Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పరిపూర్ణమైన విద్యతోనే ఆర్థిక అసమానతలు దూరం

$
0
0

మైలవరం, జనవరి 5: పరిపూర్ణమైన విద్యతోనే సమాజంలో వేళ్ళూనుకున్న ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రవాసాంధ్రులు, వెల్వడం ప్రముఖుడు లకిరెడ్డి హనిమిరెడ్డి దాదాపు 11 కోట్ల రూపాయల సొంత నిధులతో నిర్మించి ఇచ్చిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని శనివారం ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో కులపిచ్చి, అగౌరవం, ఆర్థిక అసమానతలు, విభేదాలు నెలకొని ఉన్నాయని, వీటన్నింటినీ రూపుమాపేది సంపూర్ణ విద్యేనన్నారు. అటువంటి విద్యను మైలవరం ప్రాంత ప్రజలకు అందిస్తున్న లకిరెడ్డి కుటుంబీకులు ధన్యులని కొనియాడారు. మైలవరం ప్రాంతంలో విద్యా వ్యాప్తికి దాదాపు 35 కోట్లరూపాయలు హనిమిరెడ్డి వెచ్చించారని తెలిసిన తర్వాత ఈ రోజుల్లో ఇటువంటి దాతలు ఇంకా ఉన్నారా అనే ఆశ్చర్యం కలిగిందన్నారు. మంత్రి పార్థసారధి మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఏడాది 26 లక్షల మంది విద్యార్థులకు 4 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించినట్లు తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు 101 కోట్ల రూపాయల మెస్ చార్జీలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ హనిమిరెడ్డిలాంటి దాతలను అందరూ ఆదర్శంగా తీసుకుని వారి ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మైలవరానికి పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని, ఈ భవనంలోనే డిగ్రీ ఇంగ్లీష్ మీడియం కోర్సులను, పీజీ కోర్సులను ప్రవేశపెట్టి తెలుగు, ఇంగ్లీష్ మీడియం తరగతులను నిర్వహించాలని, విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను యుజిసి గ్రాంటు నుండి మంజూరు చేయాలని కోరారు. దాత లకిరెడ్డి హనిమిరెడ్డి అధ్యక్షతన
జరిగిన ఈ సభలో తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి, ఎమ్మెల్సీలు ప్రభాకర్, లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి, ఆర్‌జేడీ మోజెస్, లకిరెడ్డి బాలిరెడ్డి, ద్వారకా తిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, డిసిసి అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి ధన్‌రాజ్, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు రాజీవ్ రతన్, మైలవరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ అప్పసాని సందీప్, స్థానిక నేతలు పాల్గొన్నారు. అంతకుముందు కళాశాల భవనాన్ని ప్రభుత్వానికి రిజిష్ట్రేషన్ చేసిన పత్రాలను దాత హనిమిరెడ్డి ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ చేతుల మీదుగా ఆర్‌జేడీ శామ్యూల్ మోజెస్‌కు అందించారు.

