరు సహకార సంఘానికి తహశీల్దార్ అన్వర్ హుసేన్, బెల్డోన సహకర సంఘానికి చిప్పగిరి డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకర్, చింతకుంట సహకార సంఘానికి హాలహర్వి ఎంపిడిఓ నాగేశ్వరరావు, హొళగుంద సహకార సంఘానికి తహశీల్దార్ నియాజ్ అహ్మద్, రామదుర్గం సహకార సంఘానికి ఆలూరు ఎంపిడిఓ చంద్రశేఖరయ్యను, పెద్దహరివాణం సహకార సంఘానికి ఆదోని ఎంపిడిఓ సలీంబాష, మద్దికెర సహకార సంఘానికి ఆదోని తహశీల్దార్ బాలగణేష్, పెద్దతుంబళం సహకార సంఘానికి ఎమ్మిగనూరు అగ్రికల్చర్ అధికారి శ్రీనివాస్ సురేష్, బదినేహాళ్ సహకార సంఘానికి కౌతాళం డిప్యూటీ తహశీల్దార్ రమణమూర్తిని, ఆర్లబండ సహకార సంఘానికి కోసిగి ఎంఏఓ రామాంజనేయులు, చిన్నతుంబళం సహకార సంఘానికి ఎమ్మిగనూరు డిప్యూటీ తహశీల్దార్ లక్ష్మన్నదాస్, పెద్దకడుబూరు సహకార సంఘానికి తహశీల్దార్ ఈరన్న, ఎమ్మిగనూరు సహకార సంఘానికి అగ్రికల్చర్ అధికారి సుధాకర్, నందవరం సహకార సంఘానికి ఎంఏఓ రాజేష్‌ను, కల్లుదేవకుంట సహకార సంఘానికి మంత్రాలయం ఎంఏఓ వెంకటేశ్వర్లు, కడిమెట్ల సహకార సంఘానికి ఎమ్మిగనూరు ఇఓఆర్‌డి అయ్యన్న, మంచాల సహకార సంఘానికి మంత్రాలయం ఎంపిడిఓ వన్నప్పరాజు ఎన్నికల అధికారులుగా నియమించినట్లు వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా తీసుకునే చర్యలపైన ఈనెల 5న ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి, ఎఎస్పీ శిమోషీ ఎన్నికల అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రాజేంద్రప్రసాద్ సేవలు మరువలేనివి
కర్నూలు (స్పోర్ట్స్), డిసెంబర్ 30: రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ విద్యలో వృత్తి విద్యాకోర్సులు చదివిన విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా అప్రెంటీస్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆర్‌ఐవో రాజేంద్రప్రసాద్‌కే దక్కుతుందని ఇంటర్మీడియేట్ బోర్డు మూడవ జోన్ జాయింట్ డైరెక్టర్ జంగమయ్య అన్నారు. రాజేంద్రప్రసాద్ సేవలను ఇంటర్మీడియేట్ బోర్డు మరిచిపోదని ఆయన అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో ఆర్‌ఐవో రాజేంద్రప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జెడి జంగమయ్య, కడప ఆర్‌జెడి గొపే నాయక్, ఇంటర్ బోర్డు డిప్యూడీ సెక్రటరీ శివప్రసాద్, ఆర్‌ఐవోలు రామకృష్ణ, ప్రసాద్‌రావు, డివిఇవోలు దివాకర్, ప్రసాద్, ఎపి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం నాయకులు రాజారావు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా జెడి జంగమయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. ఇంటర్మీడియేట్ బోర్డులో రాజేంద్రప్రసాద్ పని చేస్తున్నప్పుడు అందరికి మంచి సలహాలు ఇచ్చే వారన్నారు. ఆర్‌జెడి గొపె నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో పదవి విరమణ సర్వ సాధారణం అని, పదవి విరమణ తరువాత సమాజిక సేవతో పాటు అధ్యాత్మిక జీవితాన్ని గడపాలని అన్నారు. ఇంటర్మీడియేట్ బోర్డు డిప్యూటీ సెక్రటరి శివప్రసాద్ మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ క్రమశిక్షణకు మారుపేరని, విద్యార్థులను మంచి పౌరులుగా ఎదిగేందుకు కృషి చేసిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఆర్‌ఐవోలు రామకృష్ణ, ప్రసాద్‌రావు, డివిఇవోలు ప్రసాద్, దివాకర్‌లు మాట్లాడారు. అనంతరం ఆర్‌ఐవో రాజేంద్రప్రసాద్‌ను జ్ఞాపికతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు ఇంతియాజ్ అహ్మద్, చెన్నయ్య, లెక్చరర్లు, పిడిలు, పాల్గొన్నారు.
