Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మసకబారిన ఎర్రజెండా

$
0
0

నెల్లూరు, డిసెంబర్ 30: జిల్లాలో సిపిఎంకు నిన్న రాదు... రేపులేదు అనే పరిస్థితి తయారైంది. ముగిసిపోతున్న ఏడాదిలో జిల్లాలో వచ్చిన మూడు ఉప ఎన్నికల్లోనూ సిపిఎం అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే నియోజకవర్గానికి రెండు నుంచి మూడు వేల ఓట్లకు మించి పోల్ కాకపోవడం రాజకీయంగా ఆ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఈ ఏడాది మార్చి 18న నిర్వహించిన కోవూరు ఉప ఎన్నిక బరిలో నిలిచిన సిపిఎం అభ్యర్థి జొన్నలగడ్డ వెంకమరాజుకు కేవలం 3,562 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కోవూరు నియోజకవర్గం అంతే స్వతహాగా సిపిఎంకు ఎంతో పట్టున్న ప్రాంతం. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య స్వగ్రామం ఈ నియోజకవర్గ పరిధిలోని విడవలూరు మండలం అలగానిపాడు. అంతేగాక గత 2009 ఎన్నికలకు ముందు జరిగిన పునర్విభజనలో సిపిఎంకు మరో పట్టున్న అల్లూరు నియోజకవర్గం రద్దై అందులో చాలా ప్రాంతం కోవూరులోనే విలీనమైంది. గతంలో ఎప్పుడు పోటీ చేసినా కోవూరు నియోజకవర్గంలో ఇరవై వేల వరకు ఓట్లు పోలవుతున్నాయి. దామరమడుగు, పెనుబల్లి తదితర కంచుకోటల్లాంటి గ్రామాల్లో కూడా విజేతకు సమీప ప్రత్యర్థిగానే (ద్వితీయ స్థానానికే) పరిమితమయ్యారు. ఈ ఉప ఎన్నికలో సిపిఎం నామినేషన్ మిగిలిన అభ్యర్థుల కార్యక్రమం కంటే కోలాహలంగా కొనసాగింది. రాష్టప్రార్టీ కార్యదర్శి బివి రాఘవులు కూడా హాజరై నెల్లూరు నుంచి కోవూరు వరకు మోటార్‌బైక్ ర్యాలీపై వెళ్లారు. మరో ముఖ్య నేత, మాజీ రాజ్యసభ సభ్యులు మధు కూడా తరలివచ్చారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఎర్రజెండాలు రెపరెపలాడేలా రోడ్‌షో నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలంతా ఇంటింటా ప్రచారం కూడా చేసినా ఆశించిన ఫలితంలో ఆరోవంతు కూడా లభించలేదు. ఇదిలాఉంటే 2004 ఎన్నికల్లో, అంతకుముందు 1993 ఉపపోరులో సిపిఎం ఒంటరిగా పోటీ చేసింది. ఆ రెండుమార్లు పదివేలకుపైగానే ఓట్లు లభించాయి. దీనికితోడు గతంలో జిల్లాపార్టీ నాయకులు జక్కా వెంకయ్య రెండు పర్యాయాలు (1985,94)ల్లో పోటీ చేసి గెలుపొందిన అల్లూరు నియోజకవర్గం పునర్విభజనతో రద్దైంది. ఆ నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం, తదితర కీలక ప్రాంతాలన్నీ కోవూరులోనే విలీనమయ్యాయి. ఏదేమైనా స్వతహాగా కమ్యూనిస్టులు గెలిచే అవకాశాల్లేకున్నా ప్రధాన అభ్యర్థుల జయాపజయాలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపగలరనేది ఒకప్పట్లో విశే్లషణలుండేవి. అయితే ఇప్పటి పరిస్థితి అయితే అలా కనిపించడం లేదు. ప్రస్తుత సంవత్సరం జూన్ 12న నిర్వహించిన నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి చండ్ర రాజగోపాల్‌కు కేవలం 17వేల ఓట్లు మాత్రమే లభించాయి. లోక్‌సభ స్థానం పరిధిలోనూ ఇప్పటి వరకు సిపిఎం ఎన్నో పర్యాయాలుగా పోటీ చేస్తున్నా ఇంతటి తక్కువ ఓట్లైతే ముందెన్నడూ రాలేదు. అంతకు ముందు ఒక్కో నియోజకవర్గ పరిధిలోనే ఈ మాత్రం పోలింగ్ నమోదవుతుండేది. ఇప్పుడు ఏడు నియోజకవర్గాల పరిధి విస్తరించి ఉన్న నెల్లూరు లోక్‌సభలోనూ అంతే పరిస్థితి నెలకొని ఉండటం విడ్డూరకరమైన పరిణామం. గతంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి వామపక్షాల తరఫున ఎమ్మెల్యేలు ఎన్నికైన దాఖలాలున్నాయి. ఉదాహరణకు నెల్లూరు రూరల్ మండలం గురించి ప్రస్తావించుకుంటే ఎన్టీఆర్ మాండలిక వ్యవస్థ ప్రవేశపెట్టాక నాటి నుంచి నేటి వరకు కూడా ఎంపిపిలు కమ్యూనిస్టులే కావడం గమనార్హం. మూడేళ్ల క్రితడం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజవకర్గం నుంచి పోటీ చేసిన సిపిఎం అభ్యర్థికి పదివేలకు పైగానే ఓట్లు లభించాయి. ఈదఫా ఎంపి ఉప ఎన్నికల్లో అదే రూరల్ నియోజకవర్గంలో 3,033 మాత్రమే దక్కడం గమనార్హం. ఈ ఉప ఎన్నికలోనూ సిపిఎం నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా కొనసాగింది. రాష్టప్రార్టీ కార్యదర్శి బివి రాఘవులు నేతృత్వంలో నెల్లూరు నగరంలో మోటార్‌బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యకర్తలంతా ఇంటింటా ప్రచారం కూడా చేసినా ఫలితంలో ఆరోవంతు కూడా లభించలేదు. ఏదేమైనా స్వతహాగా కమ్యూనిస్టులు గెలిచే అవకాశాల్లేకున్నా అతితక్కవ పోలింగ్ శాతం నమోదు చేసుకుంటూ కేవలం ఉద్యమపార్టీనే సిపిఎం పరిమితమవుతోంది. సదరు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి చండ్ర రాజగోపాల్ సిపిఎం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతేగాక ఆయన గతంలో ఎన్నో రైతువారీ ఉద్యమాల్లో కీలకంగా సేవలందించారు. అయినాసరే ఎన్నికలొచ్చేటప్పటికి ఆయనకు దక్కిన ఓటింగ్ బహు పరిమితంగా ఉంటోంది. లోక్‌సత్తాతో జతకట్టినా పరిస్థితులైతే ఆశాజకనకంగా మారలేదనే భావించాలి. ఉదయగిరి ఉప ఎన్నికల్లో సిపిఎం తరఫున పోటీ చేసిన కాకు వెంకటయ్య పరిస్థితి కూడా ఘోరాతిఘోరంగానే కనిపించింది. ఇలాంటి పరిస్థితులన్నీ అధిగమించి కమ్యూనిస్టులు రానున్న 2013లో ముందుకెలా వెళ్తారనేది సమర్ధవంతంగా ఆలోచించాల్సిన రాజకీయ అంశమే.

