Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అర్హతగల కౌలుదారులందరికీ రుణాలు

$
0
0

గుంటూరు, జనవరి 5: వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో అర్హతగల కౌలు దారులందిరికీ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ బ్యాంకర్లను కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 16,616 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించామన్నారు. వీరిలో 7,242 మంది కౌలు రైతులకు వివిధ బ్యాంకులు 16.90 కోట్ల రూపాయలు రుణాలను అందించాయన్నారు. అత్యధికంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు 5,940 మందికి 5,139 మంది కౌలు రైతులకు 12.64 కోట్ల రూపాయల రుణాలు అందించిందన్నారు. అయితే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,368 మంది రైతులకు కేవలం 440 మందికి మాత్రమే 95.91 లక్షల రూపాయల రుణాలు అందించడంపై జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్, ఎంపి రాయపాటి సాంబశివరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకులన్నింటిలోనూ ఎస్‌బిఐ పెద్దదైనప్పటికీ కౌలురైతులకు రుణాలు అందించడంలో వెనుకంజలో ఉందన్నారు. ఎంపి రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారునికీ జీరో నిల్వతో బ్యాంక్ ఖాతా తెరవాలని సూచించారు. గ్రామ రెవెన్యూ అధికారులు అడంగళ్ జారీ చేయడం లేదని వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ విఆర్‌ఒ ఇచ్చే అడంగళ్ చెల్లదని, మీసేవ కేంద్రం ద్వారా జారీ చేసే అడంగళ్ పత్రం మాత్రమే చెల్లుబాటు అవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు జెసి కె శారదాదేవి, ఆంధ్రాబ్యాంకు డిజిఎం కె వెంకటేశ్వర్లు, ఆర్‌బిఐ, నాబార్డు ఎజిఎంలు హరిహరణ్, నాగేశ్వరరావు, ఎల్‌డిఎం రామిరెడ్డి, వివిధ బ్యాంకుల అధికారులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అక్రమ ఓటర్లను చేర్పించిన ఘనతెవరిదో తెలుసుకోవాలి
ప సహకార శాఖ మంత్రి కాసు
మాచర్ల, జనవరి 5: సహకార సంఘంలో అక్రమ ఓటర్లను అత్యధికంగా చేర్పించిన ఘనతను మరచి రైతులకు అండదండలుగా నిలుస్తున్న తమపై ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. శనివారం వెల్దుర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మాచర్ల చేరుకున్న మంత్రి కాసు స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహంలో పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్రంలో సహకార సంఘాన్ని బలోపేతం చేసి రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించిన ఘనత కాంగ్రెస్‌పార్టీకే దక్కుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 40లక్షల మంది రైతులు సహకార సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారన్నారు. 1995లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కోటి 7లక్షల మందిని 20రోజుల్లో పంచాయతీ, అసెంబ్లీ పరిధిలోని ఓటర్లందరినీ రాత్రికి రాత్రి రైతులుగా గుర్తించి ఓటర్లుగా చేర్చిన ఘనత తెలుగుదేశంపార్టీకే దక్కుతుందన్నారు. కేవలం 9లక్షల మంది రైతులను ఓటర్లగా చేరిస్తే తమపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తానెప్పుడు పల్నాడులో శాంతినే కోరుకుంటానని కొందరు కావాలనే అలజడులు సృష్టిస్తూ అశాంతిని రగులుస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చౌకబారు ప్రయత్నాలను తానెప్పుడూ పట్టించుకోనన్నారు. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో ఆరుతడి పంటలను కాపాడేందుకు ప్రభుత్వంతో చర్చించి కృషి చేస్తానన్నారు. జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలలోని పంటలు నీరులేక ఎండిపోతున్న విషయాన్ని కొందరు మంత్రి దృష్టికి తీసుకరాగా వెంటనే మంత్రి కాసు ఇరిగేషన్ శాఖ కార్యదర్శి అజేంద్రపాల్‌తో ఫోన్లో పంటలను కాపాడేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. స్థానిక మార్కెట్ యార్డులో కొనసాగుతున్న సిసిఐ కేంద్రంలోని అమ్మకాల గురించి మార్కెట్ యార్డు చైర్మన్ వెంకట్రామిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పినె్నల్లి లక్ష్మారెడ్డి, కుర్రి పున్నారెడ్డి తదితరులు ఉన్నారు.
