Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మళ్లీ మొదలైన విద్యుత్ కోత!

$
0
0

కడప, జనవరి 2 : నూతన సంవత్సరంతో పాటే జిల్లాలో భారీ విద్యుత్ కోత మొదలైంది. బుధవారం జిల్లా కేంద్రం నుంచి అన్ని ప్రాంతాలకూ విద్యుత్ సరఫరా చేసే ప్రధాన ఫీడర్‌ను తరుచూ కోత విధించారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో 7 గంటల పైబడి, గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటల పైబడి కరెంటు కోత కొనసాగించారు. ఇప్పటికే పగలు ఎండల తీవ్రతతో అల్లాడుతున్న జిల్లా వాసులు కరెంటు కోతతో తీవ్ర పడుతున్నారు. ఇక రాత్రిల్లో ఇష్టారాజ్యంగా కరెంటు కోత విధిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మరో వారం 10 రోజుల తర్వాత పగలు, రాత్రి చీకట్లోనే మగ్గే పరిస్థితులు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. కోతతో సంబంధిత ప్రాంత వాసులు సబ్ స్టేషన్లకు ఫోన్లు చేయడం, లేదా నేరుగా ళ్లి విచారిస్తుంటే తమకేమీ తెలియదని జిల్లా కేంద్రం నుంచి ప్రధాన ఫీడర్ ద్వారానే కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారని సమాధానం ఇస్తున్నారు. దీంతో కొంతమంది విద్యుత్ అధికారులపై దుర్భాషలాడుతున్నారు. రానున్న రోజుల్లో స్థానికంగా ఉన్న విద్యుత్ అధికారులు, సిబ్బందిపై ప్రజలు దాడి చేసినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల విషయానికి వస్తే ఇప్పటికే రాత్రింబవళ్లు విద్యుత్‌కోసం వ్యవసాయ పొలాల వద్ద జాగారం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. మరోవైపు ప్రభుత్వమేమో వ్యవసాయానికి 7 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తామని ప్రకటించినా కనీసం రెండు గంటలు కూడా నిరాటంకంగా విద్యుత్ సరఫరా కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పట్టణాల్లో వ్యాపార సంస్థలు, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు, ఆస్పత్రులు, తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక పరిశ్రమలు, వాణిజ్యపర వ్యాపారాలు కరెంటు కోతతో ఉత్పత్తిపై ఆశలు వదులుకున్నారు. ఇకపోతే విద్యార్థులకు ఇక రానున్న రోజులన్నీ పరీక్షల కాలమే. ఈ నేపథ్యంలో ఎడాపెడా విద్యుత్‌కోతతో తాము పరీక్షలకు ఏ విధంగా చదువుకోవాలోనని అనుమానాలు వ్యక్తం చేస్తూ విద్యార్థులు భయాందోళనలు చెందుతున్నారు. ఇక తల్లిదండ్రులు అయితే వ్యయ ప్రయాసలతో తమ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి ఏడాది పొడవునా కష్టపడ్డామని డీలా పడ్డారు. ఈ వ్యవహారంపై విద్యుత్‌శాఖ అధికారులను వివరణ కోరగా విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందని, ప్రధాన విద్యుత్ సరఫరా కేంద్రాల నుంచే జెన్‌కో జిల్లాకు కావాల్సినంత విద్యుత్‌ను సరఫరా చేయడం లేదని సమాధానం ఇచ్చారు. రానున్న రోజుల్లో విద్యుత్ కోత వేలను కూడా తాము చెప్పలేమని, ప్రజలు కూడా విద్యుత్‌ను ఆదా చేసుకోవాలని అధికారులు ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

