Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆనందహేల

$
0
0

ఏలూరు, డిసెంబర్ 31: నూతన సంవత్సరం తేనున్న కొత్త శోభలు, కొత్త ఆశలు, ఉజ్వల భవిష్యత్ పట్ల నమ్మకాల మధ్య 2012కి ప్రజలు ఆనందోత్సాహాలతో వీడ్కోలు పలికారు. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే సోమవారం అర్ధరాత్రి జిల్లా జనం ఆనందడోలికల్లో తేలియాడారు. కలెక్టర్ బంగ్లాలో జరిగిన వేడుకల్లో డిఐజి సూర్యప్రకాశరావు భారీ కేక్ కట్‌చేశారు. 12గంటలు దాటగానే యువకులు మోటారుసైకిళ్లపై తిరుగుతూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. జనం కేరింతలు కొట్టారు. హర్షధ్వానాలతో పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దఎత్తున టపాసులు కాల్చారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నగరంలోని ఇళ్ల ముందు వివిధ డిజైన్లతో ముగ్గులు వేశారు. నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తారతమ్యబేధాలు లేకుండా ఎలాంటి భేషజాలు చూడకుండా తమ హృదయద్వారాలు తెరిచి నూతన సంవత్సరానికి మనసారా స్వాగత గీతాలు పలికారు. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన ప్రార్ధానాలయాలకు, దేవాలయాలకు వెళ్లి నూతన సంవత్సరం తమకు విజయాలు పంచాలని కోరుకున్నారు. రాత్రి 12గంటలకల్లా చిన్నాపెద్ద తేడా లేకుండా 3హ్యాపీ న్యూఇయర్2 తెలియజేసుకున్నారు. ఫోన్లు సైతం కొత్త ఏడాది బిజిలో 3ఆల్ లైన్స్ ఆర్ బిజి2తో కొత్త సంవత్సరంలో హడావిడిలో మునిగిపోయాయి.
మరోవైపు మంగళవారం జరిగే నూతన సంవత్సర వేడుకలకు పలు ప్రాంతాల్లో గ్రీటింగ్ కార్డ్సు దుకాణాలు, పండ్ల దుకాణాలు, కేక్ అమ్మకాలతో సందడి నెలకొంది. మారుతున్న కాలం, ఆధునికతలు ప్రజల అలవాట్లలో కూడా మార్పులు తెచ్చాయి. గతంతో పోలిస్తే ఈసారి న్యూఇయర్ గ్రీటింగ్‌ల హడావిడి బాగా తగ్గినట్లే కన్పించింది. నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాలు ఆధునికతను సంతరించుకుని ఎస్‌ఎంఎస్‌లు, ఇ-మెయిల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తుండటంతో గ్రీటింగ్ కార్డుల హడావిడి కొంత తగ్గింది. దీంతో గతంలో ప్రతి వీధిలో దర్శనమిచ్చే గ్రీటింగ్ కార్డుల విక్రయ దుకాణాలు ఈసారి స్పల్ఫశాతంలోనే దర్శనమిచ్చాయి. వాస్తవానికి టెక్నాలజీ దెబ్బ తగిలి గ్రీటింగ్ కార్డుల దుకాణాలు విలవిలలాడిపోయాయనే చెప్పుకోవాలి. అంతకుముందు గ్రీటింగ్ కార్డులు విపరీతమైన ఫ్యాషన్‌గా కొనసాగేవి. అయితే ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఏటా వీటి రేట్లను వందశాతం చొప్పున పెంచుకుంటూ వచ్చేశారు. ఆ నేపధ్యంలోనే ఎస్‌ఎంఎస్‌లు, ఇ-మెయిల్స్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుకోవటం సులభంగాను, తక్కువ ఖర్చుతో అయిపోవటంతో జనం అంతా వాటివైపే మళ్లిపోయారు. ఈ ఏడాది ఆ పరిణామం మరింత వేగంగా రూపుదిద్దుకుంది. దీంతో గ్రీటింగ్ కార్డులు ఇవ్వటం ఇప్పుడు పాత ఫ్యాషన్‌గా మారిపోయిందంటే ఆతిశయోక్తి కాదు. అయితే నూతన సంవత్సరం వేడుకల్లో సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఈ ఏడాది కూడా పండ్లు, కేక్‌లు, బొకేలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో పండ్లు, కేక్‌ల ధర అకాశాన్ని అంటింది. ఇక బొకేల సంగతి చెప్పనవసరం లేదు. మరోవైపు ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరంలోని అపార్టుమెంట్లలో సమైక్యంగా వేడుకలు జరుపుకోవటం విశేషం. ముగ్గులు పోటీలు, విశేష అలంకారాలతో సందడి వాతావరణం నెలకొంది. వసుధైక కుటుంబాన్ని తలపించేవిధంగా అపార్టుమెంట్లలోని వారందరూ సమైక్యంగా వేడుకలు నిర్వహించుకోవటం గమనార్హం.

