Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రైల్వే ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో డిఆర్‌ఎం చాంబర్ ముట్టడి

$
0
0

గుంతకల్లు, జనవరి 2: రైల్వేలో ఏక పక్షంగా బదిలీలను నిరసిస్తూ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడు లేని విధంగా డిఆర్‌ఎం చాంబర్‌ను ముట్టడించారు. డిఆర్‌ఎం తేజెంధర్ పాల్ సింగ్‌ను ఎంప్లాయిస్ డివిజన్ కార్యదర్శి రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి దాదాపు సాయంకాలం 7 గంటల వరకు చాంబర్‌లో నిర్బంధించి నిరసన వ్యక్తం చేశారు. డిఆర్‌ఎం వైఖరిపై ఎంప్లాయిస్ సంఘ్ నాయకులు జోనల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి రెడ్డెప్ప మాట్లాడుతూ డిఆర్‌ఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని, కేవలం సంఘ్ నాయకుల పట్ల వేధింపులకు దిగుతున్నాడన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఓపెన్ లైన్ టికెట్ చెకింగ్ డిపోను ప్రారంభించలేదన్నారు. అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న వారిపై చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది కాలంగా కార్మికుల సమస్యలను డిఆర్‌ఎం దృష్టికి తీసుకువెళ్లిన, నిర్లక్ష్య వ్యవహరిస్తుడని విమర్శించారు. డిఆర్‌ఎం వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు డిఆర్‌ఎంను ఇంటికి వెళ్లనియ్యమని వారు భీష్మించారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ డివిజనల్ కమాండెంట్ సెంథిల్‌కుమరేషన్ ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ సిఐ బిబిఎస్ మాధవన్, ఎస్సై సుధీర్‌ల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఆర్పీఎఫ్ డివిజనల్ కమాండెంట్ సెంథిల్‌కుమరేషన్‌తో పాటు ఎడిఆర్‌ఎం సత్యనారాయణలు ఆందోళనను విరమించాలని డివిజన్ కార్యదర్శి రెడ్డెప్పకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిష్కరించకుండ ఆందోళన విరమించేది లేదని ఆయన వారికి వివరించారు. కాగా డివిజన్ కార్యదర్శి రెడ్డెప్పను వన్‌టౌన్ ఎస్సై ఇస్మాయిల్ ఏక వచనంతో సంభోదించడంపై రెడ్డెప్పతో పాటు యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వివాదానికి దిగారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే అరెస్ట్ చేసుకోవాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేయడం కార్మికుల హక్కు అని డివిజన్ కార్యదర్శి రెడ్డెప్ప పేర్కొన్నారు. అయితే బుధవారం రాత్రి వరకు ఆందోళనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ సంఘ్ వివిధ బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇది కాంగ్రెస్, వైకాపా కుట్ర
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, జనవరి 2: కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుట్ర పన్ని పరిటాల శ్రీరామ్‌ను అక్రమంగా కేసులో ఇరికించాయని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. బుధవారం పరిటాల సునీత స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక శాసనసభ్యురాలి ఇంట్లో స్పీకర్ అనుమతి లేకుండా సోదాలు నిర్వహించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలో అనేక మంది మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, హోంమత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారునిపై వచ్చిన ఆరోపణలు, కేసులపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే కుమారుడిని ఉద్దేశ్య పూర్వకంగా కుట్ర కేసులో ఇరికించారన్నారు. ఎమ్మెల్యే అన్న కనీస మర్యాద పాటించకుండా ఇంట్లో సోదాలు నిర్వహించడం సరైంది కాదన్నారు. ఏదయినా ఉంటే తాము న్యాయపరంగా తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