మల్లన్న సన్నిధిలో హైకోర్టు జడ్జి
శ్రీశైలం, డిసెంబర్ 30: జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల దేవస్థానంలో కొలువున్న శ్రీ భ్రమరాంభిక, మల్లికార్జున స్వామి వార్లను హైకోర్టు జడ్జి ఎన్‌వి రమణ కుటుంబ సమేతంగా ఆదివారం స్వామి అమ్మవార్లను దర్శించారు. విజిలెన్సు అదనపు డిజి సాంబశివరావు దంపతులు కూడా శ్రీశైల స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి దేవస్థాన అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారికి రుద్రభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకుని ఆశీర్వాద మండపం వద్ద తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలను స్వీకరించారు.

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
కర్నూలు (స్పోర్ట్స్), డిసెంబర్ 30: స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను కేంద్ర రైల్వే శాఖ సహా మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆదివారం నగరంలోని మంత్రి కోట్ల నివాసంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోట్ల మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన సంవత్సంలో మంచి ఫలితాలను సాధించాలని, విద్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మెన్ ఆకెపోగు వెంకటస్వామి, ఎస్టీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు నరసింహుడు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి యోగీశ్వరుడు, శ్రీనివాస యాదవ్, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఎయిడ్స్ రోగులకు దుస్తులు పంపిణీ
కర్నూలు ఓల్డ్‌సిటీ, డిసెంబర్ 30: మధర్‌థెరిసా సేవ సమితీ ఆధ్వర్యంలో నగరంలోని చిన్న పార్కులో ఎయిడ్స్ రోగులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ హజరై దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవ సమితీ నిర్వహకులు పవన్, భాష, అంజి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
సిమెంట్ దిమ్మెపడి తాపీమేస్ర్తి మృతి
శిరివెళ్ల, డిసెంబర్ 30: శిరివెళ్ల మండలం వనికినిదినె్నలో ఆదివారం సిమెంట్ దిమ్మె కూలి తాపీమేస్ర్తి మేకల చిన్నచెన్నయ్య (40) మృతిచెందాడు. గత కొన్ని రోజుల నుండి నూతన భవనం నిర్మాణంలో ఉందని సిమెంట్ బీం పోసి పొట్లను తొలగించే సమయంతో దానికిందపడి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతిచెందిన వ్యక్తికి అపద్భందు పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
బావిలోపడి కాంగ్రెస్ నాయకుడు మృతి
నందికొట్కూరు, డిసెంబర్ 30: పట్టణంలోని పగిడ్యాల రహదారిలోని జీవన్ జ్యోతి స్కూల్ సమీపంలో వున్న బావిలో కాంగ్రెస్ నాయకుడు ఫైజుల్లా అలియస్ (సన్న) (35) మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. సన్న స్నేహితులతో కలిసి శనివారం రాత్రి మద్యం సేవించడానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీనితో కుటుంబ సభ్యులు, బంధువులు గాలించగా పాఠశాల దగ్గరవున్న బావి దగ్గర చూడగా మృతదేహం బయటపడింది. సన్న ఆత్మహత్యకు పాల్పడ్డడా లేదా ప్రమాదవశాత్తు బావిలోపడి మృతి చెందాడా అనే విషయం ప్రశ్నార్థాకంగా మారింది. కుటుంబ సభ్యుల మేరకు ఎస్‌ఐ కృష్ణయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటో ఢీ వ్యక్తి మృతి
సి.బెళగల్, డిసెంబర్ 30: మండల పరిధిలోని పొలకల్ గ్రామానికి చెందిన యువకుడు జమ్మి నాయుడు (23) అనే యువకుడు ఆదివారం రాత్రి 7 గంటలకు ఆటో ఢీకొని మృతి చెందాడు. మృతునికి భార్య వుంది. సమాచారం తెలుసుకున్న తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కార్మికుడి ఆత్మహత్యాయత్నం
బేతంచెర్ల, డిసెంబర్ 30: మండల పరిధిలోని సిమెంట్‌నగర్‌లోని పాణ్యం సిమెంట్స్ పరిశ్రమ యాజమాన్యం చేయని తప్పలు మోపుతు కేసులు బనాయించి వేదిస్తోందని పరిశ్రమలోని కాంట్రాక్టు కార్మికుడు అదివారం పరిశ్రమ పైపులైన్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కార్మీకులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు గత నెల 21వ తేదీ పరిశ్రమలో ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృతిచెందిన విషయం విధితమే. ఈ ఘటనపై యాజమాన్యం స్పందించకపోవడంతో మృతుల బందువులు పరిశ్రమ ఎదుట నిరసనకు దిగిన సమయంలో సంఘటన స్థలంలో ఉన్న 29 మంది కాంట్రాక్టు కార్మికులపై యాజమాన్యం అక్రమకేసులు బనాయించి వేదిస్తూ కేసులో మొదటి నిందితునిగా నమోదు చేసిన కిరణ్‌కుమార్ అనే కాంట్రాక్టు కార్మికుడిని మూడు రోజుల క్రితమే పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. దీంతో భయాందోళనకు గురైన రెండవ నిందితుడు కుమార్ పరిశ్రమపై ఉన్న పైపులైన్‌పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన పరిశ్రమ సిబ్బంది కార్మికుడికి నచ్చజేప్పి ఎండి శ్రీధర్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్ళారు.