కోటి ఆశలతో
కొత్త సంవత్సరానికి స్వాగతం
(ఆంధ్రభూమి బ్యూరో, ఏలూరు)
పాత సంవత్సరం అందించిన అనుభవాన్ని నెమరువేసుకుంటూనే కొత్త సంవత్సరం చిరస్మరణీయమైన అనుభవాలను అందించాలని జనమంతా ఆకాంక్షిస్తున్నారు. కోటి ఆశలు, కొత్త ఊసులతో కొత్త సంవత్సరం వడివడిగా నడిచి రాగా జిల్లా జనమంతా ఆప్యాయంగా ఆహ్వానించారు. గత ఏడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఈ ఉత్సాహంలో తెరమరుగు చేసుకుంటున్నారు. రానున్నకాలం అంతా మంచిని తెస్తుందన్న గట్టి ఆశే అందరిలోనూ ద్యోతకమవుతోంది. ఆ ఉత్సాహం, ఆ ఉల్లాసం నూతన సంవత్సర వేడుకల్లో స్పష్టంగా ప్రతిఫలించాయి. మనం బాగుండటమే కాకుండా అందరూ బాగుండాలన్న ఆకాంక్ష వ్యక్తమైంది. జిల్లా అభివృద్ధి పథంలో నిలిచి ఉన్నా పరుగులు తీయకుంటే భవిష్యత్తులో వెనుకబడతామన్న ఆలోచనతో అందరి లక్ష్యం అభివృద్ధే మార్గంగా ముందుకు సాగుతున్నారు. నూతన సంవత్సరంలో దీనికి సరికొత్త ప్రతిజ్ఞలు కూడా చేశారు. జిల్లాకు సంబంధించి మార్గదర్శకులు, రథసారథులుగా ఉండే ఉన్నతాధికారుల్లో రానున్న ఏడాది సాధించే విజయాలపై ధృడమైన నమ్మకం కన్పించింది. సాధించి తీరుతామన్న పట్టుదల వారిలో వ్యక్తమైంది. ఎటువంటి ఆటంకాలు ఎదురొచ్చినా ప్రజల మద్దతుతో వాటిని ఎదుర్కొని ముందుకు సాగుదామన్న పిలుపే అందరిలోనూ వినిపించింది....

అందరికీ అనందదాయకం కావాలి
నూతన సంవత్సరం జిల్లా ప్రజలకు ఆనందదాయకం కావాలని ఏలూరు రేంజ్ డిఐజి జి సూర్యప్రకాశరావు ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలోనికి అడుగిడుతున్న సందర్భంగా సోమవారం ఆయన ‘ఆంధ్రభూమి ప్రతినిధి’2తో మాట్లాడారు. పోలీసు సిబ్బందికి, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాభాగస్వామ్యంతోనే పోలీసు యంత్రాంగం మరిన్ని విజయాలు సాధించడానికి సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 2013లో కూడా ప్రజాసమస్యల విషయంలో పోలీసుసిబ్బంది సత్వరం స్పందించి తగిన పరిష్కారం అందించేలా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. పోలీసుశాఖ మరింత సమర్ధవంతంగా విధులు నెరవేర్చి ప్రజలకు ప్రశాంత జీవనాన్ని అందించేందుకు కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో పోలీసుశాఖలో కూడా ప్రశాంతత ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. మరింత శాంతియుత వాతావరణంలో జీవనాన్ని సాగించేందుకు ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించాలన్నారు.
