Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ బూటకాలు ప్రజలు నమ్మరు

$
0
0

పిఠాపురం, జనవరి 2: వైఎస్‌ఆర్, కాంగ్రెస్ పార్టీ బూటకపు కబుర్లు ప్రజలు నమ్మే స్ధితిలో లేరని రాష్ట్ర టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి, సినీ నటి కవిత ఆయా పార్టీలను దుయ్యబట్టారు. పిఠాపురం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎస్‌విఎస్‌ఎన్ వర్మ చేపట్టిన 325 కిలోమీటర్ల పాదయాత్ర నేటితో ముగియనుండడంతో పిఠాపురం పట్టణంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా ప్రసంగించారు. వైఎస్‌ఆర్ పార్టీ నాయకుడు జగన్ కోట్లాది రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జగన్‌ను ఏ విధంగానైనా జైలు నుంచి విడిపించాలనే కోటి సంతకాల సేకరణ చేపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టిడిపి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేసే పార్టీ టిడిపియేనన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎస్‌విఎస్‌ఎన్ వర్మ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, అల్లుమల్లు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమార్కులను గాలికి వదిలేసిన ఎసిబి
* 3‘మద్యం’ కేసులతో ఉక్కిరిబిక్కిరే కారణం * ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు లేవు..ఆకస్మిక తనిఖీలు లేవు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జనవరి 2: అవినీతి, అక్రమాలకు పాల్పడే అక్రమార్కులను అవినీతి నిరోధకశాఖ గాలికి వదిలేసింది. మద్యం సిండికేట్ల కేసులు ఒత్తిడి కారణంగా 2012లో ఇతర కేసులను అంతగా పట్టించుకోకపోవటంతో అక్రమార్కులు చెలరేగిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అంతకు ముందు సంవత్సరాల్లో ఏసిబి నమోదుచేసిన కేసులతో పోలిస్తే, 2012లో సరయిన కేసులే నమోదుకాలేదు. 2011డిసెంబరు నుండి మద్యం సిండికేట్ల కార్యాలయాలపై ఏసిబి అధికారులు దాడులు చేయటం మొదలైన దగ్గర నుండి ఈ కేసులు ఓ కొలిక్కి రావటానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో అంతకు ముందు సంవత్సరాల్లో అన్ని రకాల కేసులు కలిపి సుమారు 20వరకు నమోదయ్యేవి. లంచం తీసుకుంటున్న రాష్టప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవటం, ఆదాయానికి మించిన ఆస్తులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మికంగా తనఖీ చేయటం వంటి కేసులను ఏసిబి నమోదుచేసేది. ఈ కేసులన్నీ కలిపి అంతకు ముందు సంవత్సరాల్లో 20వరకు ఉంటే, 2012లో తూర్పుగోదావరి జిల్లాలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇంతకు మించి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులుగానీ, ఆకస్మిక తనిఖీలుగానీ నమోదుకాలేదు. 2012 ప్రారంభం నుండే మద్యం సిండికేట్ల కేసులు ఏసిబి అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసాయి. పోనీ ఈ కేసుల్లోనైనా ఆశించిన ప్రగతిని సాధించారా అంటే అదీ అంత సంతృప్తికరంగా కనిపించటం లేదు. ఏసిబి అధికారులు పూర్తిగా తమ సమయాన్ని మద్యం సిండికేట్ల కేసులకే వెచ్చిస్తుండటంతో వివిధ ప్రభుత్వశాఖల్లో అక్రమాలకు పాల్పడే వారు రెచ్చిపోయారు. అలాగని మద్యం మామూళ్లు కూడా ఎక్కడా ఆగినట్టు కనిపించటం లేదు. ఎప్పటి మాదిరిగానే ఎవరి వాటా వారికి వెళ్లిపోతున్నట్టు సమాచారం అందుతోంది. అయితే మద్యం సిండికేట్లపై ఏసిబి దాడుల కారణంగా కొత్తగా అమలులోకి వచ్చిన లాటరీ వేలం కారణంగా మందు బాబులు ఎమ్మార్పీకే మద్యం కొనుగోలుచేసుకోగలుగుతున్నారు. ఇది మినహాయిస్తే మిగిలిన లావాదేవీలు 3మామూలు2గానే సాగుతున్నట్టు సమాచారం అందుతోంది.
నగదు బదిలీపై కలెక్టర్ సమీక్ష
గొల్లప్రోలు, జనవరి 2: నగదు బదిలీ పధకం అమలుపై జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయరామ్మ్రేష్‌తో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మండల పరిధిలో నగదు బదిలీ పధకం, ఇందిర జలప్రభలను ప్రారంభించనున్న నేపధ్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయా పధకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎంత మందికి బ్యాంక్ ఖాతాలు ప్రారంభించారన్న అంశంపై బ్యాంక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు సంబంధించిన మైక్రో ఎటిఎంలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని ఆదేశించారు. అలాగే ఆధార్ సీడింగ్‌కు సంబంధించిన పూర్తి డేటాను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. నగదు బదిలీ ప్రారంభం సందర్భంగా ఎటువంటి లోపాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. అంతకు ముందు కొత్తవజ్రకూటం గ్రామంలోని ఇందిర జలప్రభ పధకం లాకుకు సంబంధించిన బోరును పరిశీలించారు. అలాగే నగదు బదిలీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనడడంతో హెలీప్యాడ్ నిర్మాణానికి అనువైన స్ధలం కోసం చేబ్రోలు గ్రామంలో ఆదర్శ్ ఇంజనీరింగ్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట స్థలాలను పరిశీలించి అనువుగా లేవని గుర్తించారు. ఈ సమావేశంలో డ్వామా పిడి మధుసూదన్, డిఆర్‌డిఎ పిడి మధుకర్‌బాబు, అడ్మిన్ ఎస్పీ సత్యనారాయణ, సోషల్ వెల్ఫేర్ జెడి విజయ్‌కుమార్, ఎంపిడిఓ ఎస్ సత్యనారాయణ, తహశీల్దార్ పినిపే సత్యనారాయణ, పలువురు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
కలుషిత ఆహారంతో 20 మంది గిరిజన బాలికలకు అస్వస్థత
రంపచోడవరం, జనవరి 2: స్థానిక గిరిజన బాలికల వసతిగృహంలో 20 మంది విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెడితే బుధవారం వసతిగృహంలో విద్యార్థినులకు విరేచనాలు అవడంతో హాస్టల్ సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి పప్పు, తోటకూరతో భోజనం చేసిన విద్యార్థినులు బుధవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్యం చేసిన అనంతరం తిరిగి వసతిగృహానికి పంపారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందని స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. డిడి హేమలతారాణి ఆదేశాల మేరకు వసతిగృహంలో గెద్దాడ పిహెచ్‌సి వైద్యులు శిబిరం నిర్వహించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం బాగానే వుందని వసతిగృహ సిబ్బంది తెలిపారు.