తెలుగు జాతి గురించి చెప్పడమే
చరిత్రకారుల బాధ్యత
అవనిగడ్డ, జనవరి 5: దివి సీమ సమూల చరిత్రను వెలికి తీయలేకపోతున్నామని, స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు పాల్గొన్నారనేది చరిత్రలో ఉందని, స్వాతంత్య్రానికి ఊపిరి పోసింది ఆంధ్రులే అన్న విషయం చరిత్రలో వెల్లడి చేయటం లేదని అధికార భాషా సంఘ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక గాంభీ క్షేత్రం ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మహాసభల 37వ వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలుగు జాతి గురించి మన వంతుగా మహాసభల్లో చెప్పాల్సిన స్థితి ఏర్పడిందన్నారు. అదే చరిత్రకారులపై ఉన్న బాధ్యత అన్నారు. జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ పురాతన దేవాలయాల కట్టడాల గూర్చి తెలుసుకోవాలని, అతిశయోక్తి గురించి మాట్లాడే ఉత్సాహం చరిత్ర గురించి మాట్లాడే విషయంలో ఉండకూడదన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఈ చరిత్ర మహాసభలు గ్రామీణ ప్రాంతంలో జరగటం విశేషమన్నారు. బ్రిటిష్ లైబ్రరీల్లో మన తెలుగు సంస్కృతికి సంబంధించిన గ్రంథాలు, పోతన భాగవతం, తెలుగు ప్రముఖుల వస్తువులు ఇప్పటికీ ఏసి గదుల్లో జాగ్రత్త చేసి ఉండటం అదృష్టమన్నారు. అక్కడి ప్రదర్శనలోని వస్తువులను మనం ఇక్కడకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా అతిథులు 37వ చరిత్ర కాంగ్రెస్ పావనీర్‌ను, చరిత్ర కాంగ్రెస్ ప్రొసిడింగ్స్‌ను, లక్ష్మీనారాయణ స్వామి చరిత్రను, కాకతీయ ప్రభావం గ్రంథాన్ని ఆవిష్కరించారు. ప్రధానంగా మూడు తీర్మానాలు చేశారు. పురావస్తు కట్డడాలు కూల్చరాదని, సాహతీవేత్తలకు మాదిరిగానే చరిత్రకారులకు కూడా అవార్డులు ఇవ్వాలని, తెలుగు భాషా వికాసానికి సంబంధించి చరిత్రను కూడా భాగస్వామ్యం చేయాలని మహాసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