అభిలాషతో అభివృద్ధి
కొత్త సంవత్సరం అన్ని కుటుంబాల్లో ఉత్సాహన్ని, ఉల్లాసాన్ని కలిగించి కుటుంబమంతా ప్రశాంతంగా జీవనాన్ని సాగించేందుకు అటు ప్రభుత్వం, ఇటు యంత్రాంగం అండగా నిలబడుతుందని జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్ తెలిపారు. నూతన సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆమె 3ఆంధ్రభూమి ప్రతినిధి2తో మాట్లాడుతూ గత ఏడాది కాలంలో అభిలాష కార్యక్రమం ద్వారా జిల్లాలో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిష్కరించామని చెప్పారు. ఈవిషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రముఖుల సహకారం మరువలేనిదన్నారు. ఈ స్ఫూర్తితో 2013లోనూ అభిలాషతో అభివృద్ధి అన్న లక్ష్యంతో ముందుకు సాగుతామని తెలిపారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలు, అధికారులకు ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
మరింత చేరువవుతాం
గడచిన ఏడాది జిల్లాలో శాంతిభద్రతలు సంతృప్తికరంగానే ఉన్నాయని, ఈ ఏడాది కూడా జిల్లాలో శాంతి,సామరస్యం వెల్లివిరియాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రమేష్ అకాంక్షించారు. గత ఏడాది ఎన్నో అవాంతరాలు ఎదురైనా వాటిని పోలీసు యంత్రాంగం సమర్ధంగా అదిగమించగలిగిందని చెప్పారు. కొత్త సంవత్సరం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తూ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాత్రి ఆయన 3ఆంధ్రభూమి ప్రతినిధి2తో మాట్లాడుతూ గత ఏడాది శాంతిభద్రతలకు సంబంధించి జిల్లాలో చెప్పుకోదగ్గ స్ధాయిలో సంఘటనలు చోటుచేసుకోకపోవటంతో ప్రశాంతంగా గడిచిపోయిందన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగాన్ని మరింత వేగవంతం చేసి ప్రజానీకానికి చేరువయ్యేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్దాయిలో కొత్త ఏడాది వినియోగించనున్నామని తెలిపారు. ఎక్కడనుంచైనా ప్రజలు తమ కష్టాలను, ఫిర్యాదులను ఫోన్ ద్వారా కూడా అందజేస్తే వాటిని కాపీలుగా రూపొందించి సంబంధిత స్టేషన్‌లో ఇది నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భాషా సమస్యగాని, స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే తన పేస్‌బుక్ అక్కౌంట్ ద్వారా జిల్లా ప్రజానీకానికి దగ్గరయ్యానని, ఎటువంటి ఫిర్యాదునైనా దీనిద్వారా కూడా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా 2013 సంవత్సరం కూడా ప్రశాంతంగా, సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు జీవనాన్ని సాగించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల సహకారం పూర్తిగా లభిస్తే పోలీసుశాఖ మరింత సమర్ధవంతంగా సేవలు అందించగలుగుతుందన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయం
పేదవర్గాల సంక్షేమమే లక్ష్యంగా జిల్లా రెవిన్యూ యంత్రాంగాన్ని తీర్చిదిద్దుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టరు డాక్టరు టి బాబూరావునాయుడు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలు, రైతుల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాత్రి ఆయన 3ఆంధ్రభూమి ప్రతినిధి2తో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో నా రేషన్ కార్యక్రమాన్ని మరింత పదునైన ఆయుధంగా వినియోగించి బోగస్‌లను నివారించి పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆరికడతానని చెప్పారు. అలాగే రెవిన్యూ ఉద్యోగులు, సిబ్బంది నీతి,నిజాయితీకి కట్టుబడి సమాజానికి సేవ చేయటమే లక్ష్యంగా భావించేలా చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లాలో శాంతి, సామరస్యం వర్దిల్లాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రశాంతంగా ఎప్పటిలానే అభివృద్ది పధంలో దూసుకువెళ్లాలని ఆయన అభిలషించారు.
