చిత్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన 12.36 శాతం సర్వీస్ టాక్స్‌ను తొలగించాలంటూ చిత్ర పరిశ్రమ సోమవారం ఫిలిం ఛాంబర్ ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమ ఈ రోజున నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ- ఇప్పటికే చిత్ర పరిశ్రమ మీద రాష్ట్ర ప్రభుత్వం విధించిన అన్ని రకాల పన్నులను చెల్లిస్తున్నాం. మళ్లీ కొత్తగా 2012 జూలై నుంచి కేంద్ర ప్రభుత్వం సర్వీస్ టాక్స్ పేర 12.36 శాతం విధించింది. ఇది నిర్మాత పాలిట పెనుభారం. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ మాత్రమే. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిశ్రమ ఇది. చిత్ర పరిశ్రమ అనగానే అందరికీ మేం వేసుకున్న సిల్క్ చొక్కాలు మాత్రమే కనిపిస్తాయి. లోపల వేసుకున్న చిరిగిన బనియన్ గురించి ఎవరికీ తెలీదు. పాత ఆర్టిస్టులు ఎందరో ఈ రోజు టాక్స్‌లు కట్టి తినడానికి లేని పరిస్థితిని చూస్తున్నాం. ఈ విషయాలు ప్రభుత్వానికి తెలీదు. మా కష్టాలను తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ టాక్స్‌ను రద్దు చేయాలని కోరుతున్నాం. సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలన్నీ కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలిసి వినతిపత్రాన్ని సమర్పిస్తున్నామ’ని తెలిపారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ- ఏ వ్యాపార పరిశ్రమకి లేని ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ చిత్ర పరిశ్రమ కడుతోంది. ఇప్పుడు విధించిన సర్వీస్ టాక్స్ నిర్మాతల పాలిట భారం’ అన్నారు.
రామానాయుడు మాట్లాడుతూ- ప్రభుత్వం మా ఇబ్బందులను అర్థం చేస్కుని సర్వీస్ టాక్స్‌ను ఎత్తి వేయాలని కోరుతున్నాన’ని అన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, సాగర్, వి.బి.రాజేంద్ర ప్రసాద్, కైకాల సత్యనారాయణ, దిల్ రాజు, వెంకటేష్, జగపతిబాబు, నాగినీడు, దాము, ఆలీ, వేణుమాధవ్, అల్లు అరవింద్, సునీల్, అశోక్‌కుమార్, నాని, తదితరులతోపాటు ఫిలిం ఛాంబర్ సభ్యులు, కళాకారులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు.
పాల్గొన్న వారంతా చిత్ర పరిశ్రమపై విధించిన టాక్స్‌ను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
- చిత్ర పరిశ్రమ నిరసన -
english title:
s
Date:
Tuesday, January 8, 2013