తుని నుంచే పోటీ చేస్తా
టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల
కోటనందూరు, జనవరి 2: రానున్న సాధారణ ఎన్నికలలో తుని నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రకటించారు. దీంతో తుని అసెంబ్లీ నుండి యనమల పోటీపై నెలకొన్న అనుమానాలకు ఆయన ప్రకటనతో తెరపడింది. కె మల్లవరం గ్రామంలో మండల టిడిపి అధ్యక్షులు గాడి రాజబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండలానికి చెందిన టిడిపి నాయకులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయమై యనమలను అడగగా ఆయన పై విధంగా స్పందించారు. తాను రాజ్యసభకు వెళ్తున్నాననే వార్తలు వెలువడే నేపధ్యంలో తుని నుండి పోటీ చేయననే అపోహలు వ్యాపించాయని అయితే అందులో వాస్తవం లేదన్నారు. కార్యకర్తలు, అభిమానుల కోర్కెలపై తాను తుని పరిధిలో నిలుస్తానని కార్యకర్తల మధ్య యనమల వెల్లడించారు. 2014 ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సహకార, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయానికి అందరూ సమిష్టగా కృషి చేయాలని ఆయన కార్యకర్తకలు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చిన తనను నేరుగా సంప్రదించవచ్చని అన్ని వేళల అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి తుర్లా లోవరాజు, మాజీ ఎంపిపి గొర్లి అచ్చియ్యనాయుడు, మాజీ జెడ్‌పిటిసి పి భాస్కరసత్యనారాయణ, పెనుమూర్తి నాగేశ్వరరావు, ఎ సత్యంమూర్తి, జి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
రేపు తపోవనంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ
తుని, జనవరి 2 : తుని పరిసర ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక శోభలు అందిస్తున్న కుమ్మరిలోవ తాండవ నదీ సమీపానగల తపోవనంలో ఈ నెల 4వ తేదీన వివిధ దేవతామూర్తుల విగ్రహప్రతిష్ఠ సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ శక్తిగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ దత్తాత్రేయ,ప్రసన్నాంనేయ,శ్రీ చక్రరాజాధిష్ఠత, శ్రీ రాజారాజేశ్వరి దేవతమూర్తుల విగ్రహాలకు ప్రతిష్ఠిస్తున్న సందర్భంగా వైభవంగా పూజలు నిర్వహించారు. అన్నవరం దేవస్థానం, తలుపులమ్మలోవ దేవస్థానం వేదపండితుల పాల్గొని శృంగేరి పీఠాధీశ్వరుని పాదుకలను పూర్ణ కుంభంతో యజ్ఞశాలకు మేళ తాళాలతో శాస్త్రోత్రంగా తీసుకెళ్లి వందన సమర్పణ, యాగసంకల్పం చేశారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనం, వంటి కార్యక్రమంతోపాటు ప్రతిష్ఠించిన విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.శుక్రవారం విగ్రహాప్రతిష్ఠ అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సచ్చిదానంద సరస్వతి స్వామిజీ తెలిపారు.
లింగంపర్తి దళితుల భారీ ర్యాలీ
దళిత నేతల డిమాండ్లకు అధికారులు అంగీకారం

ఏలేశ్వరం, జనవరి 2: ఫ్లెక్స్ బోర్డు ఏర్పాటులో జరిగిన వివాదం బుధవారం కూడ ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో రగులుతూనే వుంది. జిల్లా ఎస్సీ, ఎస్టీ మోనటరింగ్ సెల్ సమక్షంలో ఏర్పడిన శాంతి చర్చలు గ్రామస్థులను శాంతింపచేసినా ఆ దాడిలో మనస్తాపానికి గురైన దళిత సామాజిక వర్గాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉన్నతాధికారులు వ్యవహరించడం లేదని ఆ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం లింగంపర్తి గ్రామం నుండి వందలాది మంది దళితులు మూడు కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరారు. ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావాలని పెద్దాపురం ఆర్డీవో డాక్టర్ శివశంకర వరప్రసాద్, డిఎస్పీ కరణం కుమార్ తహసీల్దార్ కెజె ప్రకాష్‌బాబు, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, తుని సిఐలు రామ్మోహనరెడ్డి, సోమశేఖర్, భరత్‌మాతాజీ, భాస్కరరావుతో పాటు ఆయా సర్కిల్ పరిధిలో ఎస్సైలు, సిబ్బంది విశేషంగా కృషి చేస్తున్నారు. అనుక్షణం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిరంతరం డేగ కన్నుతో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలావుండగా లింగంపర్తి గ్రామంలో 144వ సెక్షన్ అమలులో వున్నందున ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించకుండా దళిత నాయకులు శాంతియుతంగా గ్రామం బయటకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ర్యాలీ గేటు బయటనే ఆర్ అండ్ బి రహదారిపై బైఠాయించి నాయకులు మాత్రమే తహసీల్దార్ కార్యాలయంలో వేచివున్న ఆర్డీవో, డిఎస్పీ, తహసీల్దార్ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడిన వారిలో దళిత నాయకులు శ్యామ్ దయాకర్, కొండేపూడి శ్యాంబాబు, కె రాజేంద్ర, ఎస్ మోషేరావు, బోండు వీరబాబు, నల్లబాబు, బోండ్ల శేఖర్, చవల పాపారావు, శ్యాంకుమార్, అనంతారపు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 48 గంటల నుండి లింగంపర్తిలో దళితవాడలో మంచినీటి సౌకర్యాన్ని నిలిపివేశారని, ఆ వాడలో దళితులు పనులు లేక పస్తులుంటున్నారని, దాడులు జరిగిన ప్రాంతంలో దళితులకు తాగేందుకు నీరు, తినేందుకు తిండి ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొన్నా ఉన్నత స్థాయి అధికారులకు నివేదికలు పంపామని చేతులు దులుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గురువారం ఉదయం పది గంటలకల్లా దాడిలో పాల్గొన్న వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఏలేశ్వరం ఎస్సైపై చర్యలు తీసుకోవాలని, పది రోజులు దళితవాడల్లో వున్నవారికి ఆహారం, మంచినీరు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు జిల్లా ఉన్నతాధికారులతో చర్చలు జరిపి వారి ఆదేశాల మేరకు డిమాండ్లను అంగీకరించడంతో నాయకులు శాంతించారు. ఇలావుండగా దానం లాజర్‌బాబు నాయకత్వంలో ప్రజలు రెండో కుంపటిగా ఆర్ అండ్‌బి రహదారిపై పడుకుని లింగంపర్తిలో దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ఉన్నతాధికార్లతో చర్చలు జరిపి వారి డిమాండ్లు ఫలప్రదం చేసుకుని ప్రజలతో చెప్పేందుకు వచ్చిన నాయకులు, అధికారులు లాజర్‌బాబు చర్యతో నివ్వెరపోయారు. అనంతరం ఆయనతో చర్చించి నాయకులు చెప్పిన డిమాండ్లకు లాజర్‌బాబు శాంతించడంతో ఆందోళనకారులు తమ ఆందోళన విరమించారు. ఈ నిరసన ప్రదర్శనలో ఏలేశ్వరం, యర్రవరం మధ్య వున్న ఆర్ అండ్ బి రహదారిపై సుమారు మూడు గంటలు ట్రాపిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
2 వేల మందికి భోజన వసతి
లింగంపర్తి గ్రామంలో దళితులపై దాడి ఘటన నేపధ్యంలో చట్ట ప్రకారం ఆ ప్రాంతవాసులకు ఆహారం, మంచినీటి సరఫరా చేయాల్సిందిగా ఆ సామాజిక వర్గానికి చెందిన జిల్లా, రాష్ట్ర నాయకుల డిమాండ్ చేయడంతో బుధవారం రాత్రి రెవెన్యూ అధికారులు స్పందించి, సుమారు 2 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని దళితవాడలో ఇంటింటికి తహసీల్దార్ ప్రకాష్‌బాబు స్వయంగా వెళ్ళి, ఆహారాన్ని, మంచినీటిని పంపిణీ చేయించారు. పెద్దాపురం ఆర్డీవో శివశంకర వరప్రసాద్ ఆదేశాల మేరకు లింగంపర్తి గ్రామంలో రెవెన్యూ అధికారులు దళితుల అవసరాలు తీర్చేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నారు. దీంతో దళితవాడలో పండుగ వాతావరణం నెలకొంది.

శబరిమలై యాత్రకు ఎమ్మెల్యే తోట
రామచంద్రపురం, జనవరి 2: అయ్యప్పస్వామి దీక్ష చేపట్టిన ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, పలువురు అయ్యప్పస్వామి దీక్షాధారులు బుధవారం మధ్యాహ్నం శబరిమలై బయలుదేరి వెళ్ళారు. బుధవారం ఉదయం ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత శ్రీ్భమేశ్వరస్వామి వార్ల ఆలయంలో ఇరుముడుల కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక అర్చకస్వామి కళ్ళేపల్లి ఫణికుమార్‌శర్మ ఈ కార్యక్రమానికి యాజ్ఞీకం చేశారు. ఇరుముడుల కార్యక్రమానికి అధికసంఖ్యలో ప్రజానీకం, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, తదితర అయ్యప్ప స్వామి భక్తులు ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణలు చేసిన అనంతరం శ్రీ్భమేశ్వరస్వామి వారిని, శ్రీమాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని, తమ భక్తిప్రపత్తులు చాటుకున్నారు. నియోజకవర్గ నలుమూలల నుండి అభిమానులు తరలివచ్చి, అయ్యప్పస్వామి దీక్షలో ఉన్న ఎమ్మెల్యే తో

వైఎస్‌ఆర్, కాంగ్రెస్ పార్టీ బూటకపు కబుర్లు ప్రజలు
english title: 
ysr

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>