ప్రొద్దుటూరు వాసులకు
పొంచిఉన్న నీటి ఎద్దడి!
* పెన్నాకు నిలిచిపోయిన నీటి సరఫరా
ప్రొద్దుటూరు, జనవరి 2 : దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్న చందంగా పైతట్టు ప్రాంతాల్లో వర్షాలు కురిసి శ్రీశైలం జలాశయం కొంతమేరా ఆశించిన స్థాయిలో నీటి మట్టానికి చోచుకున్న దానికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లకు నీటి విడుదలనుకొంత మేరా చేసినప్పటికి ఆశించిన స్థాయిలో చివరి ప్రాంతంగా ఉన్న ప్రజలకు గుక్కెడు మంచి నీరు కరువయ్యే పరిస్థితి ఎదురవుతున్న సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు మండలంతోపాటు రాజుపాళెం మండలాలకు తాగునీటి అవసరాల కోసం ఏర్పాటుచేసిన నీటి వనరులుగా ఉన్న పెన్నానది బోర్లు రోజురోజుకు భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో పరిస్థితి విషమంగా తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రెండులక్షలు పైబడి జనాభా కలిగి ఉన్న పట్టణానికి ప్రధాన నీటి ఆధారిత కేంద్రంగా పెన్నానది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల దాహార్తికి ఎంతో ఉపయోగపడేది. కాల క్రమేనా వర్షాభావ పరిస్థితుల కారణంగా నది పరివాహక ప్రాంతం నీటి ప్రవాహానికి చోచుకోకపోవడంతో కొన్ని సంవత్సరాల కాలంగా భూగర్భజలాలు అంతంతమాత్రంగా ఉపయోగపడుతూ వచ్చేవి. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం పెన్నానదిలో పట్టణ ప్రజల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ప్రధాన బోరుబావుల వద్దకు, వాటి చుట్టు పరిసర ప్రాంతాలకు నీటిని తరలించి ఎటిలోకి వదలడం జరిగింది. తద్వారా రెండు సంవత్సరాల పాటు అక్కడ ఉన్న బోర్లలో కొంచెం భూగర్భజలాలు పెరిగి పట్టణ ప్రజలకు కొంతమేరా ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటికి పోయేస్థితికి రావడంతో పట్టణ ప్రజలు దాహార్తి తీర్చేందుకు స్థానిక శాసనసభ్యులు మల్లెల లింగారెడ్డి అనేక ప్రకటనలు చేయడంతోపాటు నీటి సమస్య తీర్చేందుకు ఉన్నత స్థాయి అధికారులు, కేబినెట్ మంత్రులతో చర్చించిన సందర్భంలో శ్రీశైలం జలాశయం నుండి ఒక టిఎంసిని అవుకు రిజర్వాయర్ తద్వారా మైలవరం జలాశయం నుండి ప్రొద్దుటూరు పట్టణానికి ప్రధాన ఆధారిత కేంద్రంగా ఉన్న పెన్నానదిలోకి వదిలే విధంగా ఎట్టకేలకు సాధించడం జరిగింది. ఆ మేరకు అవుకు రిజర్వాయర్‌కు కృష్ణజలాలు చేరడం అనంతరం మైలవరం జలాశయంకు వరద కాలువ ద్వారా 0.75 టిఎంసి వరకు చేరిన అనంతరం అవుకు నుంచి కృష్ణాజలాలను నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న నీటితో మైలవరం జలాశయం నుండి పట్టణ ప్రజల తాగునీటి కోసం దక్షిణ కాలువ ద్వారా నీటిని తరలించడానికి అంతగా సాధ్యపడదనే అనుమానాలు అటు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాగా మైలవరం జలాశయం కింద ఉన్న గ్రామాలు తాగునీటి సమస్య ఏర్పడిన సందర్భంలో కొంతమేరా నీటి విడుదల జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేయించడం జరిగింది. అదే రీతిలో ఉన్న కాస్త నీటిలోనైనా ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి కోసం మైలవరం దక్షిణ కాలువ ద్వారా వదిలినట్లయితే కనీసం ఈ ఏడాదైనా పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులను నీటి విడుదల చేయాలని పత్రికల ద్వారా, స్వయంగా కోరడం జరిగింది. ఈ చర్చ గత సంవత్సరం డిసెంబర్ నెల నుంచి జరుగుతున్నప్పటికి నీటి విడుదల పై స్పష్టమైన ప్రకటన రాక మునుపే కృష్ణజలాలను ఆపివేయడంతో పెన్నమ్మ అడుగంటి పోవడంతో దాహార్తి కోసం పట్టణ ప్రజలు ఎదురుచూపు చూస్తున్నారు. ఎంతమేరా సమస్య తీర్చగలుగుతారో ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడుతొంది.