వైవాహిక సమస్యలను
ఫ్యామిలీ కౌనె్సలింగ్‌లో పరిష్కరించుకోవాలి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జనవరి 5: వైవాహిక సమస్యలను ఫ్యామిలీ కౌనె్సలింగ్ సెంటరులో పరిష్కరించుకోవాలని బందరు డిఎస్పీ లావణ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. తన కార్యాలయంలో శనివారం ఫ్యామిలీ కౌనె్సలింగ్ సెంటరును డిఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైవాహిక సమస్యలకు సంబంధించి మొదట పోలీస్ స్టేషన్‌లో తదుపరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. అక్కడ పరిష్కారం కాకపోతే ఫ్యామిలీ కౌనె్సలింగ్ సెంటరును ఆశ్రయించాలన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఆరుగురిని సభ్యులుగా నియమించినట్లు పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కౌన్సిలింగ్ చేసి సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్:
బందరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈ నెల 28వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్‌ను అమలుపర్చనున్నట్లు
డిఎస్పీ తెలిపారు. ఊరేగింపులు, సమావేశాలు, ధర్నాలు తదితర కార్యక్రమాలకు ముందస్తు అనుమతి పొందాలన్నారు. 48 గంటల ముందే సంబంధిత పోలీస్ అధికారుల అనుమతి పొందాలన్నారు. 30 పోలీస్ యాక్ట్‌ను ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆటోను ఢీకొన్న లారీ: ఒకరి మృతి
మైలవరం, జనవరి 5: మండలంలోని గణపవరం అడ్డరోడ్డు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన ఇది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కీర్తిరాయినిగూడెం శివారు పోరాటనగర్‌కు చెందిన కూలీలు రోజూ మాదిరిగానే శనివారం కూడా అడ్డరోడ్డు సమీపంలోని రైస్ మిల్లులో కూలి పని చేసేందుకు ఆటోలో బయలు దేరారు. వీరు గణపవరం అడ్డరోడ్డు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ కూలీల ఆటోను ఢీకొట్టటంతో అందులో ప్రయాణిస్తున్న లావూరి రాము(19) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న కారుమూరి శ్రీను, నల్లమోతు సుధాకర్, తానేటి పెద్దిరాజు, తానేటి నాగరాజు, బసవాని నాని, దేవరపల్లి రామకోటయ్య, అజ్మీర శ్రీనులు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన కారుమూరి శ్రీను, నల్లమోతు సుధాకర్‌లు తీవ్రంగా గాయపడటంతో వీరిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. మిగిలిన క్షతగాత్రులు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా సమాచారం అందుకున్న సీపీఐ నాయకుడు సీహెచ్ కోటేశ్వరరావు క్షతగాత్రుల్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. మరణించిన రాము మృత దేహానికి నివాళులర్పించారు. మృతుని బంధువులను పరామర్శించి సానుబూతి తెలిపారు. కాగా చనిపోయిన రాము కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికులకు చెక్కుల పంపిణీ
నందివాడ, జనవరి 5: ప్రభుత్వం నిరుపేదలకు ఆర్థిక చేయూత అందించే అందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందని దీనిని వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ చింతా కళావతి అన్నారు. శనివారం జనార్థనపురం సెంటర్‌లో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ మండల కార్మికుల అధ్యక్షుడు తుల్లిమిల్లి యేషయ్య అధ్యక్షతన గర్భిణీలకు, ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల భార్యలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపిడీఓ మాట్లాడుతూ భవన కార్మికులు అందరూ గుర్తింపు కార్డులు పొందాలన్నారు. అలాగే బీమా చెల్లించడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చన్నారు. దీనిలో జనార్థనపురంకు చెందిన ఏడుగురు గర్భిణీలకు కాన్పుకు 5వేలు చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన లక్ష్మీనరశింహాపురంనకు చెందిన భవన కార్మికుడు తమ్మినేని కృష్ణ భార్య పార్వతికి, మరో మహిళకు 30వేల రూపాయిలు పంపిణీ చేశారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ టివివి ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతి భవన నిర్మాణ కార్మికుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. అనంతరం బీమా కూడా చెల్లించాలని తెల్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పివి బాబూరావు, బేతాళ రామారావు, జక్కు ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.
అక్బరుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలి
మచిలీపట్నం (కోనేరుసెంటరు), జనవరి 5: హిందూ సంస్కృతిని, దేవతలను కించపరుస్తూ ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ చేసిన ప్రసంగాలు భారత రాజ్యాంగంలోని భిన్నత్వంలోని ఏకత్వానికి భంగం కలిగిస్తున్నాయని బిజెపి నాయకుడరు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, మాజీ సైనికుడు హుస్సేన్ మష్టారు తీవ్రంగా విమర్శించారు. శనివారం వారు వేర్వేరు ప్రకటనల్లో శాంతియుతంగా సహజీవనం సాగిస్తున్న హిందూ, ముస్లింల మధ్య చిచ్చురేపే విధంగా ఉందన్నారు. ఇందువలన శాంతి భద్రతలకు తీవ్ర భంగం ఏర్పడుతుందన్నారు. రాజ్యాం గ పరిరక్షకునిగా శాసనసభలో ప్రమా ణం చేసిన ఆయన రాజ్యాంగాన్ని ధిక్కరించే విధంగా ప్రసంగాలు చేయటం క్షంతవ్యం కాదన్నారు. ప్రభుత్వం అక్బరుద్దీన్ ఒవైసి శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తూ డిఆర్‌ఓ ఎల్ విజయచందర్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు.

వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ
బంటుమిల్లి, జనవరి 5: వైఎస్ జగన్ విడుదల కోరుతూ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని ముల్లపర్రు, మల్లేశ్వరం గ్రామంలో వైఎస్‌ఆర్ సిపి రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని సంతకాలను సేకరించారు. వైఎస్‌ఆర్ సిపి రాష్ట్ర నాయకులు కుక్కల నాగేశ్వరరావు, పెడన నియోజకవర్గ కన్వీనర్ వాకా వాసుదేవరావు, జిల్లా సేవాదళ్ నాయకులు మావులేటి వెంకట్రాజులు మాట్లాడుతూ వైఎస్ జగన్‌ను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేసి జైలుకు పంపారన్నారు.

పరిపూర్ణమైన విద్యతోనే సమాజంలో వేళ్ళూనుకున్న ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని రాష్ట్ర ఉప
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>