జిల్లా వాసులకు మంత్రుల శుభాకాంక్షలు
ఏలూరు/్భమడోలు, డిసెంబర్ 31 : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 1వ తేదీన ఎంఎం పురంలోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండరని మంత్రి పిఎ పి సత్యనారాయణ తెలిపారు. శుభాకాంక్షలటు తెలియజేయడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వ్యయప్రయాసలకోర్చి ఎంఎం పురం రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు.

సోషల్ యాక్షన్ కమిటీల ఆధ్వర్యంలో

కుటుంబ తగాదాల పరిష్కారం
ఏలూరు, డిసెంబర్ 31 : ప్రజావాణికి వచ్చే కుటుంబ తగాదాలను సోషల్ యాక్షన్ కమిటీలు పరిష్కరించే విధంగా తగు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ముఖ్యంగా కుటుంబ ఆస్థి తగాదాలు, సరిహద్దు తగాదాలు, భార్యాభర్తల వివాదాలు వస్తున్నాయని వాటిని పరిష్కరించడానికి పోలీసులను ఆశ్రయించకుండా స్వయం సహాయక గ్రూపుల సోషల్ యాక్షన్ కమిటీ మహిళలకు అప్పగించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకూ 5 వేల కేసులకు పైగా పరిష్కరించి న్యాయం చేయడం జరిగిందని అదే విధంగా ప్రజావాణిలో వచ్చే ఇటువంటి కేసులను సత్వరం పరిష్కారానికి సోషల్ యాక్షన్ కమిటీలు దృష్టి పెట్టే విధంగా డి ఆర్‌డి ఎ పిడి వై రామకృష్ణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో కౌన్సిలింగ్ ద్వారా ఎన్నో కుటుంబాలను కలపడం జరిగిందని, భవిష్యత్తులో కూడా శాంతియుత జీవనం కోసం చర్చలు ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రజల ఆలోచనా విధానంలో కూడా మార్పు రావాలని కోరారు. జిల్లాలో వికలాంగులకు సత్వర న్యాయం అందించడానికి అనేక చర్యలు తీసుకున్నామని అంగవైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడానికి కూడా దృష్టి కేంద్రీకరించామని కలెక్టర్ చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు మాట్లాడుతూ సమాజంలో పేద వర్గాల సంక్షేమానికి అనేక నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టామని ప్రజావాణి ద్వారా పేదలకు సత్వర న్యాయం అందిస్తామని చెప్పారు. వివిధ సమస్యలపై ప్రజలిచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులు పదిహేను రోజుల్లోగా పరిష్కరించి ఫిర్యాదుదారులకు తగు సమాచారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్‌వో ఎం మోహనరాజు, డి ఆర్‌డి ఎ పిడి వై రామకృష్ణ, జడ్పీ డిప్యూటీ సి ఇవో వి నాగార్జునసాగర్, డ్వామా పిడి ఎన్ రామచంద్రారెడ్డి, డిపివో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రాక్టికల్స్‌లో ‘జంబ్లింగ్’ వద్దు
