చెన్నై, జనవరి 1: అత్యాచారం కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిమాండ్ చేశారు. రేపిస్టులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్లాల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆమె సూచించారు. దోషులకు ఉరిశిక్ష విధించాలన్న జయలలిత, అవసరమైతే కెమికల్ కస్ట్రేషన్ కింద శిక్షలు అమలు చేయాలని కోరారు. అత్యాచారం కేసులను త్వరగా విచారించేందుకు వీలుగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌లో 23 ఏళ్ళ యువతి మృతిపట్ల ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులో ఇలాంటి ఘాతుకాలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మహిళపై జరిగే అత్యాచారం కేసులను గూండా చట్టం కిందకు తీసుకురానున్నట్టు మంగళవారం ఇక్కడ ప్రకటించారు. మహిళల భద్రత కోసం 13 అంశాల కార్యాచారణ అమలు చేయనున్నట్టు తెలిపారు. స్ర్తిలపై లైంగిక వేధింపుల అదుపునకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేపిస్టులపై గూండా చట్టాలను ప్రయోగించడంతోపాటు మహిళల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు గూండా చట్టాన్ని సవరిస్తామన్నారు. అత్యాచారం వంటి కేసులను తీవ్రమైన నేరాలుగా పరిగణించి పోలీసు ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయిస్తామన్నారు. మహిళలపై వేధింపులకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సిసిటివిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రద్దీగాఉండే ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం సివిల్ డ్రస్‌లో పోలీసులను నియమించనున్నట్టు వెల్లడించారు. లైంగిక దాడులకు గురయ్యే మహిళలకయ్యే వైద్య ఖర్చులు, పునరావాసానికి చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఉమెన్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన మహిళా న్యాయవాదులను నియమిస్తామన్నారు.
మహిళా భద్రతకు 13 అంశాలతో కార్యాచరణ తమిళనాడు సిఎం జయ వెల్లడి
english title:
rep
Date:
Wednesday, January 2, 2013