Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అత్యాచారాల నిరోధానికి ఆకస్మిక తనిఖీలు

$
0
0

రాజమండ్రి, జనవరి 5: ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన నేపథ్యంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు కోస్తాంధ్ర ఐజి కె రాజేంద్రనాధ్‌రెడ్డి వెల్లడించారు. విద్యాసంస్థల బస్సులు, ఇతర బస్సుల్లో సిఐ, ఎస్‌ఐలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహింపజేస్తామన్నారు. ఈ విధానం వల్ల ఈవ్‌టీజర్లను వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. రాజమండ్రి అర్బన్‌జిల్లాలో అమలు చేస్తున్న విధంగా మహిళలు ఎక్కువగా సంచరించే బస్టాండ్లు, విద్యాసంస్థలు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లలో మహిళా ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం సాయంత్రం ఆయన రాజమండ్రి ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సుల డ్రైవర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి, ఈవ్‌టీజింగ్, మహిళా వేధింపుల జరిగితే సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరతామన్నారు. పోలీసు గస్తీని ముమ్మరం చేస్తామన్నారు. ఇందుకోసం సబ్‌కంట్రోళ్లను ఏర్పాటు చేస్తామని రాజేంద్రనాధ్‌రెడ్డి వెల్లడించారు. రీజియన్‌లో ఇళ్లల్లో చోరీ నేరాలు పెరిగాయన్నారు. చోరీలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తామని ఐజి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర చిన్ననేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అయితే పట్టణ, నగర ప్రాంతాల్లో మోసం, భూకబ్జా కేసులు పెరిగిపోయాయని చెప్పారు. ఈసందర్భంగా ఆయన ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్‌లో రికార్డులు తనిఖీ చేశారు. నేరాలపై సమీక్ష జరిపారు. ఈసమావేశంలో డిఐజి జి సూర్యప్రకాశరావు, అర్బన్ ఎస్పీ టి రవికుమార్‌మూర్తి, ఏఎస్పీ ఎస్ వరదరాజు, డిఎస్పీలు పాల్గొన్నారు.
నేడు ముఖ్యమంత్రి రాక
గొల్లప్రోలులో ప్రత్యక్ష లబ్ధి పథకం ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 5: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యక్ష లబ్ధి పధకాన్ని ప్రారంభించేందుకు ఆదివారం జిల్లాకు రానున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రత్యక్ష లబ్ధి పధకాన్ని గొల్లప్రోలులో లాంచనంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయరామ్మ్రేష్‌లు ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి రానున్న నేపధ్యంలో జిల్లా మంత్రులు కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి తోట నరసింహం గత రెండు రోజులుగా గొల్లప్రోలు ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రత్యక్ష లబ్ధి పధకం ప్రారంభానికి జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ కార్యక్రమ నిర్వాహణపై సంబంధిత అధికారులతో నిరంతరం చర్చిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యక్ష లబ్ధి పధకం క్రింద సాంఘిక భద్రతా పించన్‌లు, ఉపాధి హామీ వేతనాలు చెల్లింపు, రేషన్ బియ్యం పంపిణీ, బాలకార్మిక బడుల పిల్లలకు స్ట్ఫైండ్‌లు, జననీ సురక్ష యోజన క్రింద గర్భిణీలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు. ఈ పధకం ముఖ్య ఉద్ధేశ్యం నిజమైన అర్హులకే ప్రభుత్వ సాంక్షేమ పధకాలు అందాలని భావిస్తుండడంతో కార్యక్రమంపై అధికారులు ఇప్పటికే గొల్లప్రోలు మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. పిఠాపురం శాసన సభ్యురాలు వంగా గీత తన నియోజకవర్గంలో ప్రారంభమవుతున్న ప్రత్యక్ష లబ్ధి పధకం విజయవంతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయరామ్మ్రేష్‌లు నేరుగా హైదరాబాద్ నుండి ఆదివారం ఉదయం విమానంలో బయలుదేరి విశాఖపట్నానికి ఉదయం 8.15 గంటలకు చేరుకుంటారు. అనంతరం వారు రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10.30 గంటలకు గొల్లప్రోలు మండలం వజ్రకూటం గ్రామం చేరుకుని ఇందిర జలప్రభ బ్లాక్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం 11.25 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు. గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద వివిధ బ్యాంక్‌లు ఏర్పాటు చేసిన ఆధార్ అనుసంధానిత సేవల స్టాల్స్‌ను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తిలకించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రత్యక్ష లబ్ధి పధకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పధకం ద్వారా సాంఘిక భద్రతా పించన్‌లు, ఉపాధి హామీ వేతనాలు చెల్లింపు, రేషన్ బియ్యం పంపిణీ, బాలకార్మిక బడుల పిల్లలకు ఉపకార వేతనాలు, జననీ సురక్ష యోజన క్రింద గర్భిణీలకు ఆర్ధిక సహాయం, కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యక్ష లబ్ధి పధకం ప్రారంభించిన అనంతరం సభా వేదిక నుండి ప్రజలను ఉద్ధ్యేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు గొల్లప్రోలుకు వస్తుండడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం
గొల్లప్రోలు, జనవరి 5: గొల్లప్రోలు మండల పరిధిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయరామ్ రమేష్‌ల పర్యటనకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. నగదు బదిలీని గొల్లప్రోలు నుండే ప్రారంభించనుండడంతతో అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు కొత్త వజ్రకూటం గ్రామంలూని ఇందిర జలప్రభ బ్లాక్‌ను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం గొల్లప్రోలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో నగదు బదిలీని ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి జైరామ్మ్రేష్‌లు పాల్గొంటారు. ఇందు కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద బహిరంగ సభా వేదిక నిర్మాణం పూర్తి చేయడంతో షామియానాలు వేశారు. అళాగే మహిళ శక్తి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్టాల్స్‌కు ప్రత్యకంగా స్ధలాన్ని కేటాయించారు. బహిరంగ సభా వేదికను కొత్తవజ్ర కూటంలోని ఇందిర జలప్రభ బ్లాక్‌ను జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, ఎస్పీ శివశంకరరెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ జవహర్‌లాల్‌నెహ్రూ, డిఎస్పీ సాయిశ్రీ తదితరులు పాల్గొన్నారు. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత విశ్వనాధ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులను ఏర్పాట్లును పర్యవేక్షించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు భారీ బందోబస్తు
గొల్లప్రోలు: గొల్లప్రోలు మండలంలో ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జయరామ్మ్రేష్‌ల పర్యటనను పురష్కరించుకుని పోలీసులు భారీ భద్రత చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ, అడ్మిన్ ఎస్పీలతో పాటు ఐదుగురు డిఎస్పీలను, 19 సిఐలు 79 మంది ఎస్సైలను 163 మంది ఎఎస్సైలను, 700 మంది కానిస్టేబుల్స్‌ను, 50 మంది మహిళ కానిస్టేబుల్స్, 183 మంది హోంగార్డులు, 40 మంది మహిళ హోంగార్డులు బందొబస్తు నిర్వహిస్తున్నట్లు కాకినాడ డిఎస్పీ సాయిశ్రీ తెలిపారు.

బిపిఎస్ దరఖాస్తుల పరిష్కారానికి మరోసారి గడువు
* ఐదేళ్లుగా ఇదే తంతు* ఇంకా 50 శాతం దరఖాస్తులు పెండింగ్
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జనవరి 5: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్రప్రభుత్వం అమలుచేసిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీంలో దరఖాస్తుచేసుకున్న భవన యజమానులకు మరోసారి అవకాశం కల్పించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బిపిఎస్), లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్)లను రాష్ట్రప్రభుత్వం 2007లో తెరపైకి తీసుకొచ్చింది. పురపాలకసంఘాలు, నగరపాలకసంస్థలు ఆమోదించిన ప్లాన్లకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను, డిటిసిపి ఆమోదం లేకుండా వేసిన లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్రప్రభుత్వం అప్పట్లో ఈ పథకాలను అమలుచేసింది. ఈ పథకం కింద భవనాలను, లే అవుట్లు, లేదా లే అవుట్‌లోని స్థలాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు చాలా మంది యజమానులు దరఖాస్తులు సమర్పించారు. అయితే ఈ దరఖాస్తులు సక్రమంగా లేకపోవటంతో రాష్ట్రప్రభుత్వం భవన యజమానులకు, స్థలం యజమానులకు దఫదఫాలుగా అవకాశాలు ఇస్తూ వచ్చింది. గత ఐదేళ్లుగా గడువును ప్రతి ఆరు నెలలకోసారి పొడిగిస్తూ వస్తున్నాగానీ, ఇంత వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పూర్తిగా పరిష్కారం కాలేదు. లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) కింద స్థలాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు ఇప్పటికీ మరో ఆరు నెలల గడువు ఉంది. కానీ బిపిఎస్‌లో భవనాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు మాత్రం గత డిసెంబరు 31వ తేదీతో గడువు ముగిసింది. బిపిఎస్ కింద తమ భవనాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ దరఖాస్తుచేసుకున్న వారు నిర్ణీత ఫీజు చెల్లించకపోవటం, నిర్ణీత ప్లాన్లను జతచేయకపోవటం వంటి కారణాల వల్ల ఆయా దరఖాస్తులు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. ఇలాంటి దరఖాస్తుదారులకు ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా పరిష్కరించుకోవటం లేదు. బిపిఎస్‌లో దరఖాస్తుచేసుకోవటం వల్ల అనవసరంగా రూ.20వేల నుండి రూ.