=====

ధార్మిక ఉద్యోగ నేతకు సన్మానం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధార్మిక సంస్థ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జిల్లాలోని పెంచలకోన ఆలయ ప్రధాన అర్చకులు గుండ్లూరు సీతారామయ్య దంపతులను ఆదివారం ఘన సన్మానించారు. స్థానిక ఆమనిగార్డెన్స్‌లో చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికార్ల, ఉద్యోగుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మేడేపల్లి విజయరాజు, దేవాదాయశాఖ నెల్లూరు సహాయ కమిషనర్ నల్లూరు యానాదిశెట్టి, పెంచల కోన ఆలయ సహాయ కమిషనర్ దివి శ్రీనివాసరావు, జొన్నవాడ ఆలయ సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

=====

సూళ్లూరు పేట అభివృద్ధికి బాటలు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 30: జిల్లాలో సూళ్లూరుపేట వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాటు ద్వారా ఆ పట్టణాభివృద్ధికి బాటలు పడుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక హరితా టూరిజం హోటల్ ఆవరణలో ఫ్లెమింగో ఫెస్టివల్‌కు సంబంధించిన ప్రచారరథాన్ని మంత్రి ఆనం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట ఈ ఏడాది పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ అయిన అనంతరం భవనాల కోసం ఏభై లక్షల రూపాయలు, డ్రైనేజి కాలువలు, సిమెంట్ రోడ్లు, తదితర అవసరాల నిమిత్తం మరో కోటిన్నర లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు. సూళ్లూరుపేట పట్టణం, చుట్టుపక్కల ఉన్న మొత్తం 22 తాగునీటి పథకాలను సమర్ధవంతంగా పనిచేసేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. సూళ్లూరుపేట పట్టణం, జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండే రోడ్డుపై చెంగాళమ్మ ఆలయం వద్ద కాళంగినదిపై శిథిలావస్థకు చేరుకున్నందున కొత్త వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా షార్ నిధులు పదికోట్ల రూపాయలు కూడా వివిధ పథకాల అమలుకు మంజూరయ్యాయన్నారు. సూళ్లూరుపేటలో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల నిర్మాణం కోసం నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడేగాక రాష్టవ్య్రాప్తంగా వివిధ నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియంల నిర్మాణం చేపట్టేలా రాష్ట్ర బడ్జెట్‌లో ప్రస్తుత సంవత్సరం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియం ఏర్పాటు కానున్నాయన్నారు. విలేఖర్ల సమావేశంలో భాగంగా ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ పులికాట్ సరస్సుకు సముద్రం నుంచి నీరు వచ్చే ద్వారాలు మూసుకుపోతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించామన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా రత్నం కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సంక్షిప్తంగా తెలిపారు.

పార్టీలకు అతీతంగా సూళ్లూరుపేట అభివృద్ధికి కృషి
సూళ్లూరుపేట, డిసెంబర్ 30: పార్టీలు వేరైనా తామిద్దరం సూళ్లూరుపేట అభివృద్ధికి కలసికట్టుగా పనిచేస్తామని ఎమ్మెల్యే పరసా రత్నం, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాలో వారు విలేఖర్లతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సూళ్లూరుపేటను అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈప్రాంత ప్రజా సమస్యలను మంత్రి ఆనం దృష్టికి అన్ని పార్టీల పెద్దల సమక్షంలో తీసుకువెళ్లామని, ఆయన వెంటనే స్పందించి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించారని, దీంతో సిమెంటు రోడ్లు, తాగునీరు వసతి కల్పిస్తామన్నారు. సూళ్లూరుపేటను అభివృద్ధి చేసేందుకు షార్ నిధులు కేటాయించాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఇరువురం కలసి వినతిపత్రం సమర్పించగా ఆయన వెంటనే స్పందించి పది కోట్ల రూపాయల షార్ నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. సూళ్లూరుపేట అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అమలు జరుగుతుందన్నారు. స్థానిక హోలీక్రాస్ కూడలి నుండి చెంగాళమ్మ ఆలయం వరకు సిసి రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దీనిని మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. పార్టీలు ఏవైనా పేట అభివృద్ధికి కలసికట్టుగా పనిచేసి శాటిలైట్ టౌన్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
ఫ్లెమింగో ఫెస్టివల్ పోస్టర్ విడుదల
జనవరి 8,9,10 తేదీల్లో జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌కు సంబంధించి పోస్టర్లను ఆదివారం ఎమ్మెల్సీ వాకాటి, ఎమ్మెల్యే పరసా విడుదల చేశారు. ఈసారి కనీ వినీ ఎరుగని రీతిలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. గత ఏడేళ్లుగా తామే స్వయంగా ఈ పండుగను నిర్వహిస్తున్నామని, ఈసారి టూరిజం క్యాలెండర్‌లో పండుగను చేర్చి ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రణాళికా బద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పండుగను తొలిరోజు కేంద్ర టూరిజం శాఖ మంత్రి చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. దీనిని జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేనాటి రామచంద్రారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దెపూడి వేణుగోపాలరెడ్డి, చెంగాళమ్మ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి, దేవారెడ్డి సుధాకరరెడ్డి, జట్టు వేణుయాదవ్, అలవల సురేష్, రాజశేఖర్, యుగంధర్ పాల్గొన్నారు.
నా హయాంలోనే వెంకటగిరి అభివృద్ధి
వెంకటగిరి, డిసెంబర్ 30: తన హయాంలోనే వెంకటగిరి అభివృద్ధి చెందిందని, మున్సిపల్ కార్యాలయాన్ని తానే కట్టించానని, భవనం తనదేనని మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి తెలిపారు. ఆదివారం వెంకటగిరికి వచ్చిన ఆమె మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీగా ఉన్న వెంకటగిరిని మున్సిపాలిటీగా తీర్చిదిద్ది 80 లక్షల రూపాయలతో మోడల్ బిల్డింగ్ కట్టించింది తానేనని, మరెవ్వరూ చేయలేదని కనుక ఈ మున్సిపల్ బిల్డింగ్ తనదేనన్నారు. వీధివీధినా సిమెంట్ రోడ్డు వేయించి వెంకటగిరిని ఒక ప్రత్యేక మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన ఘనత తనకే దక్కిందన్నారు. పదవిలో ఉన్నా, లేకున్నా వెంకటగిరి అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. మున్సిపాలిటీలో అదనపు గదులు నిర్మించేందుకు 65 లక్షల రూపాయలు, గొడ్డేరువాగు రక్షణ గోడ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయించానన్నారు. అంతేకాకుండా సూళ్ళూరుపేట, నాయుడుపేట, వాకాడు స్వర్ణముఖి పొర్లుకట్టల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామన్నారు. అనంతరం సహకార సొసైటీ ఎన్నికలపై స్థానిక నాయకులతో సమీక్షించారు.

జనాదరణ చూసి ఓర్వలేకే
బాబుపై విమర్శలు
నెల్లూరు అర్బన్, డిసెంబర్ 30: తమ పార్టీని, అధినేత చంద్రబాబును విమర్శించడం విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌కు తగదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో లగడపాటి రాజగోపాల్ లబ్ధిపొందారన్నారు. ప్రజల కష్టాలు చూసేందుకు బాబు పాదయాత్ర చేస్తుంటే ప్రజలు ఆయనను ఆదరించి ఘన స్వాగతం పలుకుతున్నారని, దీనిని ఓర్వలేక బాబుపై ఎంపి లగడపాటి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కరెంట్ కోత, పెరిగిన పంట పెట్టుబడుల ధరలతో రైతు సంక్షోభంలో చిక్కుకుపోయి అప్పుల భారంతో కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికు పేదల కష్టాలు పట్టడం లేదన్నారు. వైస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ప్రజల సొమ్ము వేల కోట్లలో దిగమింగడం వల్లే అన్ని వర్గాలు ప్రస్తుతం దుర్భర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నియంత్రలా వ్యవహరించే రాష్ట్ర ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబుపై లగడపాటి చేస్తున్న విమర్శలు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. అనంతరం బీద రవిచంద్ర జిల్లా ప్రజలకు 2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగను ప్రజలందరూ శుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నగర అధ్యక్షుడు నూనె మల్లికార్జునయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు
ఆంధ్రభూమిబ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 30: డిఎస్సీ-2012లో ఎంపికైన అభ్యర్థులకు ఎట్టకేలకు ఉపాధ్యాయ నియామక ఉత్తర్వులు అందాయి. ఆదివారం జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం ఈ నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు. విద్యాశాఖ సహాయ సంచాలకులు విజయ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అర్ధరాత్రి వేడుకలపై నిఘా పెంచాలి
* బిజెపి కార్యదర్శి మిడతల విజ్ఞప్తి
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 30: నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా అర్ధరాత్రి నిర్వహించే వేడుకలపై నిఘా పెంచాలని బిజెపి జిల్లా కార్యదర్శి మిడతల రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతివ్వడం శోచనీయమన్నారు. అర్ధరాత్రి వేడుకల కోసం విదేశాలనుంచి మాదకద్రవ్యాలు రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులు స్వాధీనం చేసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో పబ్, క్లబ్ సంస్కృతి వల్ల యువ శక్తి నిర్వీర్యం అవుతోందన్నారు. ఢిల్లీలో అత్యాచారానికి గురై మృతి చెందిన వైద్య విద్యార్థిని ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి వేడుకల పట్ల పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఉందని బిజెపి భావిస్తోందన్నారు. పాశ్చాత్య పోకడలకు అలవాటుపడి తాగి తందనాలాడడం, మాదకద్రవ్యాలు సేవించడమే నూతన సంవత్సర వేడుకలుగా యువత భావిస్తుండడం సిగ్గుచేటన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రమేష్ విజ్ఞప్తి చేశారు.

