మహబూబ్‌నగర్, జనవరి 1: నిన్నటి వరకూ అక్కడ .. పిరమిడ్ కింద ముక్కు మూసుకుని ధ్యానం చేయడం మాత్రమే కనిపిచింది. మానసిక ఒత్తిడి నుంచి ఒకింత ఉపశమనం కోసం వచ్చిన వందలాది భక్తులతో కిటకిటలాడింది. తెల్లారేసరికి ఒక్కరూ లేరు. అంతా నిర్మానుష్యం. డిసెంబర్ 21నుంచి 31వరకు ప్రపంచ ధ్యాన మహాసభలు నిర్వహించిన సుభాష్ పత్రీజీ నిజ స్వరూపం బయటపడటమే ఇందుకు కారణం. పత్రీజీ ధ్యాన బోధనలో.. కంత్రీ లీలలు వెలుగు చూడటంతో మహిళలు బిక్కచచ్చిపోతున్నారు. పత్రీజీ ఉద్దేశంలో ధ్యానం అంటే మహిళలను బిగి కౌగిళ్ళలో బంధించడం, ముద్దులు పెట్టడం, శయన మందిరంలో మసాజ్ చేయించుకోడమే. ఉన్న ఒత్తిడిని పోగొట్టుకునేందుకు వచ్చిన మహిళలు ఇప్పుడు పత్రీజి గురించి ఎలక్ట్రానిక్ చానళ్ళలో వచ్చిన కథనాలతో కొత్త ఒత్తిడికి గురవుతున్నారు. తమ పరువు ఎక్కడ బజారున పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల సమీపంలో హన్మాస్‌పల్లి గ్రామంలో జరిగిన ప్రపంచ ధ్యాన మహాసభలు వివాదాస్పదమయ్యాయి. డిసెంబర్ 21 నుంచి 31వరకు జరిగిన ప్రపంచ ధ్యాన మహాసభలు ముగింపులో అసలు ‘్ధ్యస లీలలు’ బయటపడ్డాయి. గత పది రోజుల్లో నిత్యం వేలాదిగా ధ్యాన మహాసభలకు హాజరై ధ్యాన క్రియ నిర్వహించారు. పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ చూపించిన తీరు అప్పట్లో వివాదాస్పదం కాకున్నా, ముగింపునాటికి వెలుగు చూసిన నిజాలు చూసి ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు. మంగళవారం పలు టీవీ ఛానళ్లు ధ్యాన మహాసభల్లో సుభాష్ పత్రీజీ ప్రవర్తనా శైలిని బయటపెట్టాయి. మహిళలతో కౌగిలింతలు, మసాజ్‌లు చేయించుకోవడం, ముద్దులు వంటి దృశ్యాలు మహిళలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. కాగా ధ్యాన మహాసభలకు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సహా, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు సైతం హాజరయ్యారు. అయితే, సుభాష్ పత్రీజీ ప్రవర్తనా తీరు వెలుగు చూడటంతో మహాసభలకు హాజరైనవారంతా అవాక్కవుతున్నారు. ధ్యాన మహాసభలు వివాదాస్పదం కావడంతో, వివాదంలో తామెక్కడ ఇరుక్కుంటామోనన్న భయం కూడా ప్రముఖులను వెంటాడుతోంది. ధ్యాన మహాసభలు వివాదాస్పదం కావడంతో కడ్తాల పిరమిడ్ ధ్యాన కేంద్రం వైపే అందరి దృష్టి పడింది. మహిళలతో మసాజ్ చేయించుకుంటున్న సుభాష్ పత్రీజీ రంగు బయటపడటంతో ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్‌ను ధ్యాన మహాసభల్లో పత్రీజీ వ్యవహరించిన తీరుపై ప్రశ్నించగా, ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.
పత్రీజీ నేపథ్యం ఇదీ
నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన సుభాష్ పత్రీజీ ఇన్‌కంటాక్స్ శాఖలో పని చేసి పదవీ విరమణ చేశారు. తర్వాత ఒక ప్రముఖ ఎరువుల కంపెనీలో సూపర్ వైజర్‌గా కొంతకాలం పని చేశారు. ఆ సమయంలోనే ఆయన హైదరాబాద్‌లో వేణువు వాయించడం కూడా నేర్చుకున్నారు. తర్వాత కర్నూలులో మొట్టమొదటిసారిగా ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్‌నగర్ జిల్లా హన్మాల్‌పల్లి గ్రామంలో ఏకంగా శాశ్వత ప్రాతిపదికన పిరమిడ్ ఆకారంలో ధ్యాన కేంద్రాన్ని రికార్డు సమయంలో నిర్మించారు. వారంపాటు పిరమిడ్ కేంద్రంలో ధ్యానం చేస్తూ అక్కడికి వచ్చిన వారితో ధ్యానం చేయించిన పత్రీజి, కొత్త ఏడాది అడుగు పెట్టగానే కంటికి కనిపించకుండా పోయారు. పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణం వెనుక అక్కడి స్థలాన్ని కబ్జా చేసే కుట్ర కూడా దాగి ఉందన్నది కొందరి ఆరోపణ.
వివాదాస్పదమైన ధ్యాన మహాసభలు టీవీ కథనాలతో కంగుతింటున్న మహిళలు ధ్యాన సభల్లో కేంద్ర మంత్రి, ప్రముఖులు సుభాష్ పత్రీజీ తీరుపై విమర్శల గగ్గోలు
english title:
bigi
Date:
Wednesday, January 2, 2013