లాఠీచార్జి దురదృష్టకరం
ప నిరసన శిబిరంలో టిడిపి ఎమ్మెల్యేలు
నరసరావుపేట, జనవరి 5: సహకార సంఘాల సభ్యుల ఓట్ల నమోదు ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై తాము పోరాటం చేస్తుంటే పోలీసులు లాఠీచార్జి చేయడం దురదృష్టకరమని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గతనెల 23వతేదీన జరిగిన టిడిపి నాయకులు, కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా కుంపటి రవి ఆధ్వర్యంలో స్థానిక ఏంజల్ టాకీస్ సెంటర్ వద్ద జరుగుతున్న ముగింపు నిరసన దీక్షలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పట్టణ పార్టీ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రియాదవ్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం దారుణమన్నారు. సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఓడిపోతుందనే భయంతో సొసైటీ ఓట్ల నమోదులో అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్ తనయుడు జగన్మోహన్‌రెడ్డి పేదల సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ నాయకులకు కాలం దగ్గరపడిందని హెచ్చరించారు. డిఎస్పీ వెంకటరామిరెడ్డిపై చర్యలు తీసుకునేంతవరకు తమ పోరాటం ఆగదన్నారు. ప్రభుత్వం, పోలీసులు కళ్ళు తెరవాలన్నారు. నాలుగోతేదీన సహకార సంఘాల ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా, ఇంతవరకు ప్రకటించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మాట్లాడుతూ నరసరావుపేటలో పనిచేస్తున్న పోలీసులు, పోలీస్ అధికారులు మంత్రి కాసు కోసమే పనిచేస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జరిగిన సంఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. డాక్టర్ కోడెల శివరామకృష్ణ మాట్లాడుతూ హోంమంత్రి ఎలా పనిచేయాలో డాక్టర్ కోడెలను చూసి నేర్చుకోవాలని, పోలీస్ అంటే ఎలా ఉండకూడదో నరసరావుపేట డిఎస్పీని చూసి నేర్చుకోవాలన్నారు. ఖాకీదుస్తులను వదిలివేసి, ఖద్దర్ దుస్తులను వేసుకుంటే తామెంటో నిరూపిస్తామన్నారు. డిఎస్పీపై కేసును నమోదు చేసేంతవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదన్నారు. మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కుంపటి రవి మాట్లాడుతూ మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికి కృతజ్ఞలు తెలిపారు. తనపై మరిన్నికేసులను బనాయిస్తామని బెదిరింపుకాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం నిరసన దీక్షలో పాల్గొన్న వారికి ఎమ్మెల్యేలు ధూళిపాళ్ళ నరేంద్ర, జీవీ ఆంజనేయులు, ప్రభాకర్ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈకార్యక్రమంలో ఏడుకొండలు, మానుకొండ శివప్రసాద్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
నిర్దిష్ట ప్రణాళికతోనే నగరాభివృద్ధి
ప మంత్రి కన్నా సూచన
గుంటూరు (కార్పొరేషన్), జనవరి 5: ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించుకుని, తదనుగుణంగా అధికారులంతా కృషి చేస్తే నగరాభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. శనివారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి మంత్రి కన్నా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పలు పథకాల ద్వారా ప్రాజెక్టులు చేపట్టిన అదనపు నిధులతో నగరాభివృద్ధికి కృషి చేస్తోందని, గతంలో 20 కోట్లతో నగరాభివృద్ధి జరిగిందన్నారు. మొదటి విడతలో చేపట్టిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకాన్ని దృష్టిలో ఉంచుకుని రెండవ విడతకు గుంటూరు నగరాన్ని ఎంపిక చేయడం జరిగిందని, ఈ పథకం