ఏలూరు, డిసెంబర్ 31: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం ఇంటర్మీడియట్ విద్యార్ధులు స్థానిక కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులు పోలీసు బారికేడ్లను తోసుకుని లోనికి వెళ్లేందుకు యత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ విద్యార్ధులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రైవేటు జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బివి గోపాలకృష్ణ, అధ్యక్షులు ఎం ఎస్ ఆర్ ఆంజనేయులు (రాజు)లు మాట్లాడుతూ ఏ కోర్సులో లేని విధంగా ప్రాక్టికల్స్ జంబ్లింగ్ పేరుతో ఇంటర్మీడియట్ బోర్డు గ్యాంబ్లింగ్ ఆడుతోందని ఆరోపించారు. ఇంటర్మీడియట్‌లో ఏ పరికరాలతో అయితే నేర్చుకున్నారో ఆ పరికరాలతోనే పరీక్ష నిర్వహించాలని వారు అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్దుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు వున్నాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన పరికరాలు వివిధ నమూనాల్లో వుంటాయని, ఇవి అన్ని కళాశాలల్లో ఒకే విధంగా ఉండకపోవచ్చునన్నారు. ఫిజిక్స్ పరికరాలు, బోటనీ, జువాలజీ మోడల్స్, స్లైడ్లు ఒక్కొక్క కళాశాలకు ఒక్కో రకంగా వుంటాయని అన్నారు. విద్యార్ధులు వీటిని సులభంగా గుర్తుపట్టే అవకాశాలున్నాయన్నారు. ఏ కళాశాలలో పరికరాలను ఉపయోగించి ప్రాక్టికల్స్‌కు సిద్ధమయ్యారో ఆ కళాశాలలోని పరికరాలతోనే ప్రాక్టికల్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ఎన్‌వి ప్రసాద్, కోశాధికారి జి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు హెచ్‌వి ఆర్ ప్రసాద్, సహాయ కార్యదర్శి టి సంజీవరెడ్డి పాల్గొన్నారు.
గ్రీవెన్స్ సెల్ ద్వారా సమస్యల పరిష్కారం:పితాని
పెనుగొండ, డిసెంబర్ 31: ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గ్రీవెన్స్ సెల్ ద్వారా వెంటనే పరిష్కరించనున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు హాజరైన మంత్రి పితాని మాట్లాడుతూ ఈ వేదిక సమస్యల పరిష్కార వేదిక కావాలని ఆకాంక్షించారు. మార్టేరు, పెనుగొండ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరింపజేయనున్నట్టు చెప్పారు. పెనుగొండ, మార్టేరు, సత్యవరం, వెంకటరామపురం గ్రామాలను పెనుగొండలో విలీనం చేసి, పురపాలక సంఘంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. చిన్నవారిపాలెంలో రూ.34.5 లక్షల వ్యయంతో ఇన్నర్ రోడ్లు, డ్రెయినేజీలు అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో పెనుగొండ బస్టాండ్‌ను నూతనంగా ఆధునీకరించనున్నట్టు తెలిపారు. ఎల్లప్పకాలువ ఆధునికీకరణ పనులు 2013, జూలై నాటికి పూర్తిచేస్తామన్నారు. దీర్ఘకాలంగా రామచంద్రరావుపేటలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. పెనుగొండ పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని, అందుకు కావలసిన సదుపాయాలు సమకూర్చుకోవాలని మంత్రి సూచించారు. జనవరి 1 నుండి నగదు బదిలీ పథకం అమలు జరుగుతుందని, ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు ఉండాలన్నారు. ఈ గ్రీవెన్స్‌సెల్‌లో వివిధ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చిన అర్జీలను మంత్రి స్వీకరించారు.
