న్యూఢిల్లీ, జనవరి 1: ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నాడన్న అభియోగాలపై కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జప్తు చేయటాన్ని ఈడీ న్యాయ ప్రాథికార సంస్థ సమర్థించింది. వివాదంపై రెండువర్గాల మధ్య జరిగిన వాదోపవాదాలు మంగళవారం పూర్తయ్యాయి. వాదనలు విన్న అథారిటీ తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు ప్రకటించింది. నాలుగైదు రోజుల్లో తీర్పు వెలువడుతుందని తెలిసింది. తమ తీర్పు వెలువరించే లోపు వివాదంపై ఒక నివేదిక అందించాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను న్యాయ ప్రాధికార సంస్థ ఆదేశించింది. జగన్‌కు చెందిన జగతి, జనని సంస్థలతో పాటు, పెట్టుబడులు పెట్టిన సంస్థలకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జప్తు చేసిన సంగతి తెలిసిందే.
జగన్ ఆస్తుల కేసు ఈడీ చర్యను సమర్థించిన న్యాయ ప్రాథికార సంస్థ వాదనలు పూర్తి.. రిజర్వులో తీర్పు
english title:
j
Date:
Wednesday, January 2, 2013