హెచ్‌పి గ్యాస్‌గోడౌన్‌లో చోరీకియత్నం
శిరివెళ్ల, డిసెంబర్ 30: శిరివెళ్లమెట్ట వద్ద ఏర్పాటు చేసిన హెచ్‌పిగ్యాస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం దోపిడియత్నం విఫలమయ్యింది. ఈ విషయంపై గోడౌన్ యజమాని ఎస్‌ఐ ఆశోక్‌కు ఫిర్యాదు చేయడంతో స్థలాన్ని పరిశీలించారు. గతంలో సుమారు 40 గ్యాస్ సిలిండర్లు దొంగలించడం జరిగిందన్నారు.
ఎట్టకేలకు అంత్యక్రియలు
బేతంచెర్ల డిసెంబరు 30 : మండలంలో నాలుగు రోజులుగా కొనసాగిన వివాహిత మృతి విషయం ఆదివారం ఓ కొలిక్కి రావడంతో అంతక్రియలు పూర్తయ్యాయి. బైనపల్లెకు చెందిన ఆరుణ అనే వివాహిత అనుమానస్పద స్ధితిలో మృతి చెందింది. భర్త తాలూకు వారు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని చెప్పగా మృతురాలి తల్లిదండ్రులు గొంతు నులిమి చంపారని ఆరోపించడంతో ఇరువర్గాల మద్య వాగ్వివాదం చోటు చేసుకొని మూడు రోజులుగా మృతదేహన్ని కదిలనివ్వకుండా మృతురాలి వర్గం అడ్డుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం అర్ధరాత్రి మృతదేహన్ని కర్నూలుకు తరలించి శవపరీక్ష నిర్వహించారు. అనంతరం బైనపల్లెలో అంత్యక్రియలు నిర్వహించారు.
అంతర్ జిల్లా దొంగ అరెస్టు
కర్నూలు, డిసెంబర్ 30: నగరంలో ఇటీవల జరిగిన వరుస దొంగతానాలకు పాల్పడిన ఇద్దరి నింధుతుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా మరోకరు పరారీలో వున్నారు. వారివద్ద నుంచి దాదాపు రూ.5లక్షల విలువ చేసే బంగారం, వెండి అభరాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పాతబస్టాండ్ దగ్గర షరాఫ్‌బజార్ సమీపంలో దొంగను అరెస్టు చేసిన వారిలో సిఐ మురళీధర్, ఎస్సై మంజునాథ్, హెచ్‌సి చంద్రుడు, పిసిలు సుదర్శన్, శేఖర్, నాగరాజు, మధు, అమర్‌నాథ్‌రెడ్డి, జూనియర్ నాగరాజు, వినోద్‌కుమార్‌లు ఉన్నారు. ఆదివారం కర్నూలు 2వ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డిఎస్పీ లతామాధురి మాట్లాడుతూ నగరంలోని ముజఫర్‌నగర్‌కు చెందిన బాలన్న కుమారుడు గోర్లగుట్ట నాగేంద్రకుమార్ అలియాస్ నాగేంద్రలుగా గుర్తించినట్లు చెప్పారు. అతని నుండి దాదాపు 14 తులాల బంగారు, 10 తులాల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఆమె పేర్కోన్నారు. సిఐ మురళీధర్ మాట్లాడుతూ నాగేంద్ర మాలదాసరి చెన్నకేశవులుతో కలసి నగరంలోని ప్రకాష్‌నగర్‌లోని దేవి అపార్ట్‌మెంట్‌కు చెందిన కేదార్‌నాథ్‌గౌడ్ ఇంట్లో, ధర్మపేటలోని సుధాకర్ ఇంట్లో, నవంబర్ నెలలో వైఎస్ షర్మిలా పాదయాత్ర సందర్భంగా గుంపులో బుధవారపేటలోని మహిళ మెడలోని 1 బంగారు గొలుసు, ఆశోక్‌నగర్ రైల్వేస్టేషన్ నుండి వెళ్తున్న ఒక మహిళ మెడలో నుండి 1 బంగారు చైను లాక్కొని పరార్‌లో వున్నాడని సిఐ పేర్కొన్నారు. నాగేంద్ర గతంలో పలు దొంగతనాల కేసులు, కర్నూలుతోపాటు డోన్ పోలీసులు అరెస్టు చేసి జైళుకి పంపడం జరిగిందని విచారణలో తెలిందన్నారు. దాసరి చెన్నకేశవులు అనే మరో దొంగ ప్రస్తుతం పరారీలో వున్నాడని, త్వరలో అరెస్టుచేసి దొంగతనాల కేసులో సొత్తును రికవరీ చేస్తామని ఆయన తెలిపారు. ట్రాఫిక్ సిఐ వినోద్‌కుమార్, 2వ పట్టణ ఎస్సై ముంజునాథ్ పాల్గొన్నారు.

2012 సంవత్సరం
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>