పరిటాల శ్రీరామ్ కోసం
ముమ్మర గాలింపు
ధర్మవరం రూరల్, జనవరి 2: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కోసం జిల్లా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కోర్టులలో శ్రీరామ్‌తోపాటు నిందితులు లొంగిపోతారన్న అనుమానంతో పోలీసులు ముందస్తు చర్యగా జిల్లాలోని కోర్టుల వద్ద ప్రత్యేక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్యాయత్నం కేసులో ధర్మవరం రూరల్ పోలీసు స్టేషన్‌లో పరిటాల శ్రీరామ్‌తోపాటు మరో 14 మం దిపై కేసు నమోదు కాగా, ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా వు న్న పరిటాల శ్రీరామ్, నాగూర్ హుస్సే న్, పరిటాల సునీత డ్రైవర్ రాముతోపాటు మిగిలిన నిందితులు పోలీసు లు అరెస్టు చేయాల్సి వుంది. శ్రీరామ్ పోలీసులకు లొంగిపోకుండా కోర్టులోనే లొంగిపోతాడన్న అనుమానం తో పోలీసులు తమ అదుపులోకి తీసుకోవాలని ముందస్తుగా కోర్టుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేగాక జిల్లాలో పోలీసులు నాలుగైదు ప్రత్యేక బృందాలుగా విడిపోయి శ్రీరామ్‌తోపాటు మిగిలిన వారి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాలతోపాటు పరిటాల శ్రీరామ్ సమీప బంధువులు, అతని తండ్రి రవి సన్నిహితుల స్వగ్రామాలకు సైతం పోలీసులు వెళ్లినట్లు సమాచారం. పరిటాల శ్రీరామ్ మేనమామ బాలాజీ గతంలో వున్న ప్రాంతాలకు సైతం పోలీసులు వెళ్ళినట్లు తెలుస్తోంది. పరిటాల సమీప బంధువు ఎల్ నారాయణచౌదరి, బంధువులు, అతని కుమారుడు నివసిస్తున్న ప్రదేశాలలో సైతం పోలీసు నిఘా వుంచినట్లు సమాచారం. ఇదిలా వుండగా బుధవారం ఉదయం ధర్మవరం రూరల్, రామగిరి సిఐలు నరసింగప్ప, నరసింహారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు పోలీసులు సునీత స్వగ్రామమైన వెంకటాపురం, ఎల్ నారాయణచౌదరి స్వగ్రామం గరిమేకలపల్లి గ్రామాల్లో సోదాలు చేశారు. ఎట్టకేలకు శ్రీరామ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోవాలన్న ప్రయత్నంలో ప్రత్యేక నిఘా వుంచడంతోపాటు వారి సన్నిహితుల వద్ద, వారు తరచూ వెళ్ళే స్నేహితుల వివరాలను సైతం ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది.
అజ్ఞాతంలోకి పరిటాల శ్రీరామ్
కామిరెడ్డి సుధాకర్‌రెడ్డి హత్యాయత్నంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిటాల శ్రీరామ్ మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చిక్కకుండా వుండేందుకు రాష్ట్రం వదిలి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేగాక కేవలం తన రాజకీయ ఎదుగుదల ఓర్వ లేకే అధికార కాంగ్రెస్ పార్టీ, వైకాపాలు అనవసర రాద్ధాంతం చేస్తూ కేసు నమోదు చేయించారని పార్టీపరంగా తిప్పికొట్టేందుకు సైతం ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

స్ర్తిలను గౌరవించాలి

అనంతపురం సిటీ, జనవరి 2 : భారతీయ సంస్కృతి ఎంతోగొప్పదని, స్ర్తిలను గౌరవించడం పట్ల అవగాహన ప్రతి కుటుంబం నుంచి మొదలు కావాలని డి ఆర్ డి ఎ పిడి ప్రశాంతి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆర్ట్స్ కళాశాల నుంచి జెడ్‌పి కార్యాలయం వరకూ ధీర వనిత దామినికి అశ్రునివాళి అర్పిస్తూ మహిళలు చేపట్టిన ర్యాలీని జిల్లా ఇన్‌చార్జికలెక్టర్ ఎస్.సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం జెడ్‌పి మీటింగ్ హాలులో జరిగిన సమావేశానికి డిఆర్‌డిఎ పిడి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఆడవాళ్లు ఆది పరాశక్తి అని వారిని గౌరవించడం మన భారతీయ సంస్కృతి అని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాలక్రమేణా మరచిపోయి, ఆడవారిపై మగవారు చేస్తున్న ఆకృత్యాలు, ఆగడాలను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన దేశ రాజధానిలో యువతిపై జరిగిన అత్యాచార సంఘటన హేయమైన, దారుణమైన చర్యగా ఆమె పేర్కొన్నారు. మహిళలు, యువతుల పట్ల గౌరవం పెంపొందేలా మగవారికి అవగాహన కార్యక్రమం తొలుత ప్రతి కుటుంబం నుంచి ప్రారంభం కావాలని, సమాజం నుంచి కాదని ఆమె చెప్పారు. ఏ మహిళ, యువతి పట్ల అయినా అన్యాయం జరిగితే మహిళలంతా కలసికట్టుగా, బాధ్యతగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. నగర మాజీ కార్పొరేటర్, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి మోక్షప్రసూన మాట్లాడుతూ మహిళలు అత్యాచారానికి గురైనప్పుడు పోలీసుస్టేషనుకు వెళితే అక్కడ పోలీసులు నానావిధాలుగా ప్రశ్నించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళల పట్ల గౌరవప్రదంగా ఊరట కలిగించేలా మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యాన్ని పోలీసులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా కేసులు సత్వర పరిష్కారానికి నిరంతరం పనిచేసే ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని మహిళా సమస్యలు చెప్పుకోవడానికి పనిచేసే టోల్ ఫ్రీ నంబరును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మెప్మా పిడి మల్లీశ్వరి దేవి, పట్టు పరిశ్రమ శాఖ జెడి అరుణకుమారి, ఐసిడియస్ పిడి విజయలక్ష్మి, బిసి సంక్షేమ శాఖ అధికారి రమాభార్గవి, ఉపాధి కల్పనాధికారి కళ్యాణి, రచయిత్రి శశికళ తదితరులు ప్రసంగించారు.

సహకార ఎన్నికలకు సిద్ధం కండి
కళ్యాణదుర్గం, జనవరి 2: సహకార ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక కళ్యాణదుర్గం భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నియోజక వర్గంలో వున్న అన్ని సహకార సంఘాల్లో కాంగ్రెస్ పార్టీ వారే విజయం సాధిస్తారని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసి కట్టుగా పని చేయాలని తెలిపారు. నియోజక వర్గంలో 25 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ వారు చేయని, అభివృద్ధి నాలుగేళ్ల కాలంలోనే అభివృద్ధి చేయడం జరిగిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తాము సహించేది లేదని పరోక్షంగా ఇతర పార్టీలను హెచ్చరించారు. బ్రహ్మసముద్రం మండలంలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఇలాంటి సంఘటనలు మళ్లి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని వివరించారు. తెలుగుదేశం వారే ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు వరం లాంటి హంద్రీనీవా ద్వారా సాగు, తాగునీరు తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. అందుకు విశేషంగా కృషి చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ రఘునాథరెడ్డి, బాలనరేంద్రబాబు, లాయర్ దేవేంద్ర, కరణం తిప్పేస్వామి, నారాయణపురం వెంకటేసులు, మంజునాథ్‌చౌదరి, తిమ్మరాయుడు, నాగరాజు, కిశోర్, జయరాం పాల్గొన్నారు.

పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతానికి కృషి
గోరంట్ల, జనవరి 2: పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం చేయడానికి ప్రతి వ్యక్తి చిత్తశుద్ధితో కృషి చేసి వాటి ఫలితాలను భావితరాలనకు అందించాలని హిందూపురం ఎంపి నిమ్మల క్రిష్టప్ప పేర్కొన్నారు. బుధవారం ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన పైలెట్ ప్రాజెక్ట్ అవగాహన సదస్సులో మాట్లాడుతూ, రాష్ట్రంలో కేవలం మూడు మండలాలకు మాత్రమే జాతీయ గ్రామీణ నీటి పరిరక్షణ పథకం (పైలెట్ ప్రాజెక్ట్) కింద ఎంపికైయ్యాయని, ఇందులో గోరంట్ల మండలం ఉండటం హర్షణీయమన్నారు. కరవును పారదోలడానికి తాగునీటి సమస్య పరిష్కారానికి, రోగాల నివారణకు, భూగర్భ జలాల పెంపుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ పథకం విఫలమైతే దీని ప్రభావం దేశంపై చూపుతుందని, నిస్వార్థంతో లక్ష్యశుద్ధితో పాటుపడాలన్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌కు పలు ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలు ఉంటాయని, నిధుల కొరత సమస్య ఉండదన్నారు. భూగర్భ జలాలను, ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నామని, ఇప్పటికే 100 అడుగుల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయని, ప్రతి పౌరుడు భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలన్నారు. జిల్లాకు వరమైన హంద్రీనీవా పథకం పూర్తి స్థాయిలో అమలు జరిగితే మూడు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్‌ఇ ప్రభాకర్ మాట్లాడుతూ, నిజమైన లబ్ధిదారుల ఎంపిక, నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగితే పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా మంచి ఫలితాలు సాధించగలమని, ప్రాజెక్ట్‌లో తాగునీరు, సాగునీరుతో పాటు పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. సదస్సులో నాబార్డ్ ఎజిఎం రవీంద్రప్రసాద్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ రమణారెడ్డి, వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రోషన్ అలీ, డిఇ కుశకుమార్‌రెడ్డి, భూగర్భజలాల శాఖాధికారి తిప్పేస్వామి, పలు అంశాలపై పైలెట్ ప్రాజెక్ట్ కమిటీ సభ్యులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ప్రదీప్‌కుమార్, తహశీల్దార్ లక్ష్మీనాయక్, ఇఓఆర్‌డి నాగభూషణం, విద్యుత్ ఎఇ ప్రభాకర్, ప్రాజెక్ట్ సర్వే సంస్థ కార్యదర్శి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

నష్టాలబాటలో అనంత ఆర్టీసీ:ఆర్‌ఎం
రాయదుర్గం, జనవరి 2: జిల్లాలోని 12 ఆర్టీసీ డిపోలు నష్టాలబాటలో నడుస్తున్నాయని, నష్టాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రీజినల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతావారోత్సవాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యాదగిరి విలేఖరులతో మాట్లాడారు. గతయేడు జిల్లాలోని డిపోలలో రూ. 22.91కోట్ల నష్టం వాటిల్లగా ఈయేడు 18.67కోట్ల నష్టం వాటిల్లిందని అత్యధికంగా అనంతపురం డిపోలో రూ. 4కోట్లదాకా నష్టం రాగా, తాడిపత్రి డిపోలో అతితక్కువ నష్టం వచ్చిందని వివరించారు. నష్టాలను నివారించేందుకు ప్రతిడిపోలో ప్రధానమైన రూట్లను గుర్తించి ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీని లాభాలబాటలో నడిపేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అలాగే అందుకు తగిన విధంగా సిబ్బందితో పాటు ప్రయాణికులుకూడా సహకరించాలని కోరారు. ఇక పోతే ఆర్టీసీ ప్రయాణాలలో ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈయేడు జరిగిన 28ప్రమాదాలలో 23మంది మృతిచెందారని వివరించారు. ఈప్రమాదాలలో మృతిచెందిన కుటుంబాలకు మొత్తం రూ. 4కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించడం జరిగిందని ఈప్రమాదాలలో కేవలం ఆర్టీసీ తప్పిదంలేదని ఇతర వాహనాల బాధ్యతారాహిత్యంతో జరిగాయని తెలిపారు. ఆర్టీసీలో ప్రమాదాలను అరికట్టేందుకు డ్రైవర్లకు అవసరమైన శిక్షణలను ఇస్తున్నామని ఆర్ ఎం యాదగిరి తెలిపారు.
ప్రయాణికుల భద్రత ఆర్టీసీదే
ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల భద్రత పట్ల సంబంధిత సిబ్బంది బాధ్యత వహించాల్సివుందని పలువురు వక్తలు తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో బుధవారం జరిగిన 24వ రోడ్డు భద్రతావారోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్‌ఎం ఇ.యాదగిరితోపాటు ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లికార్జునశెట్టి, వైద్యాధికారులు డా.పసుపులేటి సత్యనారాయణ, మునిసిపల్ కమిషనర్ ఎల్.రామానాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అత్యుత్తమ ఆర్టీసీ డ్రైవర్లకు నగదు బహుమతులను అందజేశారు.

స్ర్తిలను గౌరవించాలి

అనంతపురం సిటీ, జనవరి 2 : భారతీయ సంస్కృతి ఎంతోగొప్పదని, స్ర్తిలను గౌరవించడం పట్ల అవగాహన ప్రతి కుటుంబం నుంచి మొదలు కావాలని డి ఆర్ డి ఎ పిడి ప్రశాంతి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆర్ట్స్ కళాశాల నుంచి జెడ్‌పి కార్యాలయం వరకూ ధీర వనిత దామినికి అశ్రునివాళి అర్పిస్తూ మహిళలు చేపట్టిన ర్యాలీని జిల్లా ఇన్‌చార్జికలెక్టర్ ఎస్.సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం జెడ్‌పి మీటింగ్ హాలులో జరిగిన సమావేశానికి డిఆర్‌డిఎ పిడి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఆడవాళ్లు ఆది పరాశక్తి అని వారిని గౌరవించడం మన భారతీయ సంస్కృతి అని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాలక్రమేణా మరచిపోయి, ఆడవారిపై మగవారు చేస్తున్న ఆకృత్యాలు, ఆగడాలను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు, యువతుల పట్ల గౌరవం పెంపొందేలా మగవారికి అవగాహన కార్యక్రమం తొలుత ప్రతి కుటుంబం నుంచి ప్రారంభం కావాలని, సమాజం నుంచి కాదని ఆమె చెప్పారు. నగర మాజీ కార్పొరేటర్, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి మోక్షప్రసూన మాట్లాడుతూ మహిళలు అత్యాచారానికి గురైనప్పుడు పోలీసుస్టేషనుకు వెళితే అక్కడ పోలీసులు నానావిధాలుగా ప్రశ్నించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మహిళా కేసులు సత్వర పరిష్కారానికి నిరంతరం పనిచేసే ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని మహిళా సమస్యలు చెప్పుకోవడానికి పనిచేసే టోల్ ఫ్రీ నంబరును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మెప్మా పిడి మల్లీశ్వరి దేవి, పట్టు పరిశ్రమ శాఖ జెడి అరుణకుమారి, ఐసిడియస్ పిడి విజయలక్ష్మి, బిసి సంక్షేమ శాఖ అధికారి రమాభార్గవి, ఉపాధి కల్పనాధికారి కళ్యాణి, రచయిత్రి శశికళ తదితరులు ప్రసంగించారు.

వారంలో రెండు రోజులైనా నీటిని అందించండి

మడకశిర, జనవరి 2: మడకశిర, హిందూపురం ప్రాంతాల్లో ప్రజలకు వారానికి రెండు రోజులైనా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా నీటిని అందించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. కొంతకాలంగా శ్రీరామరెడ్డి పథకం ద్వారా తాగునీరు సక్రమంగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీటి నిలువల కోసం నిర్మించిన ట్యాంక్‌లు, కొళాయిలు, పైపులు నిరుపయోగంగా ఉంటున్నట్లు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మడకశిర, గుడిబండ, అమరాపురం, హిందూపురం ప్రాంతాలకు శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నీరు ఏ రోజు వస్తాయోనన్న విషయాలు కూడా తెలియడం లేదని వాపోయారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ రమణారెడ్డికి ఫోన్ చేసి నీటి సరఫరా విషయమై ఆరా తీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తరచూ దెబ్బతింటున్న పైపులైన్‌లను మార్చి వేయాలన్నారు.
అదే విధంగా మడకశిర, హిందూపురం ప్రాంతాలకు వారంలో రెండు రోజుల పాటు నీటిని అందిస్తారా లేక ప్రతిరోజూ నీటిని అందించే అవకాశం ఉందా అన్న విషయాలపై నివేదిక అందచేయాలని ఆదేశించారు. ఏ గ్రామంలో అయితే నీటి ట్యాంక్, కొళాయిలు ఏర్పాటు చేశారో ఆయా గ్రామాలకు ఎందుకు నీటి సరఫరా కావడం లేదో రాత పూర్వకంగా తెలియచేయాలని మంత్రి సూచించారు.

రైల్వేలో ఏక పక్షంగా బదిలీలను నిరసిస్తూ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడు లేని విధంగా
english title: 
ra

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>