ముంబయి, జనవరి 1: అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించి ప్రపంచ మేటి క్రికెటర్‌గా ఖ్యాతి గడించిన భారత సీనియర్ బ్యాట్స్‌మన్ ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ త్వరలో దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొననున్నాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీ క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బరోడా జట్టుతో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ ముంబయి తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో ముంబయి జట్టుకు కొండంత అండ లభించినట్టయింది. బరోడాతో జరిగే మ్యాచ్‌లో సచిన్ బరిలోకి దిగుతాడని, ఈ మ్యాచ్‌లో తలపడే ముంబయి జట్టును బుధవారం ఎంపిక చేయడం జరుగుతుందని ముంబయి క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి నితిన్ దలాల్ మంగళవారం నాడు ప్రకటించాడు. అంతర్జాతీయ వనే్డ క్రికెట్ నుంచి ఇటీవలే వైదొలిగిన సచిన్‌కు ఇక ముంబయి జట్టు తరఫున అన్ని నాకౌట్ మ్యాచ్‌లలో ఆడే స్వేచ్ఛ లభించింది. రంజీ టోర్నమెంట్లో ఇప్పటికే 39 సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబయి జట్టు సచిన్ రాకతో మరోసారి ఫైనల్‌కు చేరుకోగలమన్న ధీమాతో ఉంది.
ముంబయి తరఫున క్వార్టర్ ఫైనల్ బరిలోకి
english title:
ra
Date:
Wednesday, January 2, 2013