అర్ధరాత్రి వేడుకలపై నిఘా పెంచాలి
* బిజెపి కార్యదర్శి మిడతల విజ్ఞప్తి
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 30: నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా అర్ధరాత్రి నిర్వహించే వేడుకలపై నిఘా పెంచాలని బిజెపి జిల్లా కార్యదర్శి మిడతల రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతివ్వడం శోచనీయమన్నారు. అర్ధరాత్రి వేడుకల కోసం విదేశాలనుంచి మాదకద్రవ్యాలు రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులు స్వాధీనం చేసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో పబ్, క్లబ్ సంస్కృతి వల్ల యువ శక్తి నిర్వీర్యం అవుతోందన్నారు. ఢిల్లీలో అత్యాచారానికి గురై మృతి చెందిన వైద్య విద్యార్థిని ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి వేడుకల పట్ల పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఉందని బిజెపి భావిస్తోందన్నారు. పాశ్చాత్య పోకడలకు అలవాటుపడి తాగి తందనాలాడడం, మాదకద్రవ్యాలు సేవించడమే నూతన సంవత్సర వేడుకలుగా యువత భావిస్తుండడం సిగ్గుచేటన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రమేష్ విజ్ఞప్తి చేశారు.

స్కేటింగ్ పోటీల్లో నగర విద్యార్థులు విజయం
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 30: విశాఖపట్నంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్టస్థ్రాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో నగరానికి చెందిన విద్యార్థులు విజయం సాధించి బంగారు, రజతం, కాంశ్య పతకాలను కైవసం చేసుకున్నారు. అండర్ - 14 విభాగంలో శ్రీచైతన్య స్కూల్ విద్యార్థి ఎం రేవంత్‌రెడ్డి, అండర్ - 17 విభాగంలో అక్షర విద్యాలయ విద్యార్థి పి శ్రీనివాస సాయి ప్రతిభను కనపరచారు. రేవంత్‌రెడ్డి రింక్ - 1 విభాగంలో బంగారు, రోడ్ - 1 విభాగంలో కాంశ్య పతకాలు సాధించాడు. పి శ్రీనివాసులు రింక్ - 4లో రజతం, రోడ్ - 2లో కాంశ్య పతకాలు సాధించాడు. ఈ విద్యార్ధులు జనవరి 2వ తేదీ నుండి న్యూఢిల్లీలో నిర్వహించే ఎస్‌జిఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు ఎస్‌జిఎఫ్ కార్యదర్శి చెన్నారాయుడు తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులను రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జడ్ శివప్రసాద్, కార్యదర్శి ఈశ్వర్ అభినందించారు.

మేదరులను ఎస్టీల్లో చేర్చండి
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 30: రాష్ట్రంలో మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ మేదర సంఘం నాయకులు నోముల సుందరయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కేతా అంకులు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సుబేదారుపేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సుందరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 50 లక్షల మంది మేదర్లు వెదురుతో బుట్టలు, జల్లెళ్లు, చాపలు తదితరాలు తయారీ ద్వారా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కాలానుగుణంగా వెదురు వాడకం తగ్గడంతో దానిపై ఆధారపడిన వారికి జీవనోపాధి కరవైందన్నారు. వెదురు కర్రల ధరలు పెరిగిపోవడంతో వాటితో తయారుచేసిన వస్తులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేదరులను బిసిలనుంచి ఎస్టీ జాబితాలో చేర్చి వారిని ఆదుకోవాలన్నారు. ఆగిపోయిన సొసైటీలను పునరుద్ధరించాలన్నారు. ఈకార్యక్రమంలో మేదర నాయకులు కేతా సుబ్బారావు, కె బాలనారాయణ, పి అంకమరావు, శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు.