ద్వారా నగరాభివృద్ధికి ప్రణాళికా ముసాయిదాతో 3,958 కోట్ల రూపాయల ఆవశ్యకతను ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నామన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ నగరంలో విలీనమైన పది గ్రామాల తాగునీటి అవసరాలకు గాను రిజర్వాయర్లను నిర్మించాలని సూచించారు. ఆర్టీసీ ద్వారా నగరంలో సిటీ సర్వీసులను తిప్పాలన్నారు. ఎమ్మెల్యే మస్తాన్‌వలి పులిచింతల ప్రాజెక్టు నీటిని నకరికల్లు నుంచి తీసుకుని తాగునీటి సమస్యను తీర్చాలన్నారు. కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ జనాభా పెరుగుదల వలన స్థానిక సంస్థల ఆదాయంతో అభివృద్ధి పనులను చేపట్టలేకపోతున్నామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం ద్వారా నగరాభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రజల సూచనలతో భవిష్యత్ కార్యాచరణ చేపడతామని తెలిపారు. అనంతరం నగరాభివృద్ధిపై పట్టణాభివృద్ధి అడ్వైజరీ సంస్థ ప్రతినిధి శ్రీనివాసాచారి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కె సుధాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి రమాదేవి, అడ్వకేట్ బలరామయ్య, మాజీ కార్పొరేటర్లు రంగరాజు, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల పట్టాల కోసం పేదల రిలేదీక్ష
మంగళగిరి, జనవరి 5: పట్టణంలోని పాతమంగళగిరి, రత్నాలచెరువు, 21, 22 వార్డుల్లోని ఎస్టీ కాలనీ, భగత్‌సింగ్ నగర్, శ్రామికనగర్, సుందరయ్య నగర్‌లలో గడిచిన 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం సెంటర్లో సిపిఐ ఆధ్వర్యాన శనివారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. దీక్షాశిబిరాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రారంభించారు. పట్టణ సిపిఐ కార్యదర్శి కూరపాటి మురళీరాజు అధ్యక్షతన జరిగిన సభలో ముప్పాళ్ళ మాట్లాడుతూ సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు న్యాయం జరిగే వరకు అవిశ్రాంతంగా పోరాడుతామని ముప్పాళ్ల అన్నారు. రిలేదీక్షలో షేక్ ఆదాంబీ, సయ్యద్ ఇమాంబి, దుర్గ, శివకుమారి, జ్యోతి, నాగలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు. నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి రావుల శివారెడ్డి, పట్టణ సిపిఐ సహాయ కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, గంజి వెంకటేశ్వరరావు, మునగాల మల్లేశ్వరరావు, కట్టెపోగు రత్నమాణిక్యం, మద్దిరాల రమేష్, నూతలపాటి వెంకటేశ్వరరావు షేక్ సుభాని, దస్తగిరి, తిరుపతయ్య, జాన్‌బాబు, కోలా వీరాంజనేయులు మద్ధతు తెలిపారు.

అమరావతి అందాలపై ఛాయాచిత్ర పోటీలు
అమరావతి, జనవరి 5: గుంటూరు మోడల్ ఆర్ట్ అకాడమీ ద్వారా శిక్షణ పొందుతున్న విద్యార్థుల స్పెషల్ క్యాంపులో భాగంగా కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులకు శనివారం అమరావతిలోని ధ్యానాంజనేయ విగ్రహం వద్ద పెయిటింగ్స్, ఛాయాచిత్ర పోటీలు నిర్వహించారు. మోడల్ ఆర్ట్ అకాడమీ డైరెక్టర్ బి రమాదేవి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఆర్ట్ హిస్టరీ మీద శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన 40 మంది విద్యార్థులు ఈ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి
గుంటూరు, జనవరి 5: పెండింగ్‌లో ఉన్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో తాడికొండ, పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూ

ఎస్‌బిఐ తీరుపై కలెక్టర్, ఎంపి రాయపాటి అసంతృప్తి
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>