బ్యాంకు రుణాల వసూళ్లకు రంగంలోకి పోలీసులు!
* ఆర్‌ఆర్ యాక్ట్ ప్రయోగానికి రంగం సిద్ధం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 2 : ఇక నుంచి వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వసూలు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకుకలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. వివిధ బ్యాంకుల ద్వారా పొదుపు గ్రూపులకు, ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ఇచ్చిన రుణాలు, ప్రజా సంక్షేమం కింద వివిధ సబ్సిడీ రుణాల వసూళ్లకు సంబంధిత మండల రెవెన్యూ అధికారుల నేతృత్వంలో వివిధ శాఖల అధికారులను రంగంలోకి దింపి వసూళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే నాబార్డు జనరల్ మేనేజర్లు, అన్ని జాతీయ బ్యాంకుల ఛీఫ్ మేనేజర్లు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులఛీఫ్ మేనేజర్లతోపాటు డీ ఆర్ డీ ఏ, మెప్మా, ఎస్సీ, ఎస్టీ, బి.సి, ఉద్యానవన శాఖ జిల్లా ఉన్నతాధికారులు ఇటీవలే కలెక్టర్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసి హుకుం జారీ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సంబంధిత శాఖలకు చెందిన అధికారులు బ్యాంకర్లతో సమావేశమై బకాయిల వసూళ్లకు అందరూ సహకరించాలని ఆదేశించారు. అంతేగాకుండా రెవెన్యూ రికవరీ యాక్ట్ ( ఆర్ ఆర్ యాక్ట్) ప్రయోగించి వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు క్షేత్ర స్థాయి, మండల, నియోజకవర్గ స్థాయిల్లో అదే పనిలో ఉన్నారని, ఈ నేపథ్యంలో ప్రత్యేకించి జిల్లా అధికారులను అజమాయిషితో లబ్ధిదారుల ఇళ్లకు పంపడంపై బడుగు, బలహీన వర్గాల ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అదేవిధంగా బినామీ పేర్లతో, కోట్లాది రూపాయలు రుణాలు తీసుకున్న బడా నేతలను వదిలేసి అసలు పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించకుండానే బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేత వారిని వదిలి పెట్టి చిన్నా, చితక రుణాలు తీసుకున్న బడుగులపై ఆర్‌ఆర్ యాక్ట్ ప్రయోగంపై పలువురి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి రైతులు తీసుకున్న రుణాలపై కూడా ఒత్తిడి తేనున్నారు. దీంతో వరుస కరవులతో అల్లాడుతున్న రైతాంగానికి ఆర్‌ఆర్ యాక్ట్ గొడ్డలిపెట్టుగా మారనుంది. మొత్తం మీద భారీ రుణాలుతీసుకుని ఎగవేత, సంబంధిత రుణాలు తీసుకున్న ఫర్మ్‌లను మూత వేసిన వారిని వదిలివేసి బడుగులపై కొరడా ఝులిపించనున్నారు.

భూదాన భూముల కైంకర్యానికి యత్నాలు!
* సర్వే నెంబర్ 561/బిపై పెద్దల కన్ను
* రంగంలోకి దిగిన మధ్యవర్తులు
జమ్మలమడుగు, జనవరి 2 : నాడు ఉద్యమ స్పూర్తితో పూర్వీకులు దానం చేసిన భూదాన ట్రస్టు భూములపై వారసుల స్వార్థం, రెక్కలు తొడిగిన భూముల రేట్లు వెరిసి కొందరు నేతలపరం కానుంది. వివరాల మేరకు ముద్దనూరు రోడ్డులోని ఫైర్‌స్టేషన్ ఎదురు ప్రాంతంలోని సర్వే నెంబర్ 561/బిలో సుమారు 20 ఎకరాల భూమి వుంది. పట్టణంకు చెందిన వంకదార సుబ్బయ్య మనుమడు గురప్ప వంశపారంపర్యంగా సంక్రమించిన ఈ ఆస్తిని 1956లో ఆచార్య వినేబాబావే భూదాన్ ట్రస్టుకు రాసి ఇచ్చారు. తరువాత కాలంలో ఈ భూములపై ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికి తోడు భూములను పొందిన ట్రస్టు వేరే ప్రాంతంలో వుండడంతో వీటిపై పర్యవేక్షణ కరువైంది. దీంతో ఆ భూమిని 1966లో గురప్ప బంధువు లక్ష్మీతాయారమ్మ తన కూతురు ఆర్.సుధారాణి పేరున రాసి ఇచ్చారు. 1968లో సుధారాణి భూమిని రామయ్య అనే వ్యక్తికి విక్రయ దస్తావేజుగా రాసి ఇచ్చారు. పెద్దగా పట్టింపు లేని ఈ భూములకు ప్రస్తుతం రేట్లు కోట్లలో వుండడంతో కొందరి పెద్దలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని భూదాన్ బోర్డులో వీటికి సంబంధించిన దాన పత్రాల విషయంపై చేతివాటం ప్రదర్శించారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ విషయం గత ఏడాది బయటకు పొక్కడంతో ఇంతవరకు ఎవరూ పట్టించుకోని ఈ భూములపై కొందరు పెద్దల కన్నులు పడింది. దీనికి తోడు మరికొందరు ఈ భూములకు తమదేనంటూ మంతనాలకు ప్రయత్నాలు చేపట్టినట్లు తెలుస్తోంది. 1920లో వంకదార గురప్ప ఐపి పెట్టగా కోర్టు ద్వారా ఆర్.నరసింగరావు వేలంద్వారా దక్కించుకున్నారని, అనంతరం నరసింగరావు తరపున ఆయన బంధువు ఆర్ సిద్దప్పకు కోర్టు ద్వారా ఆస్థి సంక్రమించింది. సిద్దప్ప ముగ్గురు కుమారులు తమకు సెటిల్‌మెంట్ ద్వారా రాసి ఇచ్చారని కర్నాటక రాష్ట్ర బెల్గాంకు చెందిన మనోహర్‌రావు అనే వ్యక్తి గత కొంతకాలంగా పట్టణంలో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొందరు పెద్దలు రంగంలోకి కోట్ల విలువ భూములపై తమదైన శైలిలో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రస్టు నిబంధనల ప్రకారం క్రయవిక్రయాలు చెల్లవు. అయితే ఇప్పటికే ఈ భూములకు కొందరి చేతుల్లోకి వారసలమని చెప్పుకుంటున్న వారి నుండి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సర్వేనెంబరు 561/బిలోని భూదాన్ భూములపై పూర్తి స్థాయిలో విచారించి అర్హులైన వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

కార్మికుల సంక్షేమమే లక్ష్యం
* రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ ఆంజనేయులు
కడప (రూరల్), జనవరి 2 : రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల కార్మికుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ బి. ఆంజనేయులు తెలిపారు. బుధవారం కలెక్టర్ సభా భవనంలో ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 40 వేల ఫ్యాక్టరీల్లో 12 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు. వీరందరికీ 1000 రూపాయల వరకు పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి కార్మికుల కోసం ఐదు సూత్రాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అందులో ప్రతి కార్మికునికీ గుర్తింపు కార్డు ఇవ్వాలని, అదే విధంగా కార్మికులు కూడా యాజమాన్యాన్ని గౌరవించాలన్నారు. కార్మికులకు భద్రత కల్పించాలని, దీనికి తోడు కార్మికులకు పని తనంలో నాణ్యత చూపించాలని సంక్షేమ కార్యక్రమాలను వాళ్లకు అర్థమయ్యే విధంగా అధికారులు కార్మిక సంఘాలు తెలపాలన్నారు. అంతేకాకుండా కుల సంఘాల కార్మికులు 40 వేల మంది ఉన్నారన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షా 25 కోట్ల నిధులు కార్మికుల అభివృద్ధి కోసం కేటాయించినట్లు తెలిపారు. అదే విధంగా మహిళా కార్మికుల పెళ్లిళ్ల కోసం రూ. 10 వేలు, మొదటి ప్రసూతి అలవెన్స్ రూ. 5 వేలు, రెండవ ప్రసూతికి రూ. 5 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌డి వై స్కీం కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ఈ పథకం మన రాష్ట్రంలో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఉందన్నారు. ఈ పథకం పని బాగోగులను గమణించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో అన్ని జిల్లాల్లో ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 2 లక్షల లక్ష రూపాయలు, సహజ మరణం చెందిన కార్మికులకు 30 వేల రూపాయలు, శాశ్వత అంగవైకల్యం జరిగితే 25 వేలు, పూర్తి అంగవైకల్యం జరిగితే 2 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. వివాహ సమయాల్లో కార్మికురాలు యొక్క కుమార్తెలకు 5 వేల రూపాయలు అందజేస్తారన్నారు. కార్మిక సమస్యలపై నెలలో ఒక పర్యాయం సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అనిల్‌కుమార్‌ను కమిషనర్ కోరారు. అందుకు కలెక్టర్ స్పందించి కార్మికులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నానని, సమస్యలు

* పగలు ఉక్కపోత, రాత్రి కరెంటు కోత * పరిశ్రమలు, జిరాక్స్ సెంటర్లు మూత * ఆందోళనలకు సిద్ధమవుతున్న ప్రజలు
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>