పెనుగొండ సొసైటీ ఎన్నికలపై నీలినీడలు
పెనుగొండ, డిసెంబర్ 31: పెనుగొండ సొసైటీ ఎన్నికల నిర్వహణ సందేహాస్పదంగా తయారయ్యింది. ఇప్పటికే ఈ సొసైటీలో ఓటర్ల చేర్పులో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు సాగించింది. తాజాగా ఆ పార్టీ నేతలు ఈ అక్రమాలను నివేదిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనితో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించినట్టు సోమవారం రాత్రి ఇక్కడకు సమాచారం అందింది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
కాంగ్రెస్‌ను వీడేది లేదు:కరాటం
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, డిసెంబర్ 31: తాను పార్టీ ఫిరాయిస్తున్నానని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబు పేర్కొన్నారు. స్థానిక డిసిసిబి బ్రాంచిలో 2013 డైరీ, క్యాలెండర్, పంచాంగంను ఎమ్మెల్యే ఈలినాని సోమవారం ఆవిష్కరించారు. అనంతరం కరాటం రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ 1962లో కమ్యూనిస్టు పార్టీలో ఉన్న తాను అనంతరం కాంగ్రెస్ పార్టీకి వచ్చానని, 43 సంవత్సరాలుగా కాంగ్రెస్‌కు సేవలు చేసానన్నారు. ఏ పదవిని ఆశించలేదని, పార్టీని ఎప్పుడూ దూషించలేదని, వైఎస్ సూచనల మేరకు డిసిసిబి ఛైర్మన్‌గా పోటీచేసి 2 లక్షల మంది రైతులకు వడ్డీ రుణాలు ఇచ్చే అవకాశం కలిగిందన్నారు. పార్టీలోంచి పంపుదామని కుట్ర చేస్తే తానేమి చెప్పలేనుగాని, పార్టీని విడిచేది లేదన్నారు. సహకార ఎన్నికల్లో ఈసారి పోటీ చేయనని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి ఎమ్మెల్యే ఈలినాని అంబులెన్స్ కావాలని కోరారని, అవకాశాన్ని బట్టి త్వరలో అంబులెన్స్ ఇస్తామన్నారు. జిల్లాలో ఉండి, ఉండ్రాజవరం, ఆచంట, తంగెళ్ళమూడిలలో కొత్త శాఖల ఏర్పాటుకు నాబార్డు, ఆర్‌బిఐ ల నుండి అనుమతి కోరుతున్నామన్నారు. జనవరి నెలాఖరుకు ఆన్‌లైన్ సౌకర్యం డిసిసిబిలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీనితో రూ.570 కోట్లు ఉన్న వ్యాపారం రూ. 2 వేల కోట్లకు పెరుగుతుందన్నారు.

మిస్టరీ రోడ్డు ప్రమాదం!
వీరవాసరం, డిసెంబర్ 31: వీరవాసరం మండలం నందమూరుగర్వు గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మిస్టరీగా మారింది. గ్రామంలోని పెట్రోలు బంకు సమీపంలో జాతీయ రహదారిపై అరటి పండ్ల తోపుడు బండిని ఒక మోటారు బైక్ బలంగా ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మోటారుబైక్ పై ప్రయాణిస్తున్న తామరపల్లి బాలు (15), తామరపల్లి చిట్టు (14) తీవ్రంగా గాయపడ్డారు. తామరపల్లి రాము (45)కు స్వల్ప గాయాలయ్యాయి. బాలు, చిట్టును ఏలూరు తరలించారు. గాయపడిన అరటిపండ్ల వ్యాపారి గంటా సత్యనారాయణను భీమవరం తరలించారు. ఇదిలావుండగా ప్రమాదానంతరం చీకట్లో కిందపడివున్న వీరిని వెనుకగా వస్తున్న మరో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఇందులో ఓ బైక్‌పై ఉన్న ఒక కానిస్టేబుల్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. డెల్టా ప్రాంతంలోని ఒక పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు మోటారు సైకిళ్లపై ఒక నిందితుడిని తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అనంతరం మొత్తం గాయపడిన వారిని, మూడు బైక్‌లను సమీపంలోని పెట్రోలు బంకు వద్దకు తరలించారు. అయితే కొద్దిసేపటికే మొదట ప్రమాదం జరిగిన బైక్ మినహా మిగిలిన రెండు బైక్‌లు మాయమయ్యాయి. అలాగే కానిస్టేబుళ్లు, ఇతర వ్యక్తి కూడా ఏమయ్యారనేది తెలియరాలేదు.