4 వేల కార్యక్రమాలతో కేతా అంకులు రికార్డు
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 30: సంస్థను స్థాపించిన నాటినుండి ఇప్పటివరకు 26 సంవత్సరాల్లో 4వేల కార్యక్రమాలు నిర్వహించి రికార్డు సాధించినట్టు కేతా అంకులు మెమోరియల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు కేతా సుబ్బారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 66 కార్యక్రమాలు చేశామన్నారు. విద్య, వైద్య, ఆరోగ్య, కళా, సేవా రంగాల్లో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈసందర్భంగా తనకు సహకరించిన నగర ప్రజలకు దాతలకు సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా సాయి వెనె్నల వేడుకలు
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 30: సాయి వెనె్నల ఆర్కెస్ట్రా తృతీయ వార్షికోత్సవ వేడుకలు దుర్గం మధుసూదన్ పర్యవేక్షణలో ఆదివారం స్థానిక టౌన్‌హాలులో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా జూనియర్, సీనియర్ విభాగాల్లో భజన కీర్తనల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ఆలూరి శిరోమణిశర్మ సాయి సచ్చరిత్రపై ప్రసంగించారు. గుడి నారాయణబాబు శిరిడిసాయి సూక్తులు చదివి వినిపించారు. ఈసందర్భంగా ఆర్కెస్ట్రా గాయనీగాయకులు గానం చేసిన వివిధ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో దుర్గం కృష్ణమూర్తి, బివి నరసింహం, దుగ్గపాటి రాధాకృష్ణ, ఆర్‌వి శేషయ్యనాయుడు, చీమకుర్తి సుందరేశ్వరుడు, భవానీనాగేంద్రప్రసాద్, కొమ్మి కామేశ్వరరావు, సత్యనారాయణ, మంగళగౌరి, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

మహిళల రక్షణకు చట్టలు కఠినతరం చేయాలి
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 30: మహిళల రక్షణ కోసం ప్రస్తుతం ఉన్న చట్టాలను దోషులకు కఠిన శిక్ష పడేలా సవరించాలని దళిత విద్యార్థిసేన జిల్లా అధ్యక్షుడు అరవ పూర్ణ ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. స్థానిక దర్గామిట్ట అంబేద్కర్ భవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన దళిత విద్యార్థిసేన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో అత్యాచారినికి గురై మృతి చెందిన వైద్య విద్యార్థినికి దళిత విద్యార్థిసేన, దళిత సంఘాల పక్షాన తీవ్ర సంతాపం తెలిపారు. సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పూర్ణ ప్రకాష్ కోరారు. సమావేశంలో గంగాధర్, దాసు, లక్ష్మీనారాయణ, రాజశేఖర్,షణ్ముఖం, శివ, పెంచలప్రసాద్, మల్లి, మేరీ, నిర్మల, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

అర్ధరాత్రి దైవ దర్శనాలు మంచిది కాదు
* విశ్వహిందూ పరిషత్ వెల్లడి
నెల్లూరు కల్చరల్, డిసెంబర్ 30: ఆంగ్ల సంవత్సర వేడుకల కోసం అర్థరాత్రి హిందూ దేవాలయాలను తెరిచి ఉంచితే సహించేది లేదని విశ్వహిందూ పరిషత్ సమన్వయ కార్యదర్శి మెంటా రామమోహన్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్ధరాత్రి దైవ దర్శనాలు మంచి సంప్రదాయం కాదన్నారు. మన పూర్వీకులు, మహర్షులు అనుసరించిన సాంప్రదాయాలను మనం గౌరవించాలన్నారు. దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చి హుండీ ఆదాయం కోసం అర్ధరాత్రి పూజలు నిర్వహించవద్దని దేవాదాయశాఖకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని పెంచలకోన, చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయాల్లో అర్ధరాత్రి పూజలు చేయనున్నట్టు సమాచారం అందిందని హిందూ సాంప్రదాయాలకు భిన్నంగా ఆలయాలు తెరిస్తే వీటిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆలయ విధులు ఆచరించాలని, అందుకు భిన్నంగా శ్మశాన సమయంలో ఆలయాలు తెరిస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు. హిందూ సాంప్రదాయాలు కాపాడాలని కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్, నెల్లూరు ఎసికి టెలిగ్రాం ద్వారా ఫిర్యాదుచేసినట్టు రామమోహన్ వివరించారు.

జిల్లాలో సిపిఎంకు
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>