లక్ష వరకు భవనం విస్తీర్ణాన్నిబట్టి చెల్లించాల్సి వస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మించినాగానీ, అసలు దరఖాస్తు చేయనివారి జోలికి ఎవరూ వెళ్లటంలేదన్న ఉద్దేశ్యంతో చాలా మంది దరఖాస్తుదారులు బిపిఎస్‌కు ఎన్నిసార్లు రాష్ట్రప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ సార్లు అవకాశాలు ఇచ్చిన తరువాత బిపిఎస్‌లో తమ భవనాలను క్రమబద్ధీకరించుకోని వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. బిపిఎస్‌లో క్రమబద్ధీకరించుకోని భవనాలకు విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను, తాగునీటి చార్జీలను 25శాతం అదనంగా పెంచటం లేదా ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భాగాన్ని తొలగించటం వంటి చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అంత కఠినమైన చర్యలను రాష్ట్రప్రభుత్వం తీసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో మరోసారి బిపిఎస్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
శివలింగ జీర్ణోద్ధరణ పనులకు
భీమేశ్వరాలయం , చాళుక్య కుమారారామం మూసివేత
రామచంద్రపురం/సామర్లకోట, జనవరి 5: కేంద్ర పురావస్తు శాఖ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ద్రాక్షారామ శ్రీ్భమేశ్వర స్వామివార్ల మూల విరాట్‌గా విరాజిల్లుతున్న శివలింగ జీర్ణోద్ధరణ పనుల కోసం శనివారం మధ్యాహ్నం నుండి శ్రీ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు మూసివేసారు. అలాగే సామర్లకోట పంచారామ క్షేత్రం చాళుక్య కుమారారామ భీమేశ్వరాలయంలోని యోగలింగం రసాయన పూతల మరమ్మతు పనుల నిమిత్తం పురావస్తు శాఖ అధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం ఆలయం మూసివేశారు. ద్రాక్షారామలో శనివారం ఉదయం శ్రీ స్వామివారు, అమ్మవార్లకు మేలుకొలుపు, సుప్రభాత కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, తీర్థపు బిందెతో శ్రీ స్వామివార్లకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బాలభోగం అనంతరం కళాపకర్షణ పనులకు పురోహితులు, ఆలయ అనువంశిక అర్చక స్వాములు, వేద పండితులు, స్వస్తివాచకులు శ్రీకారం చుట్టారు. ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, పంచగవ్య ప్రాశనలను రుత్విక్కులు వేదోక్త మంత్రోచ్ఛారణలతో నిర్వహించారు. అనంతరం కళాపకర్షణ నిర్వహించి, మూలవిరాట్ ఉన్న గర్భాలయ తలుపులను మూసివేసారు. శ్రీస్వామివారు, అమ్మవార్ల తదితర దేవతామూర్తులను నంది మండపంలో వేంచేయింపచేసారు. తొలుత ఆలయ ప్రాకారంలో మంగళవాయిద్యాల నడుమ, త్రికాల ప్రదక్షిణ నిర్వహింపచేసారు. ఈ నెల 10న ద్రాక్షారామలో సంప్రోక్షణ, కళాన్యాసం నిర్వహించిన అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. శ్రీ భీమేశ్వర స్వామివారి మూలవిరాట్ జీర్ణోద్ధరణ పనులు నిర్వహించే సమయంలో, పూర్తి అయ్యేవరకు ఉత్సవ మూర్తులు, ఇతర దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులను అనుమతిస్తారు. అయితే అభిషేకాలు గానీ, ప్రత్యేక పూజలు గానీ నిర్వహించరని అనువంశిక అర్చకస్వామి కళ్ళేపల్లి ఫణికుమార్ శర్మ తెలిపారు.
సామర్లకోటలో...
సామర్లకోట పంచారామ క్షేత్రం చాళుక్య కుమారారామ భీమేశ్వరాలయంలోని యోగలింగం రసాయన పూతల మరమ్మతు పనుల నిమిత్తం పురావస్తు శాఖ అధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం ఆలయం మూసివేశారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా నంది మండపంలో స్వామివారి అమ్మవారి, ఉత్సవ విగ్రహాలను ఏర్పాటుచేశారు. తొలుత ఉదయం 9 గంటలకు కలశ ఆవాహన పూజలు నిర్వహించి ఆలయ అభిషేక పండిట్ వేమూరి సోమేశ్వరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు కలశంలో స్వామివారిని నిక్షిప్తం చేసి మూలవిరాట్, స్వామివారు, అమ్మవారి ఆలయాలకు తాళాలు వేసి, ఉపాలయాలను మూసివేసి నంది మండపంలో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటుచేశారు. శివలింగానికి రసాయన మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టాలని, పాన మట్టం వద్ద శాశ్వత చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో అల్లు వెంకట దుర్గ్భావానీ, ఆలయ అర్చకులు చెరకూరి భీమేశ్వరశర్మ, రాంబాబు తదితరులున్నారు.

సర్‌చార్జీలు..విద్యుత్ కోతలతో జనానికి కాంగ్రెస్ షాక్
* సర్వనాశనమవుతున్న వ్యవసాయ రంగం* నష్టాల్లో ఆయిల్‌పామ్ రైతులు* దేశం నాయకుడు గన్ని
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జనవరి 5: రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో 2009లో ప్రజలకు మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సర్‌చార్జిలు, విద్యుత్ కోతల రూపంలో తన అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గన్ని కృష్ణ దుయ్యబట్టారు. శనివారం తన కార్యాలయంలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రజలకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరో విడత విద్యుత్ సర్‌చార్జి రూ.10వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఇంత దారుణమైన విద్యుత్ విధానం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. శీతాకాలంలో కూడా విద్యుత్ కోతలు విధిస్తున్నారని, అప్రకటిత కోతతో జనం అల్లాడుతున్నారన్నారు. అటు విద్యుత్ చార్జీలు, ఇటు కరెంటు కోతతో ప్రజలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న రబీ సీజన్‌కు, విద్యార్ధులకు పరీక్షల సమయంలోనూ విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలించుకునే ప్రయత్నంలో ఉన్నారని, కానీ ఎటూ తరలించుకోలేని భూములతో రైతులు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదన్నారు. జిల్లాలో ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా చేయకపోవటం వల్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో జరగటం లేదన్నారు. సోలార్ విద్యుత్‌పై కూడా కనీసం దృష్టిసారించటం లేదన్నారు. జిల్లాలోని విద్యుత్ ప్లాంట్లు గ్యాస్ సరఫరాలేని కారణంగా పూర్తిస్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేయలేక, సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వలేక సతమతమవుతున్నాయన్నారు. 7 గంటలు విద్యుత్ సరఫరాకాకపోవటంతో బోర్ల కింద వ్యవసాయం దెబ్బతింటోందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల కారణంగా 5 వేల 500 మెగావాట్ల విద్యుత్ అదనంగా ఉత్పత్తయిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క మెగావాట్ కూడా అదనంగా ఉత్పత్తికాలేదన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో వృథాగా నీరు పోతున్నా, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పలేకపోయారన్నారు. ఆయిల్‌పామ్ రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించటం లేదన్నారు. టన్నుకు రూ.7 వేల 700 లభించిన పరిస్థితి నుండి ఇపుడు రూ.5 వేల 300కు ధర దిగజారిందన్నారు. బియ్యంపై 1శాతం వ్యాట్ విధించటం వల్ల రైతుకు క్వింటాలుకు రూ.26తగ్గుతోందని, ఈ విధానంలో రాష్ట్రంలో ఒక సీజన్‌కు రూ.250 కోట్ల భారం రైతులపై పడుతోందని గన్ని ఆరోపించారు. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమైనవిగా గన్ని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇంత వరకు ఆయనపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశం నాయకులు కోనేరు వివేక్, వర్రే శ్రీనివాసరావు, ప్రసాద్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రిలో చంద్రబాబు బహిరంగ సభ?
9న ఖమ్మంలో భవిష్యత్ పాదయాత్రపై నిర్ణయం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జనవరి 5: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్రను కొనసాగించాలని ఆపార్టీ పొలిట్‌బ్యూరో, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కనుక నిర్ణయిస్తే రాజమండ్రిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. వరంగల్ జిల్లాలో పాదయాత్రను ముగించుకుని 9వ తేదీన ఖమ్మంలో ప్రవేశించనున్న చంద్రబాబు, తన భవిష్యత్ పాదయాత్రపై కీలకమైన నిర్ణయాన్ని ఖమ్మంలోనే తీసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం 9న తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని ఖమ్మంలో ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా వరకు పాదయాత్రను కనుక కొనసాగిస్తే రాజమండ్రిలో బహిరంగ సభను ఏర్పాటుచేయాలని, ఆ బహిరంగ సభతోనే తొలి విడత పాదయాత్రను ముగించాలన్న ప్రతిపాదనలను కూడా తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. ఒకవేళ ముందుగా నిర్ణయించిన దానిప్రకారం ఉత్తరాంధ్ర వరకు పాదయాత్రను కొనసాగించాలని భావిస్తే మాత్రం రాజమండ్రిలో బహిరంగ సభను నిర్వహించిన అనంతరం, ఉత్తరాంధ్ర వరకు పాదయాత్రను కొనసాగించి అక్కడే ముగింపు పలుకుతారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.

* రీజియన్‌లో ఫిర్యాదు బాక్సులు*ఐజి రాజేంద్రనాధ్‌రెడ్డి
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>