అంతర్ జిల్లా నేరగాడు అరెస్టు
ఏలూరు, డిసెంబర్ 31 : పలు దొంగతనాలకు పాల్పడిన అంతర్‌జిల్లా నేరగాడిని పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి ఎం రమేష్ ఈ వివరాలను తెలిపారు. విజయవాడ సనత్‌నగర్‌కు చెందిన యద్దనపూడి అరుళ మరియరాజు కొవ్వూరు గౌతమి నగర్‌లో మార్చి 7వ తేదీన తాళం వేసివున్న ఇంటిలో దొంగతనం చేశాడు. ఇంటిలో వున్న ఆరు కేజీల వెండి, 14 కాసుల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. అలాగే నవంబర్ 24వ తేదీన తణుకులో రాత్రి పెద్దపోస్ట్ఫాసు వీధిలో తాళం వేసివున్న ఇంటిలో నేరం చేసి కేజీ వెండి, అయిదున్నర కాసుల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. అలాగే డిసెంబర్ 9వ తేదీన తణుకులోని మాంటిస్సోరి స్కూలు వద్ద వున్న బ్యాంకు కాలనీలో ఒక ఇంటిలో దొంగతనానికి పాల్పడి సుమారు అయిదు కాసుల బంగారు ఆభరణాలు, అరకేజీ వెండి వస్తువులు దొంగిలించాడు. ఇతన్ని జిల్లా పోలీసులు ఆశ్రం ఆసుపత్రి వద్ద సోమవారం ఉదయం అరెస్టు చేసి సుమారు ఆరు లక్షల రూపాయల విలువైన పద్నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలు, ఆరు కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది జిల్లాలో నేరాల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినా దొంగతనాలు మాత్రం కొంత అధికంగా చోటు చేసుకున్నాయని ఎస్‌పి చెప్పారు. ప్రధానంగా తాళాలు వేసి వున్న ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయని, దీని వెనుక ఒక నెట్‌వర్కు వున్నట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఇటువంటి దొంగతనాలకు పాల్పడే వారికి ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తాళాలు వేసివున్న ఇళ్లు ఉన్నాయన్న సమాచారాన్ని అందించే నెట్‌వర్కు కొనసాగుతోందని, దీన్ని త్వరలోనే ఛేదిస్తామన్నారు. విలేఖరుల సమావేశంలో అడిషినల్ ఎస్పీ వి ఎన్‌వి సత్యనారాయణ, కొవ్వూరు డిఎస్పీ శ్రీనివాసు, కొవ్వూరు సిఐ రవివర్మ తదితరులు పాల్గొన్నారు.

దానమ్మ తల్లిని దర్శించుకున్న హాస్యనటుడు ఎల్‌బి శ్రీరామ్
తణుకు, డిసెంబర్ 31: ప్రముఖ సినీ హాస్య నటుడు ఎల్‌బి శ్రీరామ్ తణుకు మండలం దువ్వ గ్రామంలోని దానేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సోమవారం సతీసమేతంగా సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ తన భార్య స్వగ్రామమైన దువ్వకు విచ్చేసి, ఆలయాన్ని సందర్శించటం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి చల్లని కరుణ తమ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుందన్నారు. సినిమా రంగం గూర్చి మాట్లాడుతూ ప్రతిభావంతులకు అవకాశాలకు కొదువలేదని అన్నారు. తన వరకూ ఈ వృత్తిలో సంపూర్ణ సంతృప్తిని పొందుతున్నట్టు చెప్పారు. కాగా ఎల్‌బి శ్రీరామ్‌కు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రుద్ర చిన సత్యనారాయణ, ఇఒ నటరాజన్ షణ్ముఖం, సీనియర్ అసిస్టెంట్ పులపర్తి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
కొక్కిరపాడు రహదారి 15 రోజులు మూత
ఏలూరు, డిసెంబర్ 31 : నూజివీడు- వట్లూరు స్టేషన్ల మధ్య కొక్కిరపాడు గ్రామం వద్ద అత్యవసరంగా రైల్వే ట్రాక్ మరమ్మతులు చేస్తున్న కారణంగా జనవరి 1వ తేదీ ఉదయం 7 గంటల నుండి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ సంబంధిత రహదారి మూసివేస్తామని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీరు తెలిపారు.

నూతన సంవత్సరం
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles